13, ఫిబ్రవరి 2013, బుధవారం

సమస్యాపూరణం – 965 (పండితులైన వారలకు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
పండితులైన వారల కబద్ధములాడుట భావ్యమే కదా!
ఈ సమస్యను పంపిన తోపెళ్ళ బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి ధన్యవాదములు. 

41 కామెంట్‌లు:

  1. అయ్యా! శ్రీ శంకరయ్య గరూ! శుభాశీస్సులు.

    మన బ్లాగు సుహృద్భావముతో పరస్పర సౌభ్రాత్రముతో అభివృద్ధి పథములో సాగవలెనని నేను ఆశించుచున్నాను. మీకు అభినందనలు. రాగ ద్వేషములకు మనము అందరమూ తప్పకుండా అతీతులమయి ఉందాము అనుటయే ముదావహవము - అనుసరణీయము - ఆచరణీయము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  2. పండితులైన వారు సమభావనులున్ సమదర్శనుల్ క్షితిన్
    పండిత వాక్యమంచిత శుభప్రదమౌ, నపవాదు లేలనో?
    పండితులైన వారల కబద్ధము లాడుట భావ్యమేకదా!
    గండడ యంచు; సత్ఫలము లందుము సూరుల నాదరించుచున్

    రిప్లయితొలగించండి
  3. నా పూరణలో ఆఖరి పాదములో "సత్ఫలములందుము" నకు బదులుగా "సత్ఫలము గాంచుము" అని మార్చుదాము (యతి మైత్రి గురించి). స్వస్తి.

    రిప్లయితొలగించండి
  4. పండితులైనవారు జను బాటను బోదురు లోకులెప్పుడున్
    మెండుగ బోధ జేసె కద మెచ్చగ గీతను దేవదేవుడే
    కొండొక చోటనైన మది కోరక నైనను వేడుకందునన్
    పండితులైన వారల కబద్ధము లాడుట భావ్యమే? కదా!

    రిప్లయితొలగించండి
  5. దండుగమారి మాటలను తండ్రిని తల్లిని బోధకున్ సదా
    ఖండన జేయుచున్ మిగుల కావరమందున దిట్టువారకున్,
    మెండుగ నీల్గి గర్వమున మెప్పుల గోరి చరించి భ్రాంతులై
    పండితులైన వారల కబద్ధములాడుట భావ్యమే కదా!

    రిప్లయితొలగించండి
  6. శంకరార్యా! మీ పలుకులు సంతోషదాయకము.ఐతే బ్లాగులోని సభ్యులనే పరిష్కర్త పేరుతో కొందరు తూలనాడినప్పుడు మీరు గమనించలేదని యనుకొనుచున్నాను . అభ్యాసకవి యైన ఒకరిని పాపం ఒకపాదము ఆటవెలది మరొకపాదము తేటగీతితో రచించినప్పుడు "వారు క్రొత్త ఛందస్సులో ఆట గీతులు , తేట వెలదులు రచించుచునే యుంటారు " అన్నప్పుడు ,
    అలాగే ఇంకొకరిని "మీకు ఎన్ని మారులు చెప్పినను కందములో ప్రాస పూర్వాక్షర నియమమును పాటించరెందుకు " అని నిష్టూరమాడినప్పుడు ,
    మరొక లబ్ధ ప్రతిష్ఠుడైన కవిగారిని "// మీరు ఏదో మాదిరిగా కిట్టించి సమస్యను నింపేను అనుకొన్నారేమో. 2వ పాదములో "పలుకి"? -- అలాగుననే 3వ పాదములో "ప్రశ్నగు" అనునది వ్యాకరణ బద్ధమా? // " అని అన్నప్పుడు కూడ ఆ వ్యంగ్య ధోరణి మీ దృష్టికి రాలేదనే యనుకొనుచున్నాను .
    మొన్నటికి మొన్న వారి పద్యాన్ని ప్రశంసిస్తూ, అందలి పదగాంభీర్యాన్ని మెచ్చుకుంటూనే కేవలం ఫలానా ప్రయోగం విచారణీయం అన్నందుకే అలా అన్నవారిని " కొండొకడు , అజ్ఞాని " అని తక్కువ చేసినప్పుడు కూడ మీరు గమనించలేదనిపిస్తున్నది

