కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.....
పద్దెము వ్రాయు విద్దె యనఁ బాచిక లాడిన చందమే సుమా!
ఈ సమస్యను పంపిన అందవోలు విద్యాసాగర్ గారికి ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.....
పద్దెము వ్రాయు విద్దె యనఁ బాచిక లాడిన చందమే సుమా!
ఈ సమస్యను పంపిన అందవోలు విద్యాసాగర్ గారికి ధన్యవాదాలు.
పాచికలాడుట చాలా కష్టమని విన్నాను. దానిని అవధానానికి పోలుస్తూ..
రిప్లయితొలగించండిఇద్దరొ ముగ్గురోయనక ఏడుకునొక్కరు చేరి పృచ్ఛకుల్
హద్దులుమీరి ప్రశ్నలిడ, అచ్చెరువొందుచు ప్రేక్షకొత్తముల్
అద్దిర! భేషు భేషనఁగ ఆశువుగా అవధానమందునన్
పద్దెము వ్రాయు విద్దెయనఁ బాచికలాడిన చందమేసుమా
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
పాచిక లెయ్యడం, పావులు నప్పడం లో కష్టమేముంది ?
కుస్తీ అంటే కష్టం గాని , పాచికలాట సులువే గదా :
01)
________________________________________
తద్దయు భక్తితో పలుకు - తల్లికి వందన మాచరించుచున్
పెద్దల దీవనల్ , మిగుల - ప్రేముడి జూపెడి బంధు వర్గము
న్నొద్దిక గల్గు పత్ని, తన - యూహల మేరకు సంచరించుచో
కొద్దిగ టీని త్రాగి , సరి - కొత్తగు కావ్యము వ్రాయ బూనినన్
సద్దది లేనిచోట , బహు - చక్కని భావపు వెల్లువన్ , సదా
పద్దెము వ్రాయు విద్దె యనఁ - బాచిక లాడిన చందమే సుమా !
________________________________________
విద్దెలు గారడీ లనగ వేయి విధమ్ముల లాస్య మాడగన్
రిప్లయితొలగించండిసోద్దెము నొందగా మిగుల శొభలు గూరిచి లేనిదున్న టుల్
అద్దిన ముత్తెమో యనగ నాదర మొప్పెడు భాషణం బులన్
పద్దెము వ్రాయు విద్దెయన బాచిక లాడిన చందమే సుమా
వసంత కిశోర్ గారు,
రిప్లయితొలగించండిపులి-మేక ఆట చాలా కష్టమని, చదరంగము దీనినుండే పుట్టిందని గుర్తు. నేను పాచికలను పులి-మేక ఆటతో పొరబడినట్టున్నాను. ఇంకొక విధముగా పూరించడానికి ప్రయత్నిస్తాను.
రిప్లయితొలగించండిప్రాయమున పందెము కాయు స్టాకు మార్కెట్టు న
టీము పాసు చేయుటకు బ్లాగాడును టైము పాసు న
ఇన్నిపనులున్నన్ మరి ఏది సమయము క్షుణ్ణముగ నేర్వన్ ? ఇక ,
పద్దెము వ్రాయు విద్దె యనఁ బాచిక లాడిన చందమే సుమా!
జిలేబి
‘very good website’
రిప్లయితొలగించండిayurbless team
visit my ayurveda free treatment website: http://ayurbless.blogspot.in
పద్దెము వ్రాయు విద్దె యన బాచిక లాడిన చందమే సుమా!
రిప్లయితొలగించండిఅద్దిర ఏమి మాట? కవితాద్భుత వైభవ విద్య జూదమా?
వద్దుర యట్టి పోలికలు, వాగ్జననీ కరుణా ప్రసాదమౌ
విద్దె కదా కవిత్వము పవిత్రము తద్విభవమ్ము సోదరా!
అద్దిర! నర్మగర్భ కవితామృతధార, విశిష్టవైభవం
రిప్లయితొలగించండిబిద్ది, పురాకృతంబుగ లభించిన పెన్నిధి గాదె చూడగాన్
పద్దెము వ్రాయు విద్య యనఁ, బాచికలాడిన చందమే సుమా
కద్దు! వధాన ధీమణుల కైతల నల్లిక చూచినంతనే.
Pandita Nemani వారూ మీ పూరణ చాలా బాగుంది.వాగ్జననీ కరుణా ప్రసాదమౌ విద్దె కదా కవిత్వము
రిప్లయితొలగించండి------------------
పద్దెము వ్రాయు విద్దె యన బాచిక లాడిన చందమే సుమా!
అద్దిర ఏమి మాట? కవితాద్భుత వైభవ విద్య జూదమా?
వద్దుర యట్టి పోలికలు, వాగ్జననీ కరుణా ప్రసాదమౌ
విద్దె కదా కవిత్వము పవిత్రము తద్విభవమ్ము సోదరా!"
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..
రిప్లయితొలగించండిశ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...
గురుదేవులు మన్నించాలి నా పూరణ మీ అద్బుతమైన పూరణకు వ్యతిరేకము గానున్నది.
అష్టదిగ్బంధనము జేసి,కోరిన రీతి పద్యము వ్రాయకున్న శిక్షిం చెదనన్న రాజుగారి మాటలు విన్న కవి మదిలో
==============*============
పద్దెము జెప్పు పొంకముగ పాదప వృత్తము నందు పండితా !
సుద్దుల పద్దు వద్దనుచు,సుందర మూర్తుల వర్ణ నాంశముల్
కొద్దిగ జేర,గీ దినము గ్రుద్దులు దప్పవు జూడ నంగ,నీ
పద్దెము వ్రాయు విద్దె యన బాచిక లాడిన చందమే సుమా!
శ్రీ లక్కరాజు వారికి శుభాశీస్సులు. మీ ప్రశంసలకు మా సంతోషము. స్వస్తి.
రిప్లయితొలగించండిమిత్రులారా! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిజగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదులు సౌందర్యలహరి అనే కావ్యములో 15, 16, 17 శ్లోకములలో కవిత్వ వైభవము అమ్మవారి కృపా ఫలితముగనే అలవడునని వచించేరు. ఆ శ్లోకములను ఈ క్రింద ఉదహరించుచున్నాను.
శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం
వరత్రాస త్రాణ స్ఫటిక (ఘ) ఘుటికా పుస్తక కరాం
సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే
మధు క్షీర ద్రాక్షా మధురిమ ధురీణాః ఫణితయః 15.
(తా. ఓ లోకమాతా! శరత్కాలములోని వెన్నెలవలె స్వఛ్ఛముగా నున్నట్టియు, చంద్రునితో గూడిన జడల సముదాయము అనే కిరీటము కలిగినట్టియు వరదముద్రనీ, అభయముద్రనీ స్ఫటికమాలనీ నాలుగు చేతులలో ధరించునట్టియు అయిన నిన్ను సత్పురుషులు ఒకే మారు నమస్కరించినా వారికి తేనె పాలు ద్రాక్షారసము అనే వాని మాధుర్యాన్ని వహిస్తున్న కవితావాక్కులు ఎందుకు సంభవింపవు? తప్పక సంభవిస్తాయి కదా!.
కవీంద్రాణాం చేతఃకమలవన బాలాతప రుచిం
భజంతే యే సంతః కతిచి దరుణామేవ భవతీం
విరించి ప్రేయస్యా స్తరుణతర శృంగారలహరీ
గభీరాభిర్ వాగ్భిర్విదధతి సతాం రంజనమమీ .. 16
(తా. దేవీ! మహాకవుల హృదయ పద్మాలను వికసింపజేసే లేత ఎండ వంటి కాంతి కల్గిన నిన్ను అరుణా స్వరూపిణిగా ఏ సత్పురుషులు సేవిస్తారో వారు సరస్వతీ దేవియొక్క అనుగ్రహము వలన శృంగార పరిపూర్ణమైన వాక్కులతో (కవితలతో) సహృదయులను ఉప్పొంగిస్తారు.
సవిత్రీభిర్వాచాం శశిమణి శిలా భంగరుచిభిర్
వశిన్యాద్యాభిస్త్వాం సహ జనని! సంచింతయతి యః
స కర్తా కావ్యానాం భవతి మహతాం భంగి రుచిభిర్
వచోభిర్ వాగ్దేవీ వదన కమలామోద మధురైః .. 17
(తా. ఓ తల్లీ! వాగ్వైభవాన్ని కల్గించేవారు చంద్ర కాంత మణులవలె వెలుగు వారు అయిన వశిని మొదలైన దేవతలతో కూడా నిన్ను ఎవ్వడు చక్కగా ఆరాధిస్తాడో అతడు మహాకవుల రీతుల ననుసరించిన తియ్య తియ్యని మాటలతోడి కవితలను అల్లగలుగుతాడు.
(ఇందలి తాత్పర్యము ఆచార్య సార్వభౌమ డా. (ప్రొ.) వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి సౌందర్య లహరి పుస్తక వ్యాఖ్య నుండి గ్రహింపబడినది. -- వారికి కృతజ్ఞతలు).
వైజ్ఞానిక విద్య చదివినా, తెనుగు-ప్రీతిని విడువ తరమా ?
రిప్లయితొలగించండిపూరణమో దారుణమో, సమస్య-నివృత్తి మా వృత్తి సుమా
మెప్పే ఆరు మౌనమే కన్ను, అంతర్జాల భువన విజయమా
పద్దెము వ్రాయు విద్దె యన బాచిక లాడిన చందమే సుమా!
సమస్య-నివృత్తి problems and solutions are our life in software industry...
మరియొక ప్రయత్నము. అవధానమైనా బహుధా ప్రశంసలను పొందవలె ననుచు:
రిప్లయితొలగించండిపద్దెము వ్రాయు విద్దెయన బాచిక లాడిన చందమే సుమా
యద్దిర యంచు ప్రష్ట యన నాతని నోటిని మూయజేయుచున్
బద్దెము లల్లి యాశుగతి పండిత వర్యుల మెప్పులందుచున్
దద్దయు నిర్వహింతు నవధానము ప్రస్తుత ప్రక్రియాళితోన్
పండితనేమానిగారికి పూజ్యులుగురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్యగారికి వందనములు
ఒద్దిక గూర్చి శబ్దములు ఒగ్గుగ నిగ్గుగ దిద్ది పల్కుటే
పద్దెము వ్రాయు విద్దెయన బాచిక లాడెడి చందమే గదా
పద్దెము నట్లు గాక నొక భావన స్పందన శోక పూరమై
పద్దెము వ్రాసె గాదె నొక వ్యాధుడు రామచరిత్ర కావ్యమన్
అద్దము రీతి ముద్దుగ సమంచిత లక్షణ భావ మాధురిన్
రిప్లయితొలగించండిఅద్దుచు వ్రాయు ధీ కవి కులాగ్రజు లెల్లర కేమి చోద్యమీ
పద్దెము విద్దె, మాకు నవ పండిత సంహృతి కెల్ల కష్టమౌ
పద్దెము వ్రాయు విద్దెయనఁ బాచిక లాడిన చందమేసుమా.
వద్దకు చేరునొద్దికగ వాగ్దేవి దీవెనలున్నవారికిన్
రిప్లయితొలగించండిబుద్దిని బెంచుపద్యములు, వూహకు యందని భావవెల్లువన్
పద్దెములల్లియాశువుగ భారతి గొల్చిన బాగ్యశాలికిన్
పద్దెము వ్రాయ విద్దెయన బాచిక లాడిన చందమే సుమా
శ్రీ ఆదిత్య మద్దూరి గారికి శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీరు పద్యవిద్యలో మక్కువ చూపుట మంచిదే. దానికి తగినట్లు పరిశ్రమ చేసి ముందుకు సాగండి. ఇదేమి బ్రహ్మ విద్య కాదు. ముందు ఆటవెలదులు కందపద్యములు వంటివి ఎన్నో చదువుచూ వాటిలోని నడకను అనుసరించుట చేయాలి. మెల్లగా ఆటవెలదులు కందపద్యములు వ్రాయుట నేర్చుకొనగలరు. చిన్న ఛందస్సు పుస్తకములు బాగుగా చదవండి. పూర్వ కవుల పద్య కావ్యములను చదువుతూ ఉంటే మంచి భాషపై పట్టు సాధించ గలరు. అప్పుడు బాగుగా పద్యములను వ్రాయ గలరు. శుభస్య శీఘ్రం - అశ్రద్ధ వహించకండి. మొదలు పెట్టండి. విజయోస్తు. స్వస్తి.
హద్దుల మీఱు నొక్కపరి! హాయిగ నవ్వుచు పల్కు నొక్కెడన్!
రిప్లయితొలగించండిగద్దె గలట్టి పెద్దలకు కౌతుక మొప్పగ, నాడు, మెప్పుకై
యిద్దరు దిట్టలౌ కవులు హెచ్చిన స్పర్థను కైత లల్లుచో,
పద్దెము వ్రాయు విద్దె యనఁ బాచిక లాడిన చందమే సుమా!
నేమాని పండితులు క్షమించాలి.
వద్దు వచింపగా తగదు, పద్య కవిత్వము వంటఁ బట్టగా
కద్దగు వాక్సతీ కరుణ కల్మి యొకింతయు లేక, నౌనొకో
మొద్దుకు నెద్దుకున్ కుటిల బుద్ధికి వ్రాయగ కైత? కీ డనన్
"పద్దెము వ్రాయు విద్దె యనఁ బాచిక లాడిన చందమే" సుమా!
శ్రీమతి శైలజ గారి పద్యములో కొన్ని సవరణలు చేయుచూ:
రిప్లయితొలగించండివద్దకు చేరు నొద్దికగ భారతి దీవెనలున్న వారికిన్
బుద్ధిని బెంచు పద్యచయముల్ రసబంధుర భావవాహినుల్
పద్దెము లల్లి యాశువుగ వాణిని గొల్చిన భాగ్యశాలికిన్
పద్దెము వ్రాయ విద్దెయన బాచిక లాడిన చందమే సుమా
వివరణ: 1వ పాదములో వాగ్దేవి అనుటలో గణ భంగము అగును.
2వ పాదములో: వూహకు అనరాదు. ఊహకు అనుట సాధు ప్రయోగము. తెలుగులో వు వూ వొ వో అనే అక్షరములతో మొదలగు పదములు లేవు అని వ్యాకరణ సూత్రము.
2వ పాదములో: భావ వెల్లువన్ - అనరాదు. సమాసములో మొదటి పదము సంస్కృతము 2వ పదము తెలుగు వాడరాదు.
శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యములలో కలుగజేసికొనుటకు ఇచ్చగించదు కాని, కొన్ని చిన్న సవరణలు:
హద్దుల మీరు ...... పద్యములో:
మెప్పుకై అనుట సాధువు కాదు. మెప్పునకై అనుట సాధువు.
వద్దు వచింపగ ...... అను పద్యములో:
1. వాక్సతీ కరుణ కల్మి .. కల్మి అనునది తెలుగు పదము కదా సమాసములో ఉత్తర భాగములో ఉండరాదు.
2. లేక నౌనొకో అనుట సాధువు కాదు. లేకయౌనొకో అనుట సాధువు. లేక అనునది వ్యతిరేకార్ధకము కదా అందుచేత ద్రుతప్రకృతికము కాదు.
స్వస్తి.
అయ్యా శ్రీ లక్ష్మీనారాయణ గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యములో సంహృతి అని వాడేరు కదా. సంహృతి అంటే సంహారము, సంహరణము అనే అర్థములు కలవు. మీరు ఏ భావములో ఆ పదమును ఉపయోగించేరో కదా.
రిప్లయితొలగించండిగౌరవనీయులు పండిత నేమాని గురువర్యులకు నమస్కారములు
నవ పండితులమని అందుకే అన్నాను . 'సంహృతి' పదమును సమూహమనే అర్థములో వాడినాను. పర్యాయ పద నిఘంటువులో చూసి వ్రాశాను. ఆ పదార్థము సరిగా లేనట్లైతే ,ఈ విధంగా మార్చి వ్రాస్తే ఎలా ఉంటుందంటారు.
అద్దము రీతి ముద్దుగ సమంచిత లక్షణ భావ మాధురిన్
అద్దుచు వ్రాయు ధీ కవి కులాగ్రజు లెల్లర కేమి చోద్యమీ
పద్దెము విద్దె, మాకు నవ పండిత వర్యుల కెల్ల కష్టమౌ
పద్దెము వ్రాయు విద్దెయనఁ బాచిక లాడిన చందమేసుమా.
నేమాని పండితార్యా! ధన్యవాదములు. మీ సూచనల ననుసరించి సవరించిన పద్యాలివి:
రిప్లయితొలగించండిమీరలా నా తప్పొప్పులను తెలియజేస్తూ మార్గదర్శనం చేస్తూనే ఉండాలని నా విన్నపం.
