25, ఫిబ్రవరి 2013, సోమవారం

పద్య రచన – 263 (ఆకలి)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
"ఆకలి"

20 కామెంట్‌లు:

  1. జీవులనెడు యంత్రములకు
    జీవన క్రియలన్ని జేయ చేవల నొసగే
    కావలసిన యింధనమ్ము
    నావల నీవల వెదకును నాకలి యదియే !

    రిప్లయితొలగించండి
  2. ఆకలి యన్నదే యవని మహామాయ
    ....అఖిల దుఃఖమ్ముల కదియె కతము
    పొట్టలో నాకలి పెట్టు బాధలనొంది
    ....కొందరు దీనులు కుందుచుండ
    ఆకలినే మించు నట్టి దురాశతో
    ....కొందరు దుష్టులు చిందులేయ
    కామభోగములందు కలుగు వాంఛలు నాక
    ....లిని మించ కీచకుల్ పెచ్చు మీర
    ఆకలాకలి యాకలి యాకలంచు
    కలియుగమ్మున నెగయ మంటలుగ నకట
    నడుము కట్టుడీ దుస్థితి మడియజేయ
    లెండు ధర్మరక్షకులార! రండు రండు

    రిప్లయితొలగించండి

  3. ఈ కలి కాలము కొందర
    కాకలి తాళగను శక్తి యవసరమౌ నీ
    యాకలి లేకయె కొందరు
    చీకాకులు పడుచునుంద్రు, చిత్రము కాదే?

    రిప్లయితొలగించండి

  4. ఒకక్షరం ఓం రెండక్షరం ప్రేమ
    మూడు ఆకలి నాలుగు జటరాగ్ని
    పంచాక్షరీ పరం అన్నం కారణ
    సర్వం షణ్ముఖ శరవణభవ !

    జిలేబి.

    రిప్లయితొలగించండి
  5. ఆకలిని మించు శత్రువు
    ఎక్కడ మఱి గాన రాదు నెవరికి నైనన్
    ఆకలి జేయును దొంగగ
    ఆకలి యే జే యునింక యాచకు నింగా .

    రిప్లయితొలగించండి
  6. అయ్యా! శ్రీ సుబ్బారావు గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము 2వ పాదములో మీరు ప్రాస నియమమును పాటించలేదు. కొంచెము మార్చి సరిచేయండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. ఆకలిని మించు శత్రువు
    మా కయి తే గాన రాదు, మమతలు ద్రుంచున్
    ఆకలి యు జేయు దొంగగ
    ఆకలి మఱి మార్చు నింక యాచకు నింగా .

    రిప్లయితొలగించండి
  8. ఆకలి వలనే సృష్టికి
    నీ కళ యదియే తొలగిన నవ్వరుఁ బనిలో
    దూకక, నభివృద్ధన్నది
    లేకనె నిర్లిప్తతావరించదె మహిలో!

    రిప్లయితొలగించండి
  9. శ్రీ తోపెల్ల శర్మ గారు నిన్న వ్రాసిన కవిరాజవిరాజితమునకు డా. ఏల్చూరి మురళీధర్ గారు సవరణ చేసేరు బాగున్నది. అందులో మొదటి పాదమునకు మరొక సవరణ:
    1వ పాదము చివరలో: రాణగొనన్ కి బదులుగా: భాసిలుచున్ అంటే యతిమైత్రి బాగుంటుంది. స్వస్తి

    రిప్లయితొలగించండి
  10. ఉడికియుడకకున్ననుప్పు తక్కువయిన
    కాయగూర లేక గరిక తోడ
    పచ్చడైన చేసి పళ్ళెమందుంచగా
    ఆబగాను తినును ఆకలేయ.

    రిప్లయితొలగించండి
  11. గురువులకు, పెద్దలకు, కవి మిత్రులకు వందనములు.
    ఇదొక నా చిన్న ప్రయత్నం - మన్నించగలరు

    కంద గర్భిత తేటగీతి :

    బిరబిరమని వచ్చుచు గిరి విరివిగ తను
    కొనిన సరకు వీకన గని గోరగ మది
    చురచురమని యాకలి గొన కరకరమని
    నమిలి మ్రింగె గారెలు సకినాల్ ప్రియముగ

    కందము :

    బిరబిరమని వచ్చుచు గిరి
    విరివిగ తను కొనిన సరకు వీకన గనుచున్
    చురచురమని నాకలి గొన
    కరకరమని నమిలి మ్రింగె గారెలు సకినాల్

    రిప్లయితొలగించండి
  12. అయ్యా! శ్రీ నాగరాజు రవీందర్ గారూ!
    శుభాశీస్సులు. మంచి ప్రయోగము చేస్తున్నారు మీరు గర్భ కవిత్వములో. విజయోస్తు. మీ ఈనాటి పద్యములలో చిన్న సవరణ అవసరము ఉన్నది. మీరే మరొక ప్రయత్నము చేయండి. ఒకే పేజీలో కంద పద్యమును ఒక చోట మొదలిడి, మరోచోట తేటగీతిని మొదలిడి రెండిటికి గణములు, యతులు, ప్రాసలు, అన్వయము సరిపోవు రీతిలో ఉండే అక్షరములను వ్రాస్తూ రెండు పద్యములను ఒకే మారు పూర్తి చేయండి. కందపద్యము పూర్తి అయిన పిదప తేటగీతికి మరికొన్ని అక్షరములు చివరలో కలుప వలసిన అవసరము ఉంటుంది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  13. నూకలు చెల్లగ తీరును
    ఆకలిఈభూమిపైన, అంబుజనాభా
    ఏకొంచమైన చాలును,
    మాకును అమృతమును పంచి మనుపుముతండ్రీ !!!

