16, ఫిబ్రవరి 2013, శనివారం

సమస్యాపూరణం – 968 (పార్థసారథి కౌరవ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
పార్థసారథి కౌరవ పక్షపాతి.

21 కామెంట్‌లు:

  1. శాప గ్రస్తుడు కర్ణుడు సరిగ జూడ
    నిదియు నొక్కటి మనమంచి కిపుడు గూడె
    పార్థ ! సారథి కౌరవ పక్షపాతి
    కాడు శల్యుడు మేలును కలుగ జేయు

    రిప్లయితొలగించండి
  2. పార్థసారథి కౌరవ పక్షపాతి
    యైన కర్ణుని కడకేగి యతని జన్మ
    గూర్చి బోధించి రమ్మనె కురుబలమ్ము
    వీడి పాండవాగ్రజునిగ వెలుగు మనుచు

    రిప్లయితొలగించండి
  3. పార్ధ సారధి కౌరవ పక్ష పాతి
    కాదు కాదండి నిజముగ గాదు గాదు
    పార్ధ సారధి పాండవ పక్ష పాతి
    బయలు వెడలును సత్యము భారతమున .

    రిప్లయితొలగించండి
  4. దాయాదుల నడుమ తగని పోరు జరుగ
    ******ధాత్రికి కీడను తలఁపు చేత
    హస్తి పురికినేగి యందరి ముందర
    ******కోరెను సంధికై కురు కులజుని
    బ్రతిమాలె, భయపెట్టె, బంధింప పూనినఁ
    ******జంపక యెంతయో జాలిఁ జూపె
    కర్ణుడు మారిన కలహంబు జరుగుట
    ******తప్పుననుచు నచ్చ చెప్ప పూనె

    సర్వ నిర్దేశకుండు చేజాచి యడిగె
    కురు కులంబుకు మేలును కోరు వాఁడు
    తరచి చూచిన తెలియును తమ్మిబొడ్డు
    పార్థసారథి కౌరవ పక్షపాతి!!

    రిప్లయితొలగించండి
  5. మహా భారత యుద్ధమునకు ముందు శ్రీకృష్ణుడు తన బలగమంతా ఒక పక్షాన, తానొక్కడే ఒక పక్షాన ఉంటామని చెప్పినప్పుడు, అర్జునుడు తనవైపు శ్రీకృష్ణుని ఉండమని కోరుకున్న తరువాత, దుర్యోధనుడు ఇట్లు అనుకొనెను:
    బలమునంతయు నొక్కరి పక్షమందు
    తాను యొక్కడె నొక్కరి దళమునందు
    ఉంచి మంచియె చేసెను ఓర్పుతోను
    పార్థ సారథి, కౌరవ పక్షపాతి.

    రిప్లయితొలగించండి
  6. పాండవుల అజ్ఞాతవాసము పూర్తి అయిన తరువాత, సంధి కోసం శ్రీకృష్ణుడు బయలుదేరేటప్పుడు భీముడు ఈ విధంగా అనెను :
    బలిమి చేసిన బాసలు మరిచిపోయి
    సంది కోసము చేతులు సాచుటెట్లు?
    పక్షపాతము చూపుచు పలుకుటేల?
    పార్థసారథి! కౌరవ పక్షపాతి!

    రిప్లయితొలగించండి
  7. అన్నదమ్ములఁ జూడగ నచ్చెరువగు
    నొక్కచోటనె పెరిగిరి యొద్దికగను
    కృష్ణ బలరాములను వారి కే బిరుదులు-
    పార్థసారథి, కౌరవ పక్షపాతి

    రిప్లయితొలగించండి

  8. పార్థసారథి పాండవ పక్షపాతి
    యెట్టు లాతడు రారాజు మట్టు పెట్టు
    గుట్టు రట్టును జేసె లేకున్న భీము
    డా సుయేధను నెనయునే యాజిలోన.

    రిప్లయితొలగించండి
  9. ధర్మ మెటువైపు నుండునొ దానుయు నటు
    వైపు నుండును దేవుడు వచ్చి ; కాడు
    పార్థసారథి కౌరవ పక్షపాతి
    వాని పక్షాన ధర్మము లేని కతన

    రిప్లయితొలగించండి
  10. సూతపుత్రుని హతమార్చువ్రేత వేయ
    మేటి యస్త్రము సంధించి మెరయు మికను
    పార్థ! సారథి కౌరవ పక్షపాతి
    గాడు శల్యుఁడు మనవాడు కలయఁ జూడ!