    వీరి ధోరణిని నిరసిస్తూ బ్లాగుకే సెలవ్ అంటూ వెళ్లిపోయిన కవిగారింకా మనమధ్యే ఉన్నారు కూడా (పేరు విదితమే)

    ఓం సహనావవతు, సహనౌభునక్తు, సహవీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు మావిద్విషావహై ఓం శాంతిః శాంతిః శాంతిః

    రిప్లయితొలగించండి
  7. దండిగ శాస్త్రముల్ జదివి , తాము మహోన్నత శేముషీ సుధా
    మండితులయ్యు నేమి ఫలమయ్య ! యహంకృతి నెత్తి కెక్కుటన్
    గండర గండరై పలు వికారము లొక్కెడ రూపుదాల్చు - నీ
    పండితులైన వారల కబధ్ధము లాడుట భావ్యమే గదా !

    రిప్లయితొలగించండి
  8. గుండియలోన ద్వేషమును కుత్సిత భావము లేక, మైత్రియే
    నిండుగ నొప్పుచుండును వినిర్మలుడై బుధుడయ్యు, వానిపై
    మెండుగ వేసి నిందలదె మేలని యెంచెడు వాని దృష్టిలో
    పండితులైన వారల కబద్ధము లాడుట భావ్యమే కదా!

    రిప్లయితొలగించండి
  9. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ.బుధవారం, ఫిబ్రవరి 13, 2013 5:33:00 PM

    పూజ్యశ్రీ పండిత నేమాని వారికి, శంకరార్యులకు బ్లాగు మిత్రబృందమునకు నమస్సులు.ఈనాటి సమస్యను 1987 లో అమలాపురంలో బ్రహ్మశ్రీ బేతవోలు రామబ్రహ్మం గారి సంచాలకత్వంలో
    బ్రహ్మశ్రీ కడిమెళ్ళ వరప్రసాదు గారిచే జరుపబడిన శతావధానమందు నాచేనివ్వబడిన సమస్య ఇది.ఈరోజు నేను హైదరాబాదులో ఉండుటవలన వారి పూరణ వెంటనే ఇవ్వలేకపోవుచున్నాను.
    నాపూరణ

    గుండెల నిండుగా సొగసు గూర్చెడు హారము ప్రేమ మీరగన్
    పండుగ నాడు కొందునని బాసలు చేయగ వాని తప్పగన్
    మండిన గుండెతో మగువ మన్నన చేయక భర్తతో ననెన్
    పండితులైన వారల కబద్ధము లాడుట భావ్యమేకదా!

    రిప్లయితొలగించండి
  10. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ.బుధవారం, ఫిబ్రవరి 13, 2013 5:49:00 PM

    ఈ నాటి సమస్యను ఏ ఒక్కరిని నొప్పించే ఉద్దేశ్యంతో ఇచ్చినదిగాదని నా విన్నపము. గుణములకన్నను దోషములను విశ్లేషించుట వలన తప్పు తెలిసికునే అవకాశం ఉంటుంది. దోషం ఎందువలననో తెల్పిన ఇంకనూ మంచిది కదా.మనదోషములను తెలియజెప్పి సరిదిద్దువారే కదా నిజమైన గురువులు. మనలో ఆశించిన మార్పు రానప్పుడు కొంచం కఠినత జూపుట తప్పుకాదని నా అభిప్రాయం మాత్రమే. తెలుగు భాషాభివృద్ధికి ముఖ్యంగా ప్రాచీన పద్య నిర్మాణానికి పెద్దలు మిత్రుచేయు సేవ కొనియాడదగినదిగదా! ఈ శంకరాభరణం బ్లాగు ఔత్సాహికులకు మరింత మార్గదర్శకంగా రూపుదిద్దుకోవాలని ఆ శంకర గురుదేవుని వేడుచున్నాను.


