పడమట సంధ్యా రాగము కడు రమ్యము నింద్ర ధనుసు గవాక్ష మెదుటన్ కడలిని నీలపు కాంతులు విడువక జూడంగ నెంత వేడుక బుట్టున్
సూర్యచంద్రాదుల సుఖదసత్కిరణంబు..........లేవేళ చొప్పించు నింటిలోన,బయట పోవుచునుండు బంధుమిత్రులతోడ..........మాట్లాడ జేయించు మమత గురియ,ప్రకృతిసౌందర్యంబు పలుమారు చూపించి..........యుల్లాస మందించు నెల్లరకును,ఇండ్ల కన్నింటికి నినుమడించిన శోభ..........లద్భుతంబుగ గూర్చు ననవరతము,మలయ జన్యమైన మారుతంబుల దెచ్చిసంతసంబు నిచ్చు నెంతయేనిఅది గవాక్ష మెందు నద్దాని జన్మంబుధన్య మనుట యుక్త మన్యమేల?
గవాక్షమంటే...ఇంటి పైకప్పు లోనున్న నింట వెలుగుగోడకమర ప్రకృతి శోభ జూడఁ గలుగుజగతిఁ దెలియునంతర్జాల సుగమ బరచునారవ దగు యింద్రియమదే నఖిలమునకు
ఇంటనున్నగవాక్షమే యెదుటనున్న వాని జూపించునడుగిడు వానికెపుడు ఇంటరూనెట్గవాక్షమే యెదుటలేని వాని జూపును నడిగిన వాని కెపుడు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
పండిత నేమాని గారికి పూజ్యులుగురుదేవులు శంకరయ్యగారికి వందనములు మనసుగవాక్షమున్ దెఱచి మానిత సద్గురు బోధలన్ వినన్ క్షణికముజీవితమ్ములని కామమదమ్ములమోహపూరిత మ్మని దెలియంగ మాయవిడినంతనె నాత్మయెగోచరించగా ఘనమగు మోక్ష మార్గమునగమ్యముజేర్చునువిష్ణుసన్నిధిన్
సూర్యకిరణాలు వచ్చును చూరుపైనగలుగునా గవాక్షమునుండి కాంతితోడసూర్య బింబముపగిదినిసుడులు దిరిగికనుల మిరుమిట్లు గొలుపుచు గానిపించు
గాలి వీచుఁ గవాక్షముల్ గల్గినింటసూర్య రశ్మియు సోకును సోయగమునపెక్కు కిటికీలు గలయింట వెలుగునిండునాయురారోగ్యములు గల్గు నట్టియింట
శశియు గవాక్షమందు కడు చల్లని చూపుల నన్నుఁజూడగాశశిముఖమందు తోచు, గన చక్కని మోమది; భ్రాంతి వీడగా నిశి మరియింత వేదనల నిన్నుగురించి తలంపుఁ బెంచె; నీవశమిక నా మనంబు; నను బాలనఁ జేయగ వేగ రాగదే?
గురువుగారి ప్రశ్నకు, శిష్యుని సమాధానము..."కుత్సిత యోచనుండుఁ గనుఁ గోరి గవాక్షమునుండి, యెప్పుడున్సత్సుఖ మీయ నెంచు గుణసాంద్రుఁడు ద్వారమునుండి కాంచు, నోవత్స! విశేష మిందుఁ గనవచ్చెడి దేమి? వినంగఁ జెప్పుమా!""కుత్సితు దృష్టి మార్గ మిఱుకుం, గుణు దృష్టి చనె న్విశాలమై!"
లలిత చంద్రకళా కలాపంబు కురిపించి....... మనసుకాహ్లాద సంభరణమిచ్చుదినకరు ప్రభలింట తేజరిల్లగఁజేసి.... . తమమునుఁ బాపి సంతసమునిచ్చుపరిమళాల్ వెదజల్లు పవనవీచికతతుల్ ...... గృహమునందున జొచ్చి కేళిసలుపుకలుషిత సంధాన కల్మషంబులనెల్ల......... వెలివడజేసి సంప్రీతినొసఁగుసకల సౌఖ్యంబులిచ్చును సహజ రీతిప్రకృతి కాలవాలంబుగ రహివహించెనేడు కానగ రాదయ్యె చూడ గోర కడు విచిత్ర్రములీ గవాక్షమ్ము సుమ్ము
మిత్రులారా! అందరికీ శుభాశీస్సులు. ఈనాటి పద్య రచన అంశము : గవాక్షమును గురించి మిత్రులు ఒకరిని మించి ఒకరు అనునట్ట్లుగా ఉత్సాహముతో చక్కగ రచనలను చేసేరు. అందరికీ అభినందనలు. స్వస్తి.
పడమట సంధ్యా రాగము
రిప్లయితొలగించండికడు రమ్యము నింద్ర ధనుసు గవాక్ష మెదుటన్
కడలిని నీలపు కాంతులు
విడువక జూడంగ నెంత వేడుక బుట్టున్
సూర్యచంద్రాదుల సుఖదసత్కిరణంబు
రిప్లయితొలగించండి..........లేవేళ చొప్పించు నింటిలోన,
బయట పోవుచునుండు బంధుమిత్రులతోడ
..........మాట్లాడ జేయించు మమత గురియ,
ప్రకృతిసౌందర్యంబు పలుమారు చూపించి
..........యుల్లాస మందించు నెల్లరకును,
ఇండ్ల కన్నింటికి నినుమడించిన శోభ
..........లద్భుతంబుగ గూర్చు ననవరతము,
మలయ జన్యమైన మారుతంబుల దెచ్చి
సంతసంబు నిచ్చు నెంతయేని
అది గవాక్ష మెందు నద్దాని జన్మంబు
ధన్య మనుట యుక్త మన్యమేల?
గవాక్షమంటే...
రిప్లయితొలగించండిఇంటి పైకప్పు లోనున్న నింట వెలుగు
గోడకమర ప్రకృతి శోభ జూడఁ గలుగు
జగతిఁ దెలియునంతర్జాల సుగమ బరచు
నారవ దగు యింద్రియమదే నఖిలమునకు
ఇంటనున్నగవాక్షమే యెదుటనున్న
రిప్లయితొలగించండివాని జూపించునడుగిడు వానికెపుడు
ఇంటరూనెట్గవాక్షమే యెదుటలేని
వాని జూపును నడిగిన వాని కెపుడు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపండిత నేమాని గారికి పూజ్యులుగురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్యగారికి వందనములు
మనసుగవాక్షమున్ దెఱచి మానిత సద్గురు బోధలన్ వినన్
క్షణికముజీవితమ్ములని కామమదమ్ములమోహపూరిత
మ్మని దెలియంగ మాయవిడినంతనె నాత్మయెగోచరించగా
ఘనమగు మోక్ష మార్గమునగమ్యముజేర్చునువిష్ణుసన్నిధిన్
సూర్యకిరణాలు వచ్చును చూరుపైన
రిప్లయితొలగించండిగలుగునా గవాక్షమునుండి కాంతితోడ
సూర్య బింబముపగిదినిసుడులు దిరిగి
కనుల మిరుమిట్లు గొలుపుచు గానిపించు
గాలి వీచుఁ గవాక్షముల్ గల్గినింట
రిప్లయితొలగించండిసూర్య రశ్మియు సోకును సోయగమున
పెక్కు కిటికీలు గలయింట వెలుగునిండు
నాయురారోగ్యములు గల్గు నట్టియింట
శశియు గవాక్షమందు కడు చల్లని చూపుల నన్నుఁజూడగా
రిప్లయితొలగించండిశశిముఖమందు తోచు, గన చక్కని మోమది; భ్రాంతి వీడగా
నిశి మరియింత వేదనల నిన్నుగురించి తలంపుఁ బెంచె; నీ
వశమిక నా మనంబు; నను బాలనఁ జేయగ వేగ రాగదే?
గురువుగారి ప్రశ్నకు, శిష్యుని సమాధానము...
రిప్లయితొలగించండి"కుత్సిత యోచనుండుఁ గనుఁ గోరి గవాక్షమునుండి, యెప్పుడున్
సత్సుఖ మీయ నెంచు గుణసాంద్రుఁడు ద్వారమునుండి కాంచు, నో
వత్స! విశేష మిందుఁ గనవచ్చెడి దేమి? వినంగఁ జెప్పుమా!"
"కుత్సితు దృష్టి మార్గ మిఱుకుం, గుణు దృష్టి చనె న్విశాలమై!"
లలిత చంద్రకళా కలాపంబు కురిపించి
రిప్లయితొలగించండి....... మనసుకాహ్లాద సంభరణమిచ్చు
దినకరు ప్రభలింట తేజరిల్లగఁజేసి
.... . తమమునుఁ బాపి సంతసమునిచ్చు
పరిమళాల్ వెదజల్లు పవనవీచికతతుల్
...... గృహమునందున జొచ్చి కేళిసలుపు
కలుషిత సంధాన కల్మషంబులనెల్ల
......... వెలివడజేసి సంప్రీతినొసఁగు
సకల సౌఖ్యంబులిచ్చును సహజ రీతి
ప్రకృతి కాలవాలంబుగ రహివహించె
నేడు కానగ రాదయ్యె చూడ గోర
కడు విచిత్ర్రములీ గవాక్షమ్ము సుమ్ము
మిత్రులారా! అందరికీ శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిఈనాటి పద్య రచన అంశము : గవాక్షమును గురించి మిత్రులు ఒకరిని మించి ఒకరు అనునట్ట్లుగా ఉత్సాహముతో చక్కగ రచనలను చేసేరు. అందరికీ అభినందనలు.
స్వస్తి.