10, ఫిబ్రవరి 2013, ఆదివారం

సమస్యాపూరణం – 962 (వనిత కదేల సిగ్గు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
వనిత కదేల సిగ్గు మగవానికె యయ్యది శోభఁ గూర్చెడున్.
ఈ సమస్యను సూచించిన కవిమిత్రునకు ధన్యవాదములు.

26 కామెంట్‌లు:

  1. కవిమిత్రులకు నమస్కృతులు.
    నిన్న వరంగల్‌లో అవధాన రాజహంస, ప్రముఖ శతావధాని శ్రీ కోట వేంకట లక్ష్మీనరసింహం గారి "సంపూర్ణ భాగవత శతావధానం" ప్రారంభమయింది. ఈరోజు, రేపు కొనసాగుతుంది. ఆహ్వాన పత్రిక నాకు అందలేదు. అందువల్ల దానిని బ్లాగులో ప్రకటించలేకపోయాను.
    నేనూ పృచ్ఛకులలో ఒకడను. నాకిచ్చిన అంశం సమస్య.
    అవధానానంతరం ఆ విశేషాలను బ్లాగులో ప్రకటిస్తాను.

    రిప్లయితొలగించండి
  2. మునుపటి వస్త్ర ధారణలు పోవుచు పశ్చిమ దేశ ధోరణుల్
    వనితలు బూనుచుండ మగవారలు చూడగలేక సిగ్గు సి
    గ్గని తల దించి పోవు కలికాలపు వింతలు పెంపులొందుచో
    వనిత కదేల సిగ్గు మగవానికె యయ్యది శోభ గూర్చెడున్

    రిప్లయితొలగించండి
  3. శుభాభి నందనలు చాలా సంతో షంగా ఉంది మీ అవధాన విశేషముల కోసం ఎదురు చూస్టూ

    రిప్లయితొలగించండి
  4. ఘనమగు రీతియందు కడు గౌరవమొప్పగ పెద్దలెల్లరున్
    గుణయుత వంశవృద్ధికయి గొప్ప వివాహము చేసి, వారలే
    మనకిక దీవనమ్ము నిడ, మన్ననగా శుభ వార్త చెప్పగా
    వనిత కదేల సిగ్గు? మగవానికె యయ్యది శోభఁ గూర్చెడున్.

    గురువుగారు,
    శుభవార్త వినిపించారు. కడు సంతసమందెను నా మది.

    రిప్లయితొలగించండి
  5. లక్ష్మి గారూ ! మీ ఆలోచన తోనే....

    మనమున నచ్చువాని నభి మానము జూపెడు వాని వేడుకన్
    ఘనముగ పెండ్లి యాడ మరి కార్యము లన్నియు సాగి మాసముల్
    దినములు దొర్లి పోయి యొక తీయని వార్తను చెప్ప బోవగా
    వనిత కదేల సిగ్గు? మగవానికె యయ్యది శోభఁ గూర్చెడున్.

    రిప్లయితొలగించండి
  6. చిన్న సవరణ తో..

    మనమున నచ్చువాని నభి మానము జూపెడు వాని వేడుకన్
    ఘనముగ పెండ్లి యాడ మరి కార్యము లన్నియు సాగి మాసముల్
    దినములు దొర్లి పోగ నొక తీయని వార్తను చెప్ప బోవగా
    వనిత కదేల సిగ్గు? మగవానికె యయ్యది శోభఁ గూర్చెడున్.

    రిప్లయితొలగించండి
  7. అనితకు పెండ్లి యాయె కుసుమాస్త్రుడు వేయుచు వాడి బాణముల్
    ఘనముగ జంట నత్తరిని గాటపు ప్రేమను ముంచు వేళలో
    తన వలపంత చేసి యిడె తానొక తీయని ముద్దు ముందుగా
    వనితకదేల సిగ్గు మగవానికి నయ్యది శోభ గూర్చెడున్.

    రిప్లయితొలగించండి
  8. సంతోషకరమైన వార్త గురువు గారూ. నా తరఫున మీకు best of luck.

    రిప్లయితొలగించండి
  9. వెనుకటి కాలమా వనిత భేషుగ విశ్వ విహంగమౌచు శో
    ధనలట జేయగన్ వలువ ధారణ యందున ప్యాంట్సు వేయగన్,
    అనితర సాధ్యులైన పురుషాదుల ధారణ మారకుండుటే
    వనిత కదేల? సిగ్గు, మగవాడికె యయ్యది శోభ గూర్చెడున్!

