అయ్యా! శ్రీ శాస్త్రి గారూ! శుభాశీస్సులు. మీ పద్యము బాగుగనున్నది. అభినందనలు. 3వ పాదములో మధ్య నొక లఘువు ఎక్కువగా నున్నది. అది టైపు పొరపాటు కావచ్చు. స్వస్తి.
అయ్యా! శ్రీ సహదేవుడు గారూ! శుభాశీస్సులు. మీ పద్యము బాగుగనున్నది. 3వ పాదములో రాజ్య + క్షేమమ్ము అనే సమాసములో జ్య గురువు అగును - అందుచేత గణ భంగము. సరిచేయండి. స్వస్తి.
భావం: సద్విషయములను విని వాటిలోని పారమార్థిక తత్వమును చక్కగా నిత్యమూ వివేచన చేయుచున్న వానికి ముక్తి కలుగును. ప్రకృతియొక్క వికారములను చక్కగా అవలోకనము చేసి దాని తత్త్వమును చక్కగా విమర్శనము చేయుచున్న వానికి దాని నుండి విముక్తి కలుగును. కాని పూర్ణవైరాగ్యసంసిథ్థి లేని వారికి యీ రెండు విధము లయిన మార్గములునూ దుష్కరములు. కాని ఒక మంచి ఉపాయ మున్నది. అందరకునూ అన్నిటికీ భగవతి నిత్యమూ అండగా నున్నది. కాబట్టి విచారపడక అమ్మవారిని నమ్ముకొని ఉపాసించినచో తప్పక ముక్తి కలుగును. చాలా లోతైన ,రమ్యమైన భావము.
చాలా మంచి పద్యమును చెప్పినందుకు జిలేబీగారికి ధన్యవాదాలు
పండిత నేమాని వారూ, పార్వతిని భజించిన మీ మొదటి పూరణ, మధ్యాక్కరలో పాతివ్రత్య ప్రాశస్త్యాన్ని తెలిపిన రెండవ పూరణ ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. అక ప్రత్యయాంతావ్యయం కళ. ద్రుతప్రకృతికం కాదు. కాబట్టి "తినక యేమియు" అనవలసి ఉంటుంది. మూడవ పాదంలో "రాజమ్ములఁ జదివి" అంటే నేమాని వారు చెప్పిన అదనలు లఘువు తొలగిపోతుంది. * పింగళి శశిధర్ గారూ, పాతివ్రత్యాన్ని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, సతీధర్మాన్ని వివరిస్తున్న మీ పూరణ బాగుంది. అభినందనలు. * సుబ్బారావు గారూ, ఎంగిలి పండ్లనిచ్చి ముక్తి నందిన శబరిని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు. * గండూరి లక్ష్మినారాయణ గారూ, సన్మతితో మీరు చేసిన పూరణ బాగుంది. అభినందనలు. * శ్యామలీయం గారూ, మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. * సహదేవుడు గారూ, నేమాని వారి సూచనను అనుసరించి సవరించిన మీ పూరణ బాగుంది. అభినందనలు. కాని.. మూర్తి శబ్దానికి మూరితి వికృతి కాదనుకుంటాను. అయినా దానిని రామ శబ్దంలో సమాసం చేయవచ్చునా? * జిలేబీ గారూ, మంచి భావాన్ని ఇచ్చారు. అభినందనలు. మీ భావానికి నేనిచ్చిన పద్యరూపం... విని వితర్కించి ముక్తి ప్రాప్తించు తెరువుఁ గనఁగ శోధించుటే మానవునకు నొప్పు నవనిలో నన్ని తానైనయట్టి భగవ తిని భజించిన ముక్తి ప్రాప్తించు ననఘ. * నాగరాజు రవీందర్ గారూ, పశుపతిని భజించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
తోపెళ్ళ బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ, మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. * శ్యామలీయం గారూ, జిలేబీ గారి భావానికి మీ రిచ్చిన పద్యరూపాన్ని ఆలస్యంగా చూసాను. దానికి వివరణ ఇవ్వడం కూడా బాగుంది. ధన్యవాదాలు.
