23, ఫిబ్రవరి 2013, శనివారం

సమస్యాపూరణం – 975 (పోతన భారతము వ్రాసె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
పోతన భారతము వ్రాసె బుధులు పొగడఁగన్

38 కామెంట్‌లు:

  1. పోతన వలె సహజ కవియె
    రీతిగ తా కృషిని జేసె రేబవలుళు లో
    ప్రీతి హరినే దలచెను
    పో, తన భారతము వ్రాసె బుధులు పొగడఁగన్

    రిప్లయితొలగించండి
  2. కేతన పుత్రుడెవరనగ-
    భూతలనారాయణుండు పూనిక తోడన్-
    చేతలు నుండవలె మనకు-
    పోతన; భారతము వ్రాసె; బుధులు పొగడఁగన్

    రిప్లయితొలగించండి
  3. చిన్న సవరణ తో..

    పోతన వలె సహజ కవియె
    రీతిగ తా కృషిని జేసె రేబవళులు లో
    ప్రీతి హరినే దలచెను
    పో, తన భారతము వ్రాసె బుధులు పొగడఁగన్

    రిప్లయితొలగించండి
  4. శ్రీ గురువులకు, శ్రీ శంకరయ్య గారికి, పెద్దలకు
    ప్రణామములు!

    వ్రాఁత నవశౌక్తికేయ
    వ్రాత నవీయముగ గురువరాదేశము గై
    సేఁ తన శ్రీ తాళంబులఁ
    బోతన భారతము వ్రాసె బుధులు పొగడఁగన్.

    చేతఃప్రీతికి జైమిని
    స్వాతంత్ర్యము మెయి నపూర్వసంఘటనలతో
    బ్రాఁతిఁగొనఁగ నొప్పో! త
    ప్పో! తన భారతము వ్రాసె బుధులు పొగడఁగన్.

    నూతన భారతమో! యన
    బ్రాఁతిగ శివభారతకృతి భాతిగ బుధసం
    ప్రీతికి వరదాచార్యులు
    పోతన భారతము వ్రాసె బుధులు పొగడఁగన్.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  5. ప్రాతయు గ్రొత్తను గలిపీ
    కోతలు గోయంగ ఘనుడు కొండొక మారున్
    మాతాత కిట్టు లాడెను
    'పోతన భారతము వ్రాసె బుధులు పొగడగన్ '

    రిప్లయితొలగించండి
  6. శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు అద్భుతమైన పూరణలు చేస్తుంటే నేను కోతలరాయుడిని ఆశ్రయించవలసి వచ్చింది !

    రిప్లయితొలగించండి
  7. శ్రీ శంకరయ్యగురుదేవులకు,శ్రీ నేమాని పండితవర్యులకు, పెద్దలకు వినమ్రవందనములు
    ======*=======
    శీతలము జేయ తెనుగుకు
    నూతన రీతులను దెల్పెను సహజ కవియై
    ప్రీతిగ హరిని దలచి నా
    పోతన భారతము వ్రాసె బుధులు పొగడఁగన్.


    రిప్లయితొలగించండి
  8. రీతి బలికె భాగవతము
    పోతన ; భారతము వ్రాసె బుధులు పొగడగన్
    ప్రీతిగ వ్యాసుడు ; యరసి కి
    రాతుడు వాల్మీకి వ్రాసె రామాయణమున్

    రిప్లయితొలగించండి
  9. గీతా కృష్ణుని గాథను
    భూతలమెల్లఁ చదువంగ పూర్తిగ జెప్పన్
    ప్రీతిగ భాగవతంబున
    పోతన భారతము వ్రాసె బుధులు పొగడన్!

    రిప్లయితొలగించండి
  10. లోతుగ వెదకిన గానము
    పోతన భారతము , వ్రాసె బుధులు బొగడ గన్
    కేతన కొమరుడు చక్కగ
    మాతా యౌ శార దాంబ మమతలు నీ యన్ .

    రిప్లయితొలగించండి




  11. చేతోమోదముగ మధుర
    మ్మౌ తెలుగున భాగవతము నందు రచించెన్
    ఏతత్ కావ్యమున గలిపి
    పోతన భారతము వ్రాసె బుధులు పొగడగన్.

