కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
పాపములనుఁ జేయువానిఁ బార్వతి మెచ్చున్.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
పాపములనుఁ జేయువానిఁ బార్వతి మెచ్చున్.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.
పాపముఁ జేయుచు మ్రొక్కిన
రిప్లయితొలగించండిపాపములను జేయు వాని పార్వతి మెచ్చున్!
యీపగిది తలంచియు ని
క్షేపముగ దురితముఁ జేయ శ్రీకరి యడచున్!
శంకరయ్య గారూ,
రిప్లయితొలగించండివరంగల్ శతావధాన వివరాలను బ్లాగులో ప్రకటిస్తామన్నారు. ఎప్పుడు ప్రకటిస్తారు?
తలప రాదెన్నడును పాపములను జేయు
రిప్లయితొలగించండివాని, పార్వతి మెచ్చున్ శుభమ్ములిచ్చు
సకల సద్గుణ రాశియై సాదరమున
యోగ సాధన జేయుచు నుండు వాని
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆ పువ్వులు గురిపెట్టుచు
రిప్లయితొలగించండిపాపములను జేయువాని పార్వతి మెచ్చున్
పాపము పంచాస్త్రుండును
తాపము బడ బేసికంటి దగ్ధుడు నయ్యెన్
రూప రహిత సర్వాంతర్
రిప్లయితొలగించండివ్యాపక తత్త్వమునకన్నియాకారములన్
రూపించుట పాపమైన
పాపములను జేయు వాని పార్వతి మెచ్చున్!
ఆపరమేశ్వరి దిక్కని
రిప్లయితొలగించండిరేపులు మాపులును పూజ, రిత్తగనవగా
అపదలును మసిజేయగ
పాపములను, జేయువాని పార్వతి మెచ్చున్
సహదేవుడు గారూ ! ఈ రోజు రెండు పూరణలలో మీరే ముందున్నారు. అభినందనలు.
రిప్లయితొలగించండిమూర్తిగారు,
రిప్లయితొలగించండిపువ్వులను గురిపెట్టే వానికి బాగానే గురిపెట్టారు. మంచి ఆలోచన , అమ్మవారు క్షమించినదాతడినే కదా!
పద్యము రెండవభాగములో అన్వయం సరిగ్గా కుదరలేదేమో అని అనిపిస్తున్నది.
రిప్లయితొలగించండిదీపము తానై వెలుగుచు
నా పరమేశ్వరి యొకింత యౌదార్యముతో,
పాపులను జంపుట యనెడు
పాపములనుఁ జేయువానిఁ బార్వతి మెచ్చున్.
పాపాల రావు గారనె
రిప్లయితొలగించండిపాపాలను జేయువాని ,బార్వతి మెచ్చున్
నేపాపము సేయ కుండ
మా పాలిట దేవ తంచు మాతను గొలువన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిలక్ష్మీదేవి గారూ ! ధన్యవాదములు. సవరించాను
రిప్లయితొలగించండిఆ పువ్వులు గురిపెట్టుచు
పాపములను జేయువాని పార్వతి మెచ్చున్
కోపముఁ గన ఫాలాక్షుడు
పాపము తా శిక్ష నొందె పంచశరుండున్ !
రిప్లయితొలగించండికాపురుషుండయి యెన్నియొ
పాపములను జేయువాని బార్వతి మెచ్చున్
శాపగ్రస్తుడు పశ్చా
త్తాపమ్మున మారి నడువ ధర్మనిరతితోన్.
ధన్యవాదములు,గురుదేవులకు పాదాబివందనములతో
రిప్లయితొలగించండిశ్రీ నేమాని పండితవర్యుల బాటలో నా చిన్ని ప్రయత్నము
ఆటవెలది / సీసము లలో
=======*=========
పాపములను జేయు వాని బార్వతి మెచ్చు
--- నని కలియుగ స్వామి యన్న,బల్కు
లు విని పరుగు బెట్టె లోకనాయకులెల్ల
----పాపములను జేయ వారి బంధు
వర్గములను బిల్చి ,పారిదోషకమును
---- బొందగలరు మీరు పురజనులను
పగలు రాత్రియనక ,వారు వీరనకను
---- చిత్ర హింసల గురి జేసి రమ్ము.
పాప భీతినొదలి ప్రభుతల తోడను
---- చెలిమి వలన గల్గు బలిమి మీకు
రక్త మందు రుచిని భక్తి తోడను గని
--- రెచ్చి పొండి దమరు హెచ్చు గాను |
పాపపు కర్మల నరసియు
రిప్లయితొలగించండిశ్రీపతి భువి నెవరికైన శిక్షల నిచ్చున్
ఆపదలయందు మ్రొక్కుచు
పాపములను జేయువాని పార్వతి మెచ్చున్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచేపల యెంగిలి మధుపపు
రిప్లయితొలగించండిత్రాపెంగిలి లేగదూడ త్రాగెంగిలియున్
పాపమిడ కాని పాపము
పాపములను జేయువాని పార్వతి మెచ్చున్.
పాపము జేయుచు తెలియక
రిప్లయితొలగించండిశాపములను పొందు చుంద్రు చాపల్యము నన్
కోపము వలదని తల్లిగ
పాపములను జేయు వాని పార్వతి మెచ్చెన్ !
రిప్లయితొలగించండిఆ పరమేశుడు మెచ్చడు
పాపములను జేయువాని ; పార్వతి మెచ్చున్
శ్రీపతినే వేడి శరణు
పాపము జేయని నరుడిని భక్తుని వానిన్
పాపము ! దయ జూప రెవరు
రిప్లయితొలగించండిపాపములను జేయు వాని ; పార్వతి మెచ్చున్
పాపిని సైతము పశ్చా
త్తాపము నొందుచును వాడె “తల్లీ !" యనగన్
“కోపము బూనెడు వానిని
రిప్లయితొలగించండిపాపములను జేయు వాని పార్వతి మెచ్చున్"
ఈ పలుకులు గావు నిజము
పాపములను జేయు వాని పార్వతి దునుమున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపుట్టి నింటికి వేడుక పూని జరుప
రిప్లయితొలగించండిపండుగ దినము నందరు వచ్చిరంత
భోజనంబున ఘృతపాపములను జేయు
వాని పార్వతి మెచ్చున్ సెబాసనుచును.
(ఘృతపు+ఆపములను (అపూపములను)
ఈనాటి సమస్యకు చక్కని పూరణలు చేసిన కవిమిత్రులు...
రిప్లయితొలగించండిసహదేవుడు గారికి,
పండిత నేమాని వారికి,
గన్నవరుపు నరసింహమూర్తి గారికి,
చంద్రమౌళి గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
లక్ష్మీదేవి గారికి,
సుబ్బారావు గారికి,
కమనీయం గారికి,
వరప్రసాద్ గారికి,
గండూరి లక్ష్మినారాయణ గారికి,
మిస్సన్న గారికి,
రాజేశ్వరి అక్కయ్య గారికి,
నాగరాజు రవీందర్ గారికి
అభినందనలు. ధన్యవాదాలు.
*
సహదేవుడు గారూ,
మూడవ పాదం ప్రారంభంలో యడాగమం వేసారు. వాక్య ప్రారంభం కనుక దానిని 'ఈ పగది' అని అచ్చుతో మొదలు పెట్టడంలో దోషం లేదు.
*
చంద్రమౌళి గారూ,
మూడవపాదం చినర 'పమైన' అని జగణం పడింది. అక్కడ "పాప మయిన" అంటే సరి.
*
సుబ్బారావు గారూ,
మూడవ పాదం చివర 'య కుండ' అని జగణం వేసారు. 'దేనత + అంచు = దేవత యంచు' అని యడాగమం వస్తుంది. అక్కడ సంధి లేదు. నా సవరణ...
ఏ పాపములను జేయక
మా పాలిట దేవత యని మాతను గొలువన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
రిప్లయితొలగించండివైవిధ్యంగా, చమత్కారంగా చెప్పాలన్న మీ ప్రయత్నం ప్రశంసనీయం. అభినందనలు.
'ఘృతపు + ఆపము" అన్నప్పుడు 'కర్మధారయమున ఉత్తున కచ్చు పరమైనపుడు టుగాగమ మగు' అన్న సూత్రం వలన ఘృతపుటాపము అవుతుంది. పేర్వాది శబ్దాలకు మాత్రం సంధి జరిగే అవకాశం ఉంది.
మార్చే అవకాశం లేనందున అలాగే ఉండనిద్దాము.
లోపములెంచకు నాయెడ
రిప్లయితొలగించండిపాపములను చేయనింక పార్వతిమాతా
కోపమువలదని కోరిన
పాపములను జేయు వాని పార్వతి మెచ్చున్"
శాపము నా విరహమ్మౌ
రిప్లయితొలగించండితాపము భరియింప లేక తప్పులనయ్యో!
పాపమని! దేవదాసును
పాపములనుఁ జేయువానిఁ బార్వతి మెచ్చున్
దాపుఁ గని దేవదాసుని
రిప్లయితొలగించండిశాపమ్మీ త్రాగుడనుచు సైచుచు నయ్యో
పాపమ్మని దయజూపుచు
పాపములనుఁ జేయువానిఁ బార్వతి మెచ్చున్