3, ఫిబ్రవరి 2013, ఆదివారం

పద్య రచన – 241

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

30 కామెంట్‌లు:



  1. కఱవు వచ్చె నేమొ కారప్పొడియు లేదు
    నారికేళ రుచుల నంజు లేదు
    కంజపత్ర ఘటిత కంచమ్ము నేమయ్యొ
    నిలను మెత్తు రయ్య యిట్టి యిడ్లి ?

    గురువు గారూ ! ఇప్పుడున్నయో లేవో తెలియదు. ఇడ్లీలు విశాఖపట్టణములో విజయ విహారులో బాగుండేవి. హేలాపురిలో వసంత విహారులో కూడా బాగుండేవి. వసంత కిషోర్ గారు నాతో అంగీకరిస్తారు.

    రిప్లయితొలగించండి
  2. మూర్తి గారూ ! ఈ రోజు ఇడ్లీ పలహారానికి ముందున్నారు.. అభినందనలు.

    ఇడ్డెన లందురు వీటిని
    గడ్డలుగా ఉల్లి వేసి కమ్మని సాంబార్
    వడ్డించగ చట్నీతో
    అడ్డేమియు లేదు తినగ నాహా ! ఓహో !

    రిప్లయితొలగించండి
  3. అల్పాహారము సొంపుగ
    గల్పించిరి శంకరార్య కన్నుల విందై
    వేల్పులె మెచ్చెడి యిడ్లీ
    తల్పమ్మును వీడి రారె త్వరితము మిత్రుల్ !

    రిప్లయితొలగించండి
  4. హనుమచ్ఛాస్త్రి గారూ! తిండికి తిమ్మరాజునే !! మీ గుంటురు నెప్పుడూ సందర్శించే భాగ్యము కలుగ లేదు. అక్కడ మంచి ' విహారు ' పేరొకటి చెప్పండి !

    రిప్లయితొలగించండి
  5. ఔరా! యిడ్డెనలంట నాలుగివి యల్పాహారమౌ వేడి సాం
    బారున్ బచ్చడు లున్నవిందు నిక జిహ్వా! నీదె భాగ్యంబగున్
    సారంబౌ రుచిగూర్చు డెందమలరున్ సంతోషమేపారు ని
    త్యారోగ్యప్రదమైన వంటకమిదే యన్యంబు లింకేలనో?

    రిప్లయితొలగించండి
  6. మూర్తి గారూ ! ఇక్కడ మంచి ' విహారు ' లు లేవండీ ! మంచి వి ' లాసు ' లేగానీ.. '.శంకర వి లాస్ ' ఉన్నది.. ఈ సారి ఇటు వచ్చి నప్పుడు గుం ' టూరు ' రండి..

    అల్పాహారపు పద్యమ
    నల్పంబుగ చెప్పినారు ఆర్యా! నిజమే !
    కల్పనయే లేదందును
    వేల్పులు మెచ్చునుగ నిడ్లి వేడిగయున్నన్.

    రిప్లయితొలగించండి
  7. అల్పాహారపు పద్యమ
    నల్పంబుగ చెప్పినారు ఆర్యా! నిజమే !
    కల్పనయే లేదందును
    వేల్పులు మెచ్చునుగ నిడ్లి " వేడిన " తినగన్.

    రిప్లయితొలగించండి
  8. పై పద్యములో "కల్పన" ఉన్నా .."నిజము" కూడా ఉన్నది..

    రిప్లయితొలగించండి
  9. సభకు నమస్కారములు.
    నా పద్యములు, పూరణలు యథావిథిగా వ్రాయుటకు అనుమతి కోరుతూ.....

    గ్రామాంతరమున నుండి వి
    రామము చేకొంటి; తిరిగి రంజిలు పద్యా
    రామము చేరితి; కోరితి
    నే మీ యాశీస్సులెల్ల, నిర్మల భక్తిన్.

    ఈనాటి పద్యము

    తేలికగా జీర్ణమగును,
    పోలిక లేదనుచు నమ్మి, భోజనమనుచున్
    మేలును జేయునటంచును
    జాలిగ రోగుల కిత్తురు, సత్తువ కొఱకై.

    రిప్లయితొలగించండి
  10. అమ్మా! లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యమును చాలా బాగుగా వ్రాసేరు. అభినందనలు. పద్యములో ఎక్కడైనా ఇడ్డెన (ఇడ్లి) అనే పదము వాడితే ఇంకా బాగుండేది.

