17, ఫిబ్రవరి 2013, ఆదివారం

సమస్యాపూరణం – 969 (కవిత లల్లు నతఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కవిత లల్లు నతఁడు  కాపురుషుఁడు.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

44 కామెంట్‌లు:

 1. కవి పరబ్రహ్మమ్ము కావ్యమీ యఖిలాండ
  ....కోట్యజాండమ్ములై గోచరించు
  కవి లోక మిత్రుండు కాలాధినాథుండు
  ....చైతన్యవరదాత జలజహితుడు
  కవులకే కవియంచు గణుతికెక్కిన వాడు
  ....గణపతి సకల వారణహరుండు
  ఉశనాకవి యటంచు యశమును గాంచెను
  ....ప్రముఖ కళాస్రష్ట భార్గవుండు
  కవి యనంగ హంస, కవి హంసనుంబోలె
  మంచి విషయముల గ్రహించి లోక
  ములకొసంగ వలెను; ముచ్చటకై బొల్లి
  కవిత లల్లువాడు కాపురుషుడు

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. కవియె పరబ్రహ్మ మ్మని
   కవి లోకహితుం డటంచు కవి ఘనతను దె
   ల్పవె మృదుమధురోక్తులతో
   నెవరయ్యా నీకు సాటి నేమాని కవీ!
   (చివరి పాదంలో అఖండయతి. నాకిష్టం లేనిదైనా తప్పలేదు. మన్నించాలి)

   తొలగించు
 2. మాస్టారూ, కవిత లల్లు "వాడు" కాపురుషుడు అంటే బాగుంటుందేమో చూడండి. ధన్యవాదాలతో...

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. చంద్రశేఖర్ గారూ,
   ధన్యవాదాలు. నాకూ ఆ ఆలోచన వచ్చింది. సేవ్ చేసిన సమస్యను కాపీ చేసి పేస్ట్ చేసినప్పుడు ఆ విషయం మరిచిపోయాను. అయినా తేడా లేదు కదా అని అలాగే ఉంచేసాను.

   తొలగించు
 3. లల్లు అనేవాడిని ప్రేమించిన కవితతో....

  ప్రేమికుండనుచును పెద్దగా తలపకు
  బుట్టలోన బడకు బుద్ఢిగలిగి
  దూరమందు నిలుపు దుర్బుద్ధి కనవమ్మ
  కవిత! 'లల్లు' - వాడు కాపురుషుడు

  రిప్లయితొలగించు
 4. ఆచార్యా ! ధన్యవాదములు.

  చిన్న టైపాటును సవరిస్తూ...

  ప్రేమికుండనుచును పెద్దగా తలపకు
  బుట్టలోన బడకు, బుద్ధిగలిగి
  దూరమందు నిలుపు, దుర్బుద్ధి కనవమ్మ
  కవిత! ' లల్లు' - వాడు కాపురుషుడు

  రిప్లయితొలగించు
 5. మిత్రులారా! ఈనాడు జగన్మిత్రుడు కవియైన శ్రీ సూర్యనారాయణ మూర్తి యొక్క పర్వదినము "రథసప్తమి" కావున అందరికీ శుభాకాంక్షలు.

  నమో నమః ప్రభాకరాయ జ్ఞాన భాస్కరాయతే
  నమో నమో మహాంధకార నాశకాయ భానవే
  నమో నమ స్త్రికాల కారణాయ వేదమూర్తయే
  నమో నమో మహారుజార్తి నాశకాయ తే నమః

  స్వస్తి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. నేమాని వారూ,
   సూర్యభగవానుని గురించిన మీ పంచచామరం అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.
   సప్తాశ్వరథారూఢుని గురించిన సమస్యనో, పద్యరచననో ఈరోజు ఇవ్వవలసింది. కానీ ఆలస్యమయింది.

   తొలగించు
 6. మిత్రులారా! ఈనాడు జగన్మిత్రుడు కవియైన శ్రీ సూర్యనారాయణ మూర్తి యొక్క పర్వదినము "రథసప్తమి" కావున అందరికీ శుభాకాంక్షలు.

  నమో నమః ప్రభాకరాయ జ్ఞాన భాస్కరాయతే
  నమో నమో మహాంధకార నాశకాయ భానవే
  నమో నమ స్త్రికాల కారణాయ వేదమూర్తయే
  నమో నమో మహారుజార్తి నాశకాయ తే నమః

  స్వస్తి

  రిప్లయితొలగించు
 7. అగును కవియె భావజగతిలో విహరించి
  కవిత లల్లు నతడు ; కాపురుషుడు
  వేదవిహితు డతడు పిరికివాడు ఖలుడు
  పరమ కుత్సితుండు పరమ లోభి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. రవీందర్ గారూ,
   మీ పూరణ బాగుంది. అభినందనలు.
   చివరి పాదంలో పరమ శబ్దం పునరుక్తి అయింది. "పరమ కుత్సితుండు బాలిశుండు" అందాం.

   తొలగించు
 8. విబుధవరులనోట వేలాది పద్యముల్
  వినినంత కలుగునే విద్యకొంత
  కవిరాజ సన్మాన కథలువిన్నను చాలు
  నుత్తేజమొందు మా చిత్తమందు
  అవధానములయందు వ్యవధానములనీక
  ధారణాపటిమ వంద్యమ్ముగాదె
  లోకోక్తులను నీతి లౌకికతత్వంబును
  జనులకొసంగివిజ్ఞానమీరె

  పద్యమందునిట్టి భావంబులవిలేకె
  కాలధర్మములను కానలేక
  తప్పుదోవజూపుదారిద్ర్యభావాల
  కవితలల్లునతఁడు కాపురుషుఁడు

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. సంపత్ కుమార్ గారూ,
   మీ సీసపద్యం చాలా బాగుంది. అభినందనలు.
   'కలుగునే' అంటే కలుగదు కదా అనే అర్థం వస్తున్నది. అక్కడ "కలుగును/కలుగులే" అందాం.
   "లౌకికతత్వంబును" అన్నచోట గణదోషం... తత్త్వమున్... అందాము.

   తొలగించు
 9. కవిత లల్లు నతడు కా పురుషు డనుట
  వింత గాదె మనకు ? వినుట కింపు
  గాదు , సామి ! యరయ కవిత లల్లు నతడు
  కవి యనగ బరగు కవి వ రేణ్య !

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   బాగుంది మీ పూరణ. అభినందనలు.
   చివరిపాదంలో గణదోషం... కవి యనంగ బరగు కవివరేణ్య... అంటే సరి.

   తొలగించు
 10. అన్నదమ్ముల గూడి యాడుతూ పాడుతూ,
  ప్రేమభావన తోడ పేర్మి గొనుచు,
  అక్క చెల్లెళ్లు తామమ్మనూ, నాన్ననూ
  అర్చించు సంస్కారమందుకొనుచు,
  సంప్రదాయముతోడ, సచ్చరిత్రముతోడ
  మన జాతినే నిల్పి మనుట కొరకు,
  అగ్రగాములగుచు అన్యోన్య ప్రేమతో
  అందరూ మహితాత్ములగుట కొరకు

  కవిత చెప్పువాడు కానివాడనుకొంద్రు
  చపల బుద్ధితోడ జనులు నేడు.
  మంచి మాటకిపుడు మహిమలేనిచ్చోట
  కవితలల్లువాడు కాపురుషుడు.

  (మహిమ లేని + ఇచ్చోట అనినా అభిప్రాయం.)

  రిప్లయితొలగించు
 11. గురువు గారూ ! మీ సవరణ ‘ బాలిశుండు ' చాలా బాగుంది.

  అగును కవియె భావజగతిలో విహరించి
  కవిత లల్లు నతడు ; కాపురుషుడు
  వేదవిహితు డతడు పిరికివాడు ఖలుడు
  పరమ కుత్సితుండు బాలిశుండు

  రిప్లయితొలగించు
 12. jagathi jagrutamagu saraLi teliyuvaadu
  nadata gatulu dappi nadayu vaadu
  kalasi tiruga naedu kaalushitamaipaome,
  kavita lallu vaadu, kaapurushudu

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. జగతి జాగృతమగు సరళి తెలియువాడు
   నడత గతులు దప్పి నడయువాడు
   కలసి తిరుగ నేడు కలుషితమైపోమె
   కవిత లల్లు వాడు, కాపురుషుడు.

   సహదేవుడు గారూ,
   బాగుంది మీ పూరణ. అభినందనలు.

   తొలగించు
 13. స్వర్ణ మంజరులందు, స్వర ఝరీ వనులందు,
  కల్లోలముగనుండు కడలి యందు,
  నీటి పుంతల లోన,నెగడు మంటల లోన,
  పూదండలోనున్న పూలలోన,
  కమనీయముగ బల్కు కైవారముల లోన,
  పాల మీగడ లోన, ఫలములోన,
  పులకింతలొలికించు పూబోణి ముఖమందు,
  పంచ బాణుని చేతి బాణమందు

  వివిధ రీతులందు విలువైన కవితలను
  చెప్పినంత చేత జీర్ణమగునె ?
  నిజము చెప్పువాడు, నిజ జీవితమునందు
  కవితల్లువాడు - కాపురుషుడు.

  రిప్లయితొలగించు
 14. మారెళ్ళ వారు ఎంత అద్భుతమైన పూరణ చేశారు ! మన: పూర్వక అభినందనలు.

  రిప్లయితొలగించు
 15. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మఆదివారం, ఫిబ్రవరి 17, 2013 12:32:00 PM

  నిక్కము రవిగాంచనిచో కవి గాంచును
  కాన కవిత నిలచె కాలమందు
  కాని అల్లిబిల్లి కల్లబొల్లి కతల
  కవితలల్లువాడు కాపురుషుడు.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. తోపెల్ల వారూ,
   మీ పూరణ బాగుంది. అభినందనలు.
   మొదటి పాదంలో గణదోషం...
   "నిక్కము రవిగాంచని యెడల కవి గాంచు" అందామా?

   తొలగించు
 16. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మఆదివారం, ఫిబ్రవరి 17, 2013 1:06:00 PM

  శంకరార్య! ముద్రారాక్షసాన్ని సవరణ చేస్తూ, మరల ప్రయత్నం, అవధరింతురు గాక!

  నిక్కము రవిగాంచనిచొ కవి గాంచును
  కాన కవిత నిలచె కాలమందు
  కాని అల్లిబిల్లి కల్లబొల్లి కతల
  కవితలల్లువాడు కాపురుషుడు.

  రిప్లయితొలగించు
 17. నా పద్య రచనా జీవితంలో మొట్టమొదటి సారి నేను వ్రాసిన సీస పద్యములు. గురువుగారి ఆశీస్సు లభించటం నా అదృష్టం.

  రిప్లయితొలగించు
 18. సాహిత్యాభిమాని గారికి ధన్యవాదములు. ఇంక పండిత ప్రఖండులు శ్రీ నేమాని వారి ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నాను.
  ఇంట్లో అమ్మ కోప్పడినప్పుడు మనకు తాత్కాలికంగా కోపం వస్తుంది. తరువాత నిజం తెలుసుకొని పశ్చాత్తాప పడతాము. మళ్ళీ అమ్మ దగ్గరికే వెళ్ళి మన సమస్యలు చెప్పుకుంటాము.
  నాకు శ్రీ నేమాని వారి సలహాలు మా అమ్మ మాట వంటివే.

  రిప్లయితొలగించు
 19. సుకుమార హృదయుండు జూడగ నొక్కఁడు
  ******కఠిన భావంబుల ఖలుడొకండు
  సర్వ హితముఁ గోరు సఛ్చీలుడొక్కఁడు
  ******స్వార్థమె హెచ్చిన వ్యక్తి యొకఁడు
  సృష్ఠింప పూనెడి సున్నితుడొక్కఁడు
  ******నాశనమొనరింపు నరుడొకండు
  ఆత్మ తృప్తి గలిగి యలరుచుండునొకఁడు
  ******అన్నియుండినను తానలుఁగు నొకఁడు

  రసిక భావములకు రారాజునొక్కఁడు
  పిసినిగొట్టు తనము పెంచునొకఁడు
  వేఱు వేఱు కాదె వివరము జూచిన
  కవిత లల్లువాడు, కాపురుషుడు!!

  రిప్లయితొలగించు
 20. కవి యనంగ నెవడు ? వివరింప నెంచగ
  పొలము దున్ను నెవడు హలము చేత ?
  కినుక యున్న వాని ననవచ్చునా నిట్లు ?
  కవిత లల్లు వాడు ; కాపు ; రుషుడు

  * రుష = కోపము

  రిప్లయితొలగించు
 21. శ్రీ వామన కుమార్ గారికి మా యందున్న సదభిప్రాయము మమ్ము పులకితులను గావించినది. శుభమస్తు. వారి పద్యము రసవత్తరముగ నున్నది.

  ఎవరిని పొగిడితే ఏమగునో లేకుంటే ఏమగునో యని ఇన్నాళ్ళూ మిన్నక ఉంటున్నాను.

  "వా వా యటంచు నో వామన! మీ భావ వైఖరిని మిగుల ప్రస్తుతింతు."
  స్వస్తి.
  Please see a small flaw in your poem's last lines. one laghuvu is to be removed.

  రిప్లయితొలగించు
 22. ధన్యవాదములు గురువు గారూ,

  తప్పుల సంస్కరించితిరి, ధన్యుడనైతిని వందనంబిదే.

  రిప్లయితొలగించు
 23. జిగురు సత్యనారాయణ గారూ,
  మీ పూరణ జాషువాగారి "రాజు-కవి" ఖండికను గుర్తు చేసింది. చాలా బాగుంది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  క్రమాలంకార పద్ధతిలో మీ తాజా పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించు
 24. భాష, భావ, సృజన బంధురంబైనట్టి
  యువత కోరుకొన్ననవత కలిగి
  నట్టి కవిత గాక, నపకృష్ట మైనట్టి
  కవిత లల్లువాడు కాపురుషుడు .

  రిప్లయితొలగించు
 25. కవియె సృష్టి కర్త కవియె దార్శనికుండు
  కవియె వాణి బిడ్డ కవియె గురువు
  కవిత లల్లు నతడు కాపురుషుడు గూడ
  మెచ్చు రీతి ఘనుడు మేదిని గన.

  రిప్లయితొలగించు
 26. మారెళ్ళ వామన్ కుమార్ గారూ,
  మీ రెండు సీసపద్యాలూ బాగున్నవి. ముఖ్యంగా రెండవది ఉత్తమంగా ఉంది. నేమాని వారి మెచ్చుకోలు పొందిన పద్యం అది. అభినందనలు.
  మొదటి పద్యంలో "ఆడుతూ పాడుతూ, తాతమ్మనూ, నాన్ననూ" అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. "అడుచు పాడుచు, తాతమ్మను నాన్నను" అంటే సరి.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించు
 27. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ.ఆదివారం, ఫిబ్రవరి 17, 2013 9:46:00 PM

  మిస్సన్న మహోదయా! ఇదివరలో నాకు జరిగిన ప్రమాదమే ఇక్కడ జరిగినట్లనిపించుచున్నది. తేట గీతి ఆటవెలది కలసి తేట వెలది అగుచున్నది.1, 3, యతి స్థానాలు చూడ మనవి. భావం అద్భుతం. అభినందనలు.

  రిప్లయితొలగించు
 28. తొపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మఆదివారం, ఫిబ్రవరి 17, 2013 9:49:00 PM

  మిస్సన్న మహోదయా! నెపొరబడితిని క్షమించండి

  రిప్లయితొలగించు
 29. కల్ల బొల్లి కధలు కలిపించి మురిపించి
  చిన్న వారి మనసు చెదర గొట్టి
  పిన్న వయసు నందు పెడ ద్రోవ లను బట్టు
  కవిత లల్లు నతడు కాపు రుషుడు

  రిప్లయితొలగించు
 30. సుకవి యైన వాడు సొబగైన పదయుక్తి
  జనుల హితము గోరి సలుపు రచన
  కుకవి విరసమైన క్షుద్రమౌ రచనల
  కవిత లల్లు నతడు కాపురుషుడు.

  రిప్లయితొలగించు
 31. రాజేశ్వరి అక్కయ్య గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  కమనీయం గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించు
 32. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  ఇద్దరూ వేరు వేరు :

  01)
  _______________________________

  ఋతము పలుకు కృతుల - కృతవిద్యు డొక్కండు
  కృతిని గలుగ జేయు - ఋషభ మొకడు
  ఇద్దరొక్కరెట్లు?- పద్ధతులవి వేరు
  కవిత లల్లు నతఁడు , - కాపురుషుఁడు !
  _______________________________
  ఋతము = సత్యము
  కృతి = కావ్యము,ప్రబంధము, నొప్పించు
  కృతవిద్యుడు = పండితుడు
  ఋషభము = ఎద్దు

  రిప్లయితొలగించు
 33. ప్రథమ ప్రయత్నంలోనే,
  పండిత ప్రశంస లందుకొనే
  పూరణలు చేసిన
  వామన కుమారున కభినందనలు !

  రిప్లయితొలగించు
 34. వసంత కిశోర్ గారికి ధన్యవాదములు.
  గురూజీ. మీరు చెప్పినట్లు పద్యాన్ని సవరించుకుంటాను.
  ఈరోజు సమస్య ఇంకా దారిలో ఉన్నట్లుంది. నాకేమో స్కూలుకు టైమ్ అయిపోతోంది.

  రిప్లయితొలగించు