గురువుగారికి వందనములు. శ్రీహరి నిఘంటువులో మూర్తికి సమానమైనదిగ చూపారు.శ్రీతాళ్లపాక అన్నమయ్య గారి సంకీర్తనల్లో ఆది మూరితి అని సమాసంచేసారు. గురువులవారూ! దయతో పరిశీలించ ప్రార్థన.
జిలేబి వారి భావానికి శ్రీశ్యామలరావుగారి పూరణాంచిత వివరణ శ్రీ శంకరార్యుల పూరణ అద్భుతము. అందరికి అభినందనలు. చిన్ని సవరణతో జిలేబి గారి చలువతో (భగవతి పదం వారిదే)
మిస్సన్న గారూ, విష్ణువును, శివపరివారాన్ని ఆశ్రయించి చెప్పిన మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. ఇక మీ మూడవ పూరణ చక్కగా ఉంది. * సహదేవుడు గారూ, నిజమే... బ్లాగులోనే వివిధ నిఘంటువుల లింకులు ఉన్నాయన్న విషయం మరిచాను. రవ్వా శ్రీహరి గారు లక్ష్యంగా అన్నమయ్య ప్రయోగాన్నే ఇచ్చారు. * రాజేశ్వరి అక్కయ్య గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * తోపెళ్ళ వారూ, ధన్యవాదాలు. మీ తాజా పూరణ చాలా బాగుంది. అభినందనలు.
ఆర్తినొందుచునుంటి జన్మాబ్ధిలోన
రిప్లయితొలగించండిఅమృతహస్తమ్ముతో బ్రోవుమమ్మ! వేగ
యనుచు భక్తిభావమ్ముతో నగజ పార్వ
తిని భజించిన ముక్తి ప్రాప్తించు ననఘ!
తినక నేమియు నుపవాస దీక్ష తోడ
రిప్లయితొలగించండినమ్మకమ్మును మదినిల్పి నమక చమక
మంత్ర రాజమ్ములను జదివి మహి సతీప
తిని భజించిన ముక్తి ప్రాప్తించు ననఘ!
అయ్యా! శ్రీ శాస్త్రి గారూ! శుభాశీస్సులు. మీ పద్యము బాగుగనున్నది. అభినందనలు. 3వ పాదములో మధ్య నొక లఘువు ఎక్కువగా నున్నది. అది టైపు పొరపాటు కావచ్చు. స్వస్తి.
రిప్లయితొలగించండిమధ్యాక్కర:
రిప్లయితొలగించండిపతిని భజించిన ముక్తి ప్రాప్తించు ననఘ! యటంచు
సతులు సమాదరమతులు సావిత్రి మొదలైన వార
లతుల దీక్షాన్విత లగుచు ననవరతము గొల్చుచుండి
సతులలో సమ్మాన్యలనుచు సద్యశంబును బొంది రవని
పతియె ప్రత్యక్ష దైవంబు పడతికెపుడు
రిప్లయితొలగించండిననెడు సూక్తిని నెరనమ్మి యాచరించి
ఇహముపరముల నాశించు ఇంతి; యా ప
తిని భజియింప ముక్తి ప్రాప్తించు ననఘ!
పతియె ప్రత్యక్ష దైవంబు పడతికెపుడు
రిప్లయితొలగించండిననెడు సూక్తిని నెరనమ్మి యాచరించి
ఇహముపరముల నాశించు ఇంతి; కా ప
తిని భజియింప ముక్తి ప్రాప్తించు ననఘ!
కాలమెట్లు మారిననేమి కట్టికొనిన
రిప్లయితొలగించండివాడు పూజనీయుండగు పతిని యాద
రించుటకు మించి వ్రతములు లేవు గద, ప
తిని భజించిన ముక్తి ప్రాప్తించు ననఘ!
శబరి పండ్ల న్ని రుచిజూచి సరిగ నుండు
రిప్లయితొలగించండిఫలము రామ చంద్రున కిడి భక్తి తోడ
ముక్తి నొందెను జివరన భువిని , గనుక
తిని భజించిన ముక్తి ప్రాప్తించు ననఘ !
పాప కర్మల జేయుచు బామరుండు
రిప్లయితొలగించండితీర్థ యాత్రల నెన్నెన్నొ తిరుగుచుండు
నంతరంగములో నున్న హరిని సన్మ
తిని భజించిన ముక్తి ప్రాప్తించు ననఘ !
ఎండమావుల జలములీ యింద్రియముల
రిప్లయితొలగించండివలని సుఖములు గావున తెలివి గలిగి
యాశ లణగించి పరమాత్ముడైన శ్రీప
తిని భజించిన ముక్తి ప్రాప్తించు ననఘ
తండ్రి మాటను తలఁదాల్చు తనయుడైన,
రిప్లయితొలగించండిఏక పత్నీవ్రతంబున నేలి కైన
రాజ్య క్షేమమ్ము కాంక్షించు రామ మూరి
తిని భజియింప ముక్తి ప్రాప్తించు ననఘ!
శ్రీ శంకరయ్యగురుదేవులకు,శ్రీ నేమాని పండితవర్యులకు, పెద్దలకు వినమ్రవందనములు
రిప్లయితొలగించండిరైతులు కష్టములకు క్రుంగు చున్నారు,వారు పశుపతిని పూజించిన కష్టములు దొలగునని
=======*=======
వరము లిచ్చు వడివడిగా వైరి వర్గ
ములకు,బిల్వ పత్రములతో బూజ సేయ.
భూమి పుత్రులు పుడమిన ముందు పశుప
తిని భజించిన ముక్తి ప్రాప్తించు ననఘ।
అయ్యా! శ్రీ సహదేవుడు గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగనున్నది. 3వ పాదములో రాజ్య + క్షేమమ్ము అనే సమాసములో జ్య గురువు అగును - అందుచేత గణ భంగము. సరిచేయండి. స్వస్తి.
శ్రీ శంకరయ్యగురుదేవులకు,శ్రీ నేమాని పండితవర్యులకు, పెద్దలకు వినమ్రవందనములు
రిప్లయితొలగించండి=======*======
మూడు లోకములందున మునిజనులకు
ముందు జేసిన కర్మలు పుడమి పైన
బంధములు వేయ, మదిలోన పార్వతీప
తిని భజించిన ముక్తి ప్రాప్తించు ననఘ ।
రిప్లయితొలగించండికొట్టిమిట్టాడు బ్రతుకున,కొలది కాల
మేని యేకాగ్రదీక్షతో నితరములను
మరచి ధర్మనిరతి తోడ మదిని శ్రీప
తిని భజించిన ముక్తి ప్రాప్తించు ననఘ.
ఏల్చూరివారు నటరాజు గురించి రచించిన పద్యం ప్రౌఢ శైలిలో రసరమ్యముగానున్నది.వారికి నా అభినందనలు.
శ్రీ నేమని గురువర్యులకు వందనములు మరియు ధన్యవాదములు. తమరి సూచిత సవరణ:
రిప్లయితొలగించండితండ్రి మాటను తలఁదాల్చు తనయు డైన,
యేక పత్నీ వ్రతంబున నేలి కైన
ప్రజల సేమమ్ము మరువని రామ మూరి
తిని భజించిన ముక్తి ప్రాప్తించు ననఘ!
రిప్లయితొలగించండివిని ఆలోచింప ముక్తి ప్రాప్తించు ననఘ
కని శోధింప ముక్తి ప్రాప్తించు ననఘ
అవని లో అన్నియు తానైన ఆ భగవ
తిని భజియింప ముక్తి ప్రాప్తించు ననఘ!
జిలేబి.
ఐదు మొగముల వానిని హరుని భవుని
రిప్లయితొలగించండివిలయకారుని జన్నంపు వేటకాని
జింక తాల్పుని రుద్రుని శివుని పశుప
తిని భజించిన ముక్తి ప్రాప్తించు ననఘ !
