27, ఫిబ్రవరి 2013, బుధవారం

పద్య రచన – 265 (తిరునాళ్లు)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
"తిరునాళ్లు"

27 కామెంట్‌లు:

  1. తిరుగుచు నుందురు మనుజులు
    తిరుగలిలా రేయి బవలు దిన భత్యముకై
    తిరు నామము గల వానిని
    తిరునాడుల నాడు దలచు తీరుగ చూడన్.

    రిప్లయితొలగించండి
  2. తిరుగుచు నుందురు మనుజులు
    తిరుగలిలా రేయి బవలు దిన భత్యముకై
    తిరు నామము గల వానిని
    తిరునాడులు వెట్ట దలచు తీరుగ నాడే !

    రిప్లయితొలగించండి
  3. శంకరాభరణ ప్రోత్సాహ పర్వములు
    శంకరార్యుల తోటి సాహచర్యంబు
    అరవిందభవురాణి నర్చించు విధులు
    తిరునాళ్ళు తిరునాళ్ళు తిరునాళ్ళు మనకు

    కవితా సుమారామ గంధ సమ్ముదిత
    వివిధ సుసాహిత్య విన్యాసతతులు
    సరస శబ్దార్థ భాస్వత్ పద్యరచన
    తిరునాళ్ళు తిరునాళ్ళు తిరునాళ్ళు మనకు

    రిప్లయితొలగించండి
  4. పల్లెలోన జరుగు పండుగ తిరునాళ్ళు
    బంధుజనముతోడ పరిఢవిల్లు
    కలసి కట్టుగ శుభకరముగ పిల్లలు
    పెద్ద వారలెల్ల ప్రీతి నుంద్రు.

    రిప్లయితొలగించండి
  5. తిరునాళ్లు జరుగు చుండును
    వర వేంకట నాధు కెపుడు వర్షము లందున్
    బిరబిర లాడుచు జనములు
    దరహాసము దోడ నతని దరి జేరుదురీ .

    రిప్లయితొలగించండి
  6. శ్రీ శంకరయ్యగురుదేవులకు,శ్రీ నేమాని పండితవర్యులకు, పెద్దలకు వినమ్రవందనములు
    =======*=========
    శంక రార్యుల సాహిత్య సరిగమలను
    పండితుల పద విన్యాస పద్యములను
    శంకరాభరణమునందు పొంకముగను
    గనిన జనులకు తిరునాళ్ళు గణ్యముగను

    రిప్లయితొలగించండి




  7. పెద్ద తిరునాళ్ళు జరుగును పేటలోన
    సంబరమ్ములు జరుగును చాల యచట
    పోయి చూతము మముగొని పొండి యనగ
    నటులె యని భర్త కొనిపోయె నతివనపుడు.

    రిప్లయితొలగించండి
  8. శ్రీ పండితులవారి “ద్విపద”ము లంటి చిన్న ప్రయత్నము.

    తలనీల మిడి బోడి తలలతడుముచు
    ఈలకూ తలనది నీతకొట్టుచును
    గోల గోలలుచేయ కుదురు లేకయును
    బాలబాలికలకు పరవశంబిడును

    తడవతడవకును తల్లిదండ్రులను
    బుడగలు బూరాలు బుల్లి వస్తువులు
    జడపిన్ను రిబ్బను జంతికల్ జీళ్ళు
    అడుగడుగున కన నడుగు కొనుమని

    ఇళ్ళనొదలియెద్దు బళ్ళమీద తిరు
    నాళ్ళ కొత్తురు నాయనమ్మలతోడ
    బళ్ళ విడిచి యంత పశులు మే యంగ
    కళ్ళజూడ మనకు కలుగును వింత.

    రంగుల రాట్నాల రకరకమ్ములుగ
    హంగుల న్నియుజేరి హంగామ చేయు.

    తిరునాళ్ళు తిరునాళ్ళు తిరునాళ్ళ ఘనత
    తిరునాళ్ళు తిరునాళ్ళు తిరునాళ్ళు కనుమ.

    రిప్లయితొలగించండి
  9. వరికోతలు పూర్తవ్వగ
    సరి, పని లేనట్టి రైతు సంబర పడగన్
    పరమాత్ముని దర్శింపగ
    తిరునాళ్లని గూర్చి నారు తేరులు దిరుగన్!

    రిప్లయితొలగించండి
  10. స్వామిని దర్శింప చనుదెంచు భక్తుల
    .. సందడితో జనసంద్రమనగ
    వారివెంబడి వచ్చు పసివార లొనరించు
    .. కోలాహలము దిక్కులను మ్రోయ
    అంగళ్ళ బారుల రంగులరాట్నాల
    .. పెద్దల పిన్నల సద్దు చెలగ
    చిగురుబోడుల చూడ నెగబడు కుఱ్ఱాళ్ళ
    .. డాంబికంబులు వినోదంబు గొలుప
    జరుగుచుండెడు తిరునాళ్ళు సకలజనుల
    కమితహర్షమ్ము గూర్చుచు నలరుచుండు
    నేటి కొకనాడు వచ్చు నీ సాటి లేని
    మేటి పండువ మాయూర మిత్రులార

    రిప్లయితొలగించండి
  11. శ్యామలీయం గారు! మీ పద్యం మనోహరంగాయున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. శర్మగారికి నా పద్యం నచ్చినందుకు కృతజ్ఞతలు.
    అందులో ". డాంబికంబులు వినోదంబు గొలుప" అన్న చోట యతి భంగం అనుకుంటున్నాను. దానిని కొంచెం మార్చి
    ". డంబంబు లతివినోదంబు గొలుప"
    అంటే బాగుంటుంది. అప్పుడు ప్రాసయతి చక్కగా కుదురుతుంది.

    రిప్లయితొలగించండి
  13. అయ్యా! శ్రీ శ్యామలరావు గారూ! శుభాశీస్సులు.
    బహుకాల దర్శనము. ఈనాడు నిజముగా మాకు తిరునాళ్ళే.
    మీ పద్యమును భేషుగా ప్రదర్శించేరు. అభినందనలు. టైపు పొరపాటులు అందరికీ వస్తూ ఉంటాయి. మీ పద్యము 2వ పాదములో చిన్న టైపు పొరపాటు:
    కోలాహలమ్ము దిక్కులను మ్రోయ అని ఉంటే సరిపోతుంది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. అందరికీ శుభాశీస్సులు.
    ఈనాటి తిరునాళ్ళు గురించి వ్రాసిన మిత్రుల అందరి రచనలు వైవిధ్య భరితముగా తిరునాళ్ళనే తలపింప జేస్తున్నవి. శుభం భూయాత్. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. కాల్వగట్లవెంట కాలినడకనేగి
    కారుకూతలెన్నొకాసికొనుచు
    తాయిలాలు తినుచు దాహార్తి తీర్చెడి
    గోలిసొడ తాగి గూడు చేరు.

    రిప్లయితొలగించండి
  16. యెద్దు బండిని వెంకన్న సిద్ధ పరచ
    తొల్లి తిరినాళ్ళు గాంచగ పల్లె లందు
    గరగ నెత్తిన బెట్టుకు సురలు మెచ్చ
    కనుల విందుగ నుండును కనగ సొగసు
    ముగ్ధ మోహన సౌందర్య ముదము గూర్చు !

