7, ఫిబ్రవరి 2013, గురువారం

సమస్యాపూరణం – 959 (పండు వెన్నెల గాసెను)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
పండు వెన్నెల గాసెను బట్టపగలు
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదములు.

31 కామెంట్‌లు:

  1. వన్నెలే చిందు 'మిస్ యూని వర్సు ' రాగ
    నొక్క వేడుక సభకామె హొయలు జూచి
    కుర్ర కారుల మదిలోన వెర్రిగాను
    పండు వెన్నెల గాసెను బట్టపగలు

    రిప్లయితొలగించండి
  2. నింగి శుక్లపక్షము నాడు నీరజారి
    పండు వెన్నెల గాసెను ; పట్టపగలు
    సూర్యుడు నడినెత్తికి వచ్చి చురుకు మనెడు
    తీక్ష్ణ కరముల తోచెను దినము నందు

    రిప్లయితొలగించండి
  3. నిన్నటి " తల "లు గల దత్తపది పూరణ ల గురించి నా స్పందన .

    'తల ' యుండవలయు నందున
    'తలకానిది ' యుండవలయు తగినట్లనగా
    తలగాని తలల తమ రా
    తలలోనే జూపిన ' కవి 'తలకే జయహో!

    రిప్లయితొలగించండి

  4. ఓల లాడుచు రఘువంశ యుదధి లోన
    రామచంద్రుడు గురిపించె ప్రేమసుధలు
    నవక జలజుని వదనంబు నవ్వు చింద
    పండు వెన్నెల గాసెను బట్టపగలు

    రిప్లయితొలగించండి
  5. గోలివారి "తలల" పద్యము అద్భుతముగా నున్నది,అభినందనలు అందుకొండి

    రిప్లయితొలగించండి
  6. గుండె నిండుగ చెలికాఁడు కొలువు తీర
    చెండు పూవు బోలు వనిత సిగ్గుపడగ...
    నిండు పున్నమి నాటి యా నింగి సొగసు!!
    పండు వెన్నెల గాసెను బట్టపగలు .

    రిప్లయితొలగించండి
  7. దడిచి సైంధవ భూపతి దాగి యుండ
    క్రీడి మాటను నిలపగ కృష్ణుడంత
    చక్రమడ్డమేసి యినుని చాటుఁ జేయ
    పండు వెన్నెల గాసెను బట్టపగలు!!

    రిప్లయితొలగించండి
  8. కరువు కాలము నశియించె గడుపు నిండ
    కూడు లభియించె బ్రతుకులు కోలుకొనియె
    సంకటంబులు మిత్రమా! సమసిపోయె
    పండు వెన్నెల గాసెను పట్టపగలె .

    రిప్లయితొలగించండి
  9. కలిసి చరవాణి పొరబాటు పిలుపు తోన
    ప్రేమగా మారి విరహమ్ము పెంపు గాగ
    చూచుకొన జంట సాయంత్ర శోభయందు
    పండు వెన్నెల గాసెను పట్ట పగలు!
    చరవాణి= సెల్ ఫోన్
    పొరబాటు పిలుపు=మిస్డ్ కాల్

    రిప్లయితొలగించండి
  10. నవ్వినంతనె తనువెల్ల నాట్యమాడె
    ఓరచూపుకు స్వేదాన సొమ్మసిల్లె
    అతివ సొగసుకు దాసోహ మనెను యతడు
    పండు వెన్నెల గాసెను బట్టపగలు

    రిప్లయితొలగించండి
  11. చల్లగాలులనడుమయాచందమామ
    హేలగావింపనా శరత్కాల రాత్రి
    పండు వెన్నెలఁ గాసెను, పట్ట పగలు
    సూర్యుడుదయించ చెమటలజూచినాము,
    జీవితమ్మున సుఖదు:ఖభావములివె.

    రిప్లయితొలగించండి
  12. నేడు పౌర్ణమి యగుటన నీ లి ఖగము
    పండు వెన్నెల గాసెను, బట్ట పగలు
    యెండ తీ వ్రత జూ డగ మెండు గుండె
    చెట్లు చేమలు సర్వము చితిగ మారె

    రిప్లయితొలగించండి
  13. తెల్ల మంచులు కురిసెను యుల్ల మలర
    జగము మురిసెను హిమవంత నగము సొగసు
    సుమము తెలుపును మించిన హిమము కాంతి
    పండు వెన్నెల గాసెను బట్ట పగలు

    రిప్లయితొలగించండి
  14. పండు వెన్నెలలో సాగు పాట కొఱకు
    చిత్రసీమలో షూటింగు చేయుచుండ
    వెలిగె దీపపు చంద్రుడు విస్తరించి
    పండు వెన్నెల గాసెను బట్టపగలు

    రిప్లయితొలగించండి
  15. తల లేని తల గూర్చిన యిన్ని తలపులు మీ తలలో ఎలా మొలుస్తున్నాయి హనుమచ్ఛాస్త్రి గారూ?

    రిప్లయితొలగించండి
  16. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    భార్య బింకాన్ని వీడితే భర్త మదిలో :

    01)
    _______________________________

    పంత మూని పండుకొనిన - పడుచు భార్య
    పంతమును దీర్చ బ్రతిమాలు - పతిని జూచి
    పంతమును వీడి ప్రియమార - పలికి నంత
    పండు వెన్నెల గాసెను - బట్ట పగలు !
    _____________________________

    రిప్లయితొలగించండి
  17. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మదిలో వెన్నెల గాయించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    తల కాని తలల కవితలను బ్లాగు పక్షాన ప్రశంసించినందుకు ధన్యవాదాలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు.
    మీ రెండవ పూరణ అదిరింది. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహమూర్తి గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసనీయం. అభినందనలు.
    'రఘువంశ + ఉదధి = రఘువంశోదధి' అవుతుంది. అక్కడ యడాగమం రాదు కదా. ఆ పాదాన్ని 'మునకవేయుచు రఘుకులాంభోధియందు' అని అందామా?
    నవక జలజుని.... ?
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ అందంగా ఉంది. అభినందనలు.
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ ప్రశంసనీయంగా ఉంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    *
    ప్రయాగ మూర్తి గారూ,
    మీకు శంకరాభరణం బ్లాగు ఆనందంతో స్వాగతం పలుకుతున్నది.
    మీ ప్రయత్నం ప్రశంసనీయం. అభినందనలు.
    రెండవ పాదంలో యతి తప్పింది. 'ఓరచూపుకు స్వేదాన నోలలాడె...' అందామా?
    'అనెను + అతడు = అనె నతడు' అవుతుంది. అక్కడ యడాగమం రాదు. 'అనియె నతడు' అందాం.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    నీలి ఖగము... ?
    *
    రాజేశ్వరి అక్కయ్య గారూ,
    మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
    'కురిసెను + ఉల్లము = కురిసె నుల్లము' అవుతుంది. అక్కడ యడాగమం రాదు. 'తెల్లనైన మంచు కురిసె నుల్ల మలర' అందాం.
    *
    వసంత కిశోర్ గారూ,
    అలక లేని చోట పగలే వెన్నెల కదా... బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. తల లేని తలగూర్చి తలచిన కలతలే గా !!!

    రిప్లయితొలగించండి
  19. మిస్సన్న గారూ ! శంకరార్యా ! ధన్యవాదములు.
    శంకరాభరణ పఠిత గారూ

    నాది తల లేని తలగూర్చి తలచు ఉత్సుకత కల తలే గా !!!

    రిప్లయితొలగించండి
  20. శంకరాభరణ పఠిత గారూ,
    ఈ పేరుతో ప్రత్యేకంగా మెయిల్ ఐడి తయారు చేసుకున్నందుకు ధన్యవాదాలు.
    మీ రెవరో కాని ఇలా అజ్ఞాతంగా ఉండాలనుకుంటే నాకు అభ్యంతరం లేదు.
    మీ వ్యాఖ్యలోని 'ధ్వని'ని గుర్తించలేక పోయాను. క్షంతవ్యుణ్ణి.

    రిప్లయితొలగించండి



  21. కవుల యూహల కేమి రెక్కలు ధరించి
    జగము నూయల లూగించ జాలుచుంద్రు
    వింతకాదు;సాధ్యమ్మె కవీంద్ర రచన
    పండువెన్నెల గాసెను బట్టపగలు.

    రిప్లయితొలగించండి
  22. మిస్సన్న మహాశయా ! కుశలమే ! ధన్యవాదములు !

    శంకరార్యా !ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  23. కమనీయం గారూ,
    కదిలే ఊహలకు కన్నులు పొదిగే కవులకు సాధ్యం కానిదేది?
    మనోహరమైన పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. శంకరార్యా !
    పెద్దల పట్ల అమర్యాదగా ప్రవర్తించు తలలకు మాత్రమే నా వ్యాఖ్య వర్తిస్తుంది గాని, శాస్త్రిగారి వంటి సహృదయులకు వర్తించదు.

    రిప్లయితొలగించండి
  25. ప్రయాగ మూర్తి, బెంగుళూరుశుక్రవారం, ఫిబ్రవరి 08, 2013 9:44:00 AM

    గురువుగారికి నమస్కారం.
    తప్పుల సవరణలతో చాలా ధైర్యం వస్తోంది. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి



  26. ఆర్యా,సి.నా.రె.గారి ప్రసిద్ధమైన సినిమాపాట '' పగలే వెన్నెల, జగమే ఊయల ''దృష్టిలో ఉంచుకొని నేను చేసిన పూరణను మీరు మెచ్చినందుకు నా ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  27. గురుదేవులకు,శ్రీ నేమాని పండితవర్యులకు పాదాబివందనములతో
    =====*=====
    రామ దాసుని మొర విని రామ లక్ష్మ
    ణులు కరుణ జూపి తానీషను గలసి దన
    పైక మంతయు జెల్లించ పరవశమున
    పండు వెన్నెల గాసెను బట్ట పగలు

    రిప్లయితొలగించండి