ఎటొచ్చీ కొంచెం మందబుద్ధి మూలాన చేసిన తప్పులనే చేస్తూ ఉంటాను, మీరెత్తి చూపితేనే కాని గుర్తించి సవరించుకోలేను.
హద్దుల మీఱు నొక్కపరి! హాయిగ నవ్వుచు పల్కు నొక్కెడన్!
గద్దె గలట్టి పెద్దలకు కౌతుక మొప్పగ, నాడు, నీడకై
యిద్దరు దిట్టలౌ కవులు హెచ్చిన స్పర్థను కైత లల్లుచో,
పద్దెము వ్రాయు విద్దె యనఁ బాచిక లాడిన చందమే సుమా!
నేమాని పండితులు క్షమించాలి.
వద్దు వచింపగా తగదు, పద్య కవిత్వము వంటఁ బట్టగా
కద్దగు వాక్సతీ కరుణ కల్గక లేశము నైన, నౌనొకో
మొద్దుకు నెద్దుకున్ కుటిల బుద్ధికి వ్రాయగ కైత? కీ డనన్
"పద్దెము వ్రాయు విద్దె యనఁ బాచిక లాడిన చందమే" సుమా!
అయ్యా శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ సవరించిన పద్యములు బాగుగ నున్నవి. 2వ పద్యములో "వంట బట్టగా" మాత్రము వ్యావహారికము. ఒడలు అంటే శరీరము. ఒంట బట్టగా అనుట సాధువు.
అయ్యా శ్రీ లక్ష్మీనారయణ గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ సవరించిన పద్యము చాల బాగుగ నున్నది. సంహృతి గురించి మీ వివరణ బాగుగనే యున్నది. నిఘంటువులో ఇచ్చిన అర్థమును తప్పక వాడుకొనవచ్చును. స్వస్తి.
ధన్యవాదములు గురువుగారు..
రిప్లయితొలగించండినేమాని పండితార్యా! ధన్యవాదములు. క్రిందివిధంగా సవరిస్తున్నాను.
రిప్లయితొలగించండివద్దు వచింపగా తగదు, పద్య కవిత్వము నేర్వ నేరికిన్
కద్దగు వాక్సతీ కరుణ కల్గిన లేశము నైన, నౌనొకో
మొద్దుకు నెద్దుకున్ కుటిల బుద్ధికి వ్రాయగ కైత? కీ డనన్
"పద్దెము వ్రాయు విద్దె యనఁ బాచిక లాడిన చందమే" సుమా!
మిత్రులారా!
రిప్లయితొలగించండిఈ నాటి సమస్యకు అందరూ చక్కగా స్పందించేరు. మంచి పద్యములు వ్రాసేరు. అందరికి అభినందనలు. స్వస్తి.
కొద్ది కుతూహలంబు, చిఱు కోరిక కల్గగ పద్యవిద్యలో
రిప్లయితొలగించండినెద్ది,ఘనంబునై వెలయు హెచ్చగు జ్ఞానము? శూన్యమే సుమా!
సుద్దుల తీరుగా పలికి సొక్కెడు నాకిది నిక్కమేయగున్
పద్దెము వ్రాయు విద్దె యనఁ బాచిక లాడిన చందమే సుమా!
రిప్లయితొలగించండిప్రొద్దును వెళ్ళదీయుటకు ముద్దుగ పాచిక లాడు చుండగా
హద్దులు మీరు సంతసము నందెద రందరు నట్టి యాటలో
పెద్దలు, పండితోత్తములు, విజ్ఞులు, కైతలు వ్రాయు వారి కీ
పద్దెము వ్రాయు విద్దె యనఁ బాచిక లాడిన చందమే సుమా!
బొడ్డు శంకరయ్య గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
కొద్దిగ నేర్చి ఛందమును గొప్పగ మ్రొక్కుచు గూగులమ్మకున్
రిప్లయితొలగించండిముద్దుగ కూర్చి ప్రాసలను బుద్ధిగ నేర్చుచు శబ్దశాస్త్రమున్
దిద్దుచు తప్పులన్నియును తేరగ జూచుచు నాంధ్రభారతిన్
దద్దమ లెల్ల పూనెడిది దండుగ మాలిన క్రీడరో యిదే
పద్దెము వ్రాయు విద్దె యనఁ బాచిక లాడిన చందమే సుమా!