25, అక్టోబర్ 2013, శుక్రవారం

సమస్యాపూరణం - 1215 (క్షీరాబ్ధిశయనుఁ డనంగ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.....
క్షీరాబ్ధిశయనుఁ డనంగ శివుఁడే గదరా!
ఈ సమస్యను పంపిన నాగరాజు రవీందర్ గారికి ధన్యవాదాలు.

40 కామెంట్‌లు:

  1. కవిమిత్రులకు నమస్కృతులు.
    మా అబ్బాయి ఆపరేషన్ రేపు జరగవచ్చు. ఇంతకుముందే ఆసుపత్రినుండి ఇంటికి వచ్చాను. మళ్ళీ వెంటనే వెళ్ళాలి. దయచేసి మిత్రులు పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.
    మా అబ్బాయి స్వాస్థ్యాన్ని కోరుతూ సందేశాలు పంపిన శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. గౌరీ మనోహరుండును
    తారాప్రియ శేఖరుండు త్ర్యంబకుడు మహో
    దారుడు సద్గుణ నికర
    క్షీరాబ్ధి శయనుడనంగ శివుడే గదరా

    రిప్లయితొలగించండి
  3. గురువు గారూ ! మీ అబ్బాయి తప్పక కోలుకోవాలని ఆశిస్తూ, భగవంతుని వేడుకొంటున్నాను.

    రిప్లయితొలగించండి
  4. మిత్రులు శంకరయ్యగారి కుమారునకు శీఘ్రగతిన నారోగ్యము కుదుట పడవలెనని యా భగవంతుని బ్రార్థించుచు...

    ధారుణిలో శివుఁ డనఁగన్
    గోరిన శుభముల నొసంగు కూరిమి వేల్పౌ!
    గోర శుభమిడు హరి! కనుక,
    క్షీరాబ్ధిశయనుఁ డనంగ శివుఁడే గదరా!

    (హరిహరాభేదము)

    రిప్లయితొలగించండి
  5. ఈ రూపము నా రూపము
    నే రూపము నందు నైన నీశానుడినే
    నేరుపు గాంచెడి వారల
    క్షీరాబ్ధిశయనుఁ డనంగ శివుఁడే గదరా!

    రిప్లయితొలగించండి
  6. నారాయణినాధుడుహరి
    క్షీరాబ్దిశయనుడనంగ,శివుడే గదరా,
    గౌరీ మనోహరుడనగ
    కోరిక తీరగ నిరువురి కోరిభజింతున్

    రిప్లయితొలగించండి
  7. గురువుగారికి ప్రణమిల్లుతూ,..
    మీ అభ్బాయి తొందరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను..

    రిప్లయితొలగించండి
  8. శైలజ గారు,
    నారాయణి అనగా పార్వతి ఆమె నాధుడు హరుడు కదా? ఏదైనా నిగూఢార్ధము ఉన్నదా మీ రచనలో?

    రిప్లయితొలగించండి
  9. ఆదిత్య మద్దూరిగారికి,నమస్సులు,..
    లక్ష్మీదేవిని నారాయణి యని అందురు కదా..పార్వతిని కూడా అంటారు..మన బ్లాగులో ఆంద్రభారతిలోచూడండి..

    రిప్లయితొలగించండి
  10. నీరము ధవళాచలమున
    ధారాపాతముగ జారి ధవళతమంబై
    క్ష్రీరమువలెనగుపించగ
    క్ష్రీరాబ్దిశయనుఁ డనంగ శివుఁడే గదరా!

    రిప్లయితొలగించండి
  11. శైలజ గారూ నారాయణి అంటే నారాయణుని సోదరి అనీ, నారాయణుని పత్ని కాదనీ, పార్వతి అనీ పెద్దల మాట. శివుని భార్య శివ వలె నారాయణుని భార్య నారాయణి అనుకోవడము పొరబాటు.

    రిప్లయితొలగించండి
  12. శ్రీ శంకర గురువర్యా! మీ సుపుత్రుడు పడుట వలన తగిలిన గాయము త్వరగా నయమవ్వాలని
    భగవంతున్ని ప్రార్థిస్తున్నాము .

    Roa S. Lakkaraajugaaru! నా పద్యాన్ని ప్రశంసించిన మీకు ధన్యవాదములు.


    రారా!శివ కేశవులొక
    టేరా! భేదంబులేది దెరుగవ నీవా
    గౌరీశుండజు డనబడు
    క్షీరాబ్ధి శయనుడనంగ శివుడే గదరా!

    రిప్లయితొలగించండి
  13. నారాయణుడే యగుగద
    క్షీరాబ్ధి శయను డనంగ ; శివుడే గదరా
    గౌరీపతి భస్మాంగుడు
    మారరిపువు శూలధరుడు మరుగొంగ యనన్ !

    రిప్లయితొలగించండి
  14. అలకపానుపునెక్కి కుమారుడు నిదురించె శేషుని పై,
    కుమారుడన తండ్రి అవతారమని రూఢి చేయుటకై,
    ఈ వింతగని వైకుంఠ వాసులు చర్చించిరి తబ్బిబ్బై
    క్షీరాబ్ధిశయనుఁ డనంగ శివుఁడే గదరా! పెళ్లికోడుకై

    నా రచనకు ఆధారాలు
    1) కుమారస్వామి తండ్రి శివుడి అవతారమని నమ్మడం
    2) శ్రీ మహా విష్ణువు కుమారస్వామికి మేనమామ-పిల్లనిచ్చిన మామ కావడం
    3) వైకుంఠలోకంలో అలక పానుపు సన్నివేశం స్వకల్పితం

    రిప్లయితొలగించండి
  15. శ్రీ మిస్స్సన్నగారికి,నమస్కృతులు..
    లక్ష్మీదేవికి వున్న అనేక పేర్లలో నారాయణి కూడా వున్నది కదా..అదే నేను తీసుకున్నాను,అంతే తప్ప నారాయణుని భార్య కనుక నారాయణి అని భావించి వ్రాయలేదు..నారాయణి అన్న పేరు ఆమెకు వున్నపుడు నేను వ్రాసిన వాక్యం తప్పు అవుతుందంటారా.?

    రిప్లయితొలగించండి
  16. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..
    శ్రీ శంకర గురువర్యా! మీ అబ్బాయికి తగిలిన గాయముల నుండి త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తు!
    ==========*==========
    భూరి వరము నిడు వరధుడు
    క్షీరాబ్ధి శయనుడ నంగ, శివుడే గదరా
    కూరిమి కరమున బట్టిన / కోరిన వరముల నిచ్చెడి
    గౌరీ పతి!గమకము నను గరళము ద్రాగెన్!
    (గమకము = నైపుణ్యము)
    (కూరిమి కరమున బట్టిన= nitya nirmaluDu)

    రిప్లయితొలగించండి
  17. మిత్రులారా! శుభాశీస్సులు.
    నారాయణి అనే నామము పార్వతి దేవికే ప్రసిద్ధము. (సర్వ మంగళ మాంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అని వేదములో పార్వతిని మాత్రమే సంబోధించుచున్నారు కదా). మిగిలిన దేవతలను కూడా నారాయణి అనుచు అనేక సహస్రనామావళులలో ఉందవచ్చును కానీ వానిని ప్రమాణములుగా గైకొనలేము.
    స్వస్తి

    రిప్లయితొలగించండి
  18. మిత్రులారా! శుభాశీస్సులు.

    ఈనాటి సమస్యకు వచ్చిన పూరణలను పరిశీలించుదాము. అందరికీ అభినందనలు.

    శ్రీ గుండు మధుసూదన్ గారు:
    హరిహర అభేదము చూపుచు వ్రాసిన మీ పద్యము చాల బాగుగ నున్నది.

    చి. తమ్ముడు డా. గన్నవరపు : నీ పద్యము రూపాభేదమును దెలుపుచు చాలా బాగుగనున్నది.

    శ్రీమతి శైలజ గారు: మీ పద్యము బాగుగ నున్నది.

    శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారు:
    రజతాచలముపైని నీరు క్షీరమువలె నుండును అను మీ సమర్థన బాగుగ నున్నది.

    శ్రీ లక్ష్మీనారాయణ గారు:
    మువ్వురు మూర్తులకు అభేదము చూపుచు మీరు వ్రాసిన పద్యము చాల బాగుగ నున్నది.