    రిప్లయితొలగించండి
  14. గురువర్యులకు వందనములు. మీరు నా సందేహమును తీర్చి గర్భిత కందమును ఎలా వ్రాయాలో తెలిపినందులకు ధన్యవాదములు. మీరు సూచించిన విధముగా నేను మరొక ప్రయత్నము చేసినాను. ఇందులో నేను ఎంతవరకు కృతకృత్యు డనైనానో నేనెఱుగను. దయచేసి నన్ను ఆశీర్వదించగలరు.

    కందము :

    బిరబిరమని వచ్చుచు గిరి
    విరివిగ తను కొనిన సరకు వీకన మది గో
    చరమవ మరిమరి క్షుథలన్
    కరకరమని నములుచు పలు *ఖడికలు మెసగెన్

    * పేలాలు

    తేటగీతి :

    బిరబిరమని వచ్చుచు గిరి విరివిగ తను
    కొనిన సరకు వీకన మది గోచరమవ
    మరిమరి క్షుథలన్ కరకరమని నములుచు
    పలు *ఖడికలు మెసగె రుచి బరగు చుండ

    రిప్లయితొలగించండి
  15. ఆ"కలి" రూపమె "ఆకలి" వివిధాకృ
    ...... తుల దాల్చి పాల్జేయు దుర్గతులను
    కలికి కన్యాత్వము కాలిపొవు కులుకు
    ...... కొరు కామాంధుని కొర్కె యగుచు
    తనవారి తనువులు తల్లడిల్లగ జూచి
    ...... పడతి పయనమయ్యె పతిత యగుచు
    ముష్టినెత్తుకొనెడి బుడతల భవితము
    ...... బుగ్గిపాలగుచుండె భుక్తి కొఱకు

    పలు విధముల ప్రజల నాకలి బాధించు
    ధనము మతము కులము ధరణి యందు
    పొందనెంచు నరుల డెందమందున నిల్చి
    రాజకీయ పదవి రక్తి నిడగ..

    రిప్లయితొలగించండి
  16. ఆ"కలి" రూపమె "ఆకలి" వివిధాకృ
    ...... తుల దాల్చి పాల్జేయు దుర్గతులను
    కలికి కన్యాత్వము కాలిపొవు కులుకు
    ...... కొరు కామాంధుని కొర్కె యగుచు
    తనవారి తనువులు తల్లడిల్లగ జూచి
    ...... పడతి పయనమయ్యె పతిత యగుచు
    ముష్టినెత్తుకొనెడి బుడతల భవితము
    ...... బుగ్గిపాలగుచుండె భుక్తి కొఱకు

    పలు విధముల ప్రజల నాకలి బాధించు
    ధనము మతము కులము ధరణి యందు
    పొందనెంచు నరుల డెందమందున నిల్చి
    రాజకీయ పదవి రక్తి నిడగ..

    రిప్లయితొలగించండి
  17. ఆకలిపై సాకల్యంగా తమ అభిప్రాయాలను తెల్పుతూ చక్కని పద్యాలు రచించిన కవిమిత్రులు...
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    పండిత నేమాని వారికి,
    సుబ్బారావు గారికి,
    సహదేవుడు గారికి,
    డా. ప్రభల రామలక్ష్మి గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    మంద పీతాంబర్ గారికి,
    తోపెళ్ళ బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. అయ్యా! శ్రీ నాగరాజు రవీందర్ గారూ! శుభాశీస్సులు.
    మీ గర్భకవిత్వము 2వ ప్రయోగము బాగుగా వచ్చినది. చివరి అక్షరము గె అని తేటగీతిలో గెన్ అని కందములోను వచ్చినది కదా. మరి కొంచెము ప్రయత్నము చేస్తే ఈ భేదమును కూడా నివారించ గలరు. తేటగీతిలో ఎక్కడో ఒకచో ఒక మాత్రను సవరించ గలిగితే కృతకృత్యులు కాగలరు. విజయోస్తు. ఈ పద్యమును మార్చనక్కరలేదు. మీ తరువాతి ప్రయత్నములో మరికొంత శ్రమను తీసుకొనండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి




  19. ఆకలియె లేనిచో నరులమరు లౌదు
    రెల్ల జనులును బనిచేయ నొల్లరపుడు
    జగతి నభివృద్ధి సాగునె? జరయు,రుజయు
    నాకలియు నరజాతికత్యవసరమ్ము.

    రిప్లయితొలగించండి