కరము నొప్పిబుట్ట కరకర లాడించు నోట వేసి తిండి పూట పూటనేడు ముట్టడాయె నిమ్మరసమ్మును కడుపునొప్పి యనుచుఁ, గరము మురిసె.
నెత్తియుండిననదినెప్పి పుట్టుచునుండుపొట్టయున్నవచ్చు పొట్టనెప్పిలేవివేవి నాకు రావుయే తలనొప్పికడుపునొప్పు లనుచు కరము మురిసె!
చాలు చాలు నయ్య చాలు నీ చెణుకులుగొప్ప వాడవయ్య కుప్పు స్వామినవ్వి నవ్వి చూడు నాకైన దయ్యయోకడుపునొప్పి యనుచుఁ గరము మురిసె.
ఫద్మ యీదినంబు పనికిరాలేదుగకడుపు నొప్పియనుచు,కరము మురిసెకనకదుర్గ తాను కనినకలనుగూర్చిఅభయ హస్త మిచ్చె నంబ కలను
పండిత నేమానిగారికి గురుదేవులు శంకరయ్యగారికి వందనములుమాయ నొప్పి కాదు మ౦దుకులొంగదు పురిటి శాల కేగు త్వరిత మనుచు తల్లి పలుక వినిన తనయ బాధను మరచి కడుపునొప్పి యనుచు గరము మురిసె
మిక్కుటంబుగాను మెక్కి యొక్కడరచె కడుపునొప్పి యనుచు, కరము మురిసె నెంత కాల మాయె సుంతైన విశ్రాంతి లేక నేడు కలిగె నాక టంచు .
శ్రీగురుభ్యోనమ:కడుపు నొప్పి యనుచుఁ గరము మురిసెగాని జ్వరము వచ్చెననుచు వైద్యుడపుడుసూదిపొడిచినంత చురచుర భుజముపైనొప్పి నోర్వలేక నోరుమూసె
ఎదుటి వాడి బాగు నెన్నడు విన్ననుతల్ల డిల్లు చుండు తప్పటోడుకీడు జరిగె నేని కేరింతలఁబడుచుకడుపు నొప్పి యనుచుఁ !,గరము మురిసె!
కమల నయనుడు తన గర్భమ్ములో జేరి,నెలలు నిండి, పురిటి కలయె దీరుశుభ ముహూర్త మరిగె! చూడరో దేవకిన్ -కడుపునొప్పి యనుచుఁ, గరము మురిసె!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
సంతులేని సతికి చాల దినములకు గర్భమయ్యె నంబ కరుణ చేతముదిత కొక్కనాడు పురిటినొప్పులు రాగకడుపునొప్పి యనుచు గరము మురిసె !
మిత్రులారా! శుభాశీస్సులు.ఈనాటి పూరణలను పరిశీలించుదాము: ముందుగా అందరికీ అభినందనలు.శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు:భోజన ప్రియు డొకడు కడుపు నొప్పి కావున నేడు ముట్టడాయె నిమ్మరసమును అని పూరించేరు. పద్యము చాల బాగుగ నున్నది.శ్రీ గూడ రఘురాం గారు:పద్యము బాగుగ నున్నది. నెప్పి అనే పదము లేదు. నొప్పి అనుటయే సాధువు. రావు + ఏ అనుచోట యడాగమము రాదు. శ్రీ మిస్సన్న గారు:కుప్పుస్వామిగారి చెణుకులతో మీ పొట్టకి నొప్పి వచ్చినదా? చాల బాగున్నది మీ పద్యము.శ్రీ సుబ్బా రావు గారు:పద్మ పనికి రాలేదు. కనకదుర్గకి కల వచ్చినది. మీ పద్యము బాగుగ నున్నది. కానీ అన్వయ సౌలభ్యము లేదు. శ్రీ తిమ్మాజీ రావు గారు:ప్రసవ వేదన నొప్పియే ఐనా ఆనందమును ఇచ్చును కదా. మీ పద్యము చాలబాగుగ నున్నది.శ్రీ లక్ష్మీనారాయణ గారు:కడుపు నిండుగా మెక్కి, కడుపు నొప్పి వచ్చినా చాల కాలమునకు విశ్రాంతి దొరకినది కదా సంతోషము అన్నారు. మీ పద్యము చాల బాగుగ నున్నది.శ్రీ శ్రీపతి శాస్త్రి గారు:కడుపు నొప్పి కంటే సూది మందు నొప్పి ఎక్కువ అన్నారు. బాగుగ నున్నది మీ పద్యము.శ్రీ సహదేవుడు గారు:ఎదుటివాని నొప్పిని చూచి మురిసే వాని గూర్చి చెప్పేరు. చాల బాగుగ నున్నది మీ పద్యము. వాడి అనరాదు - వాని అనుటయే సాధువు.శ్రీ ఆచార్య ఫణీంద్ర గారు: బహుకాల దర్శనము. సంతోషము.దేవకి ప్రసవ వేదన లోకమునకే సంతోష కారణము కదా. చాల బాగుగ నున్నది మీ పద్యము.శ్రీ బొడ్డు శంకరయ్య గారు:మంచి విరుపుతో పూరించేరు. కాని అన్వయ సౌలభ్యము లేదు. పద్యము బాగుగ నున్నది.శ్రీ నాగరాజు రవీందర్ గారు:బాగుగ నున్నది మీ పద్యము - భార్య ప్రసవ వేదన ఆనందదాయకమే కదా. స్వస్తి.
శ్రీ నేమని గురువర్యులకు ప్రణామములు మరియు ధన్యవాదములు. తమరి సూచన ప్రకారం సవరణ:ఎదుటి వాని బాగు నెన్నడు విన్ననుతల్ల డిల్లు చుండు తప్పటోడుకీడు జరిగె నేని కేరింతలఁబడుచుకడుపు నొప్పియనుచుఁ !,గరము మురిసె!
ఎక్కు వైన తిండి యిబ్బంది పెట్టగాకడుపు నొప్పి తో నొకండు బాధపడుచు మాని వేయ పనులు, విశ్రాంతితోకడుపు నొప్పి యనుచుఁ గరము మురిసె
శ్రీ కంది శంకరయ్య గురువర్యులకు వందనములు,,అర్థ గణదోషములున్న సవరించ ప్రార్థన !కడుపునింపుటకును కాయకష్టమొకడుకరము తోడ జేయ కడుపు నవ్వెతిన్న కూడరుగక తిప్పలు పడుచున్నకడుపు నొప్పియనుచు గరము మురిసె
కరము నొప్పిబుట్ట కరకర లాడించు
రిప్లయితొలగించండినోట వేసి తిండి పూట పూట
నేడు ముట్టడాయె నిమ్మరసమ్మును
కడుపునొప్పి యనుచుఁ, గరము మురిసె.
నెత్తియుండిననదినెప్పి పుట్టుచునుండు
రిప్లయితొలగించండిపొట్టయున్నవచ్చు పొట్టనెప్పి
లేవివేవి నాకు రావుయే తలనొప్పి
కడుపునొప్పు లనుచు కరము మురిసె!
చాలు చాలు నయ్య చాలు నీ చెణుకులు
రిప్లయితొలగించండిగొప్ప వాడవయ్య కుప్పు స్వామి
నవ్వి నవ్వి చూడు నాకైన దయ్యయో
కడుపునొప్పి యనుచుఁ గరము మురిసె.
ఫద్మ యీదినంబు పనికిరాలేదుగ
రిప్లయితొలగించండికడుపు నొప్పియనుచు,కరము మురిసె
కనకదుర్గ తాను కనినకలనుగూర్చి
అభయ హస్త మిచ్చె నంబ కలను
పండిత నేమానిగారికి గురుదేవులు శంకరయ్యగారికి వందనములు
రిప్లయితొలగించండిమాయ నొప్పి కాదు మ౦దుకులొంగదు
పురిటి శాల కేగు త్వరిత మనుచు
తల్లి పలుక వినిన తనయ బాధను మరచి
కడుపునొప్పి యనుచు గరము మురిసె
మిక్కుటంబుగాను మెక్కి యొక్కడరచె
రిప్లయితొలగించండికడుపునొప్పి యనుచు, కరము మురిసె
నెంత కాల మాయె సుంతైన విశ్రాంతి
లేక నేడు కలిగె నాక టంచు .
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండికడుపు నొప్పి యనుచుఁ గరము మురిసెగాని
జ్వరము వచ్చెననుచు వైద్యుడపుడు
సూదిపొడిచినంత చురచుర భుజముపై
నొప్పి నోర్వలేక నోరుమూసె
ఎదుటి వాడి బాగు నెన్నడు విన్నను
రిప్లయితొలగించండితల్ల డిల్లు చుండు తప్పటోడు
కీడు జరిగె నేని కేరింతలఁబడుచు
కడుపు నొప్పి యనుచుఁ !,గరము మురిసె!
కమల నయనుడు తన గర్భమ్ములో జేరి,
రిప్లయితొలగించండినెలలు నిండి, పురిటి కలయె దీరు
శుభ ముహూర్త మరిగె! చూడరో దేవకిన్ -
కడుపునొప్పి యనుచుఁ, గరము మురిసె!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసంతులేని సతికి చాల దినములకు
రిప్లయితొలగించండిగర్భమయ్యె నంబ కరుణ చేత
ముదిత కొక్కనాడు పురిటినొప్పులు రాగ
కడుపునొప్పి యనుచు గరము మురిసె !
మిత్రులారా! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిఈనాటి పూరణలను పరిశీలించుదాము: ముందుగా అందరికీ అభినందనలు.
శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు:
భోజన ప్రియు డొకడు కడుపు నొప్పి కావున నేడు ముట్టడాయె నిమ్మరసమును అని పూరించేరు. పద్యము చాల బాగుగ నున్నది.
శ్రీ గూడ రఘురాం గారు:
పద్యము బాగుగ నున్నది. నెప్పి అనే పదము లేదు. నొప్పి అనుటయే సాధువు. రావు + ఏ అనుచోట యడాగమము రాదు.
శ్రీ మిస్సన్న గారు:
కుప్పుస్వామిగారి చెణుకులతో మీ పొట్టకి నొప్పి వచ్చినదా? చాల బాగున్నది మీ పద్యము.
శ్రీ సుబ్బా రావు గారు:
పద్మ పనికి రాలేదు. కనకదుర్గకి కల వచ్చినది. మీ పద్యము బాగుగ నున్నది. కానీ అన్వయ సౌలభ్యము లేదు.
శ్రీ తిమ్మాజీ రావు గారు:
ప్రసవ వేదన నొప్పియే ఐనా ఆనందమును ఇచ్చును కదా. మీ పద్యము చాలబాగుగ నున్నది.
శ్రీ లక్ష్మీనారాయణ గారు:
కడుపు నిండుగా మెక్కి, కడుపు నొప్పి వచ్చినా చాల కాలమునకు విశ్రాంతి దొరకినది కదా సంతోషము అన్నారు. మీ పద్యము చాల బాగుగ నున్నది.
శ్రీ శ్రీపతి శాస్త్రి గారు:
కడుపు నొప్పి కంటే సూది మందు నొప్పి ఎక్కువ అన్నారు. బాగుగ నున్నది మీ పద్యము.
శ్రీ సహదేవుడు గారు:
ఎదుటివాని నొప్పిని చూచి మురిసే వాని గూర్చి చెప్పేరు. చాల బాగుగ నున్నది మీ పద్యము. వాడి అనరాదు - వాని అనుటయే సాధువు.
శ్రీ ఆచార్య ఫణీంద్ర గారు: బహుకాల దర్శనము. సంతోషము.
దేవకి ప్రసవ వేదన లోకమునకే సంతోష కారణము కదా. చాల బాగుగ నున్నది మీ పద్యము.
శ్రీ బొడ్డు శంకరయ్య గారు:
మంచి విరుపుతో పూరించేరు. కాని అన్వయ సౌలభ్యము లేదు. పద్యము బాగుగ నున్నది.
శ్రీ నాగరాజు రవీందర్ గారు:
బాగుగ నున్నది మీ పద్యము - భార్య ప్రసవ వేదన ఆనందదాయకమే కదా.
స్వస్తి.
శ్రీ నేమని గురువర్యులకు ప్రణామములు మరియు ధన్యవాదములు. తమరి సూచన ప్రకారం సవరణ:
రిప్లయితొలగించండిఎదుటి వాని బాగు నెన్నడు విన్నను
తల్ల డిల్లు చుండు తప్పటోడు
కీడు జరిగె నేని కేరింతలఁబడుచు
కడుపు నొప్పి
యనుచుఁ !,గరము మురిసె!
ఎక్కు వైన తిండి యిబ్బంది పెట్టగా
రిప్లయితొలగించండికడుపు నొప్పి తో నొకండు బాధ
పడుచు మాని వేయ పనులు, విశ్రాంతితో
కడుపు నొప్పి యనుచుఁ గరము మురిసె
శ్రీ కంది శంకరయ్య గురువర్యులకు వందనములు,,అర్థ గణదోషములున్న సవరించ ప్రార్థన !
రిప్లయితొలగించండికడుపునింపుటకును కాయకష్టమొకడు
కరము తోడ జేయ కడుపు నవ్వె
తిన్న కూడరుగక తిప్పలు పడుచున్న
కడుపు నొప్పియనుచు గరము మురిసె