మూడు కరణములును శుద్ధముగ జెలంగుచుండగా మూడు గ్రహము లుచ్చలోన పొల్పుగా విరాజిలన్ మూడు శుభద రాజయోగములు ఫలించుచుండ నా మూడె పదవి, కీర్తి, ధనము పుష్కలముగ నిచ్చుగా
వీడి నియమ నిష్ట లనగ వేడు కందు మునుగు చున్ పాడు పనులు జేసి మరల పరమ సౌమ్యు డనగ నే చూడ లేక కనులు ముడిచె శంక రుండు భయము గా మూడె పదవి కీర్తి ధనము పుష్కలముగ నిచ్చు గా
కవిమిత్రులకు నమస్కృతులు... నిన్న రోజంతా మా బంధువుల పెళ్ళిపత్రికలు పంచే కార్యక్రమంలో ఊళ్ళు తిరిగి రావటం వల్ల బ్లాగును వీక్షించే అవకాశం దొరకలేదు. ఇప్పుడు ఆ పనిమీదే మళ్ళీ వెళ్తున్నాను... తిరిగి వచ్చాక ఈ పూరణలు, పద్యాలు చూసి వ్యాఖ్య పెడతాను... మన్నించవలసిందిగా కోరుతూ... మీ శంకరయ్య...
మూడె పదవి కీర్తి ధనము పుష్కలముగ నిచ్చుగా
రిప్లయితొలగించండిచూడగ మన రా ష్ట్రజనులు చోద్యము గను చుండగన్
దూడల లపనమ్ముడుచుచు దుగ్ధముబితుకన్ సదా
కూడని పనులెన్నొ కరపి కోరగ సమకూర్పగన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
వామనునికి దానమిచ్చిన బలి చక్రవర్తికి :
01)
_________________________________________
మేడ లేల ? మాడలేల ? - మేలు జేయ దలచినచో
మూడడుగుల నేల నిమ్ము - పూజ్య , నాకు చాలనగా
మూడడుగుల నేల నపుడు - పుడుకు నిడిన రాజు నకే
మూడె పదవి, కీర్తిధనము - పుష్కలముగ నిచ్చుగా !
_________________________________________
పుడుకు = దానము
కీర్తిధనము = కీర్తియను సంపద
మూడు కరణములును శుద్ధముగ జెలంగుచుండగా
రిప్లయితొలగించండిమూడు గ్రహము లుచ్చలోన పొల్పుగా విరాజిలన్
మూడు శుభద రాజయోగములు ఫలించుచుండ నా
మూడె పదవి, కీర్తి, ధనము పుష్కలముగ నిచ్చుగా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిత్రులారా!శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిఈ నాటి సమస్య పాదము తరలి యనబడే ఛందస్సునకు చెందినది. దీని లక్షణములు:
భ స న జ న ర = 11వ అక్షరము యతి స్థానము. ప్రాస నియమము కలదు.
దీనిని ఉత్సాహ అనే ఛందస్సులో నేను పూరించేను. ఉత్సాహ వృత్తమునకు లక్షణములు:
7 సూర్య గణములు + 1 గురువు. 5వ గణము తొలి అక్షరము యతి స్థానము. ప్రాస నియమము కలదు.
మిత్రులు ఈ రెండు ఛందస్సులలో దేనిలోనైన నింపి వచ్చును.
స్వస్తి.
శ్రీ వసంత కిశోర్ గారూ! శుభాభినందనలు.
రిప్లయితొలగించండిమీ పద్యములో పాదము చివరన ఒకొక్క లఘువు ఎక్కువ ఉన్నది. సరిజేయండి. స్వస్తి.
పాడుపనుల చట్టమునకు పట్టుబడగ “గాలి”కిన్
రిప్లయితొలగించండిమూడె పదవి, కీర్తి, ధనము పుష్కలముగ; నిచ్చుగా
నేడనుచితవర్తనముననేకయిడుములిచ్చటన్
వీడవు గుణపాఠమనగపేదలధనమందగన్.
