రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగుంది. అభినందనలు. చివరి పాదంలో గణదోషం. ‘అతిశయముగ బలికెదరట యచ్చెరువొందన్’ అందాము. * సహదేవుడు గారూ, బాగుంది మీ పద్యం. అభినందనలు. * శైలజ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘నెడుతు’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు. అక్కడ ‘నెట్టి’ అంటే సరి. * కుసుమ సుదర్శన్ గారూ, బాగుంది మీ పద్యం. అభినందనలు. ‘ప్రోత్సహించిన+ఎడల’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ఆ పాదాన్ని ‘ప్రోత్సహించినపుడు పొసగు మేలు’అనండి. * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, అద్భుతమైన అతిశయోక్తితో ఆనందాన్ని కలిగించారు.అభినందనలు. ‘కట్టినారు+ఇంపుగ’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘కట్టినార లింపుగ’ అనండి.
మితి మీరిన గర్వం బున
రిప్లయితొలగించండిసతతము బ్రమ లందు మునిగి సంతస మొందన్
వెతలను మఱచుట కొఱకని
అతిశయ ముగ బలికె దరచ్చెరు వొందన్
క్షితి నతిశయోక్తు లాడన్
రిప్లయితొలగించండిమతి మంతమ్మై కవిత్వ మామోదమ్మో!
నతి సామాన్యు డటులనిన
నతిక ప్రసంగి యను ముద్ర నంటించదరే!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమితిమీరునతిశయోక్తుల్
రిప్లయితొలగించండిగతుకులలోనెడుతునిన్నుగారడి చేయున్
వెతలకు దారిని తీయక
శృతిమించకమాటలాడ శుభమగు ధరణిన్
అతిశ యోక్తులు బల్కుచు యంతలోనె
రిప్లయితొలగించండికొండ మీదికోతినయిన గోరు మనుచు
యడుగు చుందురు కొందరు యతిశయముగ
వాస్త వమ్మును మరచుట పాడి యగునె
శ్రీ కంది శంకరయ్య గురువర్యులకు వందనములు,
రిప్లయితొలగించండిఅర్థ గణదోషములున్న సవరించ ప్రార్థన !
అతిశయోక్తులు వలదన్యుల వర్ణింప
గతియు దప్పి వారి మతియు జెడును
వాస్తవమ్ము బలికి వారి స్థితిని దెల్పి
ప్రోత్సహించి నెడల పొసగు మేల
రిప్లయితొలగించండి"ఇది తాజుమహలు కట్టగ
పదునారేడులకాలము పట్టె" ననంగా
"ఇది మా దేశము నందున
పది దినముల కట్టెద" మనె పరిహాసముగా
"ఇదె గను కుతుబు మినా"రన
"ఇది నిన్నను జూపవైతి వేల
"న" నంగా
"ఇది నిన్నను లేదే యిట
ఇది నేడే కట్టి నారు ఇంపుగ మీకై"
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
చివరి పాదంలో గణదోషం. ‘అతిశయముగ బలికెదరట యచ్చెరువొందన్’ అందాము.
*
సహదేవుడు గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
*
శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘నెడుతు’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు. అక్కడ ‘నెట్టి’ అంటే సరి.
*
కుసుమ సుదర్శన్ గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
‘ప్రోత్సహించిన+ఎడల’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ఆ పాదాన్ని ‘ప్రోత్సహించినపుడు పొసగు మేలు’అనండి.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
అద్భుతమైన అతిశయోక్తితో ఆనందాన్ని కలిగించారు.అభినందనలు.
‘కట్టినారు+ఇంపుగ’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘కట్టినార లింపుగ’ అనండి.
అతిశయ మొక్కెడ శ్రోతక
రిప్లయితొలగించండిమితమగు నానందమిడగ మెచ్చునటంచున్
శతవిధముల యత్నములను
సతతము కవులెల్ల జేయ సమ్మతమగునే?