9, ఫిబ్రవరి 2013, శనివారం

పద్య రచన – 247

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

16 కామెంట్‌లు:

  1. మనమున కానందంబగు
    ననవరతము గాంతుమేని హాస్యపు చిత్రా
    లెనలేని సౌఖ్యమబ్బెడు
    ననుపమమగు స్వాస్థ్యవృద్ధి హాస్యోక్తులకున్.

    రిప్లయితొలగించండి
  2. వనజాతాస్త్రుని మించిన
    తనూ విభవ మొప్పు నొకడు దర్పణమున దా
    గని నిజసౌందర్యమ్మును
    మనముప్పొంగగ జెలంగె మధురోహలతో

    రిప్లయితొలగించండి
  3. మనిషి యొక్క డు నిలబడి మమత తోడ
    అంద చందాలు దనవియా యద్ద మందు
    చూడ సాగెను జిత్రాన చూడు డార్య !
    యెవరి యందము వారికి యింపు గాదె ?

    రిప్లయితొలగించండి
  4. కొత్తల నడు క్కొనుటకున్
    కొత్త విధము నొక్క భిక్షకుండు కనుగొనెన్
    ఇత్తురు డబ్బులు పాంథులు
    కొత్తగ తమ మోము జూచుకొను చద్దమునన్

    రిప్లయితొలగించండి
  5. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మశనివారం, ఫిబ్రవరి 09, 2013 4:56:00 PM

    చూచు వారలకందున చోద్యమగుచు
    మోము దర్పణమై నగు మోము జూప
    పథికుల తల దువ్వుచు పైస లేయ
    కోటి విద్యలున్నవి గూడ కూటి కొరకె.

    రిప్లయితొలగించండి
  6. నవ్వులు వంటికి మంచిది
    నవ్వులు చేటందు రపుడు నాలుగు విధముల్ ! !
    నవ్వుల పువ్వులు నిండుగ
    రువ్వుచు జనులుండ జయము రుగ్మత లేకన్ !
    -------------------------------------------
    మోమును ముకురము నందున
    సోముడ తానంచు మురిసి సొగసులు చిందన్ !
    యేమది వింతగ నున్నది
    నామోమే సొగసు లలరు నళిన దళేక్షా !

    రిప్లయితొలగించండి
  7. చక్కని సంపెంగపు విరి
    ముక్కే నాదనుచు నొకడు ముకురము జూడన్
    “ లెక్కా నీకొక డాలరు !
    కక్కుర్తి పడక" ని జోగి కంఠము పలికెన్

    రిప్లయితొలగించండి
  8. తనతో చదివిన మిత్రుని
    కనలేని విధమున భిక్షగాడిగ నూహిం
    చనెలేక కొలువు చిక్కని
    మునుపటి తనుగనుచు బిక్క మోమున వణికెన్

    రిప్లయితొలగించండి
  9. dharmamu jEyaMDayyaa
    dharmaMbunu jEyakunna tama roopammE
    karmamu gaalunu naa vale
    marmaambiTa jooDa nagunu marusati janman.

    రిప్లయితొలగించండి
  10. ధర్మము జేయండయ్యా !
    ధర్మంబును జేయకున్న తమ రూపమ్మే
    కర్మము గాలును నా వలె
    మర్మంబిట జూడ నగును మరుసటి జన్మన్!

    రిప్లయితొలగించండి
  11. వ్యంగ్యచిత్రానికి తగిన పద్యాలు రచించిన కవిమిత్రులు...
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    పండిత నేమాని వారికి,
    సుబ్బారావు గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
    రాజేశ్వరి అక్కయ్య గారికి,
    సహదేవుడు గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. డా. ప్రభల రామలక్ష్మిఆదివారం, ఫిబ్రవరి 10, 2013 9:44:00 AM

    దక్షత లేరని వగచియు
    భిక్షంబును చేయదలచ బిడియంబాయెన్
    రక్షగ ముకురంబిడుకొని
    కుక్షిని నింపంగజూచె కూడలిలోనన్.

    రిప్లయితొలగించండి
  13. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మఆదివారం, ఫిబ్రవరి 10, 2013 9:46:00 AM

    రామలక్ష్మిగారు. బాగుంది మీ పూరణ౤ అభినందనలు.

    రిప్లయితొలగించండి