19, ఫిబ్రవరి 2013, మంగళవారం

పద్య రచన – 257

గుజరాతులోని సోమనాథాలయము
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17 కామెంట్‌లు:

 1. ద్వాదశి జ్యోతిర్లింగేశ!
  నాదరిఁ జేరుమయ సోమనాధ పురేశా!
  నీదర్శన భాగ్యమ్మది
  నీదాసుడఁగోరుచుంటి నిక్కము మదిలో!

  రిప్లయితొలగించండి
 2. అద్భుతంబైన సోమనాథాలయమ్ము
  కలదు సౌరాష్ట్రమున దివ్య కళలతోడ
  ఆ మహాదేవ దర్శన మఖిల దోష
  ములను దొలచుచు యోగరాశుల నొసంగు

  రిప్లయితొలగించండి
 3. అచ్చెరువు పుట్ట నిచ్చట
  ముచ్చటలను సలుప గోరి మున్నేత్రుండున్
  వచ్చెనట నుమకు దోడై
  సొచ్చిన బుణ్య(భాగ్య)మ్ములనిడు సోముని సదమున్.

  రిప్లయితొలగించండి
 4. జ్యోతిర్లింగములందున
  ప్రీతిగ నే సోమనాథ పెరుమాళ్ నెలవై
  ఖ్యాతిని గంటివి నీకే
  జోతలనర్పింతు నమ్మ శుభ దేవళమా !

  రిప్లయితొలగించండి
 5. సహదేవుడు గారూ ! బాగుంది .
  మొదటి పాదంలో గణ దోషం ...సరిచేయండి

  రిప్లయితొలగించండి
 6. శివుని భజనలన్ మాచేత పాడింపరాదా!
  భవము నిటుల దాటే పాటు జేయింపరాదా!
  కవనములను బల్కంగా దయాశాలిపై, నా
  భవము తొలగు నాశీర్వాదమౌ సోమనాథా!

  రిప్లయితొలగించండి
 7. సోమనాధుని యాలయ సొగసు జూడ
  వేయి కన్నులు జాలవు , వీ ను లలర
  సుప్ర భాతము వినవచ్చు సుస్వ రమున
  రాణ యొప్పగ గుజరాతు రాష్ట్ర మందు

  రిప్లయితొలగించండి
 8. మిత్రులు గోలి వారలకు ధన్యవాదములు. మొదటి పాద గణదోష సవరణ:
  'ద్వాదశ జ్యోతిర్లింగా!'

  రిప్లయితొలగించండి
 9. దండయాత్రల శిథిలమై యుండునట్టి
  సోమనాథ మందిరమతి సుందరముగ
  దొల్లి వైభవమును బొంది వెల్లివిరిసె
  నవ్యనిర్మితి భక్తులానందమొంద.

  రిప్లయితొలగించండి
 10. సోముని సౌందర్యంబును
  వేమారులు జూడ నింక వీక్షణ జేయన్
  మామనములి చ్చగించును
  నేమముతో సేతు బూజ నిర్గుణు నకునున్

  రిప్లయితొలగించండి
 11. శాపము నొందిన సోముడు
  తాపసియై వరము నొంది తరియిం చంగా
  శాపము పాక్షిక మనుచును
  తాపము తొలగంగ శివుడు తన్విని వెలసెన్ !

  రిప్లయితొలగించండి
 12. శివ శివాయని మదిలో నామమొనరించి,
  భక్తితో నీవు చేయు పూజ, ఆ భోళా శంకరుండా
  భక్తికి మెచ్చిచ్చు రవ్వంత బూడిదయిననూ
  నీకెంతో ప్రీతి పాత్రమో కదా ఓ భక్త కన్నప్పా!

  రిప్లయితొలగించండి
 13. సోముడు పెండ్లియాడెనట సోయగమొప్పగ దక్షకన్యలన్
  భామగు రోహిణిన్ వలచి, పైదగువారిని తృణీకరింపగన్
  మామ శపింపనంతటనుమాపతి మెప్పున పొంద తేజమున్
  సోముడు సోమనాథుడని శోభల గూర్చెను లింగధారుడై.


  రిప్లయితొలగించండి
 14. ఘోరీ నుండి ఎందరెందరో విజాతీయ రాజులు మతవిద్వేషంతో మాటిమాటికి ధ్వంసమౌతూ, పునర్నిర్మాణంమౌతూ చివరికి సర్దార్ పటేల్ కృషితో నేటికీ రూపుతో కనువిందు చేస్తూ భక్తులకు కల్పవల్లిగా నిల్చిన సోమనాథాలయం పై మనోహరమైన పద్యాలను రచించిన కవిమిత్రులు...
  సహదేవుడు గారికి,
  పండిత నేమాని వారికి,
  గన్నవరపు నరసింహమూర్తి గారికి,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  లక్ష్మీదేవి గారికి,
  సుబ్బారావు గారికి,
  కమనీయం గారికి,
  రాజేశ్వరి అక్కయ్య గారికి,
  తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
  అభినందనలు, ధన్యవాదాలు.
  *
  రవికుమార్ గారూ,
  భావమూ, భాషా బాగున్నవి. ఛందోబద్ధం చేయడానికి ప్రయత్నించండి. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 15. దక్షుడు తనయలనందర
  దక్షిణనాయకుడటంచు దానము చేయన్
  శిక్షకు గురియై సోముడు
  దక్షత చూపించి నిలిపె తన తోడల్లున్
  డా. ప్రభల రామలక్ష్మి

  రిప్లయితొలగించండి