    రిప్లయితొలగించండి
  12. జాతి పిత గాంధి భారత
    మాతకు ముద్దుల కొమరుఁడు మహనీయుండౌ
    నేత "అహింస" యనగ వల
    పో! తన భారతము వ్రాసె బుధులు పొగడఁగన్!!

    రిప్లయితొలగించండి
  13. మాతెలుగు తల్లి నిజ తల
    పో!తన భారతము వ్రాసె బుధులు పొగడగన్
    ధాతలు నన్నయ తిక్కన
    భూతలమున నెఱ్ఱనార్య భూసుర కవులున్.

    రిప్లయితొలగించండి
  14. ఖ్యాత సహజకవివర్యా!
    పోతన! భారతము వ్రాసె బుధులు పొగడగన్
    నీతివిదులు నన్నయ ముఖు
    లేతత్ గ్రంథంబు వేదమే యన బరగున్

    రిప్లయితొలగించండి
  15. ఖ్యాతిగ శ్రీపాద బుధుం
    డాతత పాండిత్యమెసగ నమిత గుణాఢ్యుం
    డై తన గురిగా గొనుచుం
    బోతన భారతము వ్రాసె బుధులు పొగడఁగన్ !!!

    రిప్లయితొలగించండి
  16. ఖ్యాతిగ శ్రీపాద బుధుం
    డాతత పాండిత్యమెసగ నమిత గుణాఢ్యుం
    డై తన గురిగా గొనుచుం
    బోతన , భారతము వ్రాసె బుధులు పొగడఁగన్ !!!

    రిప్లయితొలగించండి
  17. ఏ తెరగున మీరంటిరి
    పోతన భారతము వ్రాసె బుధులు పొగడఁగన్
    చేతన మొప్పదు బమ్మెర
    పోతన భాగవతము నలవొకగ వ్రాసెన్

    రిప్లయితొలగించండి
  18. ఏ తెరగున మీరంట
    పోతన భారతము వ్రాసె బుధులు పొగడఁగన్
    చేతన మొప్పదు బమ్మెర
    పోతన భాగవత మునల వోకగ వ్రాసెన్

    రిప్లయితొలగించండి
  19. ఏ తెరగున మీరంట
    పోతన భారతము వ్రాసె బుధులు పొగడఁగన్
    చేతన మొప్పదు బమ్మెర
    పోతన భాగవత మునల వోకగ వ్రాసెన్

    రిప్లయితొలగించండి

  20. ఏ తెరగున మీరంటిరి
    పోతన భారతము వ్రాసె బుధులు పొగడగన్
    చేతన మొప్పదు బమ్మెర
    పోతన భాగవతము నలవోకగ వ్రాసెన్

    రిప్లయితొలగించండి
  21. అన్వయ సౌలభ్యము కొరకు నా పద్యమును కొంచెము సవరించుచున్నాను:

    ఖ్యాత సహజ కవి వర్యా!
    పోతన! భారతము వ్రాసె బుధులు పొగడగన్
    నీతి విదుడు నన్నయ కవి
    యేతత్ గ్రంథంబు వేదమే యన బరగున్

    రిప్లయితొలగించండి
  22. నూతనముగ స్వీయ చరిత
    మాతురముగ వ్రాయ నెంచె మనుజుం డొకడున్
    ఆ తెఱగున యింపో ! కం
    పో ! తన భారతము వ్రాసె బుధులు పొగడగన్

    రిప్లయితొలగించండి
  23. “ పోతన వ్రాసిన దేమది ?"
    సీతను నొక టీచ రడిగె సిల్లీ క్వశ్చన్
    ఆతురతో సీత నుడివె
    “పోతన భారతము వ్రాసె బుధులు పొగడగన్"

    రిప్లయితొలగించండి
  24. నాగరాజు గారూ! బాగుంది. అబద్దం వా సుబద్ధం వా కుంతీ పుత్రో వినాయకా

    రిప్లయితొలగించండి
  25. శర్మ గారూ ! నృతం వా అనృతం వా వదేత్ నిశ్శంకయా.

