27, అక్టోబర్ 2013, ఆదివారం

సమస్యాపూరణం - 1217 (మామా యని బావమఱఁది)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.....
మామా యని బావమఱఁది మాటలు గలిపెన్
ఈ సమస్యను పంపిన నాగరాజు రవీందర్ గారికి ధన్యవాదాలు.

30 కామెంట్‌లు:

 1. సీమల దిరిగిన దొరయని
  నేమాత్రము గరువ మనక నిండు మనంబున్
  ప్రేమగ సంతస మందుచు
  మామాయని బావ మఱఁ ది మాటలు గలిపెన్

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  మేనమామ బావ అయినా అలవాటయిన పిలుపు మామే గదా :

  01)
  _________________________________
  మామకు , నక్కకు బెండిలి
  సామాన్యముగాదె జరుగ - జనముల లోనన్ !
  మామయు , బావయు గావున
  మామా యని బావమఱఁది - మాటలు గలిపెన్ !
  _________________________________
  మామ = మేనమామ

  రిప్లయితొలగించండి
 3. శంకరార్యా !
  మీ అబ్బాయికి ఎలా వుంది ?
  ఆపరేషన్ జరిగినదా?
  శీఘ్రముగా స్వస్థత చేకూరాలని కోరుకుంటున్నాను !

  రిప్లయితొలగించండి
 4. కవిమిత్రులకు నమస్కృతులు.
  ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు మా అబ్బాయికి ఆపరేషన్. అబ్బాయి స్వాస్థ్యాన్ని అభిలశిస్తూ సందేశాలు పంపిన అందరికీ ధన్యవాదాలు.
  క్రమం తప్పకుండా చక్కని పూరణలతో బ్లాగును శోభాయమానం చేస్తున్న మిత్రులకు అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. మోము గన చందమామయె
  కాముడవే యందమందు కద రావయ్యా
  ప్రేముడి నో కందర్పుని
  మామా యని బావమరది మాటలు గలిపెన్

  రిప్లయితొలగించండి
 6. నీ మంచి సుతునకుఁ దగిన
  దై కూఁతురు గలిగె, నింక తగవు మఱచి యుం
  దామా నా సత్పుత్రికి
  మామా! యని బావమఱఁది మాటలు గలిపెన్.

  రిప్లయితొలగించండి
 7. మామా! బావా! పిలుపులు
  మామూ లయిపో యెనిపుడు మాటల మధ్యన్
  మామకు నక్కను యివ్వగ
  మామాయని బావమరది మాటలు గలిపెన్

  రిప్లయితొలగించండి
 8. కోమలి యక్కయ్య సుతను
  రాముడు మనువాడ మెచ్చి, రాంబా బయ్యెన్
  మామ మరియు బావ తనకు ;
  మామా! యని బావమఱఁది మాటలు గలిపెన్.

  రిప్లయితొలగించండి
 9. ప్రేమగ బెద్దలు జేయగ
  మామకు నక్కకు ముదమున మనువే జగిగెన్
  మామయె బావగ మారిన
  మామాయని బావ మరదిమాటలు గలిపెన్

  రిప్లయితొలగించండి
 10. ధీమంతుఁడైనవాఁడట
  ప్రేమించెను యక్క కూతుఁ, వివహంబయ్యెన్,
  శ్రీమంతమాడువేళల
  మామా! యని బావమఱిఁది మాటలు గలిపెన్.

  రిప్లయితొలగించండి
 11. పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు

  “కామేశ్వరి నీ కూతుని
  ప్రేమించితి బావ నాకు బెండ్లి నొనర్పన్
  యేమియు కట్నంబడుగను
  మామా” యని బావమరది మాటలు గలిపెన్

  రిప్లయితొలగించండి
 12. రా! మా యింటికి బావా!
  సామాన్యపు వాగ్వివాద సంగతి మరచీ
  కోమలి గుణవతి నా సుత
  మామా! యని బావమరది మాటలు గలిపెన్

  రిప్లయితొలగించండి
 13. ప్రేమగ నా సతి తమ్ముడు
  సేమంబులఁ దెలియఁ గోరి చేరఁగ వచ్చెన్
  యేమోయ్! యన మా నాన్నను
  మామా! యని బావ మఱఁది మాటలు గలిపెన్

  రిప్లయితొలగించండి
 14. పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు శంకరయ్య గారికి వందనములు

  “మీ””మా”యనగా నేలా
  “మా””మా”యని బావమరది మాటలుగలిపెన్
  “నీమాయలు నాకెరుకయె
  నా మామిడి పండ్లనీయ ననిబావనియెన్

  రిప్లయితొలగించండి
 15. రా ,మాయింటికి నిప్పుడు

  మామా !, యని భావమఱది మాటలు గలిపెన్

  కామాక్షి కగును సోదరు

  డా మోహనరావు కూ డ హర్షము తోడన్

  రిప్లయితొలగించండి
 16. మరియొక ప్రయత్నము:

  మామిడి మారయ్య కదా
  మా మా యనుటొప్పటంచు మధురోక్తులతో
  ప్రేముడి నగవులు చిందుచు
  మా మా యని బావమరది మాటలు గలిపెన్

  రిప్లయితొలగించండి
 17. మిత్రులకు శుభాశీస్సులు.
  ఈనాటి సమస్యకు సరసమైన పూరణలు వచ్చుచున్నవి. అందరికి అభినందనలు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 18. మా బావమఱఁది ప్రేమలో పడి, యామె తండ్రితో మాటలు గలిపెనను సందర్భము...

  ఏమో? పేరుం దెలియదు!
  నీమము విడి యతని కూఁతు నెమ్మిఁ దలఁచుచున్
  క్షేమ మరసికొను వంకను
  "మామా!"యని బావమఱఁది మాటలు గలిపెన్!

  రిప్లయితొలగించండి
 19. రామా! రామా! యేమిది
  మామవు బావవు వరుసకు,మాన్యుడు నీవున్
  కామా పెట్టుము గొడవకు
  మామా! యని బావమరది మాటలు గలిపెన్

  రిప్లయితొలగించండి
 20. కాముకయువకుల మనసులు
  నేమంబుల దప్పి మసిని నీలంబయ్యెన్
  కామినుల వెంటఁ బడనని
  మా మాయని బావ మఱఁ ది మాటలు గలిపెన్

  రిప్లయితొలగించండి
 21. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..

  శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...
  =======*============
  ప్రేమించిన నా సోదరి
  ధీమంతుడవని దెలియగ దృప్తిని జెందెన్!
  నీ మంచి దనము దెలిసెను
  మామా!యని బావమఱఁది మాటలు గలిపెన్!

  రాయల సీమలోను, కర్ణాటక లోను బావను మామ యందురు

  రిప్లయితొలగించండి
 22. అలిగిన బావమరిదిని బతిమాలమని సుతుని పంపె,
  మామ,పండగపూట కలసి ఉండుట చూచుటకు ఇంపె,
  వణుకుచు అమ్మమ్మింటికి చేరిన మనుమడు మౌనం తెంపె
  అనునయముగ మామా యని బావమరిది మాటలు కలిపె

  రిప్లయితొలగించండి
 23. ఏమాటకు ముందైనను
  ' మామామా ' యనుచు నత్తి మాటలు వచ్చున్
  మోమాటము బడుతూనే
  ' మామా ' యని బావ మఱఁ ది మాటలు గలిపెన్.

  రిప్లయితొలగించండి
 24. మా మాయ జూచి, బావా !
  నా మాటల వినుము నేను నచ్చితి దానిన్
  ప్రేమగ పెండ్లాడుదునని
  మా మాయని, బావమఱఁది మాటలు గలిపెన్!

  రిప్లయితొలగించండి
 25. సీమాంతరమేగి మరల
  గ్రామమునకు మరలువేళ కాంతాగ్రజుడే
  ప్రేముడి నా తండ్రిని గనె;
  మామా యని బావమఱఁది మాటలు గలిపెన్

  రిప్లయితొలగించండి
 26. మామిడి మాధవ రావుది
  మా.మా. యనుచిన్న పేరు; మహనీయుండా
  "మామ"యె వరించ యక్కను
  మామా యని బావమఱఁది మాటలు గలిపెన్!

  రిప్లయితొలగించండి


 27. ఏమాత్రము తెలియక రా
  మామా యని బావమఱఁది మాటలు గలిపె
  న్నో మారైనన్ చూడని
  నామము తెలియని మనుజుని నాకట్టుకొనెన్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 28. శ్యామల వర్ణపు కూతును
  ప్రేమించితి నేను ఘాటు రీతిగనిక నీ
  కోమలిని నా కొసగమని
  మామా! యని బావమఱఁది మాటలు గలిపెన్

  రిప్లయితొలగించండి