11, అక్టోబర్ 2013, శుక్రవారం

సమస్యాపూరణం – 1201 (తలఁ దొలఁగించిన నిడుములు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
తలఁ దొలఁగించిన నిడుములు దప్పు జనులకున్.
ఈ సమస్యను సూవించిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదములు.

21 కామెంట్‌లు:

  1. తలలేని పనులతో కల
    తలనే జనమందు పెంచి తన్నుక జచ్చే
    తలపులు గలిగిం ' చెడు ' నే
    తలఁ దొలఁగించిన నిడుములు దప్పు జనులకున్.

    రిప్లయితొలగించండి
  2. పండుగకు మా అమ్మాయి యింటికి వెళ్తున్నాను. మూడు రోజులు బ్లాగుకు అందుబాటులో ఉండక పోవచ్చు. సమస్యలను, పద్యరచనాంశాలను షెడ్యూల్ చేస్తున్నాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  3. అయ్యా! శ్రీ హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
    మీ పూరణ బాగుగ నున్నది. కానీ నేతలను తొలగించే ధైర్యము గాని విధానము గాని ఎక్కడ? స్వస్తి.

    రిప్లయితొలగించండి
  4. శ్రీగురుభ్యోనమ:

    కులమత భావము జూపక
    పలువురకున్ సాయబడుచు పలువిధములుగా
    నలసిన వంచితులకును వె
    తలఁ దొలఁగించిన నిడుములు దప్పు జనులకున్.

    రిప్లయితొలగించండి
  5. వలచియు సత్యము ధర్మము
    నిలుపఁగఁ దలఁచియు మనమ్ము నిలిపి చెడు తలం
    పులఁ జెడు పలుకులఁ జెడు నడ
    తలఁ దొలఁగించిన నిడుములు దప్పు జనులకున్!

    రిప్లయితొలగించండి
  6. శ్రీగురుభ్యోనమ:

    కలతలు గండము బాధలు
    కలుగును మరలునుసహజముగనుజీవితమం
    దిలవేల్పు నమ్ముకొని చిం
    తల తొలగించిన నిడుములు తప్పుజనులకున్

    రిప్లయితొలగించండి
  7. కలిలో మహిషాసురులన్
    దలపించెడు వారు గలరు, దయతో పిలువన్
    బలికే దుర్గా! వారల
    తలఁ దొలఁగించిన నిడుములు దప్పు జనులకున్

    రిప్లయితొలగించండి
  8. పలువిధముల కష్టములకు
    తలపే కారణమటంచుఁ దలచెడు జనులా
    వల కళ్ళకుఁ గట్టిన గం
    తలఁ తొలఁగించిన నిడుములు దప్పు జనులకున్.

    రిప్లయితొలగించండి
  9. తలపెట్టు సమ్మెల వలన
    వెలుగక దీపాలు జనులు విలవిల లాడన్
    మెలమెల్లగా కరెంట్ కో
    తల దొలగించిన నిడుములు దప్పు జనులకున్

    రిప్లయితొలగించండి

  10. ఇలలో చింత వలన వెత
    కలలోనైనను తొలగదు; కనుక సదా చిం
    తలఁ జేయగ దగునే? చిం
    తలఁ దొలఁగించిన నిడుములు దప్పు జనులకున్.

    రిప్లయితొలగించండి

  11. ఇల గజముఖుడౌ గణపతి
    తలదొలగించిన,నిడుములుదప్పు జనులకున్
    తలుపులయమ్మను గొలిచిన
    ఇలవేలుపుమాకుగాన నిచ్చునుశుభముల్

    రిప్లయితొలగించండి
  12. చిలవలు పలవలు జేర్చుచు
    పలు విధములుపన్యసించి ప్రాజ్ఞుల మనముల్
    కలుషిత పరచెడు పలు నే
    తల దొలగించిన నిడుములు దప్పు జనులకున్.

    రిప్లయితొలగించండి
  13. పలు మార్లు బాగు జేసిన
    నెలవాయెను రోడ్డులన్ని నిష్కుహముల కా
    తలమున వెళ్ళుటకై గుం
    తల దొలగించిన నిడుములు దప్పు జనులకున్

    రిప్లయితొలగించండి
  14. మిత్రులారా! శుభాశీస్సులు. ఈ నాటి సమస్యకు భావ వైవిధ్యముతో చక్కని పూరణలను అందరు పంపేరు. అందరికీ అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. శిలలను, సుందర విగ్రహ
    ముల, గోడల రూపు మాపు మూఢ మతుల చే
    తలు, వాటిపై వెకిలి వ్రా
    తల దొలగించిన నిడుములు దప్పు జనులకున్

    రిప్లయితొలగించండి
  16. కలకలము రేపుచుండెను
    చెలరేగెడి ధరలు బడుగు జీవుల మదిలో
    చలియించని పాలక నే
    తల తొలగించిన నిడుములు దప్పు జనులకున్

    రిప్లయితొలగించండి
  17. కలతలు బాధలు నిరతము
    కలియుగమున జనులకెల్ల కాతర బెట్టన్
    చిలువలు వలువలయిన చిం
    తల దొలగించిన నిడుములు దప్పు జనులకున్

    రిప్లయితొలగించండి
  18. కొలతలు జేయుచు ధనమును
    చిలువలు పలువల తలపులు చింతలు జేయన్
    కలతలు దీర్చుచు తమ నల
    తలఁ దొలఁగించిన నిడుములు దప్పు జనులకున్

    రిప్లయితొలగించండి


  19. ఇలలో జిలేబి మనుజుల
    కులాభ ములజేర్చు పనుల గూర్చి దొరలటన్
    పలువిధ కష్టములను కల
    తలఁ దొలఁగించిన నిడుములు దప్పు జనులకున్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  20. మిలమిల లాడగ భాజప
    కలతలు మీరగ గజగజ కంపము తోడన్
    వలవల నేడ్చెడి కాంగ్రెసు
    తలఁ దొలఁగించిన నిడుములు దప్పు జనులకున్

    రిప్లయితొలగించండి