    శ్రీ నాగరాజు రవీందర్ గారు:
    మంచి విరుపుతో చేసిన మీ పూరణ చాల బాగుగ నున్నది.

    శ్రీ వరప్రసాద్ గారు:
    మీ పద్యము కూడా మంచి విరుపుతో చక్కని భావమును వెలువరించు చున్నది.

    స్వస్తి

    రిప్లయితొలగించండి

  19. నా రామనామమెప్పుడు
    నారాణీ! మదిని దలచు నాసఖుడెవరో ?
    నోరారజెప్పు మనుచును
    క్షీరాబ్ధి శయను డనంగ, శివుడే గదరా !

    రిప్లయితొలగించండి
  20. నారాయణ పరమేశ్వరు
    లేరూపము నున్నగాని లీలేయనగా
    సారూప్యము గల దైవము
    క్షీరాబ్ధి శయనుఁ డనంగ శివుఁ డేగదరా !

    రిప్లయితొలగించండి
  21. ధారుణిఁ స్థితి కారకుఁడౌ
    క్షీరాబ్ధిశయనుఁడనంగ, శివుడే గదరా
    భారము తగ్గించెడు లయ
    కారకుఁడీ భువిని గాచు కాలుడు గదరా!

    రిప్లయితొలగించండి
  22. గురువుగారికి నమస్సులు.
    తమ పుత్రుడు శీఘ్రంగా కోలుకోవాలని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను.

    ఇద్దరు మిత్రుల సంభాషణ:

    ఏరా శీనూ! చూడిటు
    క్షీరాబ్ధిశయనుఁడనంగ శివుడే గదరా?
    పోరా! కానే కాదది
    క్షీరాబ్ధిశయనుఁడనంగ శ్రీహరి యనరా!

    రిప్లయితొలగించండి
  23. పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు శంకరయ్య గారికి వందనములు

    తారలు, విశ్వమ్ము,న కా
    ధారములైయున్నశక్తి తత్వమ్మనుచున్
    సారమునెరిగిన వారలు
    క్షీరాబ్ధి శయను డనంగ శివుడే గదరా

    రిప్లయితొలగించండి
  24. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు
    క్షీరాబ్ధిశయనుఁ డనంగ, శివుఁడే గదరా
    ధారుణి నద్వైత రవము
    పూరించిన శంకరుండు భూరి గుణాబ్ధీ!

    రిప్లయితొలగించండి
  25. మిత్రులారా! శుభాశీస్సులు.
    మరికొందరి పూరణలను పరిశీలించుదాము:అందరికీ అభినందనలు.

    శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు:
    పద్యములోని అన్వయము సులభ గ్రాహ్యముగా లేదు.

    శ్రీమతి రాజేశ్వరి గారు:
    శివ కేశవ రూపాభేదముతో పూరించేరు - చాల బాగుగ నున్నది.

    శ్రీ సహదేవుడు గారు:
    ఒక పద్యము మంచి విరుపుతో పూరించేరు చాలా బాగుగ నున్నది. రెండవ పద్యము ఇద్దరి మిత్రుల సంభాషణగా బాగుగ నున్నది.

    శ్రీ తిమ్మాజీ రావు గారు:
    తత్త్వము నెరిగిన వారికి అంతయొ నొక్కటేయని సెలవిచ్చేరు. చాల బాగుగ నున్నది.

    శ్రీ మిస్సన్న గారు:
    మంచి విరుపుతో చక్కని పద్యమును చెప్పేరు. చాల బాగుగ నున్నది.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  26. కోరిన వరములనెల్లను
    బేరములాడక యొసగెడు పేరిమి దైవం
    బై రూఢియయిన కరుణా
    క్షీరాబ్ధిశయనుఁ డనంగ శివుఁడే గదరా!

    రిప్లయితొలగించండి
  27. కోరిక దెలుపుము నీదని
    క్షీరాబ్ధిశయనుఁ డనంగ శివుఁడే గదరా
    కోరెను భస్మాసురు నే
    తీరున నైన దునుమమని దీనుని వోలెన్

    రిప్లయితొలగించండి