కవిమిత్రులారా,
ఈరోజు
పూరించవలసిన సమస్య ఇది ...
చెలువుగ
రామలక్ష్మణులు సీతకుఁ దమ్ములు శంభుఁ డన్నయున్.
ప్రసిద్ధమైన ఈ సమస్యను సూచించిన శ్రీరామచంద్రుడు గారికి ధన్యవాదములు.
గతంలో ఒక
అవధాని పూరణ....
అలర గణింపఁ
బంక్తిరథు నాత్మజు లెవ్వరు? మైథిలిండు నే
లలనకుఁ దండ్రి? మన్మథుని లావుశరంబులునేవి? కాళికా
చెలువుని నామ
మెద్ది?
మఱి సీరికి శౌరియు
నేమి కావలెన్?
చెలువుగ
రామలక్ష్మణులు; సీతకుఁ; దమ్ములు; శంభుఁ; డన్నయున్
(http://www.maganti.org/samasya సౌజన్యంతో...)
మిత్రులారా! ఈ నాటి సమస్యకు పూర్వము ఒక అవధాని క్రమాలంకారములో పూరించేరు. సరే. క్రమాలంకారములో నింపుట "అన్యథా మార్గం నాస్తి" అన్నప్పుడే వర్తించును. అందుచేత ఇతరములైన మార్గములను అన్వేషించుదాము:
రిప్లయితొలగించండినా ప్రయత్నమును చూడండి:
తెలియక నేటి బాలలును తెల్లమొగమ్ములు వేయుచుండగా
విలువలు తగ్గి సంఘమున పెద్దలకేని హుళక్కి జ్ఞానమై
నలుగుచునుండ బల్కుట జనమ్ములలో నిది యేమి వింతయే?
చెలువుగ రామలక్ష్మణులు సీతకు దమ్ములు శంభుడన్నయున్
పలువురు చూచుచుండగను భళ్ళున విల్లును వంచి త్రుంచి, మా
రిప్లయితొలగించండిచెలువపు బెండ్లి కూతురును చేకొను రాముఁడె, యన్ను దన్నుగా
నిలిచెను , యుద్ధరంగమున నేర్పున రావణు ద్రుంచి గాచిరే
చెలువుగ రామలక్ష్మణులు; సీతకుఁ దమ్ములు శంభుఁ డన్నయున్
కలరట; కాని యీ ధరణి కాయము దాల్చగ రాకపోయిరే!
మలుపులు దిర్గు కావ్యమది మాన్యుడు వాల్మికి వ్రాసె, వేదముల్
రిప్లయితొలగించండితెలిపెను శూలి యొక్కడని తీరుగ భ్రాతలు లేరు లేరనిన్
పొలుపుగ కానరారు కన పుణ్యకథల్ - యొక జట్టు నుండకన్
చెలువుగ రామలక్ష్మణులు; సీతకుఁదమ్ములు; శంభుఁడన్నయున్
చిత్రపూరణ చేయగ చింత జేయ
రిప్లయితొలగించండిమెదలకుండెను భావమ్ము మేథయందు
నాలుగిడ్లీలు సాంబారు నాల్కనంట
పూర్తి యయ్యెను పూరణ పూర్తిగాను.
నెలవు శతావధానముననేతలు గాయక, పాఠకాదులన్
రిప్లయితొలగించండికలకలలాడ పండిత నికాయము తోడ రవీంద్రభారతిన్
సులువుగనంచు పృచ్చకుడు సూచన జేయుచునో సమస్యగా
" చెలువుగ రామలక్ష్మణులు సీతకుదమ్ములు శంభుడన్నయున్."
నెలవు శతావధానముననేతలు గాయక, పాఠకాదులన్
రిప్లయితొలగించండికలకలలాడ పండిత నికాయము తోడ రవీంద్రభారతిన్
సులువుగనంచు పృచ్చకుడు సూచన జేయుచునో సమస్యగా
" చెలువుగ రామలక్ష్మణులు సీతకుదమ్ములు శంభుడన్నయున్."
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినలువురు పిల్లలన్ గని సనాతన నామము లన్న ప్రీతిచే
రిప్లయితొలగించండిపిలచిన పుణ్యముల్ గలుగు పేర్లను బెట్టిరి భార్య భర్తలున్
సులువుగ నుండు బిల్చుటకు సుంతయు చోద్యము గాదు చూడగన్
" చెలువుగ రామలక్ష్మణులు సీతకుదమ్ములు శంభుడన్నయున్."