అతుల మహానుభావుడని హరుని మనంబున తలచి
రిప్లయితొలగించండిపతిగ పొందెతపము జేసి పార్వతి రతిపతి కృపను
ఆతారకాహారి కొమరు డగుచు మో దముగూర్ప గపశు
పతిని భజించిన ముక్తి ప్రాప్తించు ననఘ! నిజము.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిజిలేబీగారి పద్యం బాగుంది. దానికి లక్షణశుధ్ధి చేస్తే ఇలా గవుతుందని అనుకుంటున్నాను
రిప్లయితొలగించండిజిలేబిగారు చెప్పిన పద్యం:
విని ఆలోచింప ముక్తి ప్రాప్తించు ననఘ
కని శోధింప ముక్తి ప్రాప్తించు ననఘ
అవని లో అన్నియు తానైన ఆ భగవ
తిని భజియింప ముక్తి ప్రాప్తించు ననఘ!
పరిష్కృతపద్యం:
విని వివేచించ ముక్తి ప్రాప్తించు ననఘ
కని విమర్శించగా ముక్తి కలుగు ననఘ
అవని నన్నియు తానైన యట్టి భగవ
తిని భజించిన ముక్తి ప్రాప్తించు ననఘ!
భావం: సద్విషయములను విని వాటిలోని పారమార్థిక తత్వమును చక్కగా నిత్యమూ వివేచన చేయుచున్న వానికి ముక్తి కలుగును. ప్రకృతియొక్క వికారములను చక్కగా అవలోకనము చేసి దాని తత్త్వమును చక్కగా విమర్శనము చేయుచున్న వానికి దాని నుండి విముక్తి కలుగును. కాని పూర్ణవైరాగ్యసంసిథ్థి లేని వారికి యీ రెండు విధము లయిన మార్గములునూ దుష్కరములు. కాని ఒక మంచి ఉపాయ మున్నది. అందరకునూ అన్నిటికీ భగవతి నిత్యమూ అండగా నున్నది. కాబట్టి విచారపడక అమ్మవారిని నమ్ముకొని ఉపాసించినచో తప్పక ముక్తి కలుగును. చాలా లోతైన ,రమ్యమైన భావము.
చాలా మంచి పద్యమును చెప్పినందుకు జిలేబీగారికి ధన్యవాదాలు
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిపార్వతిని భజించిన మీ మొదటి పూరణ, మధ్యాక్కరలో పాతివ్రత్య ప్రాశస్త్యాన్ని తెలిపిన రెండవ పూరణ ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
అక ప్రత్యయాంతావ్యయం కళ. ద్రుతప్రకృతికం కాదు. కాబట్టి "తినక యేమియు" అనవలసి ఉంటుంది.
మూడవ పాదంలో "రాజమ్ములఁ జదివి" అంటే నేమాని వారు చెప్పిన అదనలు లఘువు తొలగిపోతుంది.
*
పింగళి శశిధర్ గారూ,
పాతివ్రత్యాన్ని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
సతీధర్మాన్ని వివరిస్తున్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
ఎంగిలి పండ్లనిచ్చి ముక్తి నందిన శబరిని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
గండూరి లక్ష్మినారాయణ గారూ,
సన్మతితో మీరు చేసిన పూరణ బాగుంది. అభినందనలు.
*
శ్యామలీయం గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
నేమాని వారి సూచనను అనుసరించి సవరించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
కాని.. మూర్తి శబ్దానికి మూరితి వికృతి కాదనుకుంటాను. అయినా దానిని రామ శబ్దంలో సమాసం చేయవచ్చునా?
*
జిలేబీ గారూ,
మంచి భావాన్ని ఇచ్చారు. అభినందనలు. మీ భావానికి నేనిచ్చిన పద్యరూపం...
విని వితర్కించి ముక్తి ప్రాప్తించు తెరువుఁ
గనఁగ శోధించుటే మానవునకు నొప్పు
నవనిలో నన్ని తానైనయట్టి భగవ
తిని భజించిన ముక్తి ప్రాప్తించు ననఘ.
*
నాగరాజు రవీందర్ గారూ,
పశుపతిని భజించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
తోపెళ్ళ బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
శ్యామలీయం గారూ,
జిలేబీ గారి భావానికి మీ రిచ్చిన పద్యరూపాన్ని ఆలస్యంగా చూసాను. దానికి వివరణ ఇవ్వడం కూడా బాగుంది. ధన్యవాదాలు.
