14, అక్టోబర్ 2013, సోమవారం

సమస్యాపూరణం - 1204 (తొమ్మిదిలోనొకటి దీయ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.....
తొమ్మిదిలోనొకటి దీయ తొయ్యలి పదియౌ.
ఈ సమస్యను పంపిన సంపత్ కుమార్ శాస్త్రి గారికి ధన్యవాదములు.

28 కామెంట్‌లు:

  1. సోదర సోదరీ మణుల కందరికీ విజయ దశమి శుభా కాంక్షలు

    ఇమ్ముగ నవ రాత్రు లకని
    సొమ్ములు తామెండు కొనగ సొగసులు విరియన్
    నెమ్మన మున ధరి యించగ
    తొమ్మిదిలో నొకటి దీయ తొయ్యలి పదియౌ !

    రిప్లయితొలగించండి
  2. అమ్మలు! యెనిమిది యగునే
    తొమ్మిదిలోనొకటి దీయ; తొయ్యలి! పదియౌ
    నిమ్ముగ దానికొకటినిక
    కమ్మగ కలపంగ, లెక్క ఖచ్చితమపుడే!

    రిప్లయితొలగించండి
  3. తొమ్మిది తొమ్మిదులందున
    నిమ్ముగ నొకటొకటి దీసితేనివె గనుమా
    బొమ్మల కలుపుట కొరకై
    తొమ్మిదిలో నొకటి దీయ తొయ్యలి పదియౌ

    రిప్లయితొలగించండి
  4. రమ్మిక లెక్కలఁ జెప్పుదు
    నెమ్మికతో నీవునేఁడు నేర్చుకొనుటగా
    నిమ్మిక, రోమను యంకెల
    తొమ్మిదిలో నొకటి తీయ తొయ్యలి పదియౌ.

    రిప్లయితొలగించండి
  5. శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారి పూరణ బాగున్నది. అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  6. రావణాసురుడు మండోదరితో :
    "ఇమ్మహి గల దెవ్వారికి
    దమ్మీ లంకాపతి పది తలలను గూల్చన్?
    దొమ్మి నొకటి తీసి, మరల -
    తొమ్మిదిలోనొకటి దీయ తొయ్యలి పదియౌ!"

    రిప్లయితొలగించండి
  7. సంపత్ గారూ ! బాగుంది . నేనూ మీ బాటలోనే..

    నమ్మిది నాల్గున నొక్కటి
    కొమ్మా! మరి దీయనైదు, క్రొత్తగనుందా
    యిమ్ముగ రోమన్నంకెల
    తొమ్మిదిలో నొకటి దీయ తొయ్యలి! పదియౌ .

    రిప్లయితొలగించండి
  8. ’దమ్ము’ అన్న అన్యభాషావిశేషాన్ని పరిహరించ దలచినచో, నా పద్యాన్ని ఇలా మార్చవచ్చు -

    రావణాసురుడు మండోదరితో :
    "ఇమ్మహి గల దెవరికి ధై
    ర్యమ్మీ దశకంఠు దశ శిరమ్ముల ద్రుంచన్?
    దొమ్మి నొకటి తీసి, మరల -
    తొమ్మిదిలోనొకటి దీయ తొయ్యలి పదియౌ!"

    రిప్లయితొలగించండి
  9. అమ్మీ ! విను మెనిమి దగును
    తొమ్మిదిలో నొకటి దీయ ; తొయ్యలి ! పదియౌ
    తొమ్మిదికిని నొకటి గలుప ;
    తొమ్మిదిలో రెండు దీయ తొయ్యలి యేడౌ

    రిప్లయితొలగించండి
  10. అమ్మా! విను యెనిమిదియౌ
    తొమ్మిదిలో నొకటిదీయ; తొయ్యలి పదియౌ
    తొమ్మిదికొకటిని కలుపగ
    నమ్మకముంచుము గణితము నాకది సుళువౌ.

    రిప్లయితొలగించండి
  11. ఒక విద్యార్థినికి లెక్కల బోధించే మేష్టారు తల పట్టుకు కూర్చొని, విద్యార్థిని తల్లితో ఇలా అంటున్నాడు :

    అమ్మడికి గణిత బోధన
    అమ్మో ! నా వల్ల గాద హరహము ; వినుమో
    యమ్మా ! యిదేమి ? యెట్టుల
    తొమ్మిదిలో నొకటి దీయ తొయ్యలి పదియౌ ?

    రిప్లయితొలగించండి

  12. ఇమ్ముగ నెనిమిది యగుగద
    తొమ్మిదిలోనొకటిదీయ తొయ్యలి పదియౌ
    తొమ్మిదికి నొకటి గలిపిన
    నెమ్మదిగను నేర్చుకొనుమునిరతము లెక్కల్

    రిప్లయితొలగించండి
  13. "అమ్మా ! వ్రాయు" మన గురువు
    " తొమ్మిదిలో నొకటి వేయ తొయ్యలి పదియౌ "
    అమ్మ డిటుల వ్రాసె మరచి
    " తొమ్మిదిలో నొకటి దీయ తొయ్యలి పదియౌ "

    రిప్లయితొలగించండి
  14. రమ్మా! గణితము నేర్పెద
    ముమ్మాటికి నేర్వవలయుఁ బుడమిని బ్రతుకన్
    సుమ్మీ! రెంటికి కలిపే
    తొమ్మిదిలో నొకటిఁ దీయ తొయ్యలి పదియౌ!

    రిప్లయితొలగించండి
  15. పండిత నేమానిగారికి గురుదేవులు శంకరయ్యగారికి వందనములు

    'తొమ్మిది' రోమను అంకెల
    యిమ్ముగ 'నొకటి'యును ప్రక్క'నెక్సు'ను వ్రాయన్
    నమ్మువిలువ'పది'ఎక్సుకు
    తొమ్మిదిలో 'నొకటి'తీయతొయ్యలి'పది'యౌ

    రిప్లయితొలగించండి
  16. పండిత నేమానివారికి, సాహితీ కవి పండిత మిత్రులందఱికిని నమస్కారములు. అన్ని పూరణములఁ బరిశీలించి చూచిన, మిత్రులు శ్రీ సంపత్ కుమార్ శాస్త్రిగారి పూరణము, డా. ఆచార్య ఫణీంద్ర గారి పూరణము బాగున్నవి. అభినందనలు. ఇఁక నా పూరణము:

    బడిలో ’ఫ్ల కార్డు’లఁ దారుమారు చేయఁగ జరిగిన తికమకను దెలుపు సందర్భము...

    నెమ్మదిగఁ "దీయ" "వేయ"ల
    నమ్మాయియె తారుమారు నప్పుడు చేయన్;
    దమ్ముండది చూడక యనె
    "దొమ్మిదిలో నొకటిఁ దీయఁ దొయ్యలి! పదియౌ!"

    రిప్లయితొలగించండి
  17. కొమ్మా! నే గణితపు సూ
    త్రమ్మును నీ కెరుక జేతు రమ్మని తెలిపెన్
    కుమ్మరి బొమ్మల జత నిడి
    తొమ్మిదిలో, నొకటి తీయ తొయ్యలి పదియౌ .

    రిప్లయితొలగించండి
  18. ఈరోజు ఫస్ట్ మార్క్ సంపత్కుమార్ శాస్త్రిగారికే.

    రిప్లయితొలగించండి
  19. శ్రీగురుభ్యోనమ:

    అమ్మిన లాట్రీ చీటుల
    తొమ్మిదిలో నొకటితీయ తొయ్యలి, పదియౌ
    నమ్మా, లక్షలు జేరును
    నమ్ముము నామాటనెపుడు నాడున్ నేడున్.

    రిప్లయితొలగించండి
  20. నాకు అభినందనలు తెలుపుతూ ప్రోత్సహించిన గురువర్యులు శ్రీనేమాని గారికి, కవిమిత్రులు శ్రీ గోలిహనుమచ్చాస్త్రి గారికి, శ్రీ గుండు మధుసూధన్ గారికి మరియు శ్రీ మిస్సన్న గారికి ధన్యవాదాలు.

    చక్కని పూరణలను పంపిన కవిమిత్రులకందరికి ధన్యవాదశతములర్పిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  21. తొమ్మిది, నవగ్రహమ్ముల
    కమ్మా, కలశమ్ములిచట నాయెను! హరికిన్
    గుమ్మము ప్రక్కన నుంచిన
    తొమ్మిదిలో నొకటి దీయ తొయ్యలి పదియౌ !

    రిప్లయితొలగించండి
  22. నెమ్మనమున గణితంబును
    కొమ్మకు బోధించునట్టి గురువర్యుడనెన్
    ఇమ్ముగ రెండును గలిపిన
    తొమ్మిదిలో నొకటి దీయ తొయ్యలి పదియౌ

    రిప్లయితొలగించండి
  23. తొమ్మిది వ్రాయుము తొయ్యలి!
    ఇమ్ముగ "నొక"యంకె వ్రాసినెడమన జేర్చుమ్
    కమ్మగ కూడుమొకటి పం
    తొమ్మిదిలోనొకటి దీయ తొయ్యలి పదియౌ

    రిప్లయితొలగించండి

  24. మా గణితపు గురువులు జీపీయెస్ వారు :)


    అమ్మా ! జిలేబి నీకెవ
    రమ్మా గణితపు గురువులు ? రాపుదనములే
    లమ్మా! తెలుపదగు నెటుల
    తొమ్మిదిలో నొకటి దీయ తొయ్యలి పదియౌ ?

    జిలేబి

    రిప్లయితొలగించండి