తెలిసెను రామ చంద్ర కథ తీరును తెన్నును పుట్ట మౌని చే
రిప్లయితొలగించండితెలిసిన గాధ మారి పలు దేశపు భాషల యందు వింతగా
వెలసెను పుణ్య రామ కథ వేయి తెఱంగులగన్ వినూత్నమై
చెలువుగ రామలక్ష్మణులు సీతకుఁ దమ్ములు శంభుఁ డన్నయున్!!
క్రమాలంకారంలో తప్ప పూరించలేమలుకున్న సమస్యకు అన్య విధాలుగా చక్కని పూరణలు చెప్పిన కవిమిత్రులు...
రిప్లయితొలగించండిపండిత నేమాని వారికి,
లక్ష్మీదేవి గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి
అభినందనలు, ధన్యవాదాలు.
*
డా. ప్రభల రామలక్ష్మి గారూ,
కొరుకుడు పడని సమస్యను వదిలి కొరికే పని లేని ఇడ్లీలతో సరిపెట్టుకున్నారు. బాగుంది..
నాగరాజు రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
*
జిగురు సత్యనారాయణ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
జనపదమందు జేరి పలుజాడల చెప్పెడి గాధలెన్నియో
రిప్లయితొలగించండిమనమున నింపుకొన్న ఒకమానిసి తానె అధేతినంచుచె
ప్పెనిటు జన్నపుగా పరి కపీశ్వరు గాధలు సారహీనమే
చెలువుగ రామలక్ష్మణులు సీతకుఁ దమ్ములు శంభుఁ డన్నయున్!!
కలలు కనంగ రావణు కరాళ కలాప విలాస నృత్యముల్
రిప్లయితొలగించండితెలుసు కొనంగ పాపమది రావణు జంపగ రామ లక్ష్మ ణుల్
కలియుగ మందు వింతలు కనుం గొన చోద్యము గాక పోవునే
చెలువుగ రామ లక్ష్మ ణులు సీతకు దమ్ములు శంభు డన్నయున్ !
అమ్మా! ప్రభల రామలక్ష్మి గారూ!
రిప్లయితొలగించండిశుభాశీస్సులు.
మీ పద్యములో ప్రాస లేదు. 3వ పాదములో గణములు సరిగా లేదు. సమముగా మళ్ళీ ప్రయత్నించండి. స్వస్తి.
క్షమించాలి .గురువులకు శ్రమ కలిగించాను.నేను కిట్టించి కుస్తీ పట్టిన ఈ మాలకు ఎన్ని ముడు లున్నాయో ?
రిప్లయితొలగించండిఅమ్మా! శ్రీమతి రాజేశ్వరి గారూ! శుభాశీస్సులు. మీ పద్యమునకు కొన్ని సవరణలను ఇలాగ చేసేను:
రిప్లయితొలగించండికలలు విచిత్రమౌను దశకంఠ కరాళ విలాస నృత్యముల్
తెలియుట తప్పు, రావణు వధింపగ రాదట రామలక్ష్మణుల్
కలియుగమందు వింతలు కనుంగొన చోద్యము గాక పోవునే
చెలువుగ రామలక్ష్మణులు సీతకు దమ్ములు శంభుడన్నయున్
శ్రీ పండితుల వారికి ప్రణామములు
రిప్లయితొలగించండిఓర్పుతో సవరణ జేసి నందులకు కృతజ్ఞతలు
సీరికి శౌరి అన్నయా తమ్ముడా ? (అవధాని గారి పద్యముననుసరించి)
రిప్లయితొలగించండిఅజ్ఞాత గారూ,
రిప్లయితొలగించండిమంచి పట్టే పట్టారు. ధన్యవాదాలు.
అక్కడ... సీరియు శౌరికి నేమికావలెన్... అని ఉండాలి..
maganti.org నుండి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయడం జరిగింది.
చెలువుగ రామలక్ష్మణులు, సీతకుఁ దమ్ములు, శంభుఁ డన్నయున్,
రిప్లయితొలగించండిబలుపగు నావ నందునను భద్రకు పోవగ రాత్రివేళనున్
జలుబులు చేసి తుమ్ముచును జాస్తిగ దగ్గగ వైద్యుడచ్చటన్
విలువగు మందు వ్రాయగను వీడుచు భద్రను పారిపోయిరే!