నేమానివారికి ధన్యవాదములతో :
రిప్లయితొలగించండివామనునికి దానమిచ్చిన బలి చక్రవర్తికి :
01అ)
_________________________________________
మేడ లేల ? మాడలేల ? - మేలు జేయ దలచుచో
మూడడుగుల నేల నిమ్ము - పూజ్య , నాకు చాలనన్
మూడడుగుల నేల నపుడు - పుడుకు నిడిన బలి కదే
మూడె పదవి, కీర్తిధనము - పుష్కలముగ నిచ్చుగా !
_________________________________________
పుడుకు = దానము
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఊడె పంచె మంత్రిగారి కూడె వందిమాగధుల్
రిప్లయితొలగించండిఓడెను ప్రతిపక్ష నేత కోట్లు రాగ మెండుగా
కూడబెట్టిన ధనమెల్ల కొంతలోనె పోయెగా
మూడె పదవి - కీర్తి ధనము పుష్కలముగ నిచ్చుగా
జిలేబీ గారికి, అన్నయ్య గారికి ధన్యవాదములు !
రిప్లయితొలగించండివాడికన్ను వెలసె నంట వాటికన్ను పురములో
వేడుకలను జేసుకొనరె విశ్వనాథు గాంచుచున్
మూడుకన్నులున్న వాని ముదము గొల్చి కోరుడీ
మూడె, పదవి, కీర్తి, ధనము పుష్కలముగ నిచ్చుగా !
మూర్త్తీజీ ! శహబాష్ !
రిప్లయితొలగించండికిశోర్ జీ ధన్యవాదములు. కుశలమా !
రిప్లయితొలగించండికిశోర్ జీ మీ పద్యము అదిరింది. చాలా బాగుంది !
రిప్లయితొలగించండితోడు నిల్చి బలముఁ జూపు తొత్తులైన సేవకుల్
రిప్లయితొలగించండివాడ వాడలందు నిల్పు వన్నెలీను విగ్రహాల్
మాడ కంటి వోలె మిగుల మహిని దోచుకోగ యీ
మూడె పదవి, కీర్తి, ధనము పుష్కలముగ నిచ్చుగా!!
మాడ కంటి = హిరణ్యాక్షుడు
తరలి , ఉత్సాహ
రిప్లయితొలగించండినేడు జనుల మానసమున నీతికనగ వచ్చునా?
జాడ వెదుక పూనుకొనిన సాహసమగు సోదరా!
గోడు వినక పేదజనుల గొంతు పిసుకు వానికే
మూడె పదవి, కీర్తి, ధనము పుష్కలముగ నిచ్చుగా.
రిప్లయితొలగించండిపాడుపనుల నెన్నొ సలిపి ,పాపములను జేసియున్
నోడె జివర నెన్నికలను ,నూడె సకల సంపదల్
వీడకెపుడు సత్యనిరతి,విష్ణు జపము,ధర్మమీ
మూడె,పదవి,కీర్తి,ధనము పుష్కలముగ నిచ్చుగా.
మూర్తీజీ ! కుశలమే ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండివీడి నియమ నిష్ట లనగ వేడు కందు మునుగు చున్
రిప్లయితొలగించండిపాడు పనులు జేసి మరల పరమ సౌమ్యు డనగ నే
చూడ లేక కనులు ముడిచె శంక రుండు భయము గా
మూడె పదవి కీర్తి ధనము పుష్కలముగ నిచ్చు గా
మిత్రులకు శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిఈనాటి తరలి/ఉత్సాహ ఛందస్సులలో సమస్యను అందరూ చక్కగా పూరించేరు. అందరి పూరణలు చాల బాగుగ నున్నవి. స్వస్తి.
కవిమిత్రులకు నమస్కృతులు...
రిప్లయితొలగించండినిన్న రోజంతా మా బంధువుల పెళ్ళిపత్రికలు పంచే కార్యక్రమంలో ఊళ్ళు తిరిగి రావటం వల్ల బ్లాగును వీక్షించే అవకాశం దొరకలేదు.
ఇప్పుడు ఆ పనిమీదే మళ్ళీ వెళ్తున్నాను... తిరిగి వచ్చాక ఈ పూరణలు, పద్యాలు చూసి వ్యాఖ్య పెడతాను...
మన్నించవలసిందిగా కోరుతూ...
మీ
శంకరయ్య...