సత్యసీమ పురమ్ము సౌవర్ణ మణిఘృణి మయ భావనోన్నతి మందిరమ్ము వేద వేదాంగాది విద్యాళి రూపమ్ము జ్ఞాన వైభవము నెమ్మేని కాంతి శబ్దార్థ వైచిత్రి సద్భూషణ శ్రేణి భాషావితాన మంబర చయమ్ము సకల కళా విలాసము మందహాసమ్ము నవరసోన్మేష మానంద హేల యగు యశోభాసమాన విహంగయాన యంబురుహ సంభవుని రాణి యమరవాణి సత్కృపా రసవృష్టి ప్రసాద దృష్టి కాంచి నను బ్రోవుమా తల్లి కల్పవల్లి
మన బ్లాగు సభ్యులందరికీ శుభాశీస్సులు. మన బ్లాగులో చేరిన దగ్గరినుండి శ్రీ శంకరయ్య గారు, మరియు అందరు సభ్యులు ఆదరించు చుండుటను నే నెంతయును భాగ్యముగా భావించుచున్నాను. అందరికి హార్దిక శుభాకాంక్షలు. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.
నీ సరి దైవమేది యని నీ స్మరణాంబుధిలోన మున్గి, నే చేసెద నీకు సేవ, ఇటు జేయుచు కావ్య రసాల సృష్టినిన్! ఏ సమయంబునైన మది నీ విధి దీక్షను బూనియుందు! ఓ వాసర రాణి!వాణి! ఇదె వందన చందనమందుకోగదే!
శ్రీ నాగరాజు రవీందర్ గారూ! శుభాశీస్సులు. మీ మొదటి పద్యములో 4వ పాదములో ప్రాస ముందున్న అక్షరము లఘువు ఉండవలెను. ఆలాగున మీరు పాటించ లేదు. ఆ పాదమును ఇలాగ మార్చండి:
శ్రీ శంకరయ్య బుధేంద్రులు ఈ రోజు పద్యవిద్యార్థుల రచనారాధనకు నిలిపిన సరస్వతీ రూపచిత్రాన్ని చూడగానే శ్రీ మతుకుమల్లి నృసింహశాస్త్రి గారి "అజచరిత్రము" లోని షట్ఛాస్త్రనిరంకుశపాండితీమండితమై, పరమగంభీరమైన పద్యం ఈ గుర్తుకు వచ్చింది:
స్మృతిశ్శక్తిః ఙ్ఞాన శక్తిః బుధ్ధి శక్తి స్స్వరూపిణి
రిప్లయితొలగించండిప్రతిభా కల్పనా శక్తిః యాచ తస్మై నమో నమః
శ్రీ మహా సరస్వత్యై నమః
రిప్లయితొలగించండినాల్గు తలల వాని నాలుకపై నున్న
నలువరాణి వాణి నతుల నీకు
నీవు లేని ముఖము నిర్జీవమైయుండు
నున్న తలయె జూచు నున్నతులను.
పలుకుల రాణీ! నిను నా
రిప్లయితొలగించండితలపుల నర్తించ వేడ ధన్యుని జేయం
లలితంపు వాక్కు లీయగ
పులకిత మదితో నిరతము బుద్ధిగ నుందున్!
ప్రార్థన:
రిప్లయితొలగించండిసత్యసీమ పురమ్ము సౌవర్ణ మణిఘృణి
మయ భావనోన్నతి మందిరమ్ము
వేద వేదాంగాది విద్యాళి రూపమ్ము
జ్ఞాన వైభవము నెమ్మేని కాంతి
శబ్దార్థ వైచిత్రి సద్భూషణ శ్రేణి
భాషావితాన మంబర చయమ్ము
సకల కళా విలాసము మందహాసమ్ము
నవరసోన్మేష మానంద హేల
యగు యశోభాసమాన విహంగయాన
యంబురుహ సంభవుని రాణి యమరవాణి
సత్కృపా రసవృష్టి ప్రసాద దృష్టి
కాంచి నను బ్రోవుమా తల్లి కల్పవల్లి
మన బ్లాగు సభ్యులందరికీ శుభాశీస్సులు.
మన బ్లాగులో చేరిన దగ్గరినుండి శ్రీ శంకరయ్య గారు, మరియు అందరు సభ్యులు ఆదరించు చుండుటను నే నెంతయును భాగ్యముగా భావించుచున్నాను. అందరికి హార్దిక శుభాకాంక్షలు. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.
పావని నిన్నునమ్మితిని పామరతన్ కడు బాధనోర్చితిన్
రిప్లయితొలగించండిదీవనలీయవే జనని తేలగనీ భవ సాగరమ్మునన్
దేవతవీవటంచు మది దేవళమందున నిల్పుకొంటి, నా
చేవను పెంచి రక్షనిడు శ్రీవరదాయిని! శారదే! శుభే!!
శారద మాతకు వినతులు
రిప్లయితొలగించండిశారద మా గృపను జూడు శరణము నీవే
నీ రజ ముఖమును బోలిన
శారదమా! నీకు నెపుడు సాగిల బడుదున్
అగణిత గుణగణ విభవము
రిప్లయితొలగించండినగుమోమున కళలు దేరి నర్తించంగా
సగమై యుంటివి బ్రహ్మకు
బాగుగ జూడమ్మ మమ్ము బాసర దేవీ !
