8, ఫిబ్రవరి 2013, శుక్రవారం

సమస్యాపూరణం – 960 (మూడు ముక్కలాట)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
మూడు ముక్క లాట  ముక్తి నొసఁగు.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదములు.

29 కామెంట్‌లు:



  1. ఇహముఁ బరముఁ గలిపి యీశ్వరు గృపఁ బంచి
    పట్టు ముక్క లందు బ్రహ్మ ముంచి
    వేయు నపుడు మీరు వెన్నుడి కిత్తురే
    మూడు ముక్క లాట ముక్తి నొసఁగు !

    రిప్లయితొలగించండి
  2. హరిని భక్తి దలచి హరియించి దురితముల్
    పట్టి రేని బ్రహ్మ గట్టిగాను
    పరము తిరముగ గని హరు గొల్చి మసలిరా
    మూడు ముక్క లాట ముక్తి నొసఁగు !

    రిప్లయితొలగించండి
  3. మూడు ముక్కలివ్వి, మోహనాశనముయు
    ధర్మవర్తనమ్ము తల్లి లలిత
    పైన ధ్యాస, నరుడు పరగు జీవనక్రీడ
    మూడు ముక్క లాట ముక్తి నొసఁగు !

    రిప్లయితొలగించండి
  4. మూ డు ముక్క లాట ముక్తి నొసగు నన
    మంచి వారు కూ డ మంది గూడి
    మూడు ముక్క లాట లాడ జూతురు గద
    మంచి యుండ దెవరి మనసు లోన .

    రిప్లయితొలగించండి
  5. గురుదేవులకు,శ్రీ నేమాని పండితవర్యులకు పాదాబివందనములతో
    =======*========
    మూడు లోకములకు మోక్ష ప్రదాయిని
    మూడు ముక్క లాట,ముక్తి నొసగు
    మూడు గుణముల జను లాడ భువిని నేడు
    మూడు పూటలు దమ పొరుగు మరచి

    రిప్లయితొలగించండి
  6. ప్రయాగ శ్రీరామచంద్రమూర్తిశుక్రవారం, ఫిబ్రవరి 08, 2013 2:18:00 PM


    జపము తపము వలన జాగారమగు గాని
    నిదుర-లేమి ఫలము నివ్వ లేదు
    ఆట పాట తోనె సాధ్యమది యయిన
    మూడు ముక్క లాట ముక్తి నొసఁగు.

    రిప్లయితొలగించండి
  7. పట్టువిడుపుజూచి భక్తిభావములెంచి
    నిర్ణయములదేవునికినొసంగి
    సర్వకార్యకర్త శర్వుండనెఱిగిన
    మూడు ముక్కలాట ముక్తి నొసఁగు.

    శర్వుండు + అని + ఎఱిగిన

    రిప్లయితొలగించండి
  8. కల్లు త్రాగ నేర్పు నిల్లును చెడగొట్టు,
    "మూడు ముక్కలాట ముక్తి నొసగు"
    ననుట మూర్ఖ వాద నౌనుగాకేముంది
    తెలిసి నడుచు కొనుము తెలుగు బిడ్డ.

    రిప్లయితొలగించండి
  9. మూడు ముక్కలయ్యె మున్ను బ్రహ్మాండంబు
    స్వర్గ నరక భూమి సంజ్ఞలొప్ప
    అందు జీవు డాడ నంత్యాన వానికా
    మూడు ముక్కలాట ముక్తి నొసగు

    రిప్లయితొలగించండి
  10. పుట్టు గిట్టు నడుమ పుణ్య వర్తన తోటి
    జీవి యాట యాడ శ్రేయ మదియె
    కర్మలకిట కర్త కాదు నేనని యాడు
    మూడు ముక్క లాట ముక్తి నొసగు
    (పుట్టుట, పుణ్యవర్తన, గిట్టుట మూడు ముక్కలన్న భావంతో)

    రిప్లయితొలగించండి
  11. పుట్టు గిట్టు నడుమ పుణ్య వర్తన తోటి
    జీవి యాట యాడ శ్రేయ మదియె
    కర్మలకిట కర్త కాదు నేనని యాడు
    మూడు ముక్క లాట ముక్తి నొసగు
    (పుట్టుట, పుణ్యవర్తన, గిట్టుట మూడు ముక్కలన్న భావంతో)

    రిప్లయితొలగించండి
  12. పుట్టు గిట్టు నడుమ పుణ్య వర్తన తోటి
    జీవి యాట యాడ శ్రేయ మదియె
    కర్మలకిట కర్త కాదు నేనని యాడు
    మూడు ముక్క లాట ముక్తి నొసగు
    (పుట్టుట, పుణ్యవర్తన, గిట్టుట మూడు ముక్కలన్న భావంతో)

    రిప్లయితొలగించండి
  13. పుట్టు గిట్టు నడుమ పుణ్య వర్తన తోటి
    జీవి యాట యాడ శ్రేయ మదియె
    కర్మలకిట కర్త కాదు నేనని యాడు
    మూడు ముక్క లాట ముక్తి నొసగు
    (పుట్టుట, పుణ్యవర్తన, గిట్టుట మూడు ముక్కలన్న భావంతో)

    రిప్లయితొలగించండి
  14. పుట్టు గిట్టు నడుమ పుణ్య వర్తన తోటి
    జీవి యాట యాడ శ్రేయ మదియె
    కర్మలకిట కర్త కాదు నేనని యాడు
    మూడు ముక్క లాట ముక్తి నొసగు
    (పుట్టుట, పుణ్యవర్తన, గిట్టుట మూడు ముక్కలన్న భావంతో)

    రిప్లయితొలగించండి
  15. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మశుక్రవారం, ఫిబ్రవరి 08, 2013 7:00:00 PM

    జనన మరణ కాలచక్ర గతులయందు
    కర్మ చేయవలయు కర్త యగుచు
    పాప పుణ్య లయపు ఫలితమగుచునున్న
    మూడుముక్కలాట ముక్తి నొసగు.

