"చదువులలో సారమెల్లఁ జదివితిఁ దండ్రీ" అన్నాడు ప్రహ్లాదుడు. మొన్న వరంగల్‌లో జరిగిన భాగవత శతావధానంలో కేవలం భాగవత సంబంధమైన సమస్యలనే తీసుకురమ్మన్నారు. అప్పుడు నేను తయారుచేసుకున్న పది సమస్యలలో ఇది ఒకటి. ఈ సమస్యకు ప్రశంసనీయంగా చక్కని పూరణలు చెప్పిన కవిమిత్రులు.... పండిత నేమాని వారికి, గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, వసంత కిశోర్ గారికి, చంద్రమౌళి గారికి, లక్ష్మీదేవి గారికి, గన్నవరపు నరసింహ మూర్తి గారికి, సుబ్బారావు గారికి, మారెళ్ళ వామన్ కుమార్ గారికి, గండూరి లక్ష్మినారాయణ గారికి, నాగరాజు రవీందర్ గారికి, రాజేశ్వరి అక్కయ్య గారికి, డా. ప్రభల రామలక్ష్మి గారికి, మిస్సన్న గారికి, సహదేవుడు గారికి అభినందనలు, ధన్యవాదాలు.
నాగరాజు రవీందర్ గారూ, చక్రి శబ్దానికి ఉన్న మరో అర్థంతో చక్కని పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు. * తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు.
పది తలల రాక్షసేశుడు
రిప్లయితొలగించండిమది నెంచెను వైరభక్తి మార్గమునే య
య్యదనున ముక్తి గనుటకై
చదువులలో సారమెరిగి చక్రిన్ దిట్టెన్
చదివితి ననె ప్రహ్లాదుడు
రిప్లయితొలగించండిచదువులలో సారమంత చక్కగ జెప్పెన్
వదరకు మని సుతుడెఱిఁగిన
చదువులలో సార మెఱిఁగి చక్రిన్ దిట్టెన్.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
త్రిమూర్తులను పరీక్షింప నెంచిన భృగు మహర్షి :
01)
_______________________________
చదివెను విద్యల వన్నియు
చదువరియౌ భృగు మహర్షి - చక్కగ తానే
చదివిననూ ఫలమేమిటి ?
చదువులలో సార మెఱిఁగి - చక్రిన్ దిట్టెన్ !
_______________________________
యిదిధర్మముకాదు ప్రియమ
రిప్లయితొలగించండిదిది ధర్మంబైన వలదు నిర్ణయమనుచున్
గదుమెసుయోదనుడంతగ
చదువులలో సార మెఱిఁగి చక్రిన్ దిట్టెన్.
గదిమిరి శాపంబొసగిరి
రిప్లయితొలగించండివిదితులె, జయుడదె ప్రభువును వెంటనె జేరం
గదలచి శత్రువు దానై
(చదువులలో సార మెఱిఁగి) చక్రిన్ దిట్టెన్.
మది యెఱిగిన హృది దెలియున
రిప్లయితొలగించండివదరక దా మెలగ గలదె వాక్కుయు నెమ్మిన్
దుదిగొని హిరణ్యకశిపుడు
చదువులలో సార మెఱిఁగి చక్రిన్ దిట్టెన్.
రిప్లయితొలగించండిచదువుదు దండ్రీ! యెప్పుడు
చదువులలో సార మె ఱిగి , చక్రిని దిట్టెన్
మదమున హిరణ్య కశిపుడు
మది లోపల నావహించి మరణపు భయమున్
తన బీదరికానికి బాధపడుతున్న ఒక వ్యక్తి :
రిప్లయితొలగించండిచదివిన చదువులు గృహమం
దధికుల క్షుద్బాధనేమి నణచక పోగా
హృదినందు కోపమొందుచు
చదువులలో సారమెరిగి చక్రిన్ దిట్టెన్.
పై సంపాదన లేక బాధపడుతున్న ఒక వ్యక్తి :
రిప్లయితొలగించండిఅదనుకు తగు పనులన్నియు
వదవదగా నిర్వహించు వాడైనను, తా
నదనపు నార్జన పొందక
చదువులలో సారమెరిగి చక్రిన్ దిట్టెన్.
సుదతిని సీతను చెరగొని
రిప్లయితొలగించండిమదిచెడి యుద్ధంబు జేసె మైథిలి పతితో
పది తలలవాడు, జ్ఞానై
చదువులలో సార మెరిగి చక్రిన్ దిట్టెన్.
చదివె హరిని ప్రహ్లాదుడు
రిప్లయితొలగించండిచదువులలో సార మెఱిగి ; చక్రిన్ దిట్టెన్
జదువక కశిపుం డట్టుల ;
చదివే చదువులను బట్టి సంస్కారంబుల్
చదువులు ముఖ్యము గాదట
రిప్లయితొలగించండిమది నిండుగ మనిషి కెపుడు మంచి యనంగా !
చదివిన రావణు డైనను
చదువు లలో సారమెఱిఁ గి చక్రిన్ దిట్టెన్ !
చదువులు చెప్పెడి గురువులు
రిప్లయితొలగించండిచదివించిన తీరుచూడ చదువగమనినన్
కుదురుగ చదవని పిల్లల
చదువులలో సారమెరిగి "చక్రి"న్ దిట్టెన్.
ముదమున హ్లాదుడు శరణనె
రిప్లయితొలగించండిచదువులలో సారమెరిగి చక్రిన్, దిట్టెన్,
చిదుమగ జూచెను దైత్యుడు
మదమున దయ మాలి యకట మహనీయ సుతున్.
కొదువే లేక చదివినను
రిప్లయితొలగించండిమధువై తలకెక్కి నంత మతమౌఢ్యమదే
ముదిరిన యన్యమతస్తుడు
చదువులలోసారమెఱిగి చక్రిన్ దిట్టెన్!
మది నెంచెను ప్రహ్లాదుడు
రిప్లయితొలగించండిచదువులలో సార మెఱిగి చక్రిన్ ; దిట్టెన్
బెదరించెను హింసించెన్
గదతో మొత్తించె సుతుని కశిపుం డపుడున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి"చదువులలో సారమెల్లఁ జదివితిఁ దండ్రీ" అన్నాడు ప్రహ్లాదుడు. మొన్న వరంగల్‌లో జరిగిన భాగవత శతావధానంలో కేవలం భాగవత సంబంధమైన సమస్యలనే తీసుకురమ్మన్నారు. అప్పుడు నేను తయారుచేసుకున్న పది సమస్యలలో ఇది ఒకటి.
రిప్లయితొలగించండిఈ సమస్యకు ప్రశంసనీయంగా చక్కని పూరణలు చెప్పిన కవిమిత్రులు....
పండిత నేమాని వారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
వసంత కిశోర్ గారికి,
చంద్రమౌళి గారికి,
లక్ష్మీదేవి గారికి,
గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
సుబ్బారావు గారికి,
మారెళ్ళ వామన్ కుమార్ గారికి,
గండూరి లక్ష్మినారాయణ గారికి,
నాగరాజు రవీందర్ గారికి,
రాజేశ్వరి అక్కయ్య గారికి,
డా. ప్రభల రామలక్ష్మి గారికి,
మిస్సన్న గారికి,
సహదేవుడు గారికి
అభినందనలు, ధన్యవాదాలు.
విదు డొకడు కొనెను కుండలు
రిప్లయితొలగించండిముదముగ ధనమొసగి కొంత ; పోయగ జలముల్
విదళన మయె నవి ; చదువరి
చదువులలో సార మెఱిగి చక్రిన్ దిట్టెన్
* చక్రి = కుమ్మరి
పదుగురు చదువగ చెరియొక
రిప్లయితొలగించండిగదిలో చేరగ, చదువక కాంతామణులన్
దలచుచు పడితిరు గగనా
చదువులలో సారమెఱిగి"చక్రిన్" దిట్టెన్
నాగరాజు రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిచక్రి శబ్దానికి ఉన్న మరో అర్థంతో చక్కని పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.
*
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
శ్వేతకేతు:
రిప్లయితొలగించండిచదివియు మంత్రము లెల్లను
మది నిండుగ తంత్రములను
మాన్యత తోడన్
కదలని బ్రహ్మము దెలుపని
చదువులలో సార మెఱిఁగి చక్రిన్ దిట్టెన్
కదలని బ్రహ్మపు తత్త్వము
రిప్లయితొలగించండిపది మాటలలో తెలిపిన పండితుడొకడున్
పదునెనిమిది యోగములన్
చదువులలో సార మెఱిఁగి చక్రిన్ దిట్టెన్ 😊