2, ఫిబ్రవరి 2013, శనివారం

సమస్యాపూరణం – 955 (హంస పాలను వీడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
హంస పాలను వీడుఁ దోయములఁ ద్రావు.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

19 కామెంట్‌లు:

 1. తత్త్వ విభవమ్ము మరచుచు, తనువులొంది,
  చెంది తాదాత్మ్య మంగాదులందు నాత్మ;
  తుఛ్ఛ సుఖముల గాంచు సంతుష్టి; నకట
  హంస పాలను వీడు, దోయముల ద్రావు

  రిప్లయితొలగించండి
 2. ఎన్నిమారులు చెప్పిన నేమి వినడు
  మంచి నెంచుచు చెడునేమొ త్రుంచ మనిన
  వదల డేమందు నిక నేను మదిని దలతు
  ' హంస పాలను, వీడుఁ దోయములఁ ద్రావు'

  రిప్లయితొలగించండి
 3. కలియు గమ్మున వింతలు కలవు మెండు
  దారు ణమ్ముగ చెలరేగె దనుజ సంతు
  పంచ భూతము లన్నియు మంచె కెక్కె
  హంస పాలను వీడు దో యముల ద్రావు

  రిప్లయితొలగించండి
 4. కంటిరెప్పగ పాలించు కన్న తల్లి
  సంతు శ్రేయస్సు గోరుట వింత యగునె
  కూన లాకొన వాత్సల్య మూని, జనని
  హంస పాలను వీడు దోయముల ద్రావు !

  రిప్లయితొలగించండి
 5. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మశనివారం, ఫిబ్రవరి 02, 2013 12:36:00 PM

  కలియుగంబున నన్నియు కల్తి కాగ
  ఖాద్య మైనను ద్రవమైన కాంచు మిచట
  శాస్త్ర విజ్ఞాన మనుచును సంచ రింప
  హంస పాలను వీడుఁ దోయములఁ ద్రావు.

  చిత్ర మైన రీతుల తోడ జీవ సృష్టి
  శాస్త్ర విజ్ఞాన క్లోనింగు చర్య లనుచు
  చేయ మారెస్వ ధర్మము జీవులందు
  హంస పాలను వీడుఁ దోయములఁ ద్రావు

  రిప్లయితొలగించండి
 6. మురిపెమున నొక యంచను ముద్దుజేసి
  పెంచు చుండగ మావాడు పోయుచుండె
  చూడ నేబోయి యచ్చట చూచి నాను
  హంస పాలను, “వీడుఁ” దోయములఁ ద్రావు

  రిప్లయితొలగించండి
 7. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మశనివారం, ఫిబ్రవరి 02, 2013 12:45:00 PM

  మురిపెమున నొక యంచను ముద్దుజేసి
  పెంచు చుండగ మావాడు పోయుచుండె
  చూడ నేబోయి యచ్చట చూచి నాను
  హంస పాలను, “వీడుఁ” దోయములఁ ద్రావు

  రిప్లయితొలగించండి
 8. యూరియా కాస్టికుల సోడ, ఉప్పు, నూనె
  సర్పు, సల్పేటు, వివిథ రసాయనములఁ
  జేసి సింథటిక్ పాలను పోసినంత
  హంస పాలను వీడుఁ దోయములఁ ద్రావు!!

  రిప్లయితొలగించండి
 9. మంచిని గ్రహించి చెడును త్య
  జించుము విషము వలె నెంచి యెప్పటి కైనన్
  కించిత్తు పొరబడక రా
  యంచలు క్షీరమును గ్రోలి వారిన్ విడచున్

  *********

  మనసు ముక్తి మార్గమ్మును మరచిపోయి
  ఐహిక సుఖముల నెపుడు నభిలషించు
  మరలుచుండును చిత్తము మంచి నుండి
  హంస పాలను వీడు, దోయముల ద్రావు


  క్షీరమును నీరమును హంస వేరుచేయు
  మంచి చెడులను మనము గుర్తించవలెను
  మనసు మర్కటము పగిది మాట వినదు
  హంస పాలను వీడు, దోయముల ద్రావు
  రిప్లయితొలగించండి
 10. డా. ప్రభల రామలక్ష్మిశనివారం, ఫిబ్రవరి 02, 2013 9:26:00 PM

  ఖగపు ధాటికి కూలిన ఖగము గాచి
  కోట చేరిన గౌతమ, కొమరు జూచి |
  "పట్టుకొనిరండు వేగమె పయము, పాలు
  హంస పాలను, వీడు తోయముల ద్రావు" ||
  అనిన మహారాజు మాటలు విని సేవకులు పరుగెత్తారు.
  ( ఖగము = బాణము, పక్షి ).

  రిప్లయితొలగించండి
 11. సమస్యకు చక్కని పూరణలను అందించిన కవిమిత్రులు....
  పండిత నేమాని వారికి,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  రాజేశ్వరి అక్కయ్య గారికి,
  గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
  తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
  జిగురు సత్యనారాయణ గారికి,
  నాగరాజు రవీందర్ గారికి,
  డా. ప్రభల రామలక్ష్మి గారికి
  అభినందనలు, ధన్యవాదాలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  'యంచలు క్షీరమును గ్రోలి వారిన్ విడచున్.... అన్నప్పుడు యతి తప్పింది. 'యంచలు క్షీరమును గ్రోలి యంబువుల విడున్' అందామా?


  రిప్లయితొలగించండి
 12. గురువు గారూ ! వందనములు. య-ర-ల-వ అనెడు అంతస్థములకు తమలో తాము పరస్పర యతిమైత్రి చెల్లునని సులక్షణ సారములో ఇవ్వబడినది. కాని మరోసారి చూస్తే మీరన్నట్లు ఇది అప్రశస్తము మరియు నగ్రాహ్యము. అప్పకవి కూడ దీనిని ఒప్పుకోక నగ్రాహ్య యతులలో చేర్చినాడు. సందేహ నివృత్తి చేసినందులకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 13. పాలు మాత్రమె దొరికెడు కాల మందు
  హంస తిరిగెడు చోటుకు నరిగి యొకడు
  పాత్ర ముందెట్ట కడుపార పట్టి త్రాగె
  హంస పాలను, వీడుఁ దోయములఁ ద్రావు

  రిప్లయితొలగించండి
 14. మంచి చేడుల మధ్య మహ సంగ్రమం
  రామరావణ యుధ్థం ధర్మం గెలవగా
  ద్రోపతి వస్త్రం లగీనావాడు అధోగతిపాలు
  హంస పాలను విడు దోయముల ద్రోవు

  రిప్లయితొలగించండి
 15. నాకు ఎమి రాదు తప్పలు వుంటే తెలియఙేయండి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కార్తిక్ గారూ,
   శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
   మీరు ముందుగా కొంత ఛందోనియమాలను తెలిసికొని పద్యాలను వ్రాయడం మొదలుపెడితే నేను, మిత్రులు మీకు పద్యరచనలో తోడ్పడగలము. స్వస్తి!

   తొలగించండి
 16. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 17. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి