సుబ్బారావు గారూ, మూడవ పాదంలో 'పుణ్య' శబ్దం పునరుక్తి అయింది. "పుణ్య కార్య లబ్ధముగ గడపగవచ్చు" అందామా? * తోపెళ్ళ వారూ, రామలక్ష్మి గారూ, రవికుమార్ గారి భావానికి చక్కని పద్యరూపాన్ని ఇచ్చారు. ధన్యవాదాలు. * తోపెళ్ళ వారూ, "చల్దు లార గించి చక్రిమెచ్చిన దిదె" అంటూ మనోహరంగా చెప్పిన సీసంలో 'వేడియన్నమున' అన్నచో గణభంగం. "వేడియన్నములోన" అంటే సరి. * నాయుడుగారి జయన్న గారూ, శంకరాభరణం బ్లాగు మీకు ఆనందంగా స్వాగతం పలుకుతున్నది.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆవకాయ రుచిని జూచి యమరవిభుడు పొంగుచున్
రిప్లయితొలగించండిదేవతలకు విందు జేసె, దేవతలును మెచ్చుచున్
వే విధముల జేసి దినిరి వేడ్కతోడ, కమ్మనౌ
ఆవకాయ దినిన నమరుడగును నిజము సోదరా!
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
ఆంధ్ర జాతి సొత్తు :
01)
_______________________________
ఆంధ్ర జాతి సొత్తు - ఆవకాయ యనిన !
ఆవు నేతి తోడ - అన్నమందు
ఆవకాయ కలుప - అమృతమునే మించు !
ఆవకాయఁ దినిన - నమరుఁ డగును !
_______________________________
పండిత నేమాని వారి ఉత్సాహ పద్యం పొద్దున్నే ఉత్సాహాన్నిస్తున్నది. ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఆంధ్ర ఋషులు దీని నావిష్కరించిరి
రిప్లయితొలగించండితాళ పత్ర గ్రంధ తతిని జదివి
అమృతసమము నేతి నన్నంబు తో గలిపి
ఆవకాయఁ దినిన నమరుఁ డగును.
భూలోక యాత్ర చాలించిన పిమ్మట ;
రిప్లయితొలగించండికల్పతరువు నైన గామధేనువు నైన
కోరు మనిన నాదు కోర్కె యొకటె
' ఆవకాయఁ దెమ్ము దేవలోకమునకు
నావకాయఁ దినిన నమరుఁడగును !
భూలోక యాత్ర చాలించిన పిమ్మట ;
రిప్లయితొలగించండికల్పతరువు నైన గామధేనువు నైన
కోరు మనిన నాదు కోర్కె యొకటె
' ఆవకాయఁ దెమ్ము దేవలోకమునకు
నావకాయఁ దినిన నమరుఁడగును !'
కార మధిక మగుట గడుపు మంట గలుగు
రిప్లయితొలగించండిఆవకాయ దినిన, నమరు డగును
పుణ్య కార్య లబ్ధ పుణ్యంబు వలనన
శేష జీ వితంబు శివుని యొద్ద
అమరలోకమందు నమృతముండెడు రీతి
రిప్లయితొలగించండియద్భుతమనదగదె యావకాయి?
యాంధ్రదేశమనిన అమరలోకంబైన
ఆవకాయఁ దినిన నమరుఁ డగును.
గురువు గారికి అనేక ధన్యవాదములు. టీబీయస్ శర్మ గారికి ధన్యవాదములు.
రిప్లయితొలగించండినిన్న కవులందరూ చేసిన పద్యరచన అద్భుతముగా నుండినది.
అమ్మ పెట్టినట్టి యావకాయే మిన్న
రిప్లయితొలగించండిరోజు తిన్నగాని మోజు పోదు
కూరలెన్ని యున్న కోరు నాలుక దాన్ని
ఆవకాయ దినిన నమరుడగును .
కమ్మగుండు గాని కడుపులో మండును
ఆవకాయ దినిన, నమరుడగు
మనిషి దీన హీన మానవ సేవను
పేర్మి తోడ జేసి పృథ్వి పైన
క్షీర సాగరమును జిలుకగ పుట్టెనో !?
రిప్లయితొలగించండిఅలవిగాని రుచుల నావకాయ
మరణ శయ్య మీద కరిగిన వాడైన
ఆవకాయ దినిన నమరు డగును
క్రొత్త ఆవకాయ కోరి కలిపినంత
రిప్లయితొలగించండిపప్పు నూనె తోను గొప్ప గాను
వేడి యన్న మందు వెన్నతోన నంచి
ఆవ కాయ దినిన నమరు డగును !
ఆవకాయ అనిన అమ్మ గుర్తుకు వచ్చు,
రిప్లయితొలగించండిఆవకాయ కనిన ఆకలి గుర్తుకు వచ్చు,
ఆవకాయ అని వినిన జిహ్వ ఎగిరి వచ్చు,
ఆవకాయ తినిన నమరుడగ వచ్చు.
(పండితులు దయచేసి పద్య రూపం కల్పించాలి)
శ్రీ రవికుమార్ గారి భావానికి దగ్గరగా వారి కోరిక ప్రకారం పద్యరూపంలో
రిప్లయితొలగించండిఆవ కాయ యనిన అమ్మ గుర్తుకు వచ్చు
ఆవ కాయ గనిన ఆకలి యగు
ఆవ కాయ వినిన ఆగ లేదుగ జిహ్వ
ఆవ కాయ దినిన నమరు డగును.
ఆవకాయ అనిన అమ్మ గుర్తుకు వచ్చు
రిప్లయితొలగించండిఆవకాయని వినిన ఆడు జిహ్వ
ఆవకాయ జూడ ఆకలి వేయును
ఆవకాయ తినిన నమరుడగును.
(సూచన చేసిన శ్రీ రవికుమార్ గారికి అభినందనలు)
ముద్దపప్పు లోన శుద్ధ నెయ్యి గలిపి
రిప్లయితొలగించండిముద్ద ముద్ద కొక్క సుద్ధి వింటు
అమ్మ చేతి తోటి కమ్మనైనటువంటి
ఆవకాయ దినిన నమరుడగును
ఈ రోజు నేను లేటు.
రిప్లయితొలగించండిపచ్చి మిరప కాయ పచ్చడి దిన్నచో
పుణ్యవందుడగును, ధన్యుడగును.
నిప్పు వంటి మనిషి నీరుగారిన యెడల
ఆవకాయ తినిన నమరుడగును.
రెండవ లైన్ లో పుణ్యవంతుడు అని సవరణ.
రిప్లయితొలగించండిఅమ్మ హస్తమందు ఆవకాయకు ఎంతొ
రిప్లయితొలగించండిచవులు పుట్టి నోట జారు నీరు
అన్నమెంత తిన్న అరిగిపోవును గదా
ఆవకాయ తినిన నమరుడగును.
అవసాన దశ లో కవి సార్వభౌముడు శ్రీనాధుని స్వగతము గా ఒక ఊహ చేస్తున్నాను.. తప్పైతే మన్నించాలి.
రిప్లయితొలగించండిదివిజకవివరు గుండియల్ దిగ్గురనగ
నరుగుచున్నాడు శ్రీనాథు డమరపురికి...
అమర విభుడు నాకు నమరత్వ మొసగంగఁ
దీర్చి దేవ సభను; తెలుగు వారు
చేరి చెప్పుకొనగ- శ్రీనాధ కవివరుం
డావకాయఁ దినిన నమరుఁ డగును..
నవకాయ వంటలు నవకమునన్ వండ
రిప్లయితొలగించండి...... ఆవకాయయె లేక హాయి నిడదు
తరతరమ్ములనాటి తరవాణి యన్నము
...... నీవులేకయె నోరు నీరుగారు
వేడియన్నమున వెన్న ముద్దను నంజ
...... కంజుడే కబళము కడిగొనునుగ
ఉప్పు పులుపు కార మొక్క చోటను జేర
...... తినగ నోరూరును తినిన నెంత
బ్రహ్మచారి మఠపు బ్రహ్మాండ భాండము
ఇంట కూర లేమి వెంట నుండు
చల్దు లార గించి చక్రిమెచ్చిన దిదె
ఆవ కాయ దినిన నమరు డగును.
టీబీయస్ శర్మ గారి ఔదార్యానికి ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.
రిప్లయితొలగించండినిన్న కవిపండితులు చేసిన కృతులు అద్భుతములు.
బెల్లపావ కాయ ఉల్లమలరు దిన
రిప్లయితొలగించండిమెంతి యావ కాయ మిత్రుడగును
పచ్చ(యా)ఆవ కాయ పసనిచ్చుగా;పులి
హోర యావ కాయ హొయలు చూడు.
రిప్లయితొలగించండిశంకరార్యులిచ్చు చవులూరు చక్కని
పద్దెములను,నేడు బళిర ,తెలుగు
వారి యావకాయ వర్ణించు పద్యమ్ము ,
నెవ్వరెరుగరండి ,యేల వ్రాయ
' ఆవకాయ దినిన నమరుడగును.'
రకరకాల ఆవకాయ రుచులతో ఆహ్లాదకరంగా పూరణలు చెప్పిన కవిమిత్రులు...
రిప్లయితొలగించండిపండిత నేమాని వారికి,
వసంత కిశోర్ గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
గన్నవరపు నరసింహమూర్తి గారికి,
సుబ్బారావు గారికి,
లక్ష్మీదేవి గారికి,
గండూరి లక్ష్మినారాయణ గారికి,
నాగరాజు రవీందర్ గారికి,
రాజేశ్వరి అక్కయ్య గారికి,
రవికుమార్ గారికి,
తోపెళ్ళ బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
డా. ప్రభల రామలక్ష్మి గారికి,
నాయుడుగారి జయన్న గారికి,
మారెళ్ళ వామన్ కుమార్ గారికి,
ఊకదంపుడు గారికి,
కమనీయం గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.
సీత చేతఁ బెట్ట ప్రీతిగా తిన్నట్టి
రిప్లయితొలగించండిహనుమ మరువ డాయె యావ కాయ!
నందు కేమొ యతడు నమరు డాయె!
ఆవకాయఁ దినిన యమరు డగును!
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమూడవ పాదంలో 'పుణ్య' శబ్దం పునరుక్తి అయింది.
"పుణ్య కార్య లబ్ధముగ గడపగవచ్చు" అందామా?
*
తోపెళ్ళ వారూ,
రామలక్ష్మి గారూ,
రవికుమార్ గారి భావానికి చక్కని పద్యరూపాన్ని ఇచ్చారు. ధన్యవాదాలు.
*
తోపెళ్ళ వారూ,
"చల్దు లార గించి చక్రిమెచ్చిన దిదె" అంటూ మనోహరంగా చెప్పిన సీసంలో 'వేడియన్నమున' అన్నచో గణభంగం. "వేడియన్నములోన" అంటే సరి.
*
నాయుడుగారి జయన్న గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు ఆనందంగా స్వాగతం పలుకుతున్నది.
సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిఆలస్యమైనా అందమైన పూరణ చెప్పారు. అభినందనలు.
మూడవపాదంలో గణదోషం...
"నందు కేమొ యతడు నమరు డాయెను నాడు!" అందాం.
గురువుగారికి నమస్సులు. ముసాయిదాలో "వేడియన్నంబున" అని వ్రాసికుని టైపాటున వేడియన్నమున అని పొరపాటు జరిగినది. ధన్యవాదములు. సవరణనంతరం
రిప్లయితొలగించండినవకాయ వంటలు నవకమునన్ వండ
...... ఆవకాయయె లేక హాయి నిడదు
తరతరమ్ములనాటి తరవాణి యన్నము
...... నీవులేకయె నోరు నీరుగారు
"వేడియన్నంబున" వెన్న ముద్దను నంజ
...... కంజుడే కబళము కడిగొనునుగ
ఉప్పు పులుపు కార మొక్క చోటను జేర
...... తినగ నోరూరును తినిన నెంత
బ్రహ్మచారి మఠపు బ్రహ్మాండ భాండము
ఇంట కూర లేమి వెంట నుండు
చల్దు లార గించి చక్రిమెచ్చిన దిదె
ఆవ కాయ దినిన నమరు డగును.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి