12, ఫిబ్రవరి 2013, మంగళవారం

సమస్యాపూరణం – 964 (పాపములం జేయువాఁడె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
పాపములం జేయువాఁడె  పరముం గాంచున్.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదములు. 

23 కామెంట్‌లు:

  1. ఆ పత్రికలో జూచితి
    పాపములం జేయువాడె పరమున్ గాంచున్
    మీ పాలి రక్షకుండే
    పాపముల హరించునంచు భద్రగుణాఢ్యా!

    రిప్లయితొలగించండి
  2. పాపము జేయుట మానెద
    నీపాదములాన యనుచు నీశ్వరు కడనే
    శ్రీపాద శరణు శరణన
    పాపములం జేయువాడె, పరమున్ గాంచున్

    రిప్లయితొలగించండి
  3. తప్పక నరకము బోవును
    పాపము లంజేయువాడె, పరముంగాంచున్
    పాపములను విడ నాడుచు
    నేపొద్దును సేవ జేయ యిష్టత యున్నన్ .

    రిప్లయితొలగించండి
  4. పాపానలమునఁగాలును
    పాపములన్ జేయు వాడె,పరమున్ గాంచున్
    సోపానమగుచు పుణ్యము
    కాపాడగ, భక్తజనుడు గర్వము వీడన్

    రిప్లయితొలగించండి
  5. తాపములు బొందు నిత్యము
    పాపంబును జేయువాడె , పరముంగాంచున్
    శ్రీ పద్మాక్షుని కృపతో
    జాపకడును పుణ్య కార్య సచ్చరితుండున్.

    రిప్లయితొలగించండి
  6. ఏ పాపకర్మ జేయక
    నేపారగ దైవభక్తి యీశుడు మెచ్చున్
    చూపును సరి ; నే రీతిగ
    పాపములన్ జేయు వాడె పరమున్ గాంచున్!?

    రిప్లయితొలగించండి
  7. చూపులను గోలు పోవును
    పాపములన్ జేయువాడె ; పరమున్ గాంచున్
    పాప పరిహారమును గొని
    పాపుల రక్షించువాని పదముల వ్రాలన్

    రిప్లయితొలగించండి
  8. ఈ పలుకులు గావు నిజము
    “ పాపములన్ జేయువాడె పరమున్ గాంచున్ "
    ఈ పలుకులె నిజ మెప్పుడు
    “ పాపములను వీడువాడె పరమున్ గాంచున్ "

    రిప్లయితొలగించండి
  9. కాపురుషులుగా పుట్టుచు
    నీ పదముల జేర లేదె నీరజనాభా
    నీ పరిచారకులవులే
    పాపములం జేయువాడె పరమున్ గాంచున్

    రిప్లయితొలగించండి
  10. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    సీతను చెరబట్టుట వలననే గదా పాపాత్ముడు రావణుడు :

    01)
    _______________________________

    పాపమని యెంచకుండగ
    పాపము ! చెరబట్టి సీత - పరమును జేరెన్
    పాపాత్ముడు దశకంఠుడు !
    పాపములం జేయువాఁడె - పరముం గాంచున్ !
    _______________________________

    రిప్లయితొలగించండి
  11. డా. ప్రభల రామలక్ష్మిమంగళవారం, ఫిబ్రవరి 12, 2013 9:06:00 PM

    తాపసులై వనములలో
    తాపములను తట్టుకొనుచు తారాడంగా
    కోపపు జూపుల తోడను
    పాపములంజేయువాడె పరముంగాంచున్

    రిప్లయితొలగించండి
  12. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మమంగళవారం, ఫిబ్రవరి 12, 2013 9:19:00 PM

    ఏపగిది నైన సొమ్ములు
    తా పడయు దలంచి చేయ దారుణములనే
    రూపము నైన కటకటాల్
    పాపములం జేయువాడె పరమున్ గాంచున్.

    రిప్లయితొలగించండి
  13. శంకరార్య !
    తమరు ఒకమారు 4 రోజులు వెనుకకు వెళ్ళి పునర్విమర్శ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తోంది.

