4, ఫిబ్రవరి 2013, సోమవారం

పద్య రచన – 242

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

18 కామెంట్‌లు:

  1. ఇటనే భారత మందున
    నిటలాక్షుడు లింగ రూపు నిలచెన? లేదే !
    ఇట లీల జూపు నాతడు
    ఇటలీలో గూడ జూపె నిదిగో కనుమా !

    రిప్లయితొలగించండి
  2. నా కృతి శ్రీగిరిమల్లికార్జున శతకమునుండి:

    ఈ జగమెల్ల నీ నిలయమేయగు సర్వ చరాచరావళిన్
    రాజిలుచుందు వీవు నగరాజ సుతాప్రియ! నాదు మానసాం
    భోజమునందు నొప్పు నిను మోదముతోడ భజించుచుందునో
    రాజకళాధరా! శివ! పరాత్పర! శ్రీగిరి మల్లికార్జునా!

    రిప్లయితొలగించండి
  3. అంగాంగమ్ముల వెలయును
    జంగమ హృదయమ్ములందు జగతుల నందున్
    లింగడు వాటిక నుండడె
    సంగడియై తన్ను నమ్ము సంతప్తులకున్ !

    రిప్లయితొలగించండి
  4. శివు డం తా వ్యా పించును
    భవుడే మఱి లేని చోటు భరణి ని గలదే ?
    శివ శివ యని దను పిలువగ
    నవిరళ ముగ నిచ్చు మనకు నాయువు సిరులన్ .

    రిప్లయితొలగించండి
  5. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మసోమవారం, ఫిబ్రవరి 04, 2013 2:15:00 PM

    ఆది మధ్యాంత ములులేని యాది మతము
    సకల మతములు జనియించె సత్యమరయ
    విజ్ఞతన పరిశోధన పెంచి చూడ
    ధరణి నద్వైత మేసనా తనమ తంబు

    వాటికి నిటలి దేశపు వాటి కన్సి
    టినిబ యల్పడె గ మహాన టేశ లింగ
    మద్భుత నిరూపణముగ నమరి యుండ
    హరహ రనమశ్శి వాయన హారతిదియె.

    రిప్లయితొలగించండి
  6. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    సర్వేశ్వరుడు :

    01)
    _______________________________

    ఇటలీ లో నన నేటికి
    నిటలాక్షుం డుండనట్టి - నిగమము గలదే
    ఎట గాంచిన నట యుండును
    జటాధరుడు , సంయతుండు - సర్వేశ్వరుడే !
    _______________________________
    నిగమము = పట్నము

    రిప్లయితొలగించండి
  7. వాటికన్ను వాటికన్ను అన
    ఏమో అనుకుంటిమి ! ఇట
    లింగం దేవర 'వాడి' కన్ను
    కాలగతిన వాటికన్ను ఆయెనా ! !


    జిలేబి.

    రిప్లయితొలగించండి
  8. పండిత మిస్సన్నగారి
    పద్యం - హృద్యం అను బ్లాగును కూడా సాహితీమిత్రులు సందర్శించండి. అంతేకాక మిస్సన్నగారిని శంకరాభరణాన్ని అలరించవలసిందిగా కోరుతున్నాను.

    రిప్లయితొలగించండి
  9. పండిత మిస్సన్నగారి
    పద్యం - హృద్యం అను బ్లాగు http://missarao.blogspot.in

    రిప్లయితొలగించండి
  10. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మసోమవారం, ఫిబ్రవరి 04, 2013 9:35:00 PM

    జిలేబి గారికి నమస్సులు. ఒక చక్కని పరిశోధనాంశాన్ని స్ఫురింపచేసారు మిక్కిలి ధన్యవాదములు. భవిష్యత్తులో మీ మాట నిరూపింపబడునని ఆకాంక్షిస్తూ

    రిప్లయితొలగించండి
  11. విశ్వమంతనిండి వేడుకఁజూసెడు/జేసెడు
    లింగరూపుమునమరేశ్వరుండు
    నిటకునటకును దొర! నటనాలఁజూపుర!
    ధర్మ బద్ధు డైన మర్మయోగి

    రిప్లయితొలగించండి




  12. ఇచట నచ్చట యననేల యెల్ల జగతి
    లింగరూపుడై భవుడు కనంగవచ్చు,
    ఇటలి,యమెరికాలో గూడ నిట్టి రూప
    ములు గలవని నే జదివితి మున్ను కొంత.

    రిప్లయితొలగించండి
  13. ఇటఁ గలఁడు నటను లేఁడని
    లటపటముల నాడనేల లాలాటాక్షుం
    డెటఁ గనిన నట ఘటిల్లును !
    నిటలాక్షుడు లేని యట్టి నెలవులు గలవే !!!

    రిప్లయితొలగించండి
  14. నిర్వి కారుం డాతడు
    సర్వాం తర్యామి యైన సర్వేశ్వరు డౌ !
    సర్వము శివ మయ మన్నను
    గర్వము మనదౌను నిటలి గౌరవ మొందన్ !

    రిప్లయితొలగించండి
  15. సుబ్బా రావు గారికి ధన్య వాదములు
    నా పద్యము నందు మొదటి పాదము నెలా సవరణ చేయాలొ నాకు సరిగా రావట ల్లేదు. ఐనా గగం , గలం ఉండ వచ్చు నేమొ కదా ? ప్చ్ ! ఏమో నాకు సరిగా తెలియదు.

    రిప్లయితొలగించండి