కమల నాభుని చక్రిని కరి వరదుని
రిప్లయితొలగించండికైటభారిని సద్భక్త కల్ప తరుని
పద్మ నయనుని విష్ణుని ప్రణత సురప-
తిని భజించిన ముక్తి ప్రాప్తించు ననఘ.
గరళకంఠుని, గంగను, కార్తికేయు,
రిప్లయితొలగించండివిఘ్ననాథుని, నందిని, వీరభద్రు,
పతికి తనువున సగమౌ భవాని శివస-
తిని భజించిన ముక్తి ప్రాప్తించు ననఘ.
శ్రీ నేమానివారికి,శంకరార్యు లకు, ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమీ సూచన సవరణలతో..
తినక యేమియు నుపవాస దీక్ష తోడ
నమ్మకమ్మును మదినిల్పి నమక చమక
మంత్ర రాజమ్ముల జదివి మహి సతీప
తిని భజించిన ముక్తి ప్రాప్తించు ననఘ!
శ్యామలీయం వారు అండ్ కంది వారు
రిప్లయితొలగించండివేదోక్తం మైన భద్రం కర్ణేభి శృణుయామ దేవా...
(ఆనోభద్ర సూక్తం నించి- రిగ్వేదం)
అన్నదాని ని మనసులో పెట్టుకుని రాసినది!
మీ ఇరువురి పూరణలు మరీ అమోఘం!
నెనరస్య నెనరః జిలేబీ నామ్యా కవితా వనచారిణహ !
జిలేబి!
జిలేబి.
గురువుగారికి వందనములు. శ్రీహరి నిఘంటువులో మూర్తికి సమానమైనదిగ చూపారు.శ్రీతాళ్లపాక అన్నమయ్య గారి సంకీర్తనల్లో ఆది మూరితి అని సమాసంచేసారు. గురువులవారూ! దయతో పరిశీలించ ప్రార్థన.
రిప్లయితొలగించండితనువె సాధనమౌ జేయ ధర్మములను
రిప్లయితొలగించండితనువు కృశియింప జేయుట తప్పు! కొంత
తిని భజించిన ముక్తి ప్రాప్తించు ననఘ!
కటిక యుపవాసముల మాను, కాదు మేలు.
వెండి కొండను నిలచిన వేల్పు వయ్య
రిప్లయితొలగించండిఅర్ధ నారివి నీవైన యాది దేవ
భక్తి గొలిచిన ముదమంది రక్తి నిడుప
తిని భజించిన ముక్తి ప్రాప్తించు ననఘ !
జిలేబి వారి భావానికి శ్రీశ్యామలరావుగారి పూరణాంచిత వివరణ శ్రీ శంకరార్యుల పూరణ అద్భుతము. అందరికి అభినందనలు.
రిప్లయితొలగించండిచిన్ని సవరణతో జిలేబి గారి చలువతో (భగవతి పదం వారిదే)
అతుల మహానుభావుడని హరుని మనంబున తలచి
పతిగ పొంది తపము జేసి పార్వతి, రతిపతి వలన,
సుతుగనె తారకాంతకుని సురలందరంత మెచ్చ భగ
వతిని భజించిన ముక్తి ప్రాప్తించు ననఘ! నిజముగ.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండివిష్ణువును, శివపరివారాన్ని ఆశ్రయించి చెప్పిన మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
ఇక మీ మూడవ పూరణ చక్కగా ఉంది.
*
సహదేవుడు గారూ,
నిజమే... బ్లాగులోనే వివిధ నిఘంటువుల లింకులు ఉన్నాయన్న విషయం మరిచాను. రవ్వా శ్రీహరి గారు లక్ష్యంగా అన్నమయ్య ప్రయోగాన్నే ఇచ్చారు.
*
రాజేశ్వరి అక్కయ్య గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
తోపెళ్ళ వారూ,
ధన్యవాదాలు.
మీ తాజా పూరణ చాలా బాగుంది. అభినందనలు.