    రిప్లయితొలగించండి
  10. వనితలు కూడి నాటకము వన్నెలు చిందగ నాడనెంచినన్
    ఘనమగు మూతి మీసములు గట్టిగ పెట్టక మధ్య మధ్యలో
    పెనిగెడి వేళ జారినను, ప్రీతిగ వేసెడి కర్ణ పాత్రలో
    వనిత కదేల సిగ్గు మగవానికె యయ్యది శోభఁ గూర్చెడున్!!

    రిప్లయితొలగించండి
  11. కనుమిక నాతి సిగ్గు పడు కాలము పూర్తిగ పోవునట్టులన్
    జనహితమొప్ప 'వర్మయను జడ్జియె' నాతికి శక్తినిచ్చెనే
    మనమున చెడ్డ భావములు మర్త్యమునెవ్వడు చూపడిప్పుడున్
    వనితకదేల సిగ్గు? మగవానికె యయ్యది శోభ గూర్చెడున్

    రిప్లయితొలగించండి
  12. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మఆదివారం, ఫిబ్రవరి 10, 2013 7:51:00 PM

    మానవ దేహనిర్మితిని మానిని మానిసి రూపభేదమున్
    కానగ వస్త్రధారణము కంచెల చీరయు తన్వికొప్పగున్
    గాని విదేశ పోకడల కర్పట ధారణ మెబ్బెరందురే
    వనిత కదేల సిగ్గు? మగవానికె యయ్యది శోభఁ గూర్చెడున్.

    రిప్లయితొలగించండి
  13. కనగను నేడు రాజసము కాంతల కబ్బెను భోగ భాగ్యముల్
    పనితన మంచు భర్తలను బానిస జేసిరి వేడు కంచునే
    వినుటకు వింత గాక మరి వేడుక మీరగ సేవ లొందుచున్
    వనిత కదేల సిగ్గు మగవానికి యయ్యది శోభఁ గూర్చెడున్ !

    రిప్లయితొలగించండి
  14. "ఘనముగ పెండ్లి యాడ మరి కార్యము లన్నియు సాగి మాసముల్
    దినములు దొర్లి పోయి యొక తీయని వార్తను చెప్ప బోవగా" గోలి హనుమచ్ఛాస్త్రి గారూ శుభ వార్త ఎంత సున్నితంగా చెప్పారు.

    "పనితన మంచు భర్తలను బానిస జేసిరి వేడు కంచునే"
    రాజేశ్వరి గారూ ఎంత నిజం! ఇప్పుడే వంటకి కూరలు తరిగి ఇచ్చి వచ్చాను.

    రిప్లయితొలగించండి
  15. డా. ప్రభల రామలక్ష్మిఆదివారం, ఫిబ్రవరి 10, 2013 10:37:00 PM

    కనగను కానరావుగద కాయము నిండుగ వస్త్రధారణల్
    అనుటకు లేకపోయెగద హాయని చూచుచు సాగిపోదురే
    అనయము లెక్కపెట్టకను లాగులు షర్టులు వేసి పోవగా
    వనిత కదేల? సిగ్గు! మగవానికె యయ్యది శోభఁ గూర్చెడున్.

    రిప్లయితొలగించండి
  16. డా. ప్రభల రామలక్ష్మిఆదివారం, ఫిబ్రవరి 10, 2013 10:45:00 PM

    సాహితీ కృషీవలురెల్లరికి అభినందనలు,
    అందరూ సాహిత్యాన్ని పండిస్తున్న తీరు అద్భుతంగా ఉంది.
    మరొక్కమారు అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. అవధాన సభనుండి చాలా ఆలస్యంగా ఇల్లు చేరాను. రోజంతా బ్లాగు చూచే అవకాశం లభించలేదు. మన్నించండి.
    రేపటితో అవధానం పూర్తవుతుంది.
    అందరి పూరణల విహంగవీక్షణం చేసాను. వ్యాఖ్యానించే సమయం, ఓపికా లేవు. వీలైతే రేపు సాయంత్రం చూస్తాను.
    *
    పూరణలు పంపిన కవిమిత్రులు...
    పండిత నేమాని వారికి,
    లక్ష్మీదేవి గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    మిస్సన్న గారికి,
    సహదేవుడు గారికి,
    జిగురు సత్యనారాయణ గారికి,
    సిరాశ్రీ గారికి,
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
    రాజేశ్వరి అక్కయ్య గారికి,
    డా. ప్రభల రామలక్ష్మి గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    సిరాశ్రీ గారూ,
    సంతోషం... శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    మారెళ్ళ వామన కుమార్ గారూ,
    లక్కరాజు వారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. ధన్య వాదములు శ్రీ లక్కరాజు గారూ ! బహుకాల దర్శనం

    రిప్లయితొలగించండి
  19. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    నర్తన శాలలో స్త్రీ వేషంలో సిగ్గు పడవలసినది భీముడే గాని
    చాటుగానున్న ద్రౌపది కాదుగదా :

    01)
    _________________________________________

    వణికపు రూపు గల్గు ,వశ - బ్రామిక దీర్తును రమ్మనంచనన్
    వనితల నాట్యశాల కదె - వచ్చిన కీచకు కీడు సేయగా
    వనితగ చేరె భీముడట - వారిజ లోచన పొంచియుండగన్ !
    వనిత కదేల సిగ్గు మగ - వానికె యయ్యది శోభఁ గూర్చెడున్ !
    _________________________________________
    వణికము = మనోహరము
    వశ = స్త్రీ
    బ్రామిక = కోరిక

    రిప్లయితొలగించండి
  20. వస్త్రమును వీడి చేతులెత్తి వనజనాభుని ద్రౌపది ప్రార్థించు వేళలో
    సిగ్గుతో తలదించుకున్నవాడే గదా మగవాడు !

    02)
    _________________________________________

    వనితను దుష్టశీలు డదె - వస్త్రము లూడ్చుచు నున్న వేళలో
    వనజము నాభి యందు గల - వారిజ నేత్రుని సన్నుతింపగా
    వనితయె చేతులెత్తి , తన - వస్త్రము వీడ , సదస్సు నుండినన్
    వనిత కదేల సిగ్గు? మగ - వానికె యయ్యది శోభఁ గూర్చెడున్ !
    _________________________________________

    రిప్లయితొలగించండి
  21. పక్షులు పంచె పట్టుకు పోయిన వేళ , తను కట్టుకున్న చీరలోనే
    సగం భర్తకు పంచి యిచ్చిన దమయంతి సిగ్గు పడిందా ?
    నలుడే పడ్డాడు గాని !

    03)
    _________________________________________

    వనితను గూడి వల్లభుడు - వారికి తిండికి లేక , వైచినన్
    వనమున పక్షి గుంపపుడు - పంచియ నెత్తుకు పోవ ఖిన్నుడై
    వణకెడు నగ్న రూపుడగు - భర్తకు వస్త్రము పంచి యిచ్చుచో
    వనిత కదేల సిగ్గు మగ - వానికె యయ్యది శోభఁ గూర్చెడున్ !
    _________________________________________
    వల్లభుడు = నిషధాధిపుడు(నలుడు)
    వారి = నీరు

    రిప్లయితొలగించండి
  22. వసంత కిశోర్ గారూ,
    మీ మూడు పూరణలూ నైవిధ్యంగా ఉండి అలరిస్తున్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి




  23. కనుగొన నేటి సంఘమున గాలముతో బరివర్తనమ్ము నా
    ధునికపు భావజాలమున,దొయ్యలులందరు విద్యనేర్చియున్
    ధనసముపార్జనను,దాము వరించెడి వస్త్రధారులై,
    వనితకదేల సిగ్గు ,మగవానికె యయ్యది శోభ గూర్చెడిన్ .

    రిప్లయితొలగించండి
  24. ఘనముగ కూత కూయుచును ఘట్టిగ గెల్చెద నేనటంచు తా
    తినగనె గడ్డి పోచలను తీరిక మీరి యమేఠి నందునన్
    కనగ నిరాని నాదినము కంపర మొందుచు రాహులుండనెన్:
    వనిత కదేల సిగ్గు మగవానికె యయ్యది శోభఁ గూర్చెడున్

    రిప్లయితొలగించండి