    రిప్లయితొలగించండి
  11. శుభమస్తని దీవించుదు
    శుభమతి! తోపెల్ల వంశ తోయధి చంద్రా!
    అభిమానీ! శర్మా! మిము
    నభినందించెదను శంకరాభరణ హితా!

    రిప్లయితొలగించండి
  12. మెండుగ ధర్మమున్ నిలుప మీఱిన ద్రోణుని తాళలేకయున్
    కొండొకచో యబద్ధమును గొణ్కగ ధర్మసుతుండె రంగమున్
    భండన మందునన్ గెలువ పాండుసుతుల్ గిరిధారి యండచే
    పండితులైన వారల కబద్ధములాడుట భావ్యమే కదా!

    రిప్లయితొలగించండి
  13. తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ.బుధవారం, ఫిబ్రవరి 13, 2013 7:00:00 PM

    శ్రీ పండితుల వారు నాపై కురిపించిన ఆశీ:ప్రసూనములకు మిక్కిలి ధన్యవాదములు ప్రణామములు.

    రిప్లయితొలగించండి
  14. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ.బుధవారం, ఫిబ్రవరి 13, 2013 7:18:00 PM

    ది.13.6.1987 మరియు 14.6.1987 న జరిగిన శతావధానములో బ్రహ్మశ్రీ కడిమెళ్ళ వరప్రసాదు గారి పూరణ చూడండి.

    అండజయాన! నీ వలపునందగ రక్తిమ లేక కాదు,సొ
    మ్ముండక కాదు, వేరికతెనొందగ బుద్ధియు బుట్టికాదు, వీ
    రిండితనమ్మటన్న విని లేమ వచించె నపేత నీతిమత్
    పండితులైన వారలకబద్ధములాడుట భావ్యమే కదా!

    రిప్లయితొలగించండి
  15. పెద్దలందరికి ప్రణామాలు!

    ఈ నాటి సమస్యకు మూలం తిరుపతి వేంకటకవుల "శ్రవణానందము" ద్వితీయాశ్వాసంలోని 74-వ పద్యం:

    అనుచు నొక్కింత స్మితపూర్వకమ్ముగ నడిగిన న క్కన్నెమిన్న యిట్లనియె: (2-73)

    వెండియు రేపె వత్తుమని వేగిరపాటున గంటయైనఁ గూ
    ర్చుండక యల్లనాఁడు పని యున్నదటంచును నేగి మీరు రా
    కుండుటఁజేసి మిమ్ముఁగన నొయ్యన నొంటిగ నేగుదెంచితిం;
    బండితులైనవారల కబద్ధము లాడుట భావ్యమేకదా! (2-74)

    అని. దీనికి పెక్కు అవధానాలలో అనేకవిధాల పూరణలున్నాయి.

    రిప్లయితొలగించండి
  16. శ్రీ గురువులకు, మాన్యులు శ్రీ శంకరయ్య గారికి
    ప్రణామములు!

    ఇవి నేటి నా పూరణలు.

    "దండము లానఁగొంచు భుజదండముపై వహియించినాఁడ భూ
    మండల మాసఁగొంచు రిపుమండలతేజము; నీకు నిత్తు నా
    ఖండలభోగభాగ్యము లఖండము" లంచు సఖీమనోగతా
    పండితు లైనవారల కబద్ధము లాడుట భావ్యమే కదా.

    "కొండకు మొల్చె ఱెక్కగవ"; "కొండుక పాముకుఁ గాళ్ళు నిల్చె"; "వే
    దండము చీమపుట్టఁ దినఁ దార్కొనె" నంచు వధానవేళ దోషవా
    ఙ్మండిత శుష్క దుష్కరసమస్యలఁ బూరణ కిచ్చుచో మహా
    పండితు లైనవారల కబద్ధము లాడుట భావ్యమే కదా.

    విధేయుఁడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  17. చి. డా. మురళీధర్ గార్కి శుభాశీస్సులు.
    మీ పద్యము "కొండకు మొల్చె...." 2వ పాదములో చివరిలో 2 అక్షరములు ఎక్కువ యున్నవి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  18. మెండగు శాస్త్రసమ్మత సమీకృత పొత్తములన్ పఠించి పా
    షాండములైన భావముల సంహరణంబొనరించునట్టి కో
    దండముఁగాదె ప్రాజ్ఞుడు, వితండముజేసెడు వారు మూఢులౌ
    పండితులైన వారల కబద్ధములాడుట భావ్యమే కదా!

    రిప్లయితొలగించండి
  19. శ్రీ గురువులకు ధన్యవాదములు!

    "దండము లానఁగొంచు భుజదండముపై వహియించినాఁడ భూ
    మండల మాసఁగొంచు రిపుమండలతేజము; నీకు నిత్తు నా
    ఖండలభోగభాగ్యము లఖండము" లంచు సఖీమనోగతా
    పండితు లైనవారల కబద్ధము లాడుట భావ్యమే కదా.

    "కొండకు మొల్చె ఱెక్కగవ"; "కొండుక పాముకుఁ గాళ్ళు నిల్చె"; "వే
    దండము చీమపుట్టఁ దినఁ దార్కొనె" నంచు వధానవేళ వా
    ఙ్మండిత దోష దుష్కరసమస్యలఁ బూరణ కిచ్చుచో మహా
    పండితు లైనవారల కబద్ధము లాడుట భావ్యమే కదా.

    విధేయుఁడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  20. అయ్యా! శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యములో "శాస్త్ర సమ్మత సమీకృత..." వరకు సమాసము బాగుగనే యున్నది. ఆ తరువాత "పొత్తములన్" అని తెలుగు పదము వేయుట సాధువు కాదు. పరిశీలించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  21. తోపెల్ల సుబ్రహ్మణ్య శర్మ గారూ! గురువుగారికి ఒక మంచి సమస్యను సూచించి శ్రీ కడిమెళ్ళ వారి అద్భుతమైన పూరణను కూడా అందించారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. డా. ఏల్చూరి మురళీ ధర రావుగారు ఈనాడీయబడిన సమస్యకు మూలాన్ని అందరికీ పరిచయం చేసి ఆనందం కలిగించారు. వారు తిరుపతి వెంకటకవుల అపురూపమైన పూరణను కూడా అందించడమే గాక వారి యధాప్రకారమైన చక్కని పూరణల నిచ్చారు .

    రిప్లయితొలగించండి
  23. పండితులే కదా భరత వర్ష మహత్త్వము నెల్ల ధాత్రికిన్
    మండనమౌ విధిన్ దెలిపి మాన్యత బెంచెడి సజ్జనాళి పా-
    షండపు ధర్మ బోధలను సద్యశ మార్పెడు దేశవైరులౌ
    పండితులైన వారల కబద్ధము లాడుట భావ్యమేకదా!

    రిప్లయితొలగించండి
  24. నిండుగ జ్ఞాన సిద్ది గల నేర్పున వ్రాయుచు కావ్యముల్ కవుల్
    దండిగ సుందరం బనుచు ధారుణి గాంచిన సోయగ మ్ములన్
    నిండిన మోదమున్ మలచి నేలకు నింగికి కల్పితం బుగా
    పండితు లైన వారల కబద్దము లాడుట భావ్యమే కదా !

    రిప్లయితొలగించండి
  25. శ్రీ నేమాని గారికి,

    నమస్సులు.