    రిప్లయితొలగించండి




  11. ధర్మమున్ గెలిపింపగా
    దలచి చేరి
    యచ్యుతుడు పాండవుల పక్షమందు నాయె
    పార్థసారథి ;కౌరవ పక్షపాతి
    యైననున్ బలదేవుండు యాత్రకేగె.


    రిప్లయితొలగించండి
  12. సమస్యకు వైవిధ్యంగా చక్కని పూరణలను చేసిన కవిమిత్రులు...
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    పండిత నేమాని వారికి,
    సుబ్బారావు గారికి,
    జిగురు సత్యనారాయణ గారికి,
    మారెళ్ళ వామన్ కుమార్ గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    గండూరి లక్ష్మినారాయణ గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    చంద్రశేఖర్ గారికి,
    కమనీయం గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. జిగురు సత్యనారాయణ గారూ,
    'కులంబుకు' అని ప్రయోగించరాదు. "కులంబునకు" అని ఉండాలి. అక్కడ "కురు కులంబునకును మేలు కోరువాఁడు" అందాం.
    *
    మారెళ్ళ వామన కుమార్ గారూ,
    "తాను + ఒక్కడె = తానొక్కడె" అవుతుంది. అక్కడ యడాగమం రాదు. "తా నొకండయి యొక్కరి దళమునందు" అందాం.
    *
    గండూరి వారూ,
    మీరు కౌరవపక్షపాతిని పాండవపక్షపాతిని చేసారు.
    *
    నాగరాజు రనీందర్ గారూ,
    తానుయు అనడం సరికాదు. అక్కడ "తానును నటు" అందాం.
    *
    కమనీయం గారూ,
    "యైన నా బలదేవుండు" అనండి.

    రిప్లయితొలగించండి
  14. డా.ప్రభల రామలక్ష్మిఆదివారం, ఫిబ్రవరి 17, 2013 8:33:00 AM

    పార్థసారధి కౌరవ పక్షపాతి
    గాదు ధర్మమునకు వెన్ను గాయదలచి
    పగ్గములబట్టె పార్ధుని పక్కకొచ్చి
    రక్ష చేసెను ధర్మజుపక్షమునకు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. ప్రభల రామలక్ష్మి గారూ,
      మంచి పూరణ. అభినందనలు.
      `ఒచ్చి` అన్నది గ్రామ్యం. అక్కడ "పార్థుని పక్కఁజేరి" అందాం.

      తొలగించండి
  15. డా.ప్రభల రామలక్ష్మిఆదివారం, ఫిబ్రవరి 17, 2013 11:49:00 AM

    శంకరార్యులకు ప్రణామములు,
    తమ సూచనను అనుసరించి చేసిన మార్పుతో ...........

    పార్థసారధి కౌరవ పక్షపాతి
    గాదు ధర్మమునకు వెన్ను గాయదలచి
    పగ్గములబట్టె పార్థుని పక్కఁజేరి
    రక్ష చేసెను ధర్మజుపక్షమునకు.

    రిప్లయితొలగించండి
  16. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మఆదివారం, ఫిబ్రవరి 17, 2013 12:43:00 PM

    పార్థసారధి కౌరవ పక్షపాతి
    సైంధవుని వధింప ప్రతిన సల్పగనట
    పార్థుని కరుణన్ కాచెను భ్రమపడంగ
    జేసి రవియస్తమింపగ చేసె మాయ.

    రిప్లయితొలగించండి



  17. శంకరార్యా, మీ సూచన మేరకు చివరిపాదాన్ని 'ఐన నా బలదేవుండు యాత్రకరిగె ' అని సవరిస్తున్నాను.--కమనీయం.

    రిప్లయితొలగించండి
  18. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    పార్థ సారథి :

    01)
    _______________________________

    పార్థ సారథి బావగా - పాండవులకు !
    పార్థ సారథి గురువు తా - పాండవులకు !
    పార్థ సారథి పరమాత్మ - పాండవులకు !
    పార్థ సారథి సర్వంబు - పాండవులకు !
    పార్థ సారథి , కౌరవ - పక్ష పాతి
    సార్థకము గలిగించ, కృ - తార్థులైరి
    పాండు భూపతి తనయులు - భండనమున!
    _______________________________
    కౌరవులు = కురువంశ సంజాతులు(పాండవులు)

    రిప్లయితొలగించండి
  19. యుద్ధమందున మరణించ యోధు లైన
    కౌరవుల పక్ష మందగ వీర స్వర్గ
    మట కురుక్షేత్ర కారక ఘటికుడైన
    పార్థ సారథి! కౌరవ పక్ష పాతి!

    రిప్లయితొలగించండి