17, ఫిబ్రవరి 2013, ఆదివారం

పద్య రచన – 255

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

46 కామెంట్‌లు:

 1. మొక్క జొన్న పొత్తు ముత్యాల వలె నుండు
  కాల్చి తినగ మిగుల కమ్మగుండు
  ప్రీతి గలుగు దీని పేలాలు గా తిన
  పుష్టి నిచ్చు ప్రకృతి పొట్ల మిదియె.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గోలి వారూ,
   "కాదేదీ కవిత కనర్హం" అన్నారు కదా. ఎంత అందమైన పద్యం చెప్పారు! అభినందనలు.

   తొలగించండి
 2. సంద్ర తీరము నందుట సంధ్య వేళ
  నడచి నిన్ గనుగొంటినే నవక మొలక
  ముదిత మప్పగ ముద్దుల మొక్కజొన్న
  దంత పంక్తికి పని వట్టె తగులుకొనగ !

  విశాఖపట్టణములో సముద్ర తీరములో ఓ ముసలమ్మ చక్కగా కాల్చి పెట్టేది , పాతదినాలు మళ్ళీ గుర్తు చేసారు శ్రీ శంకరార్యులు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గన్నవరపు వారూ,
   మీ పాత జ్ఞాపకాల పద్యం బాగుంది. అభినందనలు.
   'సంద్ర తీరము' అన్న దానిని "సంద్రపుం దీరముం జేరి" అందాం.

   తొలగించండి
 3. కనఁగ నీ జొన్న మనజొన్న గాదు, నిజము,
  తురక లీ దేశమునకుఁ దెచ్చిరఁట నాఁడు
  గాన ననిరి 'మక్కాజొన్న' గాను జనులు,
  తెల్ల పచ్చని జొన్నలు దెలియ మనవి.

  రిప్లయితొలగించండి
 4. ఆచార్యా ! ధన్యవాదములు.

  నిజమా..మాకు తెలియని క్రొత్త విషయాన్ని చెప్పారు....

  చక్కగ కాల్చుక ప్రీతిగ
  మెక్కట మేగాని మాకు మీరను దాకన్
  'మక్కా జొన్నని ' తెలియదు
  మిక్కిలి యానందమాయె మీదట తెలియన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గోలి వారూ,
   బాగుంది పద్యం.
   జనవ్యవహారంలో మొక్కజొన్నగా రూఢి అయింది కాని నిజానికి అది మక్క(క్కా)జొన్న.

   తొలగించండి
 5. శాస్త్రి గారు గురువు గారు కలిసి మొక్కజొన్న గింజల రుచిని నాకు బాగా గుర్తు చేశారు

  మొక్కజొన్న కంకి బొగ్గు నిప్పుల గాల్చి
  ఉప్పుకార మలది తప్పకుండ
  ఊదుకొనుచు దినగ నొలిచిన గింజలన్
  ఉర్విలోని రుచులె పర్వు నోట

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రవీందర్ గారూ,
   ఒలిచిన గింజలను ఊదుకొనుచు తినడం బాగుంది. మంచి పద్యం చెప్పారు. అభినందనలు.

   తొలగించండి
 6. మొక్క జొన్న పొత్తు మురిపించె మమ్ముల
  ముత్యములను బోలు విత్తు తోడ
  ఉడక బెట్టి మఱియు నుప్పు వేసి దినిన
  జాల రుచిగ నుండు సామి ! నిజము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మంచి పద్యం చెప్పారు. అభినందనలు.
   ఉడికించి తిన్న చిన్నప్పటి అనుభవాన్ని గుర్తుకు తెచ్చారు. ధన్యవాదాలు.

   తొలగించండి
 7. పలుకు లొలికెడు తియ్యని పచ్చ జొన్న
  కవిత రాదుటె నిను గన కనుల పంట
  తురక లప్పుడు దెచ్చిన నురక లిడమె
  మక్కజొన్నలు దినుటకు మతము లడ్డ !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గన్నవరపు వారూ,
   తిండికి మతం అడ్డురాదన్న మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.

   తొలగించండి
 8. మొక్కజొన్న *గట్క పొయ్యి మీదను వండి
  చింతకాయ **తొక్కు సుంత జేర్చి
  నంజుకొనుచు దినగ వ్యంజనముల తోడ
  ‘చాల రుచి' యండ్రు జానపదులు

  * సంకటి
  ** పచ్చడి

  రిప్లయితొలగించండి
 9. చివరి పాదంలో తప్పు దొర్లితే మార్చాను గురువు గారూ !

  రిప్లయితొలగించండి
 10. మాన్యులు శ్రీ శంకరయ్య గారికి
  నమస్కారములు!

  ఉరుదు, హిందూస్తానీలలోని “మక్కా” తెలుగు మొక్కజొన్నలోని “మొక్క”కు మూలం కావచ్చునని ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావించారు.

  మొక్కజొన్న బహుశః 14-వ శతాబ్దికి కొద్దికాలం మునుపు మన దేశంలోకి అడుగుపెట్టిందని ఆహారశాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. సంస్కృతంలో దీనికి “యావనాల”మని పేరు. రఘునాథ గణేశ నవహస్తుని “భోజన కుతూహలము”లో “యావనాలో మహాన్ వాస్యో దుర్జరో వాతపిత్తకృత్” అని ఉన్నది. లోలింబ రాజు “వైద్యావతంసము”లో “యావనాలో మహాకాయో రుచ్యః” అని ఉన్నది. కాతభట్టు “నిఘంటుసంగ్రహము”లో “మకాయస్తు మహాకాయో కటిజః కాణ్డజః స్మృతః” అని ఉన్నది.

  సంస్కృతంలోని “మహాకాయః” (పొట్ట ఉబ్బి ఉండటం) అన్నదే – గుజరాతీ, బెంగాలీలలో “మకాయీ”, మరాఠీలో “ముక్కా”, తమిళంలో “ముక్క-చోళం”, తెలుగులో “మొక్క” అయినట్లుంది.

  అదే అర్థంలో “భూత” శబ్దం బెంగాలీలో (భుట్టా) అయింది. తెలుగులోనూ “మొక్క బుట్ట”లని ఉన్నది.

  “తురక లీ దేశమునకుఁ దెచ్చిరఁట” అన్నది ఇంకా పరిశీలనీయం. మొక్కజొన్న అమెరికా ఖండం నుంచి చైనా ఐరోపాలకు చేరి, పోర్చుగీసుల ద్వారా మనదేశంలోకి అడుగుపెట్టిందని 1939లో R.G. Reeves “The Origin of Indian Corn” అనే గ్రంథంలో వ్రాశారు. Turkish Corn అనే రూపం 17-వ శతాబ్దిలో దక్కను పీఠభూమి లోనికి ప్రవేశించినట్లుంది.

  "మక్కా" - "మొక్క" అవునో, కాదో కూడా శబ్దనిష్పత్తి ఇంకా పరిశోధనీయం.

  శుభాకాంక్షలతో,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 11. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మఆదివారం, ఫిబ్రవరి 17, 2013 12:22:00 PM

  శాస్త్రిగారు నుడువ చక్కని పద్యము
  మొక్కజొన్నమీద చిక్కెనొక్క
  నిక్కమైన యర్థమిక్కడ శంకర
  మాన్య వరుని వలన "మక్కజొన్న"

  రిప్లయితొలగించండి
 12. శ్రీ ఏల్చూరి వారు చక్కని పరిశోధనాత్మక విషయమును తెలిపినారు.
  తోపెల్ల వారూ ! ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 13. కొమ్మ యొకతె యిచ్చె కొమ్ము కొమ్మని పొత్తు
  పొత్తు వలన కుదిరె క్రొత్త పొత్తు
  ఘుమ్ము ఘుమ్మటంచు కమ్మ కమ్మని రుచుల్
  వింత వింతలైన విందు లొసగె

  రిప్లయితొలగించండి
 14. కొమ్మ యొకతె యిచ్చె కొమ్ము కొమ్మని పొత్తు
  పొత్తు వలన కుదిరె క్రొత్త పొత్తు
  ఘుమ్ము ఘుమ్మటంచు కమ్మ కమ్మని రుచుల్
  వింత వింతలైన విందు లొసగె

  రిప్లయితొలగించండి
 15. మక్కబుట్ట యండ్రు మక్క పొత్తని యండ్రు
  మక్క కంకి యనుచు నొక్కరుండు
  పెక్కు ప్రాంతములను నొక్కొక్క రీతిగా
  పిలుచుచుండ్రు జనులు పేరు పెట్టి

  రిప్లయితొలగించండి
 16. భూధర సుత బెట్టిన ముక్కు పుడక యనగ
  కమల చేతి నుండి కురియు కాసులనగ
  నలువ రాణి వీణను మీటు నఖములనగ
  మొక్క జొన్న విత్తులు తమ నిక్కుఁ జూపె

  రిప్లయితొలగించండి
 17. మక్క దినుసు నుండి చక్కని గారెలు
  చేయవచ్చు బాగ మేయవచ్చు
  మొక్కజొన్న వలన లెక్కలేని సిరులు
  కలుగు గాక ! యెపుడు కర్షకులకు

  రిప్లయితొలగించండి
 18. నాగరాజు రవీందర్ గారూ,
  మక్కజొన్న గట్క చింతపండు తొక్కుతో తిన్న అనుభవం నాకున్నది. పెరుగుతో తింటే దాని రుచే రుచి.
  చిన్ననాటి రోజులను గర్తుకు తెచ్చారు మీ పద్యంతో. ధన్యవాదాలు.
  *
  ఏల్చూరి మురళీధరరావు గారూ,
  విషయమైనా లోతుగా, సాధికారంగా వివరించే నైపుణ్యం మీ సొత్తు. ధన్యవాదాలు.
  చిన్ననాట మా స్కూల్ మాస్టారు చెప్పిన విషయమే తురకలు తెచ్చిన మక్కాజొన్నల కథ. అదే నమ్మాను, చెప్పాను. అంతే!
  *
  తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
  బాగుంది మీ పద్యం, అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  పొత్తు శబ్దంతో చమత్కారం.. మంచి పద్యం చెప్పారు. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ రెండు పద్యాలూ చాలా బాగున్నవి. అభినందనలు.
  *
  జిగురు సత్యనారాయణ గారూ,
  నిక్కు చూపిన మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 19. మొక్క జొన్న వలచి ముక్కలు గాఁజేసి
  పోపు పెట్టి కొంత పులుపు కలిపి
  యుడక పెట్ఠి దాని యుప్మగా తినినంత
  చెప్ప నలవి గాదె గొప్ప రుచుల!

  రిప్లయితొలగించండి
 20. మిత్రులు జిగురు వారి మొక్క జొన్న కవిత్వం మనోహరంగా వుంది.అభినందనలు.

  రిప్లయితొలగించండి
 21. నా రెండవ పద్యం చివరి పాదంలో ఒక మాత్ర తక్కువైంది. దానిని యిలా మార్చుతున్నాను.

  “ చాల రుచిగ నుండు జనపదులకు "

  రిప్లయితొలగించండి
 22. ముత్యాల పొత్తని ముద్దుగా నొకరన!
  ...........నవక మొల్కనె వీరు నవ్య రీతి!
  మనజొన్న కాదిది మక్క జొన్నన వారు!
  ...........కాల్చిన కంకియె కమ్మ వీర్కి !
  ఉడక బెట్టిన పైన నుప్పుతో రుచి వార్కి !
  ...........తియ్యని జొన్నన తీపు వీర్కి !
  చింత తొక్కును గూడ జిహ్వ కింపన వారు!
  ...........మొక్క బుట్టల సుద్దు ముద్దు వీర్కి!

  కొమ్మ పొత్తులు కొమ్మన ఘుమ ఘుమాయె
  వార్కి! జొన్నలు విత్తాయె వీర్కి! జొన్న
  గారె లింపాయె నొకరికి !కటకటాయె
  నాకు నికనేమి దొరకక! నమ్ము నిజము.

  రిప్లయితొలగించండి
 23. మిస్సన్న మహాశయా ! మొక్కజొన్నలో షడ్రుచులను సీసాలో నింపారు. చాలా బాగుంది.

  రిప్లయితొలగించండి
 24. మొక్కజొన్న ఎంత తిన్ననూ చక్కగా అరుగును,
  బక్క రైతుల వనంలో ఏపుగా పెరుగును,
  కాల్చి తిన్న దాని రుచి రెట్టింపు అగును,
  ఉడక పెట్టి తిన్న ఉదరాకలి తీర్చును.

  రిప్లయితొలగించండి
 25. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ.ఆదివారం, ఫిబ్రవరి 17, 2013 9:24:00 PM

  మిస్సన్న మహోదయా! ఒక బ్లాగునో పట్టు పట్టి సారమొక సీ(సా)సంలో పోసి పంచిన మీకు అభినందనలు.

  ఆలుమగలనురాగపు హాయి పొత్తు
  అత్త కోడళ్ళ మధ్యన యమరు పొత్తు
  అన్న దమ్ముల మధ్యన నున్న పొత్తు
  కలసి మెలసియు పెనవేసి కాంతులీను
  చూపు చున్నది మనకు జొన్న పొత్తు.

  రిప్లయితొలగించండి
 26. మక్కా జొన్నా యనుచు నిక్కంపు రుచు లందు
  చక్కగాను నిక్కి మెక్కు మనుచు
  అన్ని కలము లందు యద్భుతమ్ము గనిండి
  మిగిలి తీవు బ్లాగు మిడిసి పడగ

  రిప్లయితొలగించండి
 27. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ.ఆదివారం, ఫిబ్రవరి 17, 2013 9:36:00 PM

  అక్కయా గారూ! మీకలముకూడ తక్కువ మెక్కలేదు. చాల బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 28. మూర్తి మిత్రమా! సుబ్రహ్మణ్య శర్మ గారూ! ధన్యవాదాలు.

  నిజంగా మిత్రులందరూ మొక్కజొన్న పొత్తు పైన బహు కమ్మనైన పద్యాలు వ్రాశారు. నాకేమీ దొరకక అలా చేశా నన్న మాట.

  రిప్లయితొలగించండి
 29. సహదేవుడు గారూ,
  మక్కజొన్నతో ఉప్మా కూడా చేయవచ్చునా.. నాకు తెలియని విషయం. బాగుంది. మంచి పద్యం. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  ఈనాటి పద్యరచనా శీర్షికకు సమీక్ష లాంటి పద్యం వ్రాసారు. అద్భుతంగా ఉంది. అభినందనలు.
  *
  రవికుమార్ గారూ,
  మీ భావానికి నేనిచ్చిన మంజరీ ద్విపద రూపం...
  మొక్కజొన్నెంతైన మెక్కిన నరుగు
  బక్క రైతుల నేల బాగుగా పెరుగు
  కాల్చి తిన్నను రుచి కనగ రెట్టింపు
  ఉడికించి తిన్నను నుదరమ్ము నిండు.
  *
  తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
  పొత్తులను కుదిర్చిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
  మధ్యన నమరు... అనండి.
  చివిరి పాదంలో గణదోషం. మనకు... అన్నదాన్ని మనకిదే.. అనండి.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  అద్భుతంగా రాసారు పద్యాన్ని. అభినందనలు.
  మక్కా జొన్నా .. అన్నచోట గణదోషం. మక్క జొన్న అంటే సరి.

  రిప్లయితొలగించండి
 30. తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ.ఆదివారం, ఫిబ్రవరి 17, 2013 10:40:00 PM

  గురువుగార్కి నమస్సులు. మీసూచనానంతరం

  ఆలుమగలనురాగపు హాయి పొత్తు
  అత్త కోడళ్ళ మధ్యన నమరు పొత్తు
  అన్న దమ్ముల మధ్యన నున్న పొత్తు
  కలసి మెలసియు పెనవేసి కాంతులీను
  చూపు చున్నది మనకిదే జొన్న పొత్తు.

  రిప్లయితొలగించండి
 31. డా.ప్రభల రామలక్ష్మిసోమవారం, ఫిబ్రవరి 18, 2013 12:00:00 AM

  ఏల్చూరి మురళీధరరావుగార్కి,శంకరార్యులకు నమస్సులు.

  మా గురువులొకరు మొక్కజొన్న విషయమై, " మఖ నక్షత్రంలో విత్తులు నాటుతారు కాబట్టి మఖజొన్న అని పిలవబడేది. కాలక్రమంలో మఖజొన్న కాస్త మొక్కజొన్న అయ్యింది" అని చెప్పారు. ఈ విషయం మీ పరిశోధనకు పనికొస్తుందేమోనని తెలియచేస్తున్నాను. వ్యవహారంలో చాలా పదాలు రూపాంతరం చెందడం సర్వవిదితమే.

  రిప్లయితొలగించండి
 32. డా.ప్రభల రామలక్ష్మిసోమవారం, ఫిబ్రవరి 18, 2013 12:25:00 AM

  పొత్తులెక్కువాయె పొత్తును చూడంగ
  బ్లాగునందు మిత్రులందరకును
  పొత్తుకెంత శక్తొ! పొత్తును గూర్చంగ
  ఇట్టి పొత్తు గంటిమెప్పుడైన?

  రిప్లయితొలగించండి
 33. డా. ప్రభల రామలక్ష్మి గారికి,
  క్రొత్త విషయం చెప్పారు. ధన్యవాదాలు.
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  రెండవ పాదంలో యతి తప్పింది.
  "బ్లాగునందు మిత్రవర్గమునకు" అందామా?

  రిప్లయితొలగించండి
 34. గురువు గారికి, సహదేవుడు గారికి ధన్యవాదాలు

  రిప్లయితొలగించండి
 35. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  మొక్కజొన్నపొత్తు(బుట్ట) :

  01)
  _______________________________

  ముందు కాల్చ వలయు - పొందికగా వీని!
  మునపు తీరు , దినిన - మొక్కజొన్న!
  ముత్యము లవి పసిడి !- నిత్యమూ తినదగు !
  ముద్దు లొలుకు చుండు - బుట్ట దినరె !
  _______________________________
  మునపు = మోజు, కోరిక

  రిప్లయితొలగించండి