    పొత్తముల్ కు బదులుగా గ్రంధములన్ అని మార్చితే సరిపోతుందనుకుంటాను.

    మెండగు శాస్త్రసమ్మత సమీకృత గ్రంధములన్ పఠించి పా

    ధన్యోస్మి.

    రిప్లయితొలగించండి
  26. కవిమిత్రులకు నమస్కృతులు.
    ఉదయంనుండి ఇప్పటివరకు బ్లాగు చూసే అవకాశం లభించలేదు. ఈరోజు మా మేనబావ, మేనల్లుళ్ళ గృహప్రవేశాలు. తరువాత ఒక మిత్రుడి కూతురు పెళ్ళి.
    రేపు మా తమ్ముడి కొడుకు పెళ్ళి. అదే కాక మా కోడలు చెల్లెలి (బాబాయి కూతురు) పెళ్ళి.
    ఎల్లుడి మా మరో తమ్ముడి కూతురు పెళ్ళి.
    శనివారం మరో బంధువు ఇంట్లో పెళ్ళి. (15 తర్వాత పెళ్ళి ముహూర్తాలు లేవన్నారు మా పురోహితులు. కాని ఈ పెళ్ళి 16 నాడు?)
    ఈ రెండు మూడు రోజులు సమస్యలు, పద్యరచన క్రమతప్పకుండా ఇస్తా ననుకోండి. గుణదోష విచారణ మాత్రం పరస్పరం చేసుకోవలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి





  27. పండితులైనగాని ,ప్రతిభామతులైననుగాని యేరికిన్
    గొండొకచో నసత్యముల,గొంచెపుబుద్ధిని, స్వార్థచింతనన్
    మెండుగ జెప్పుటన్ వినమె ,మెప్పును బొందుటవశ్యమౌటచే
    పండితులైన వారల కబద్ధములాడుట భావ్యమే కదా.

    రిప్లయితొలగించండి
  28. ఈనాటి సమస్యను పోస్ట్ చేసిన తరువాత తప్పు చేసానేమో, తొలగించి మరో సమస్య ఇస్తే బాగుండునేమో అనుకున్నాను. కానీ బంధువుల ఇళ్ళల్లో కార్యక్రమాలకు వెళ్ళడం వల్ల వీలు చిక్కలేదు. కానీ ఇప్పుడు సమస్యకు వచ్చిన స్పందన, చర్చ చూసి తృప్తి చెందాను.
    చక్కని పూరణలు చెప్పిన కవిమిత్రులు.....
    పండిత నేమాని వారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    లక్ష్మీదేని గారికి,
    అజ్ఞాత గారికి,
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    ఏల్చూరి మురళీధరరావు గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    మిస్సన్న గారికి,
    రాజేశ్వరి అక్కయ్య గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    సమస్య నేపథ్యాన్ని తెల్పడమే కాక అద్భుతమైన పూరణలు చెప్పిన ఏల్చూరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు.
    *
    అజ్ఞాత గారూ,
    వయసులో పెద్దవారూ, గురుతుల్యులూ అయినవారు శిష్యవాత్సల్యంతో చేసే వ్యాఖ్యలను భక్తిపూర్వకంగా స్వీకరించడంలో తప్పులేదని భావిస్తాను.
    'మావిద్విషావహై ఓం శాంతిః శాంతిః శాంతిః' అని మీరే అన్నారు. మనలో ద్వేషభావం కలుగకుండుగాక! స్వస్తి!!

    రిప్లయితొలగించండి
  29. కమనీయం గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  30. శంకరార్య! తప్పును తప్పు అని చూపించడములో తప్పు లేదనుకొంటాను ,మీ వ్యాఖ్యలు కూడ ఆ విషయాన్నే బలపరచుచున్నవి ,కనుక ఇకమీదట కూడ నిష్పక్షపాతముగా తప్పొప్పులను చూపించడానికే నిర్ణయించితిని.

