13, ఫిబ్రవరి 2013, బుధవారం

పద్య రచన – 251

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

11 కామెంట్‌లు:

 1. నేతన్నల తల వ్రాతలు
  నే తప్పక మారుతుననునే ప్రతి విడతన్
  నేతలు పోటీ గెలువగ
  నే తల చాటుగను దాచు నిది న్యాయమ్మా?

  రిప్లయితొలగించండి

 2. భూతలమందు యంత్రముల పోకడ హెచ్చుగ పెచ్చులెచ్చెనే,
  నేతలు నేయువారి కళ నేడకటా! బహుమృగ్యమాయె, నీ
  రాతలు మారి పోయె మరి రయ్యన; నేమిక చేయగా దగున్?
  తాతల నాటి విద్యలను ధర్మమె యిట్టుల వీడి సాగగా?

  రిప్లయితొలగించండి
 3. చిత్ర మాయది చూడుడు నేత్ర పర్వ
  మాయె , నేతన్న యనుదిన మటుల గాను
  నేత చీ రలు ధో వతుల్ నేయు చుండు
  రంగు రంగుల దోడన రమ్య ముగను .

  రిప్లయితొలగించండి
 4. తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ.బుధవారం, ఫిబ్రవరి 13, 2013 5:19:00 PM

  పడుగు పేకల కలనేత పడతి చీర
  కట్ట మేనిసొగసు పెంచి కాంతులీను
  పడుగు పేకల బ్రతుకుల బడుగు జీవి
  జీవితంబున లేదొకో కాంతి సుంత.

  రిప్లయితొలగించండి
 5. లగ్నపు చీరల నేయ ని
  మగ్నంబగు సాలెవాని మచ్చుకు గనుమా !
  భగ్నము గాదతని ప్రతిన
  మగ్నము గాకుండు గాక ! మగ్గపు బ్రదుకుల్

  రిప్లయితొలగించండి
 6. రంగులు కలుపుచు చేలము
  హంగులతో నేసి నేసి యలసితి మేమే !
  బెంగలు తీరును మాకని
  నింగికి నిచ్చెనలు వేసి నీమము విడకన్ !

  రిప్లయితొలగించండి
 7. డా. ప్రభల రామలక్ష్మిబుధవారం, ఫిబ్రవరి 13, 2013 9:32:00 PM

  మగ్గమే కద జీవన మార్గమనుచు
  పడుగు పేకలు బాగుగ బరచుకొనుచు
  వస్త్రమందున చక్కని వన్నెలెన్నొ
  వేయువానికి బ్రతుకున వేడుకేది?

  నేతలవారికి సాయము
  చేతలలో చూపి ఋజువు చేయుట కొఱకై
  చేతులు జాపగ వచ్చిన
  నేతలనే రీతిగాను నెగ్గించుటయో?

  మగ్గము నేసెడి వారల
  కగ్గముగా మేలు చేసి అశ్రువులార్పన్
  పగ్గము పట్టెడి నాథుని
  తగ్గక మేమందరమును తండ్రిగ తలతుమ్.

  రిప్లయితొలగించండి
 8. నేత పనివారి పాటుల నెన్నగలమె
  వట్టిమాటలతోగాక గట్టిమేలు
  సలుపు నేతలు లేరైరి ;సకలజనులు
  వారు నేయు వస్త్రమ్ముల నేరికొనిన
  బడుగులైన వారి స్థితియు బాగుపడును.

  రిప్లయితొలగించండి
 9. ఈనాటి పద్యరచన శీర్షికకు చక్కని పద్యాలు రచించిన కవిమిత్రులు....
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  లక్ష్మీదేని గారికి,
  సుబ్బారావు గారికి,
  తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
  నాగరాజు రవీందర్ గారికి,
  రాజేశ్వరి అక్కయ్య గారికి,
  డా. ప్రభల రామలక్ష్మి గారికి,
  కమనీయం గారికి,
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 10. అమ్మా! రామలక్ష్మి గారూ! శుభాశీస్సులు.
  మీ 3 పద్యములు చక్కగా రాణించు చున్నవి. 3వ పద్యములో ఆఖరి పాదమును ఇలాగ మార్చుదాము:

  "తగ్గక తలచెదము మేము తండ్రికి వోలెన్"
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 11. డా. ప్రభల రామలక్ష్మిగురువారం, ఫిబ్రవరి 14, 2013 7:54:00 AM

  పూజనీయులు పండితులవారికి వందనములు,
  తమ సూచనకు నా కృతజ్ఞతలు. తమరు సూచించిన విధంగా మార్పు చేసి.....

  మగ్గము నేసెడి వారల
  కగ్గముగా మేలు చేసి అశ్రువులార్పన్
  పగ్గము పట్టెడి నాథుని
  తగ్గక తలచెదము మేము తండ్రికి వోలెన్.

  ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి