14, ఫిబ్రవరి 2013, గురువారం

సమస్యాపూరణం – 966 (దాశరథి యనంగ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
దాశరథి యనంగ ధర్మరాజు.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదములు.

31 కామెంట్‌లు:

  1. (రామో విగ్రహవాన్ ధర్మః అని ఆర్యోక్తి కదా!)

    దాశరథి యనంగ ధర్మమే ధర్మమే
    రామవిభుడు ధర్మ రాజు నిజము
    నిజమటంచు బొందె ప్రజల మన్ననలను
    దాశరథి యనంగ ధర్మరాజు

    రిప్లయితొలగించండి
  2. ధర్మరాజు పాత్ర తా బాగ పోషించు
    ప్రజల మెప్పు బొందె పెద్దగాను
    మాదు గ్రామమునను మాన్యుడై వెలుగొందు
    దాశరథి యనంగ ధర్మరాజు.

    రిప్లయితొలగించండి
  3. ధర్మరాజు పాత్ర తా బాగ పోషించు
    ప్రజల మెప్పు బొందె పెద్దగాను
    పాత్ర పేరు తోడ పాత్రుడై వెలుగొందు
    దాశరథి యనంగ ధర్మరాజు.

    రిప్లయితొలగించండి
  4. @గోలి హనుమచ్ఛాస్త్రి గారూ పద్యం బాగుంది.

    పాత్ర పేరు తోడ పాత్రుడై వెలుగొందు
    దాశరథి యనంగ ధర్మరాజు."

    రిప్లయితొలగించండి
  5. దశరథ మహరాజు దయగల పుత్రుండు
    దాశరథి యనంగ ; ధర్మరాజు
    పాండురాజు సుతుడు పాడి దప్పనివాడు
    సర్వ హితు డజాత శత్రు వనగ

    రిప్లయితొలగించండి
  6. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    దాశరథీ దయాజలధీ :

    01)
    _______________________________

    దాశరథి యనంగ - దయగల ఱేడని
    దాశరథిని జనులు - దలచు కొనగ
    ధర్మ రక్ష సేయ- దశకంఠు దునుమాడె
    దాశరథి యనంగ - ధర్మరాజు !
    _______________________________

    రిప్లయితొలగించండి
  7. దశ రధుని కొమరుడు, ధర్ముడు, రాముడే
    దాశ రధి యనంగ , ధర్మ రాజు
    పాండు రాజు యొక్క ప్రధమత నయుడేను
    రామ ధర్మ జులిల సౌమ్య భవులు .

    రిప్లయితొలగించండి
  8. నిన్నటి చర్చ అంతా చదివిన తరువాత నా అభిప్రాయాలు

    1.తప్పును తప్పు అని చెప్పడానికి పెద్ద బాధ పడవలసినది లేదు,భయపడవలసినది లేదు- ఆ తప్పు ఎవరి పద్యాల్లో ఉన్నా సరే అప్పుడప్పుడే వ్రాయడం మొదలు పెట్టిన కవులైనా లేక పేరొందిన కవుల రచనలలోనైనా
    2.తప్పును హుందాగా అంగీకరించడానికి కూడ పెద్ద మనసు కావాలి -నేను చేయి తిరిగిన రచయితను ,పేరు మోసిన కవిని నా పద్యాల్లో తప్పులెంచడానికి ఎవరికీ అధికారం లేదు అని అహంకరించకుండ - తప్పు ను చూపించినప్పుడు సహృదయంతో స్వీకరించే పెద్దమనసున్నవాడే పెద్ద కవి
    3.పేరుపొందిన కవులు కాబట్టి వీళ్ల రచనల్లో దోషాలెంచకూడదు "ఇది మహా శివుని చాపము దీన్ని స్పృశించుటయే మహా పాపము " అనే ధోరణినుండి కూడ అందరు బయటకు రావాలి ,ఉన్నదున్నట్టు చెప్పగలగాలి ,అప్పుడే ఇలాంటి పేచీలు రావు . ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. శ్రీపంచమి వసంతపంచమి లలితాపంచమి అని నానా రీతులలో తెలియబడే పర్వదినము సందర్భముగా మన బ్లాగు మిత్రులందరికి శుభాకాంక్షలు.

    సరస్వతీ మాతృ కృపా కటాక్షము అందరి యెడల ప్రసరించాలి అనీ మనమందరము సౌభ్రాత్రముతో సౌజన్యముతో సదభిప్రాయములతో ఒక కుటుంబ సభ్యులుగ మెలగాలి అనే నా ఆకాంక్ష. అందరూ దీనిని మన్నించుతారని ఆశించుచున్నాను.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  10. తండ్రి మాటను తలదాల్చు ప్రాణసముడు
    పత్నిఁ బ్రేమఁ ముంచు పతియతండు
    పాలనమును మిగుల ప్రజలెల్లఁ గొనియాడు
    దాశరధి యనంగ ధర్మ రాజు

    రిప్లయితొలగించండి
  11. రాజ్య మేలె ప్రజలు రంజిల్లు నట్లుగా
    రామ రాజ్య మనుచు రాసి కెక్కె
    తీర్చె జనుల కోర్కె త్రికరణ శుద్ధితో
    దాశరథి యనంగ ధర్మరాజు.

    రిప్లయితొలగించండి
  12. భవ జలధిని దాట భవ్యమౌ నావయై
    నదిని దాట గోరె నావ స్వామి
    తాను గుహుని పైన దయగల మారాజు
    దాశరథి యనంగ ధర్మరాజు.

    రిప్లయితొలగించండి
  13. శ్రీ గురువులకు, శ్రీ శంకరయ్య గారికి, పెద్దలకు
    ప్రణామములు!

    దాశరథి శ్రీరామచంద్రునికి, ధర్మరాజు యుధిష్ఠిరునికి ఉభయాన్వయం ఇది.

    శ్రీ ప్రభాకరాన్వయప్రాతరారాధ్యుఁ
    డుత్తముండు వెలయు నుదితయశుఁడు
    భువి నయోధ్య నాగపురికి నధీశుండు
    దాశరథి యనంగ ధర్మరాజు.

    శ్రీరామచంద్రుని పరంగా అర్థం:

    భువిన్ = పుడమి యందు; అయోధ్య నాఁగన్ = అయోధ్య అను పేరుఁగల; పురికిన్ = పట్టణమునకు; అధీశుండు = అధిపతి యగు; శ్రీ = సర్వసంపత్కరమైన, ప్రభాకర+అన్వయ = సూర్యవంశమునందు (ప్రభాకరః = రవౌ), ప్రాతః + ఆరాధ్యుఁడు = ప్రాతఃకాలమున ఆరాధింపఁదగిన స్వామి; ఉత్తముండు = శ్రీ మహావిష్ణుస్వరూపుఁడు; ఉదితయశుఁడు = విశ్రుతమైన కీర్తి గలవాఁడు (యశః = విశ్రుతత్వే); దాశరథి = దశరథాత్మజుఁ డైన శ్రీరామచంద్రుఁడు; అనంగన్ = అనఁగా; ధర్మరాజు = ధర్మస్వరూపుఁ డగు ప్రభువు; వెలయున్ = ఒప్పారును.

    ధర్మరాజు పరంగా అర్థం:

    భువిన్ = భూమి యందు; అయోధ్య నాఁగన్ = శత్రుయోధులకు గెలువ శక్యము గానిది యగు; నాగపురికిన్ = హస్తినాపురమను పేరుఁగల పట్టణమునకు; అధీశుండు = అధిపతి యగు; శ్రీ = సర్వసంపత్కరమైన, ప్రభాకర+అన్వయ = చంద్రవంశమునందు (ప్రభాకరః = చంద్రే), ప్రాతః + ఆరాధ్యుఁడు = ప్రాతర్వంద్యుఁడు; ఉత్తముండు = సర్వశ్రేష్ఠుఁడు; ఉదితయశుఁడు = ప్రసిద్ధికెక్కినవాఁడు; దాశరథి = తనను నిత్యము సేవించు వీరుల మహాసైన్యముఁ గలవాఁడు (రథ = పౌరుషవంతులైన, దాశ = సేవక గణము - "రథః స్యన్దనే శరీరే పౌరుషే యోద్ధరి" అని శబ్దార్థకల్పతరువు), అనంగన్ = అనఁగా; ధర్మరాజు = ధర్మరాజు అను పేరుఁగల యుధిష్ఠిరుఁడు; వెలయున్ = ఒప్పారును.

    విధేయుఁడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  14. చి. డా. మురళీధర రావు గారికి శుభాశీస్సులు.
    శ్లేషాలంకారముతో సమస్యను అద్భుతముగా పూరించిన మీకు హృదయపూర్వక అభినందనలు. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ.గురువారం, ఫిబ్రవరి 14, 2013 9:15:00 PM

    ధర్మవర్తనమున ధరణిని జెల్లును,
    దాశరథియనంగ ధర్మరాజు |
    ధర్మవర్తనుల త్రిధాముడు చూడగన్,
    జానకీపతియె సుజన పాలకుడు గాదె||

    రిప్లయితొలగించండి
  16. ఇనకులజుని, ఇనజానుజుని ఒక్కచో నిలిపిన యేల్చూరి వారి ప్రతిభకు నమోవాకములు.

    రిప్లయితొలగించండి
  17. పండితవర్యులకు నమస్కారములు,
    మీ పూరణలు నాటి పోతనామాత్యుల రచనలవలె అలరారుచున్నవి.
    చదువుతూండగనె హృదయాంతరాలలో భక్తి భావం పొడసూపుచున్నది.
    మీ వాగ్ఝరి దృశ్యమానమౌతున్న తీరు మాబోంట్ల అదృష్టం.
    ధన్యోహం...... ధన్యోహం...... ధన్యోహం.
    వినయముతో సదా మీ ఆశీస్సులు అభిలషించె,
    భవదీయుడు
    శ్రీరామచంద్రుడు.

    రిప్లయితొలగించండి
  18. పూజ్యశ్రీ గురుదేవుల అమోఘమైన ఆశీర్వచనానికి
    పాదప్రణామపురస్సరంగా ధన్యవాదాలు.

