15, ఫిబ్రవరి 2013, శుక్రవారం

సమస్యాపూరణం – 967 (శంకరుఁ డోర్చె రాముని)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
శంకరుఁ డోర్చె రాముని నిశాత శిలీముఖ చండ పాతమున్.
డా. జొన్నలగడ్డ మృత్యుంజరావు గారి 'కచ్ఛపి' నుండి
ఈ సమస్యను సూచించిన తోపెళ్ళ బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి ధన్యవాదములు.

18 కామెంట్‌లు:

  1. పంకజనాభుపత్నియగు పావని బాధల కారకుండునై
    కింకరుడైన రావణుఁడకృత్యముఁ జేయగ దండనార్హుడై
    జంకను మాట లేక కడు శ్రద్ధను గొల్చిన నేమటంచు నా
    శంకరుఁ డోర్చె రాముని నిశాత శిలీముఖ చండ పాతమున్.

    రిప్లయితొలగించండి
  2. నా ప్రయత్నం:-
    శాంకరిఁగూడి నృత్యమును సాంబశివుండట నాడు చుండగన్
    శంకరుఁ జూడగన్ భృగువు శైలముఁజేరినఁ గాంచకుండినన్
    బింకము జూపి లింగముగ పృధ్విని నుండగ శాపమిచ్చినన్
    శంకరుఁ డోర్చెరా, ముని నిశాత శిలీముఖ చండపాతమున్!

    రిప్లయితొలగించండి
  3. లంకపురాధినాథుడగు రావణుడత్తరి హేమవర్ణమౌ
    జింకనుఁబంపి మోసముగ సీతను గైకొనిబాధఁవెట్ట శో
    కాంకితుడై పరాక్రమవిహారమొనర్చెను యుద్ధమందు, నా
    శంకరుఁ డోర్చె, రాముని నిశాత శిలీముఖ చండ పాతమున్.

    నాశంకరుడు = నాశము జేయువాడు ( రావణుడు )
    శోకాంకితుడై = శోకముతో కూడుకొన్నవాడై ( శ్రీ రాముడు )

    రిప్లయితొలగించండి
  4. ఈ అజ్ఞాత ఎవరండి?

    ఈ బ్లాగుకు పెద్ద దిక్కుగా అన్ని బాధ్యతలు తలను దాలుస్తూ ఔత్సాహికులకు అండగా పద్, వ్యాకరణ ప్రయోగాద్యద్భుత సహాయంతో సమన్వయ కర్తగా, సంచాలకులుగా నిలుస్తున్న పండిత మాన్యులను తూలనాడుతున్నారు?

    శ్రీ శంకరయ్య గారు సంయమనం పాటిస్తున్నారు కనుకనే, పండితుల అమూల్యమైన సవరణలు, సూచనలు వినోదప్రాయంగా వ్యర్థులకు కనిపిస్తున్నాయి.

    పేరులేని వారుకూడా వ్యాఖ్యలు చేసేడయడమే? ధర్మమైన పధ్య పద్య గాములైతే వెలుగులోకి వచ్చి మాట్లాడాలు.

    అజ్ఞాతా! నిజంగా మీరు సార్థకనామధేయులు..



    సార్థక నామధేయుడవు! సద్ధృదయాత్ముల కంటకంబ!సే
    వార్థకభావనాకలిత "పండిత" వాక్కుల నోర్వలేక, వే
    రర్థములన్ సృజించుచు, నపార్థములన్ వెలయించుచుంటివే
    వ్యర్థమునామముండుటయు,ప్రౌఢమతిభ్రమితా!బుధాహితా!

    రిప్లయితొలగించండి
  5. అష్టావధాని రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారికి నమస్కారములు,
    మీరు చక్కగా చెప్పారు. తలపడగల సత్తా ఉంటే బరిలో ధ్యైర్యంగా నిలబడాలి, లేదా చక్కగా ఒదిగి ఉండాలి. ఏది ఏమైనా మీ పద్యంలో " ప్రగడ రాన్నరసా, విరసా, తుసా, బుసా" అన్న కవి దర్శనమిస్తున్నాడు. ఇప్పటికైనా ఆ అ. క. గారు పంథా మార్చుకొంటారని, శంకరార్యుల మనస్సుకి మోదాన్ని కలిగిస్తారని ఆశిద్దాం. శుభం భూయాత్.

    రిప్లయితొలగించండి
  6. వంకయె లేదు రావణుడు శంకర భక్తుడె కావరమ్ముతో
    జంకకదెచ్చె లంకకును జానకి నప్పుడు యుధ్ధమందునన్
    పంకజ నాభునంశుడటు భక్తుని పైనను విల్లునెత్తినన్
    శంకరుఁ డోర్చె, రాముని నిశాత శిలీముఖ చండ పాతమున్.

    రిప్లయితొలగించండి
  7. శ్రీ సంపత్కుమార శాస్త్రి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యమునకు కొన్ని మార్పులు అవసరము. ఇలాగ మార్చితే కొంత బాగుంటుంది:

    లంకకు పాలకుండయిన రావణు డత్తరి హేమవర్ణయౌ
    జింకను బంపి మోసమున సీతను గైకొని బాధవెట్ట క్రో
    ధాంకితుడైన రాముడు మహాజి నొనర్ప సురేంద్రరాజ్య నా
    శంకరు డోర్చె రాముని నిశాత శిలీముఖ చండపాత్మున్
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. శంకరు గూర్చి పార్థు డొక శైలము పైని తపమ్ము సేయ నా
    వంకను జేరి శంభు డొక పందిని బంపిన వేళ వానితో
    బింకము మీర నమ్మునియు భీషణ రీతిని పోరు సేయ నా
    శంకరు డోర్చెరా ముని నిశాత శిలీముఖ చండ పాతముల్

    రిప్లయితొలగించండి
  9. అయ్యా ! గతం గతః
    మన శంకరాభరణమందు సుహృద్భావ వాతావరణం లో చక్కని పద్యములు ఇంకాయెందరో కవిమిత్రులు కలసి వచ్చి వ్రాయాలనీ, విజ్ఞులు తగు సూచనలిచ్చి మమ్ములను ప్రోత్సహించాలనీ సంయమనం పాటించాలనీ కోరుచున్నాను. లక్కాకుల వారి పునరాగమనాన్ని ఆకాంక్షించుచున్నాను.

    రిప్లయితొలగించండి
  10. వంకను బెట్ట నెంచి హరి భక్తుని శక్తికి పంపి నాడ దే
    శంకలు లేక కృత్య యను శక్తిని చంపగ నంబరీషునిన్
    సంకట మాయె నా మునికె జంకక నిల్చెను వైరి షట్క నా-
    శంకరు డోర్చెరా ముని నిశాత శిలీముఖ చండ పాతముల్

    రిప్లయితొలగించండి
  11. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    నేమానివారి స్ఫూర్తితో :

    కిరాతార్జునీయము :

    01)
    _________________________________________

    పంకజ నాభు భక్తుడగు - పార్థుడు పాశుపతాస్త్ర సాధనన్
    వంకను జేరి మౌనముగ - ఫాలుని ధ్యానము జేయు వేళ , నా
    కింకరహారి జేరి యొక - ఘృష్టిని గొట్టిన , పార్థు తోడనే
    శంకరుడా కిరాతుడని - ఙ్ఞాన మెరుంగని క్రీడి వైచినన్
    శంకరుఁ డోర్చెరా, ముని, ని - శాత శిలీముఖ చండ పాతమున్ !
    _________________________________________
    వంక = సెలయేఱు(యింద్రకీలాద్రిపైనున్న)
    ఫాలుడు = శంకరుడు
    కింకరుడు = మన్మథుడు
    ఘృష్టి = వరాహము

    రిప్లయితొలగించండి
  12. కవిమిత్రులకు నమస్కృతులు.
    పెళ్ళికి వెళ్ళి ఇప్పుడే ఇల్లు చేరి బ్లాగులో వ్యాఖ్యలను గమనించాను. కొన్ని వ్యాఖ్యలు సౌజన్యపు హద్దులు దాటుతున్నట్లు తోచింది. అందువల్ల 'మాడరేషన్' పునరుద్ధరించాను. ఆలస్యం చేయకుండా వెంటవెంటనే పూరణలను, పద్యాలను, వ్యాఖ్యలను పరిశీలించి ఔచిత్యం ఉన్న వానిని ప్రచురిస్తాను. సుహృద్భావంతో బ్లాగును కొనసాగించడానికి అవకాశం ఇవ్వవలసిందిగా సవినయంగా మనవి చేస్తున్నాను. బ్లాగు నిర్వహణలో మీ భాగస్వామ్యానికి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. శ్రీ గురువులకు, శ్రీ శంకరయ్య గారికి, పెద్దలకు
    ప్రణామములు!

    “అంకిలి వెట్టెఁ బ్రేమికుల” కంచుఁ గ్రుథామతి జామదగ్న్యుఁ డు
    త్తంకగతిన్ బరశ్వథముఁ దాలిచి, యంబను ముందు నిల్పి, ఘో
    రాంకము సల్ప సాళ్వవిభురక్షకు - భీష్ముఁడు తద్వివాహనా
    శంకరుఁ డోర్చె రాముని నిశాత శిలీముఖ చండపాతమున్.

    విధేయుడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  14. శ్రీ పండిత నేమాని వారికి, మరియు అజ్ఞాత గారికి ప్రణామములతో.......

    పద్యములందు తప్పులనపారముగా తెలుపంగవచ్చు సం
    పద్యుతులైన మీరలనివార్యముగా, యది మాదు మేలుకే
    విద్యను సానబెట్టుచు వివేకములన్ గ్రహియింప వచ్చునే
    వైద్యము చేయకున్న మరి వ్యాధుల మాపుట సాధ్యమౌనటే.

    రిప్లయితొలగించండి
  15. అజ్ఞాత గారూ,
    మీరు అన్యధా భానించవచ్చు. మీరు నిరభ్యంతరంగా మీ వ్యాఖ్యలను పంపవచ్చు. ఉచితవ్యాఖ్యలను తప్పక ప్రకటిస్తాను. దోషారోపణ కంటె దోషసవరణ ఉత్తమమని నమ్ముతున్నాను. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  16. "అజ్ఞాత గారూ, తప్పులుంటే చూపించి వాటి సవరణలకి
    సలహాలిచ్చి దోహదం చేస్తే ఎంతో బాగుంటుంది,మేమూ నేర్చుకుంటాము.

    రిప్లయితొలగించండి
  17. అయ్యా రావు గారు కొన్ని సందర్భాలలో తప్పులు చేసినవారి స్టేచర్ ని అనుసరించి దిద్దుకునే అవకాశం వారికే వదిలివేయబడుతుంది , అది తప్పులను దిద్దలేని అశక్తత కాదు , తప్పులను వారికి వారే దిద్దుకోగలరనే నమ్మకం.

    రిప్లయితొలగించండి
  18. వంకలు పెట్టి రామునకు వంగుచు దండము పెట్టకుండ తా
    క్రుంకక సంద్రమందునను గుట్టుగ రాతిరి భీతిమీరగా
    జంకక సీతనివ్వకయె ఝమ్మని పోరుచు లంకవీటి నా
    శంకరుఁ డోర్చె రాముని నిశాత శిలీముఖ చండ పాతమున్

    రిప్లయితొలగించండి