సంపత్ గారు, మీ పూరణలో చిత్రజగతినన్ అను చోట చిత్రజగతినం అని ఒకటి, సాటెవ్వరమ్మ అను చోట యడాగమం రావాలి గావున "ధీటెవ్వరమ్మ" అంటే బాగుంటుందేమో పరిశీలించగలరు.
గతకాలపు నటీమణి కన్నాంబపై చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు... జిలేబీ గారికి, గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, సుబ్బారావు గారికి, సంపత్ కుమార్ శాస్త్రి గారికి, సహదేవుడు గారికి, తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి, రాజేశ్వరి అక్కయ్య గారికి, డా. ప్రభల రామలక్ష్మి గారికి అభినందనలు, ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిబొట్టు కాటుక ముకుపుడక
కనుదోయి లో కరుణ
పెదవుల పై చిరు నగవు
కరుణామయీ అంధ్ర వనిత !
జిలేబి.
జిలేబీ గారూ,
రిప్లయితొలగించండిఅభినందనలు. మీ భావానికి నా ఛందోరూపం.....
బొట్టు, కాటుక, ముకుపుడక, కందోయిలో
నవరసములు గురియు, నటులలోన
మేటియైన పసుపులేటి కన్నాంబకు
సాటి లేరు చిత్రజగతిలోన.
కన్నారా యియ్యంబను
రిప్లయితొలగించండివిన్నారా నాటి తరపు వెండితెరను తా
నెన్నో పాత్రలు వేసిన
కన్నాంబే యీమె కళల కన్నంబయ్యెన్.
కన్నాంబ ను జూ డంగ నె
రిప్లయితొలగించండిమిన్నందె ను సంత సంబు , మీ కును గాదా ?
యెన్నంగ నటన యామెది
మున్నెవ్వరు సాటి రారు మురిపెము లందున్ .
కన్నాంబను జూడగ నా
రిప్లయితొలగించండికన్నార్పగబోదు నటన కౌశలమున మీ
కన్నా చిత్రజగతినన్
దెన్నగ సాటెవ్వరమ్మ! యిప్పటికైనన్.
నటిగఁ గాక పాత్రె నడయాడె తెరపైన
రిప్లయితొలగించండికొన్ని హంగు లైన కూర్పు మెరయ
కట్టు బొట్టు లందు కన్నాంబ తీరైన
తెలుగు దనముఁగలిపి వెలిగె నాడు
సంపత్ గారు,
రిప్లయితొలగించండిమీ పూరణలో చిత్రజగతినన్ అను చోట చిత్రజగతినం అని ఒకటి, సాటెవ్వరమ్మ అను చోట యడాగమం రావాలి గావున "ధీటెవ్వరమ్మ" అంటే బాగుంటుందేమో పరిశీలించగలరు.
మాటవిరుపుల,యొరుపుల మంత్రమేసి
రిప్లయితొలగించండిహావభావ ప్రకటనల హాయిగొలుపు,
తనకుతానె సాటియగుచు తరలిపోయె
ఘనచరిత చిత్ర కన్నాంబ కాంతుమిచట.
కన్నాంబ వంటి తల్లిని
రిప్లయితొలగించండియెన్నగ నేడెవరి తరము నెవ్విధి నైనన్ !
సన్నుతి పొందగ చిత్రము
మన్నన లందించ మనకు మరియాద కదా ?
చిత్ర జగతిలోని చిత్రమును జూడగ
రిప్లయితొలగించండిచిత్ర గతిగనేలె చిత్రజగతి
కన్నె కాదనుచును కన్నాంబయేనన
అనుపమానమాయె నామె నటన.
గతకాలపు నటీమణి కన్నాంబపై చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు...
రిప్లయితొలగించండిజిలేబీ గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
సుబ్బారావు గారికి,
సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
సహదేవుడు గారికి,
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
రాజేశ్వరి అక్కయ్య గారికి,
డా. ప్రభల రామలక్ష్మి గారికి
అభినందనలు, ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిపూర్ణ శారద చంద్రుని బోలు ముఖము,
నవరసమ్ముల నవలీల నటన జూపు
నట్టి కన్నాంబ చలచిత్ర నటి కనంగ
నేటికిన్నెవరైనను సాటికలరె.