    రిప్లయితొలగించండి
  17. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    ధన్యవాదాలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    చక్కని పద్యం వ్రాసారు. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    పద్యం చివర దరి జేరుదురీ... దరి జేరుదురే-కు టైపాటా?
    *
    వరప్రసాద్ గారూ,
    మంచి పద్యం చెప్పారు. ధన్యవాదాలు.
    *
    కమనీయం గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    తోపెళ్ళ బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
    మీ ద్విపద బాగుంది. అభినందనలు.
    ఒదిలి, ఒత్తురు అని గ్రామ్యశబ్దాలను ప్రయోగించారు.
    *
    సహదేవుడు గారూ,
    తిరునాళ్ళను ఎప్పుడు ఎందుకు జరుపుకుంటారో చక్కగా వివరిస్తూ మంచి పద్యం చెప్పారు. అభినందనలు.
    *
    శ్యామలీయం గారూ,
    తోపెల్ల వారు చెప్పినట్లు మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
    నేమాని వారి మాటే నాదీను... అది టైపాటే అనుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  18. మాస్టరు గారూ ! ధన్యవాదములు.
    శ్యామల రావు గారూ ! బహుకాల దర్శనం...అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. ఇంటిలోని పనులనీజీగచేసేసి
    కొత్త కోక గట్టి కొప్పు పెట్టి
    పెద్దలంత కూడి పిన్నలైపోయట
    తిరుగి వత్తురంత తీర్థమందు
    కాల్వగట్లవెంట కాలినడకనేగి
    కారుకూతలెన్నొకాసికొనుచు
    తాయిలాలు తినుచు దాహార్తి తీర్చెడి
    గోలిసొడ తాగి గూడు చేరు.

    రిప్లయితొలగించండి
  20. స్వాగతించిన కవిమిత్రమండలికి నమస్సుమాంజలులు.
    నేమానివారు సెలవిచ్చినట్లు అది ముద్ర్రారాక్షసమే.
    నేనే వేరే కంప్యూటరు మీద అలవాటు లేని లేఖినితో ప్రయత్నించటంలో కొంచెం యిబ్బంది పడ్డాను. దాని ప్రభావం అన్న మాట.

    రిప్లయితొలగించండి
  21. మిత్రవత్పూజ్యులు శ్రీ శ్యామలరావుగారికి నమస్సులు. మీ పేరు తెలియక శ్యామలీయం అని వ్రాసినాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  22. శ్రీ శంకరార్యుల వారి చూచన ప్రకారం మార్పుచేయుచూ

    తలనీల మిడి బోడి తలలతడుముచు
    కిలకిలలాడుచు కేరింత పెట్టు
    గోల గోలలుచేయ కుదురు లేకయును
    బాలబాలికలకు పరవశంబిడును

    తడవతడవకును తల్లిదండ్రులను
    బుడగలు బూరాలు బుల్లి వస్తువులు
    జడపిన్ను రిబ్బను జంతికల్ జీళ్ళు
    అడుగడుగున కన నడుగు కొనుమని

    ఇళ్ళు వదలి బళ్ళ నెక్కివచ్చు తిరు
    నాళ్ళ కంతట నాయనమ్మలతోడ
    బళ్ళు విడిచి యంత పశులు మే యంగ
    కళ్ళజూడ మనకు కలుగును వింత.

    రంగుల రాట్నాల రకరకమ్ములుగ
    హంగుల న్నియుజేరి హంగామ చేయు.

    తిరునాళ్ళు తిరునాళ్ళు తిరునాళ్ళ ఘనత
    తిరునాళ్ళు తిరునాళ్ళు తిరునాళ్ళు కనుమ.

    రిప్లయితొలగించండి
  23. డా. ప్రభల రామలక్ష్మి గారూ,
    మీ పద్యాలు చాలా బాగున్నవి. అభినందనలు.
    ఈజీగ.. అని ఆంగ్లపదానికి బదులు.. పనుల నెంతొ వేగమె చేసి... అంటే బాగుంటుందేమో..
    పోయి + అట... అన్నప్పుడు సంధి జరుగదు కదా.. పిన్నలై యట పోయి... అందాం.

    రిప్లయితొలగించండి
  24. శంకరార్యులకు నమస్కారములు,
    మీ సూచనననుసరించి.....

    ఇంటిలోని పనులనెంతొ వేగమె చేసి
    కొత్త కోక గట్టి కొప్పు పెట్టి
    పెద్దలంత కూడి పిన్నలై యట పోయి
    తిరుగి వత్తురంత తీర్థమందు
    కాల్వగట్లవెంట కాలినడకనేగి
    కారుకూతలెన్నొకాసికొనుచు
    తాయిలాలు తినుచు దాహార్తి తీర్చెడి
    గోలిసొడ తాగి గూడు చేరు.

    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి