9, ఫిబ్రవరి 2013, శనివారం

సమస్యాపూరణం – 961 (గజమును గట్టుటకు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
గజమును గట్టుటకుఁ బచ్చగడ్డిన్ దెచ్చెన్.
సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

32 కామెంట్‌లు:

 1. గజమును కోరి కొనంగను
  నిజముగ ధనమదియె లేదు; నేడిక రెండే
  గజముల తాడును బేనియు
  గజమును గట్టుటకుఁ బచ్చగడ్డిన్ దెచ్చెన్.

  రిప్లయితొలగించండి
 2. త్రిజగత్పతియగు నా గో
  వ్రజనాథుని గట్ట నెంచు పద్ధతి గనుచో
  విజయా! మూర్ఖుడొకడు మద
  గజమును గట్టుటకు బచ్చ గడ్డిన్ దెచ్చెన్

  రిప్లయితొలగించండి
 3. భజనల నేతలఁ గొలువక
  కుజనుల యవినీతిఁ బోరు కొందఱు తోడన్
  హజరే అన్నట వచ్చెను,
  గజమును గట్టుటకుఁ బచ్చగడ్డిన్ దెచ్చెన్ !!

  రిప్లయితొలగించండి
 4. గుజరాతునుండి గొలుసులు
  గజమును గట్టుటకు, పచ్చగడ్డిన్ దెచ్చెన్
  విజయాఖ్యుడు చేనికిజని
  నిజగృహగత గోవుకొరకు నిష్ఠాత్ముండై.

  రిప్లయితొలగించండి
 5. త్రిజటా స్వప్నమును వినగ
  సజలములయ్యెను కనులవి; జవ్వనియు నయో
  నిజ బలికెను " రాముడనెడు
  గజమును గట్టుటకుఁ బచ్చగడ్డిన్ దెచ్చెన్,

  రావణుడు, మూడె వానికి రామ బాణ
  ఘాతమున చావు వచ్చును కలికి కంట
  నీటి నొలికించిన ఫలము నేఁడు వాని
  పాల మృత్యువుగా మారి పైన బడియె."

  రిప్లయితొలగించండి
 6. విజయు డను మావటి సుతుని
  గజమును గట్టుటకు కొంత గడ్డిన్ గోరన్
  నిజమెఱుగని యా బాలుడు
  గజమును గట్టుటకుఁ బచ్చగడ్డిన్ దెచ్చెన్

  ఫిబ్రవరి 09, 2013 8:34 AM

  రిప్లయితొలగించండి
 7. తమ్ముడు చి. డా. నరసింహమూర్తికి శుభాశీస్సులు.
  దుష్టచతుష్టయము పద్ధతిని వివరింప నెంచేను నా పద్యములో.
  మీ భావము కూడా ప్రశంసనీయముగా నున్నది. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 8. వ్రజ బాలు డాల మేపగ
  నిజమిత్రుల గూడి కొండ నెక్కెను కోసెన్
  విజయా గడ్డిని, త్రాడొక
  గజమును, గట్టుటకుఁ బచ్చగడ్డిన్, దెచ్చెన్.

  రిప్లయితొలగించండి
 9. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మశనివారం, ఫిబ్రవరి 09, 2013 4:53:00 PM

  నిజమని చట్టము దెచ్చుచు
  ప్రజలకు దోచిన ధనమును పంచెదమనగా
  హజరే పల్కె ప్రభుతపై
  గజమును గట్టుటకుఁ బచ్చగడ్డిన్ దెచ్చెన్.

  రిప్లయితొలగించండి
 10. గజము సరిపోదు పాశము
  గజమును గట్టుటకు ; బచ్చగడ్డిన్ దెచ్చెన్
  భుజమున మోయుచు మావటి
  గజమునకు బలము నొసంగు గ్రాసం బదియే !

  రిప్లయితొలగించండి
 11. విజయుడ ! తెమ్మినుప గొలుసు
  గజమును గట్టుటకు ; బచ్చగడ్డిన్ దెచ్చెన్
  గిజిగాడు ముక్కున కఱచి
  నిజవాసము నేర్పరచెడు నీడము కొఱకై !

  రిప్లయితొలగించండి

 12. విజయుడు గొలుసులు దెచ్చెను
  గజమును గట్టుటకు , బచ్చ గడ్డిని దెచ్చెన్
  అజయుడు లేగకు కొఱకని
  అజవిజయులు న గుదు రిద్ద రన్నా దమ్ముల్ .

  రిప్లయితొలగించండి
 13. వ్రజ బాలు డేగె తోటకు
  నిజమిత్రుల గూడి కోసె నివ్వరి గడ్డిన్
  భుజమున కెత్తగ, త్రాడొక
  గజమును, గట్టుటకుఁ బచ్చగడ్డిన్, దెచ్చెన్.

  రిప్లయితొలగించండి
 14. ఆహా! నేటి సాహితీసరస్వతి అందెలరవళి కడు మనోహ్లాదముగా నున్నది. నాటి భువనవిజయాధీశుని మానసిక స్థితి ఈరీతినేనుండెడిదేమో యని అనిపించుచున్నది.

  రిప్లయితొలగించండి
 15. నిజతేజమ్మున దించున ?
  యజసుత నా నింగిగంగ నవనికి నృజుతన్
  నిజము భగీరథు డెంచగ
  గజమును గట్టుటకుఁ బచ్చ గడ్డిన్ దెచ్చెన్ !

  రిప్లయితొలగించండి
 16. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మశనివారం, ఫిబ్రవరి 09, 2013 9:30:00 PM

  రాజేశ్వరి అక్కయ్యగారు!.నమస్సులు. 2పాదం యతి దెబ్బతింది.1 అక్షరం ఎక్కువయ్యింది. పరిశీలించండి.

  రిప్లయితొలగించండి
 17. సోదరులకు ధన్య వాదములు

  గజమును తోలుచు మావటి
  నిజమా యిది వింత గాక నిశ్చే ష్టితమౌ !
  అజమను కొని మతిచెడి
  గజమును గట్టుటకు పచ్చ గడ్డిని దెచ్చెన్ !

  రిప్లయితొలగించండి
 18. trijagamulu bojjana gala va
  naja naabhuni rOTa gaTTa naaran decchen
  nijamerugaka naMduni sati
  "గజమును గట్టుటకు పచ్చ గడ్డిని దెచ్చెన్".

  రిప్లయితొలగించండి
 19. త్రిజగములు బొజ్జన గల వ
  నజ నాభుని రోట గట్ట నారన్ దెచ్చెన్
  నిజమెరుగక నందుని సతి
  "గజమును గట్టుటకు పచ్చ గడ్డిని దెచ్చెన్".

  రిప్లయితొలగించండి
 20. అజరామరు హనుమంతుని
  ద్విజవంశజు డలుక బూని వేల్చగ దొడరెన్
  అజరారాతుల బనిచెను
  గజమును గట్టుటకు బచ్చగడ్డిన్ దెచ్చెన్


  ద్విజవంశజూడు = రావణ బ్రహ్మ

  రిప్లయితొలగించండి
 21. కవిమిత్రులకు నమస్కృతులు.
  నిన్న వరంగల్‌లో అవధాన రాజహంస, ప్రముఖ శతావధాని శ్రీ కోట వేంకట లక్ష్మీనరసింహం గారి "సంపూర్ణ భాగవత శతావధానం" ప్రారంభమయింది. ఈరోజు, రేపు కొనసాగుతుంది. ఆహ్వాన పత్రిక నాకు అందలేదు. అందువల్ల దానిని బ్లాగులో ప్రకటించలేకపోయాను.
  నేనూ పృచ్ఛకులలో ఒకడను. నాకిచ్చిన అంశం సమస్య.
  అవధానానంతరం ఆ విశేషాలను బ్లాగులో ప్రకటిస్తాను.

  రిప్లయితొలగించండి
 22. ఒకరిని మించి ఒకరుగా సమర్థంగా, మనోహరంగా పూరణలు చెప్పిన కవిమిత్రులు...
  లక్ష్మీదేవి గారికి,
  పండిత నేమాని వారికి,
  గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
  హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
  నాగరాజు రవీందర్ గారికి,
  మిస్సన్న గారికి,
  తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
  రాజేశ్వరి అక్కయ్య గారికి,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 23. భజనల రాముని వేడెడు
  భుజబలుఁడా హనుమను తుద ముట్టించ మనన్!
  నిజమెరుఁగు వారలనరే?
  గజమును పట్టుటకు పచ్చ గడ్డిని దెచ్చెన్!

  రిప్లయితొలగించండి
 24. భజనల రాముని వేడెడు
  భుజబలుఁడా హనుమను తుద ముట్టించ మనన్!
  నిజమెరుఁగు వారలనరే?
  గజమును పట్టుటకు పచ్చ గడ్డిని దెచ్చెన్!

  రిప్లయితొలగించండి
 25. అజరామరణమ్మౌ మద
  గజమ్మహంకృతియె; దీని గట్టుట కొరకై
  భజనలు జేసెడి భక్తుడు:
  "గజమును గట్టుటకుఁ బచ్చగడ్డిన్ దెచ్చెన్!"

  రిప్లయితొలగించండి
 26. విజయపు మోడిని చూడగ
  గజిబిజి కాగయె మనమ్ము గార్దభ రీతిన్
  సుజనుడు వెడలుచు యూఎన్
  గజమును గట్టుటకుఁ బచ్చగడ్డిన్ దెచ్చెన్

  రిప్లయితొలగించండి