    రిప్లయితొలగించండి
  31. అజ్ఞాతగారూ, మీ నిర్ణయం నాకు నచ్చింది. మీలాంటి ప్రతివాది భయంకరులు ఊరికొకరు, వాడకొకరు అన్నట్లు ఉంటేనే పట్టుబిగుస్తుంది, మాలాంటి వారికి నేర్చుకొనే అవకాశం దొరుకుతుంది. నిస్సంకోచంగా కొనసాగించండి. సర్వేసంతునిరామయా:
    ముసుగులో ఇంకో అజ్ఞాత:

    రిప్లయితొలగించండి
  32. పండిత శేఖరుండొకడు పత్నికి పచ్చల రత్నహారమున్
    పెండిలిరోజు కానుకగ పేరిమితో గొని దెత్తు నంచు తా
    దండిగ బల్కి తేని తన దబ్బరలాడెడు పత్నితోననెన్
    పండితులైనవారల కబద్ధము లాడుట భావ్యమే కదా.

    రిప్లయితొలగించండి
  33. పండిత శేఖరుండొకడు పత్నికి పచ్చల రత్నహారమున్

    పెండిలి రోజుకానుకగ పేరిమితో గొని దెత్తు నంచు తా

    దండిగ బల్కి తేని తన దబ్బరలాడెడు భర్తతోననన్

    పండితులైనవారల కబద్ధము లాడుట భావ్యమే కదా.

    రిప్లయితొలగించండి
  34. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _________________________________________

    గండడు గాని వాని , ఘన - గండర గండడటంచు మెచ్చుటల్
    బండయె, బండగుండె యగు - భర్తల మెప్పును పొందగోరుటన్
    కొండొక చోట నూడిగము - కోరిన దప్పద దెంత వారికిన్ !
    పండితులైన వారల క - బద్ధము లాడుట భావ్యమే కదా!
    _________________________________________
    గండడు = శూరుడు
    బండ = అవివేకి
    బండగుడు = దుష్టుడు
    భర్త = రాజు, యజమాని

    రిప్లయితొలగించండి
  35. "పండుగ రోజూ లేదు - పెళ్ళిరోజూ లేదు మీరెప్పుడూ యింతే"
    అంటూ అలిగి పండుకొన్న భార్య భర్తతో :

    02)
    _________________________________________

    పెండిలి నాడిదేమి ? పరు - పెక్కితి విట్లని భర్త లేపగా
    పిండుచు ముక్కు , భార్య , తల - పెండిన భర్తను దెప్పుచిట్లనెన్
    పండుగ నాడు నీ కిడుదు - బంగరు హారమటంచు యంటివే
    పెండిలి నాడు కూడ నిల - బెట్టక పోతివి నీదు బాసనే
    పండితులైన వారల క - బద్ధము లాడుట భావ్యమే కదా !
    _________________________________________
    తలపెండిన = మతిలేని(మరచిపోయిన)

    రిప్లయితొలగించండి
  36. @వసంత కిశోర్ గారూ మీ పూరణ బాగుంది. తల-పండిన భర్త, తల-పెండిన భర్త అవటం తప్పదు కదా!


    పెండిలి నాడిదేమి ? పరు - పెక్కితి విట్లని భర్త లేపగా
    పిండుచు ముక్కు , భార్య , తల - పెండిన భర్తను

    రిప్లయితొలగించండి
  37. పండుగ పూట వంటలను భారిగ నుప్పును సైచి యోర్పుతో
    మెండుగ మెచ్చుచున్ తమకు మేతల నిచ్చెడి సత్యభామలన్
    కొండొక రీతినిన్ వలచి గొప్పగ ముద్దిడి కాగలించెడిన్
    పండితులైన వారల కబద్ధములాడుట భావ్యమే కదా!

    రిప్లయితొలగించండి