    రిప్లయితొలగించండి

  26. ఈనాటి సమస్యకు పూరణలు పంపిన కవిమిత్రులు....
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    ఏల్చూరి మురళీధరరావు గారికి,
    గన్నవరపు నరసింహమూర్తి గారికి,
    వరప్రసాద్ గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    సహదేవుడు గారికి,
    సుబ్బారావు గారికి,
    కమనీయం గారికి,
    జిగురి సత్యనారాయణ గారికి,
    తోపెళ్ళ బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
    పండిత నేమాని వారికి,
    డా. విష్ణునందన్ గారికి,
    గండూరి లక్ష్మినారాయణ గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  27. నాగరాజు రవీందర్ మహోదయ ! అస్తు ! ఏతచ్చమత్కార రసం శంకరాభరణ పఠితృజనాః ముహుర్ముహుః పిబేయురిత్యాశంసితా మయా !!!

    రిప్లయితొలగించండి
  28. కేతనము నెగుర వేసెను
    పోతన భారతము వ్రాసె బుధులు పొగడఁ గన్ !
    చేతనము కలిగి యుండిన
    తాతలు పలుకంగ నిజము దారుణ మనుచున్ !

    రిప్లయితొలగించండి
  29. గన్నవరపు వారూ,
    "కలిపీ"ని "కలిపియు" అందాం.
    *
    సుబ్బారావు గారూ,
    "మాతా యౌ"ను "మాత యయిన" అందాం.
    *
    కమనీయం గారూ,
    "మధుర మ్మౌ" అన్నప్పుడు గణదోషం. "మధుర మౌ" అంటే సరి.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    ఆతురతతో ... అనాలి కదా.. అక్కడ "ఆతురతను" అందాం.

    రిప్లయితొలగించండి
  30. మాటిమాటికి చమత్కార రస మాధుర్యన్ని చవిచూపిస్తున్న కవిమిత్రులకు, అట్టి ఆశంసను వెలిబుచ్చిన విష్ణునందన్ గారికి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  31. మాన్యులు శ్రీ శంకరయ్య గారికి, సమస్యా పూరణకర్త లందరకు,

    ఎంతో ఆప్యాయనంగా పలుకరించిన శ్రీయుతులు గన్నవరపు నరసింహమూర్తి గారికి

    ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
  32. డాక్టర్ విష్ణునందన మహోదయ ! ధన్యోస్మి . భవత: లిఖిత పద్యమపి అతీవ సుందర మస్తి.

    రిప్లయితొలగించండి
  33. ఆర్యా ! ధన్యవాదములు.

    నా పూరణ లోని చిన్నటైపాటు సవరణ తో..

    పోతన వలె సహజ కవియె
    రీతిగ తా కృషిని జేసె రేబవళులు లో
    ప్రీతిన్ హరినే దలచెను
    పో, తన భారతము వ్రాసె బుధులు పొగడఁగన్

    రిప్లయితొలగించండి
  34. గురువు గారు సూచించిన విధంగా చిన్న మార్పుతో

    “ పోతన వ్రాసిన దేమది ?"
    సీతను నొక టీచ రడిగె సిల్లీ క్వశ్చన్
    ఆతురతను సీత నుడివె
    “పోతన భారతము వ్రాసె బుధులు పొగడగన్"

    రిప్లయితొలగించండి
  35. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    కవిత్రయము(నన్నయ ,తిక్కన, ఎఱ్ఱన) :

    01)
    _______________________________

    పోత చరితమును నుడివెను
    పోతన ! భారతము వ్రాసె - బుధులు పొగడగన్
    ప్రాతఃవంద్య త్రయంబది
    పోతనముగ నాంధ్ర జాతి - పుణ్య మనంగన్ !
    _______________________________
    పోత = విష్ణువు
    త్రయము = కవిత్రయము
    పోతనము = పవిత్రము

    రిప్లయితొలగించండి
  36. తా తలచెను నన్నయ నా
    పోతన,"భారతము వ్రాసె బుధులు పొగడఁగన్
    నే తరియించెద నిపుడు పు
    నీతము భాగవత గ్రంథ నిర్మాణమునన్.

    రిప్లయితొలగించండి
  37. ఆతడు కాపీరైటులు
    పాతవి పేటెంట్లు వెదకి వ్రాసెను థీసిస్
    నూతన శీర్షిక తోడన్:
    "పోతన భారతము వ్రాసె"; బుధులు పొగడఁగన్

    రిప్లయితొలగించండి