    మాన్యులు శ్రీ గోలి హనుమచ్ఛాస్త్రి గారి సదయ సహృదయస్పందనకు కృతజ్ఞతాంజలి!

    రిప్లయితొలగించండి
  19. ఏల్చూరి వారి ప్రతిభ అద్వితీయం !
    దాశరథిని ధర్మరాజునూ సమన్వయపరచిన తీరు అమోఘం !
    రాఘవపాండవీయాన్ని తలపిస్తోంది !
    వారు దయతో ప్రతిపదార్థం కూడా యిచ్చి
    మా బోంట్లకు సులభగ్రాహ్యం చేసినందులకు ధన్యవాదములు !
    అభినందనలు !

    రిప్లయితొలగించండి
  20. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ.గురువారం, ఫిబ్రవరి 14, 2013 10:28:00 PM

    పొరపాటున పడిన ముద్రారాక్షసాన్ని సవరిస్తూ....

    ధర్మవర్తనమున ధరణిని జెల్లును,
    దాశరథియనంగ ధర్మరాజ
    ధర్మవర్తనుల త్రిధాముడు చూడగన్,
    జానకీపతియె సుజన పాలకుడు గాదె.

    రిప్లయితొలగించండి
  21. సుకవివతంసులు శ్రీ వసంత కిశోర్ గారి
    సహృదయతకు, సౌజన్యానికి ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
  22. డా. ప్రభల రామలక్ష్మిగురువారం, ఫిబ్రవరి 14, 2013 11:44:00 PM

    లీలలందు కూడ లేదసత్యంబను
    నటుల చేసె పాలనమ్ము నాడు
    పాండుసుతుని జూచి ప్రజ పల్కసాగెను
    "దాశరథి యనంగ ధర్మరాజు".

    రిప్లయితొలగించండి
  23. చాలా ఏండ్ల క్రితం ఓ అవధానము చూడడానికి వెళ్తే - నాడు అవధాని గారు - ఎవో మాటల మధ్య - శ్రోతలతో - మీపై సరస్వతీ కటాక్షం లేదేమోనని అపోహ పడకండి .. ఉన్నది కావునే - మీరు వచ్చి ఇక్కడ కూర్చొనగలిగినారు.. లేదంటే - అదుగో (రహదారిన పోతున్న వాహనాలను చూపిస్తూ) - అలా మీరు కూడా ఇక్కడ ఏమి జరుగుతున్నదో గమనంలోకి కూడా తీసుకోకుండా వెళ్ళిపోవలిసిన వాళ్ళు అని అన్నారు...

    అలానే .. శంకరాభరణం బ్లాగుకు రాగలగటమూ.. శ్రీ నేమాని వారు, శ్రీ మురళీధరరావు గారు , శ్రీ విష్ణునందన్ గారు మొదలగు పండిత కవులు చేసిన పూరణలు /రచనలు చూడగలగటమూ కూడా సరస్వతీ దేవి కృపయే.

    రిప్లయితొలగించండి




  24. ధర్మరూపుడైన ధరణిపాలకుడును
    ధర్మరక్ష జేయు త్యాగమూర్తి
    అనుగు సతియు సీత యగ్నిపునీతయే
    దాశరథి యనంగ ధర్మజుండు .

    ద్యర్థి కావ్యంలా శ్లేషతో సమస్యను పూరించిన ఏల్చూరివారి ప్రతిభకు హార్దికాభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. ఊకదంపుడు గారూ,

    సరిగ్గా నా భావలనే మీరు మీ మాటలతో చెప్పారు. మీరన్నట్లు శంకరాభరణం బ్లాగు యొక్క దర్శనం సరస్వతీ కటాక్షం గాక ఇంకేముంది.

    పండిత ప్రకాండుల పద్య రచనలు చదవడముతో నాకున్న కొద్దిపాటి జ్ఞాన్ని సానబెట్టుకోగలుగుతున్నాను.

    మొన్నటి వ్యాఖ్యలలో ఒక అజ్ఞాత పఠిత గారు చెప్పినట్లుగా నిశిత పరిశీలనజేసి తప్పొప్పులను ఎత్తిచూపే ప్రక్రియ సరైనదేనని తలుస్తున్నాను ( ఎవరు చేసినా కూడా ). ఎందుకంటె అప్పుడే కదా మనతప్పులను సరిదిద్దుకొనగలుగుతాము.

    ధన్యోస్మి.

    రిప్లయితొలగించండి
  26. ఆలస్యంగా నా ప్రయత్నం :
    తండ్రి మాట కొరకు దానువనములకేగి,
    ఆర్కి కొరకు వాలినచట జంపి,
    ధర్మయుద్ధమందు దశకంఠు దునుమాడు
    దాశరథి యనంగ ధర్మరాజు.

    చాలా రోజుల తరువాత బ్లాగులో పద్య ప్రయత్నం. పెద్దల సవరణలు నాకు శిరోధార్యములు.

    రిప్లయితొలగించండి
  27. మా గురువు గారు శ్రీ ఏల్చూరి వారు విజ్ఞాన ఖని, పరిజ్ఞాన వని. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి