కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
సూర్యపుత్రుండు భీముండు శౌర్యధనుఁడు.
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
సూర్యపుత్రుండు భీముండు శౌర్యధనుఁడు.
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిసహజ కవచ కుండలధారి, కర్ణుడు :
01)
_______________________________
సుదతి కుంతికి దుర్వాసు - శోభ వలన
సూర్యదేవుని కరుణను - సుతుడు కలిగె
సుందరుండైన బాలుండు - సోము సాటి
సూర్యపుత్రుండు , భీముండు ,- శౌర్యధనుఁడు !
_______________________________
భీముఁడు = భయంకరుడు
వసంత మహోదయా, మీదే ప్రథమ తాంబూలం ఈ రోజు :-)
రిప్లయితొలగించండిసూర్యపుత్రుండు భీముండు శౌర్యధనుడు
రిప్లయితొలగించండిధర్మ నిరతుండునౌ యమ ధర్మ రాజు
దక్షిణ దిశాధినాథు డాతనికి గూర్తు
వినయ మలరంగ నాత్మ వందన శతంబు
చంద్రశేఖరా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిమరి మీ తాంబూలమేది ?
కర్ణుడెవరి పుత్రుండుగా కాంచె జగతి?
రిప్లయితొలగించండికుంతికనిలు వరంబున కొమరు డెవరు?
నల కురుక్షేత్ర విజయుండనందు రేమి?
సూర్యపుత్రుండు,భీముండు , శౌర్య ధనుడు!
కవచ కుండల ధారుడు కర్ణు డరయ
రిప్లయితొలగించండిసూర్య పుత్రుండు, భీముడు శౌర్య ధనుడు
కుంతి మాతకు బుట్టిన కొమరు డతడు
అన్న దమ్ములు భీ ము డు కర్ణు లపుడు
సుబ్బారావుగార్కి నమస్సులు. భీముడు-కర్ణుడు = భీమ కర్ణులు
రిప్లయితొలగించండిఅని ద్వంద్వసమాసం కావున "భీముడు కర్ణుడపుడు" అనవలెనేమో పరిశీలించండి.
దుర్మదాంధు సుయోధను దుష్ట సాహ
రిప్లయితొలగించండిచర్య మందుచు కొలువగ చరిత యందు
సూర్య పుత్రుండు భీముండు శౌర్య ధనుడు
కర్ణు డావహమందున కరగి పోయె.
సూర్య పుత్రుండు భీముండు శౌర్యధనుడు
రిప్లయితొలగించండిఇంద్ర తనయు డరిందము డెవడు వాడు ?
వెన్ను చూపరా దెన్నడు వీరు డిచట
కర్ణు డగును, భీభత్సుడు, కదన మందు.
ఈనాటి సమస్యుకు మంచి పూరణలు అందించిన కవిమిత్రులు...
రిప్లయితొలగించండివసంత కిశోర్ గారికి,
పండిత నేమాని వారికి,
సహదేవుడు గారికి,
సుబ్బారావు గారికి,
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
నాగరాజు రవీందర్ గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.
చిత్రసీమను నటనకై శ్రీహరికిని
రిప్లయితొలగించండిసూర్యపుత్రుండు భీముండు శౌర్యధనుఁడు.
ఇంద్ర పుత్రుండు చూడగా నిందరకును
పాత్రధారు డొకండెగా బాగ జేసె.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
కోరి వరమిచ్చె దుర్వాసు కుంతి కపుడు
రిప్లయితొలగించండితంత్ర మెఱుగని కన్యగ మంత్ర మహిమ
వాయు దేముడు మెచ్చగ పరమ ప్రీతి
సూర్య పుత్రుండు భీముండు శౌర్య ధనుడు
అష్ట దిక్పాలకుల యందు నమరులందు
ముఖ్యుడై సమవర్తిగా మృత్యులోక
పాలకుండైన యమరాజు పాపహారి
సూర్యపుత్రుండు ,భీముండు ,శౌర్యధనుడు.
పాపులకు తగిన శిక్షలను అమలు చేయడంవలన ,వారి పాపాలను పరిహరిస్తాడని నా భావము.( యముడు పాపహారి అనుటలో ) .
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండికమనీయం గారూ,
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.