    రిప్లయితొలగించండి
  16. పండిత నేమానివారి పూరణ చాలా ప్రశస్తంగా ఉంది.
    సహదేవుడు గారు పదే పదే అదే పద్యం పోష్టు చేసారు పొరబాటున. వారు తోటికి బదులుగా‌ తోడి అని ఉంటే బాగుండేది.

    రిప్లయితొలగించండి
  17. మూడు ముళ్ళు నమ్మి ముదముగ నీ చెంత
    తోడు నీడై యుండు తోయ జాక్షి
    సతిని మరచి తుదకు సంకట పడినంత
    మూడు ముక్క లాట ముక్తి నొసగు !

    రిప్లయితొలగించండి

  18. ఇంటి పోరు నుండి, యిక్కట్లు ముసిరిన
    కొలువు నుండి, వాడ గోల నుండి
    కలసి మిత్రులాడు గంటమాత్రమయిన
    మూడు ముక్క లాట ముక్తి నొసఁగు !

    రిప్లయితొలగించండి
  19. మూడు జగము లందు ముక్తి కోరుట కన్న
    భక్తి లేక నేమి రక్తి గలుగు
    యుక్తి గలిగి చెనటి యోగ మాయను మించి
    మూడు ముక్కలాట ముక్తి నొసగు

    రిప్లయితొలగించండి
  20. డా. ప్రభల రామలక్ష్మిశుక్రవారం, ఫిబ్రవరి 08, 2013 10:22:00 PM

    జీవుడలసిపోయి జీవితమ్మును రోసి
    ప్రాకులాడుటొట్టి భ్రాంతి యనుచు
    వలదు మరల జన్మ వలదని తలచగ
    మూడు ముక్కలాట ముక్తి నొసగు.

    రిప్లయితొలగించండి
  21. ఆసు గోర నేల హరియె దరిని యుండ
    రాజశేఖరుండె రాజు నాకు
    మూడు సంధ్యలందు ముదము నమ్మను బిల్తు
    మూడు ముక్క లాట ముక్తి నొసఁగు.

    రిప్లయితొలగించండి
  22. ఊకదంపుడు గారూ, అదరగొట్టారు గదా! మీ ఇంట్లో ఈ పద్యం చదివి వినిపించారాలేదా అని డౌటు! తస్మాత్ జాగ్రత!

    రిప్లయితొలగించండి
  23. ఊక దంపుడు గారి ధైర్యానికి హాట్సాఫ్ ! చంద్ర శేఖర్ గారూ ! ధైర్యే సాహసే లక్ష్మి

    రిప్లయితొలగించండి
  24. మూడుముక్కలాటపై ముచ్చటైన పూరణలు చెప్పి అలరించిన కవిమిత్రులు...
    గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    సుబ్బారావు గారికి,
    వరప్రసాద్ గారికి,
    ప్రయాగ శ్రీరామచంద్రమూర్తి గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    గండూరి లక్ష్మినారాయణ గారికి,
    పండిత నేమాని గారికి,
    సహదేవుడు గారికి,
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
    శ్యామలీయం గారికి,
    రాజేశ్వరి అక్కయ్య గారికి,
    రామకృష్ణ గారికి,
    డా. ప్రభల రామలక్ష్మి గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.



    రిప్లయితొలగించండి
  25. గోలి వారూ,
    నాశనముయు ... అన్నారు.. నాశనమును అనాలి.
    *
    శ్రీరామచంద్రమూర్తి గారూ,
    జాగారము.. వ్యావహారిక పదం... అక్కడ 'జాగరణమె గాని' అందామా?
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    'అని + ఎఱిగిన = అని యెఱిగిన' అవుతుంది. సంధి లేదు.
    'శర్వుండని యెఱుగ' అందాం.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    రెండవ పాదంలో గణదోషం...
    తోడు నీడగ మను... అందాం...
    *
    డా. ప్రభల రామలక్ష్మి గారూ,
    'ఒట్టి' గ్రామ్యం... ప్రాకులాడ వట్టి... అందాం.

    రిప్లయితొలగించండి
  26. డా. ప్రభల రామలక్ష్మిఆదివారం, ఫిబ్రవరి 10, 2013 9:53:00 AM

    శంకరార్య! మీ సూచనకు ధన్యవాదములు. సవరించిన పిదప....
    జీవుడలసిపోయి జీవితమ్మును రోసి
    ప్రాకులాడ వట్టి భ్రాంతి యనుచు
    వలదు మరల జన్మ వలదని తలచగ
    మూడు ముక్కలాట ముక్తి నొసగు.

    రిప్లయితొలగించండి
  27. 'రామ' 'రామ' 'రామ' రమ్యమౌ నామమ్ము
    'కృష్ణ' 'కృష్ణ' 'కృష్ణ' కీర్తనమ్ము
    మూడు పూటలందు ముమ్మారు పఠియింప
    మూడు ముక్కలాట ముక్తినొసగు

    రిప్లయితొలగించండి




  28. అర్థ ధర్మ కామమను మూడు పురుషార్థ
    ములను నియతితోడ మోదమలర
    విధుల జక్కగ నెర వేర్చ మానవునకు
    మూడు ముక్కలాట ముక్తినొసగు.

    రిప్లయితొలగించండి