    రిప్లయితొలగించండి
  14. పాపడు , ప్రహ్లాదు పీడించి గదా హిరణ్య కశిపుడు :

    02)
    _______________________________

    పాపి హిరణ్యకశిపు డా
    పాపని పీడించి గాదె - పరమును జేరెన్
    పాపము ! మడియుట హరిచే !
    పాపములం జేయువాఁడె - పరముం గాంచున్ !
    _______________________________

    రిప్లయితొలగించండి
  15. పాపము కలియుగ ధర్మము
    శాపము నీయదు జగతికి శాస్త్రము లందున్ !
    పాపమె పుణ్యము లేదట
    పాపములం జేయువాఁ డె పరముం గాంచున్ !

    రిప్లయితొలగించండి
  16. యుద్ధములో మరణించినవారు చేరేది ?

    03)
    _______________________________

    పాపము గాదా యుద్ధము ?
    పాపాత్ములు గాదె యుద్ధ - ప్రావీణ్యులహో ?
    పాపులకే గద స్వర్గము !
    పాపములం జేయువాఁడె - పరముం గాంచున్ !
    _______________________________

    రిప్లయితొలగించండి
  17. ఈనాటి సమస్యకు చక్కని పూరణలు పంపిన కవిమిత్రులు...
    పండిత నేమాని వారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    సుబ్బారావు గారికి,
    సహదేవుడు గారికి,
    గండూరి లక్ష్మినారాయణ గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    మిస్సన్న గారికి,
    వసంత కిశోర్ గారికి,
    డా. ప్రభల రామలక్ష్మి గారికి,
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    ఆర్యా అజ్ఞాతా,
    నాకున్న పరిమితజ్ఞాన పరిధిలో ఆ ప్రయోగం సరియైనదే అనుకున్నాను.
    ఒక ప్రయోగం తప్పు అన్నప్పుడు అది ఏవిధంగా తప్పో, దాని సరియైన రూపమేదో తెలియజేస్తే బాగుంటుంది. ఈబ్లాగులో అభ్యాస స్థాయినుండి అగ్రస్థాయి పద్యాలు వ్రాసేవారున్నారు. 'ప్రమాదో ధీమతోమపి' అన్నారు. ఒకరు ఏదైనా పొరపాటు చేస్తే దానిని ఎగతాళిగా ఎత్తిచూపడం కాకుండా నేను ముందు చెప్పినట్లు వివరణతో విమర్శిస్తే బాగుంటుందని నా మనవి.
    "ఫలానావారి పద్యంలో ఫలానా పాదంలో యతి సరిపోయిందా?" అనడానికీ ""ఫలానావారి పద్యంలో ఫలానా పాదంలో యతి తప్పింది" అనడానికీ ఎంతో భేదం ఉంది.
    మన వ్యాఖ్యలు రాగద్వేషాలకు అతీతంగా ఉండాలని నా సవినయ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  18. సుబ్బారావు గారూ,
    సేన జేయ నిష్టముతోడన్... అందాం.
    *
    గండూరి వారూ,
    కృపతో జాపకడును.... ?

    రిప్లయితొలగించండి
  19. అందరూ పరమాత్మకు పిల్లలే గదా !

    04)
    _______________________________

    పాపము జేసిన నాయువు(పాపీ చిరాయుః)
    పాపులు గారా బుడుతలు - పరమాత్మునికే
    పాపులు, పుణ్యులు వేరా ?
    పాపములం జేయువాఁడె - పరముం గాంచున్ !
    _______________________________

    రిప్లయితొలగించండి
  20. వసంత కిశోర్ గారూ,
    భగవంతునకు అందరూ ఒకటే అన్న మీ తాజా పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. కోపముతో "గొంతు పిసికి"
    చీపురుతో చిమ్మి "కొట్టి" చేసియు "హత్యన్"
    దీపముతో "కాల్చి" యహము
    "పాపము"లం జేయువాఁడె పరముం గాంచున్

    రిప్లయితొలగించండి
  22. దీపమ్మిడి కాశ్మీరున
    కోపముతో కొట్టి చంపి క్రూరుల మతమున్
    దాపుచు ముఫ్తిని గదిలో
    పాపములం జేయువాఁడె పరముం గాంచున్

    రిప్లయితొలగించండి