5, ఫిబ్రవరి 2013, మంగళవారం

సమస్యాపూరణం – 958 (ఖర గానమె మెప్పులొందె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
ఖర గానమె మెప్పులొందె గాయక సభలో
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

31 కామెంట్‌లు:

 1. స్వర మాధుర్యము మంగళ
  కర భావము రాగ తాళ కలితమునౌ శ్రీ
  కర రసమయ గాయక శే
  ఖర గానమె మెప్పులొందె గాయక సభలో

  రిప్లయితొలగించండి
 2. బిరుదము నొందెను 'నట శే
  ఖరు ' డని తానొక్క నటుడు కానీ యొకచో
  సరసంబుగ పాడగ "శే
  ఖర" గానమె మెప్పులొందె గాయక సభలో.

  రిప్లయితొలగించండి
 3. బిరుదములు బొందు వారలు
  సరగున బాడంగ సభను శాస్త్రోక్త ముగా
  సరసము గలిగిన యా శే
  ఖర గానమె మెప్పు లొందె గాయక సభలో .

  రిప్లయితొలగించండి
 4. గురువు గారికి ధన్యవాదములు .గురుదేవులకు,శ్రీ నేమాని పండితవర్యులకు పాదాబివందనములతో
  =====*=======
  వరముల నొందిన ఖరములు
  స్వర కర్తలు తెలుగు నాట,వారి స్వరగతుల్
  పరిధిని మించగ ,జనులనె
  ఖర గానమె మెప్పు లొందె గాయక సభలో |

  రిప్లయితొలగించండి
 5. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మమంగళవారం, ఫిబ్రవరి 05, 2013 2:13:00 PM

  వర ఘంటసాల యట శం
  కరమఠమందున కచేరి గావింపగనా
  ఖరహర ప్రియగాయక శే
  ఖర గానమె మెప్పులొందె గాయక సభలో

  రిప్లయితొలగించండి
 6. ప్రయాగ శ్రీరామచంద్రమూర్తిమంగళవారం, ఫిబ్రవరి 05, 2013 3:42:00 PM

  మరియాద తెలియని ఖలులు
  పరిహాసమునకు పరులను పెద్దలఁ ధూషిం
  తురు మిగుల ఘనమని దలచి
  ఖర గానమె మెప్పులొందె గాయక సభలో

  రిప్లయితొలగించండి
 7. శ్రీ గురువులకు, శ్రీ శంకరయ్యగారికి,
  పెద్దలకు ప్రణామములు !

  సురనిర్ఝరవరసరణుల
  నిరుపమసంగీతభంగి నింగి నొలయు శ్రీ
  కర పుట్టపర్తి కవిశే
  ఖర గానమె మెప్పులొందె గాయకసభలో.

  విధేయుఁడు,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 8. శ్రీ గురుభ్యోనమ:


  గానకోవిదులు గంగా నదితీరములో సంగీతకచ్చేరి జరుపగా, గంగా నది శబ్దతరంగాలే మిన్నగా తోచాయనే భావనలో.....

  వరగానకోవిదులున
  ప్సరసాన్నిధ్యమున జరుపు సంగీతవిభా
  వరి యందుఁ జూడ హరశే
  ఖర గానమె మెప్పులొందె గాయక సభలో.

  హరశేఖర = గంగా నది యొక్క

  రిప్లయితొలగించండి
 9. సరసాద్భుత గానామృత
  మరుదగు సంస్కార సరణి హర్షదమగు శ్రీ
  కర కర్ణాటక సంగీత శి
  ఖర గానమె మెప్పులొందె గాయక సభలో

  రిప్లయితొలగించండి
 10. ఏల్చూరి గారి పద్యము బాగున్నది ,

  నేమాని గారి క్రొత్త పద్యము బాగానే ఉంది కానీ మూడవ పాదములో కించిత్తు గణ భంగము.

  ప్రయాగ శ్రీరామచంద్రమూర్తిగారి పద్యములోనూ రెండవ పాదములో యతి లేదు.

  రిప్లయితొలగించండి
 11. స్వరరాగ సుధలు చిందగ
  హరిస్తుతిని ముకుందమాల ననువుగ పాడన్
  హరిదా సాళ్వార్ కులశే
  ఖర గానమె మెప్పులొందె గాయక సభలో

  రిప్లయితొలగించండి
 12. డా. ప్రభల రామలక్ష్మిమంగళవారం, ఫిబ్రవరి 05, 2013 7:08:00 PM

  గతంలో కీ.శే.పద్మనాభంగారు నిర్మించి, నటించిన ఒక చిత్రంలో"దయచూపవే గాడిద" అను పాటను "పాడుతా తీయగా" ఈ టీవి కార్యక్రమంలో ప్రవీణ్ అనే అబ్బాయి పాడి బాలు గారి మెప్పును పొందాడు.
  కం|| కరములు కంఠము నంటగ
  కరుణించుము నన్నునీవు గార్దభ రాజా
  కరములు గట్టిన కవిశే
  ఖర గానమె మెప్పు పొందె గాయక సభలో

  రిప్లయితొలగించండి
 13. డా. ప్రభల రామలక్ష్మిమంగళవారం, ఫిబ్రవరి 05, 2013 7:12:00 PM

  సవరణతొ...
  కరములు కంఠము నంటగ
  కరుణించుము నన్నునీవు గార్దభ రాజా
  కరుణించుమనుచు పాడిన
  ఖర గానమె మెప్పు పొందె గాయక సభలో

  రిప్లయితొలగించండి
 14. డా. ప్రభల రామలక్ష్మిమంగళవారం, ఫిబ్రవరి 05, 2013 7:28:00 PM

  కరమును గట్టుమిపుడనగ
  కరవాయెను రామదాసు కరమున కానీ(Money)
  కరములు గట్టిన కవిశే
  ఖర గానమె మెప్పుపొందె గాయక సభలో.
  (కరము= Tax)

  రిప్లయితొలగించండి
 15. ప్రియ గానమే మెప్పులొందె ప్రణయ వేదిక లో
  హర గానమే మెప్పులొందె ప్రియురాలి సపర్యలో
  గానా బజానా పరిష్వంగం లో ఖరాబాత్ న
  ఖర గానమె మెప్పులొందె గాయక సభలో !


  జిలేబి.

  రిప్లయితొలగించండి
 16. అజ్ఞాత గారు గుర్తు చేసేరు - శుభాశీస్సులు.
  ఎవ్వరికైనను పరిష్కర్తలు కావాలి అంటారు ఆర్యులు.
  3వ పాదమును మార్చుతూ చెప్పిన పద్యము:

  సరసాద్భుత గానామృత
  మరుదగు సంస్కార సరణి హర్షదమగు శ్రీ
  కర కర్ణాటక భవ్య శి
  ఖర గానమె మెప్పులొందె గాయక సభలో.

  రిప్లయితొలగించండి
 17. ఖరహరప్రియ రాగములో
  స్వరలయ తాళమున పాట సాగుచు నుండన్
  మురళీరవ గాయక శే
  ఖర గానమె మెప్పులొందె గాయక సభలో

  రిప్లయితొలగించండి
 18. నిరతము లోపము నెంచుచు
  పర దూషణ ఘనత యంచు పరిహాసమునన్ !
  నరవానర కొలువు కూటమి
  ఖ ర గానమె మెప్పు బొందె గాయక సభలో !

  రిప్లయితొలగించండి
 19. వరుణుడు వాయువు రవి హిమ
  కరులు సురపతి సభయందు గానము చేయన్
  కరతాళముల నడుమ ఖర
  ఖర గానమె మెప్పులొందె గాయక సభలో

  రిప్లయితొలగించండి
 20. గురువులకు, పెద్దలకు, కవి మిత్ర బృందానికీ నమస్కారములు. ఉద్యోగ రీత్యా యలమంచిలి నుంచి విశాఖ పట్నమునకు బదిలీ అయింది. బహుశా ఇది ఉద్యోగంలో చివరి మజిలీ కావచ్చును.ఈ రోజే అంతర్జాలపు అనుసంధానము జరిగింది. ఇన్నినాళ్ళూ అందరికీ దూరం కావడం వెలితిగా ఉన్నది. మరలా అందరితోబాటూ శంకరా భరణంలో పాల్గొనడానికి ప్రయత్నిస్తాను.

  రిప్లయితొలగించండి
 21. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మమంగళవారం, ఫిబ్రవరి 05, 2013 9:46:00 PM

  మిస్సన్నగారూ! వెలితి మీకేకాదు మాకూ అనిపించింది. చాల ఆనందంగా ఉంది ఈస్రవంతి లో మరల మీరు అనుసంధానమగుచున్నందులకు.స్వాగతం.

  రిప్లయితొలగించండి
 22. మిస్సన్నగారూ!మీకు మా ఆనందస్వాగతం.

  రిప్లయితొలగించండి
 23. యతి సవరణతో ...

  మరియాద తెలియని ఖలులు
  పరులను ధూషించుట పొరపాటని ఊహిం
  చరు మిగుల ఘనమని దలచి
  ఖర గానమె మెప్పులొందె గాయక సభలో

  రిప్లయితొలగించండి
 24. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  పూర్వం బహిరంగ వేలము వేసే రోజుల్లో :

  01)
  _______________________________

  తిరుమల తిరుపతి పురమున
  కురులకు వేలము నెరిపిన - కొందరి లోనన్
  కరతాళ రవము లెగయగ
  ఖర గానమె మెప్పు నొందె - గాయక సభలో
  _______________________________
  ఖర = వాడియైన (హెచ్చుగాపలికిన)
  గానము = పాట (వేలము పాట)

  రిప్లయితొలగించండి
 25. కవిమిత్రులకు నమస్కృతులు...
  నిన్నకూడా ప్రయాణంలో ఉండి మిత్రుల పూరణలను, పద్యాలను చూచే అవకాశం దొరకలేదు. మన్నించాలి....
  ఈ సమస్యకు చక్కని పూరణలు చేసిన కవిమిత్రులు...
  పండిత నేమాని వారికి,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  సుబ్బారావు గారికి,
  వరప్రసాద్ గారికి,
  తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
  ప్రయాగ శ్రీరామచంద్రమూర్తి గారికి,
  ఏల్చూరి మురళీధరరావు గారికి,
  సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
  నాగరాజు రవీందర్ గారికి,
  డా. ప్రభల రామలక్ష్మి గారికి,
  రాజేశ్వరి అక్కయ్య గారికి,
  వసంత కిశోర్ గారికి
  అభినందనలు, ధన్యవాదాలు.
  *
  మిస్సన్న గారూ,
  సంతోషం...
  *
  అజ్ఞాత గారూ,
  ధన్యవాదాలు.
  *
  జిలేబీ గారూ,
  అభినందనలు.


  రిప్లయితొలగించండి
 26. ధరగల రాగామృత ఘన
  చరితులు గాంధర్వగాన చతురులు పాడన్
  సురటీ రాగోత్తమ శే
  ఖర గానమె మెప్పు లొందె గాయక సభలో .

  రిప్లయితొలగించండి
 27. పురమందు నిన్న ఘనముగ
  జరిగిన సంగీతసభను జనముల రసికుల్
  కరము మురియ ,గాయకశే
  ఖరగానమె మెప్పులొందె గాయకసభలో .

  రిప్లయితొలగించండి
 28. తోపెల్లవారూ! అజ్ఞాత గారూ ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 29. పరవశముగ లోకసభన
  నరవరుడా యౌవ్వనుండు నవ్వుల పాలై
  కరతాళము లొప్పించెడి
  ఖర గానమె మెప్పులొందె గాయక సభలో

  రిప్లయితొలగించండి
 30. బరువగు వంగల భామలు
  దరువులతో పాట పాడ దారుణ రీతిన్
  జొరబడి రయమున దూరిన
  ఖర గానమె మెప్పులొందె గాయక సభలో

  రిప్లయితొలగించండి