బాసరలో కొలువైతివి
భాసురముగ భక్తకోటి భజియింపంగా
భూసురులు నిన్ను గొల్చిరి
భాసించిరి తేజమలర బాసర దేవీ !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినీ సరి దైవమేది యని నీ స్మరణాంబుధిలోన మున్గి, నే
రిప్లయితొలగించండిచేసెద నీకు సేవ, ఇటు జేయుచు కావ్య రసాల సృష్టినిన్!
ఏ సమయంబునైన మది నీ విధి దీక్షను బూనియుందు!
ఓ వాసర రాణి!వాణి! ఇదె వందన చందనమందుకోగదే!
అంచనెక్కి వచ్చె అందెలు మెరయంగ
రిప్లయితొలగించండినలువరాణి నేడు నన్ను చూడ
ఏమి భాగ్యమమ్మ ఏమినేకోరను?
అక్షరమ్మునిమ్ము అదియె చాలు.
శ్రీ నాగరాజు రవీందర్ గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ మొదటి పద్యములో 4వ పాదములో ప్రాస ముందున్న అక్షరము లఘువు ఉండవలెను. ఆలాగున మీరు పాటించ లేదు. ఆ పాదమును ఇలాగ మార్చండి:
"సుగుణోజ్జ్వల! మమ్ము కరుణ జూడుము వాణీ!"
స్వస్తి.
అమ్మా! రామలక్ష్మి గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము 4వ పాదమును ఇలాగ మార్చితే మరింత బాగుంటుంది:
"అక్షరమ్ము నొసగు మదియె చాలు"
స్వస్తి
మన్నించుము తల్లీ నను ని
రిప్లయితొలగించండిన్నెన్నగ నెవరి తరము నెవ్విధి నైనన్ !
వన్నియ నొందగ బుద్ధిని
సన్నుతి జేయంగ మదిని శాంతిని పొందన్ ! !
గురువర్యులకు వందనశతములు,
రిప్లయితొలగించండిమీరు సూచించిన విధంగా మార్పు చేసిన పిదప.....
అంచనెక్కి వచ్చె అందెలు మెరయంగ
నలువరాణి నేడు నన్ను చూడ
ఏమి భాగ్యమమ్మ ఏమినేకోరను?
అక్షరమ్మునొసగు మదియె చాలు.
శ్రీ సహదేవుడు గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము 4వ పాదములో పులకిత మదితో అనే ప్రయోగము సరికాదు. పులకిత మనమున అని మార్చుదాము. స్వస్తి.
శ్రీ శంకరయ్య బుధేంద్రులు ఈ రోజు పద్యవిద్యార్థుల రచనారాధనకు నిలిపిన సరస్వతీ రూపచిత్రాన్ని చూడగానే శ్రీ మతుకుమల్లి నృసింహశాస్త్రి గారి "అజచరిత్రము" లోని షట్ఛాస్త్రనిరంకుశపాండితీమండితమై, పరమగంభీరమైన పద్యం ఈ గుర్తుకు వచ్చింది:
రిప్లయితొలగించండిఘనఘనశ్రీసముత్కటజటావరపద
క్రమయుక్త్రయీమయరమ్యవేణి
నానాస్వరవ్యంజనప్రతానానూన
శబ్దమహాశబ్దశాస్త్రవీణ
భూరిగుణవిశేషపుంజైకనిత్యసం
బంధవత్తర్కవిభ్రాజిరశన
సరససాలంక్రియోజ్జ్వలసువర్ణపదోరు
సంగీతసాహితీస్తనభరాఢ్య
క్షిప్రసద్గతిముఖరభాట్టప్రభాక
రీయమంజీరయుగరమణీయచరణ
జలజనిత్యప్రగల్భవాచాల వాణి
నిలచుఁ గాత మదీయాస్యజలరుహమున. (అజ: 1-8)
చి. డా. ఏల్చూరి వారికి శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిఒక మంచి పద్యమును శారదాస్తుతి రూపముగా మా ముందుంచేరు. చాల సంతోషము. స్వస్తి.
నేమాని పండితార్యా ! వాణిని అద్భుతంగా వర్ణించేరు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిసకలశాస్త్రములకు,సర్వవిద్యలకును
నాధారభూతమౌ యంబవీవు
సంగీత సాహిత్య సరస సంపదలకు
గాణాచి వైనట్టి రాణివీవు ,
ధవళాంశుకములతో ధవళతనూ శోభ
సితపద్మమందు నాసీనవైతి
చతురాస్యునకు దేవి చారుసౌశీల్యవు
దేవగణ శుభ వందిత చరణవు
నీ కృపాకటాక్షములేక నెవ్వడైన
నేర్వ గలడె యే విద్యనేన్ నేర్పుమీర
అంతమాత్రపు పాండిత్య మైన నబ్బ.
తల్లి మము బ్రోవు చల్లని దయను జూపి.