    రిప్లయితొలగించండి
  11. చట్నీ సను హోటలులో
    చట్నీ సాంబారు యిడ్లి చవు లూరించున్
    పట్నానికి పోయినపుడు
    చట్నీసున తిను డెపుడును సాంబా రిడ్లిన్

    రిప్లయితొలగించండి
  12. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మఆదివారం, ఫిబ్రవరి 03, 2013 1:31:00 PM

    పిన్నలకు పెద్దవారికి ప్రియము గాదె
    రోగి గూడ తినదగు నారోగ్యమిచ్చు
    ఖాద్యమింకొకటి గలదె? కనగ మనము
    ధరను వ్యాప్తినొందె తమిళ తంబి జేత.

    రిప్లయితొలగించండి
  13. డా. ప్రభల రామలక్ష్మిఆదివారం, ఫిబ్రవరి 03, 2013 1:33:00 PM

    చిత్రపూరణ చేయగ చింత జేయ
    మెదలకుండెను భావమ్ము మేథయందు
    నాలుగిడ్లీలు సాంబారు నాల్కనంట
    పూర్తి యయ్యెను పూరణ పూర్తిగాను.

    రిప్లయితొలగించండి
  14. ఇడ్లీ లన్న ఎవరికైనా యిష్టమే. ముఖ్యంగా యువతకు. "నిన్న క్లాసుకు రాలే దేంటర్రా ?" అని మాష్టారు స్టూడెంట్సును అడిగినప్పుడు వాళ్ళిచ్చే సమాధానం :

    బాట్నీ క్లాసాబ్సెంటయి
    చట్నీ సాంబారు యిడ్లి జర్దా కిళ్ళీ
    పాట్నీ సెంటరులో తిని
    మ్యాట్నీ షోలకు వెళితిమి మాష్టర్ గారూ !

    రిప్లయితొలగించండి
  15. ఇడ్లీ లున్నవి యక్కడ
    యి డ్లీ తో బాటు యుండె నిరవగు ఛ ట్నీ
    యి డ్లీ ఛ ట్నీ కంటెను
    యి డ్లీ సాంబారు కలిపి యిష్టత దిందున్

    రిప్లయితొలగించండి
  16. శ్రీ తోపెల్ల సుబ్రహ్మణ్య శర్మ గారూ!
    శుభాశీస్సులు.
    మీరు వ్రాసిన పద్యము ఇడ్లీ గురించే కదా! మరి ఇడ్లి అనే పదము ఎక్కడా లేదే ఆ పద్యములో. పరిశీలించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  17. అమ్మా! రామలక్ష్మి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగున్నది. 4వ పాదమును ఇలాగ మార్చి చూడండి:

    "పూర్తియయ్యె పద్యము రసస్ఫూర్తి మెరయ"

    రిప్లయితొలగించండి
  18. తెలుగులో "వాసెన కుడుములు" అనబడే ఇడ్లీలపై 'రుచి'కరమైన పద్యాలు చెప్పిన కవిమిత్రులు....
    గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
    గోలి హనుమచ్ఛస్త్రి గారికి,
    పండిత నేమాని వారికి,
    లక్ష్మీదేవి గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
    డా. ప్రభల రామలక్ష్మి గారికి,
    సుబ్బారావు గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    గన్నవరపు వారూ,
    `కారప్పొడి` వ్యావహారికం కదా... "కారపుపొడి లేదు" అందాం.
    నేను కల్పించిన అల్పాహారము "కన్నుల విందై"నది అనుట వాస్తవము....
    *
    గోలి వారూ,
    మీ పద్యంలో "చెప్పినార లార్యులు" అందాం.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పునరాగమనం సంతోషదాయకం.
    నేమాని వారి వ్యాఖ్య నేపథ్యంలో.... మూడవ పాదాన్ని
    " మేలొనరఁ జేయు నిడ్లీ" అందామా?
    *
    తోపెల్ల వారూ,
    నేమాని వారి సూచన ప్రకారం
    "ఖాద్యమింకొకటి గలదె? కనగ నిడ్లి" అందామా?
    *

    రిప్లయితొలగించండి
  19. అయ్యా, ధన్యవాదములు.
    గురువుగారు, మీరు చెప్పిన పదమే బాగున్నది.
    మూడవ పాదము సవరణతో...

    తేలికగా జీర్ణమగును,
    పోలిక లేదనుచు నమ్మి, భోజనమనుచున్
    మేలగు వాసెన కుడుములు
    జాలిగ రోగుల కిత్తురు, సత్తువ కొఱకై.

    రిప్లయితొలగించండి
  20. ఇడ్డెనలు తెల్గు వంటకా లిమ్ముగాను
    పోతనామాత్యు రచనను బోల్చి చూడ
    భాగవతమున వర్ణించి వ్రాసియుండె
    చిన్ని కృష్ణుని లీలల నెన్నువేళ
    సంతసమ్మున దిన్నట్లు సఖుల గూడి.

    వేడివేడి పొగల దూది పింజలవలె
    మంచి సాంబారు నందున ముంచి తినిన
    నిడ్లి రుచికరమేగాక యెంతగానొ
    యొడలి కారోగ్యకరముగా నొప్పుగాదె.

    రిప్లయితొలగించండి
  21. డా. ప్రభల రామలక్ష్మిఆదివారం, ఫిబ్రవరి 03, 2013 7:10:00 PM

    గురువుగారికి వందన శతములు,
    తమరు సూచించిన విథముగా సవరణ జేసితిని...

    చిత్రపూరణ చేయగ చింత జేయ
    మెదలకుండెను భావమ్ము మేథయందు
    నాలుగిడ్లీలు సాంబారు నాల్కనంట
    పూర్తియయ్యె పద్యము రసస్ఫూర్తి మెరయ.

    తమ సూచనకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  22. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మఆదివారం, ఫిబ్రవరి 03, 2013 7:22:00 PM

    పండిత నేమాని వారికి, శంకరార్యులకు వందనములు,

    పిన్నలకు పెద్దవారికి ప్రియము గాదె
    రోగి గూడ తినదగు నారోగ్యమిచ్చు
    ఖాద్యమింకొకటి గలదె? కనగ నిడ్లి
    ధరను వ్యాప్తినొందె తమిళ తంబి జేత.

    నాయొక్క పూరణలకు ఎప్పటికప్పుడు తగు సవరణలు చేయగలరు.

    రిప్లయితొలగించండి
  23. అల్లము చట్నీ కారపు పొడి
    ఉల్లము రంజిల్ల నుడివె నుడిపీ నాయర్ !
    బిల్లును గాంచిన గురుతగు
    నిల్లాల డుగదు ఫలితము నిండగు ప్రేమన్ !

    రిప్లయితొలగించండి
  24. గురువు గారూ , నమస్కారములు. మీ అక్షయ పాత్రలో ఇడ్లీలింకా ఉన్నాయే ! నేను భయపడినది ' నారికేళ్ళ రుచుల నంజు ' కంజపత్ర ఘటిత కంచమ్ము ' దగ్గఱ . ఆ రెంటిలో దుష్ట సమాసా లుంటే మీరుగాని, అన్నయ్యగారు గాని సరి చేయ గలరు.

    రిప్లయితొలగించండి
  25. తమ్ముడు చి. డా. నరసింహమూర్తి పద్యములో ఇలా చిన్న మార్పు చేద్దాము:

    కఱవు వచ్చెనేమొ కారంపు బొడిలేదు
    నారికేళ రుచుల నంజు లేదు
    కంజపత్రమేది కంచమ్మునిండుగా
    యెట్లు మెత్తురిట్టి యిడ్డెనలను?

    రిప్లయితొలగించండి
  26. కంది అయ్యవారు వడ్డించిరి సుష్టైన తిరంగా టిఫిను
    పింగళి వెంకయ్య వారు రూపకల్పన చేసిరి తిరంగా జెండా

    తరంగా రంగులు రుచులు ఒకటాయే మనమానందమాయె
    చూడ చూడ వారి మధ్య సొబగులు ఒకటే కదా జిలేబీ ?


    జిలేబి.

    రిప్లయితొలగించండి
  27. మునగ సాంబారులో నిడ్లి ముంచు కొనుచు
    మధ్య మధ్యన చట్నీని మడచి తినిన
    నాలుగేమిటి యారైన నంజు కొంద్రు
    ఉదయముననిడ్లియన్నిట నుత్తమమ్ము

    రిప్లయితొలగించండి