రథసప్తమి పర్వదినమును పురస్కరించుకొని
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు
అందించిన
సూర్యస్తోత్రము
ఆదిదేవాయ లోకాప్తాయ సూర్యాయ
దినకరాయ ఖగాయ తేనమోస్తు
వేదస్వరూపాయ బిసరుహమిత్రాయ
త్రిభువన సాక్షిణే తేనమోస్తు
ఏకచక్ర రథాయ లోకైకరక్షాయ
త్రివిధ తాపహరాయ తేనమోస్తు
బ్రహ్మవిష్ణీశ్వరత్రయ తత్త్వవిభవాయ
దేవసంస్తుత్యాయ తేనమోస్తు
పద్మినీ వల్లభాయ శోభాకరాయ
వైనతేయ ప్రచోదిత వాహనాయ
అరుణ కిరణాయ తిమిర సంఘాపహాయ
శ్రితజన హితాయ ప్రహితాయ తేనమోస్తు
మానవాళికి మేల్జేయ భాను డదియె
రిప్లయితొలగించండితూర్పు కొండల పైనెక్కి తొంగి జూచె
గెల్చి మందేహ దైత్యుల దాల్చె నతడు
మంచి సిందూర రుచి తాను మించ నింగి.
నమస్కారములు
రిప్లయితొలగించండిరధ సప్తమి పర్వ దినాన సూర్య స్తోత్రము నందించిన శ్రీ పండితుల వాదికి శిరసాభి వందనములు
సాధికార పదప్రయోగ పాండితీ ప్రకర్షకు నిలువెత్తు నిదర్శనము శ్రీ పండిత నేమాని వారు! ప్రతిదిన ప్రార్థనా రూపమున దినకరుని తెనుగు స్తోత్రము ప్రాచీన పద్యమను భావము స్ఫురించునట్లుగ వ్రాసిన గురువులు శ్రీ పండితుల వారికి శతాధిక వందనములు. చదివి నిక్షిప్తంచేసికునే భాగ్యం కల్గించిన శ్రీ శంకర గురువులకు నమస్సులు.
రిప్లయితొలగించండితిమిర హరణము చేయుచు తేరు నెక్కి
జీవ రాశుల కిచ్చును చేత నంబు
జీవ కర్మల సాక్షిగ చేతనంబు
నిచ్చి పాలించి బ్రోచువా డినుడు మనకు.
అరుణ కిరణు డ ! వినతుల నందు కొనుము
రిప్లయితొలగించండిలోక బాంధవ! దినకర ! లోక రక్ష!
తూర్పు పడమర లందు నీ తేరు తిరుగు
చుండి ,వెలుగులు బ్రస రించు చుండు నెపుడు .
అన్నయ్య గారికి నమస్సులు. మీరందించిన సూర్యస్తోత్రము నా సంధ్యావందనములో భాగమయింది.ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమూర్తిగారూ నమస్కారములు. గురువుగారి స్త్రోత్రానికా అర్హత యున్నది.
రిప్లయితొలగించండి2 పాదంలో టైపాటు సవరించుచు
జీవ రాశుల కిచ్చును జీవ నంబు
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ
విష్ణు ఈశ్వరాయ =విష్ణీశ్వరాయ అగునా ముద్రా స్ఖాలిత్యమా సరి చూడుడు .
రిప్లయితొలగించండిశ్రితజన హితాయ ప్రహితాయ తేనమోస్తు అను చోట యతి భంగమును సవరించుడు.
విష్ణీశ్వరాయ అనేది కచ్చితంగా టైపాటే అని నమ్ముతున్నాను.
రిప్లయితొలగించండిచివరిపాదాన్ని "త్రిభువన హితాయ ప్రహితాయ తే నమోస్తు" అంటే యతిదోషం తొలగిపోతుంది.