10, అక్టోబర్ 2013, గురువారం

పద్య రచన – 490 (విద్యుద్విపత్తు)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
“విద్యుద్విపత్తు”

23 కామెంట్‌లు:

 1. శ్రీగురుభ్యోనమ:

  వెర్రిబాగులవాడు వెలుగులకోసమై
  విద్యుత్తునే నమ్మి విసిగిపోయె
  మడిపంట పండంగ తడియైన పారదే
  విద్యుత్తు లేకున్న వెతలు మిగులు
  నీరైన నివ్వక నిలచె గొట్టపు బావి
  వ్విద్యుద్విపత్తుతో వీధిలోన
  బ్లాగును వీక్షించి పద్యంబు పంపగా
  శక్యంబు కాదులే "శక్తి" లేక

  నేడు విద్యుత్తు మూలమై నిలచి ప్రజకు
  ప్రగతి పథమున నిలిపెను జగతినంత
  దేవి గాయత్రిమాతయే దివ్యశక్తి
  ప్రణతు లర్పింతు మాతకు భక్తి తోన(డ)

  శక్తి = పవర్ {వీక్షింపగా బ్లాగు వీలు కాకున్నది, పద్యంబు పంపగా పవరు లేదు} అందామనుకున్నా, కానీ "పవర్" అనే ఆంగ్ల పదము బదులు శక్తి అన్నాను. బ్లాగు అన్నదానికి సమానార్థము తెకియదు.

  రిప్లయితొలగించండి
 2. శ్రీగురుభ్యోనమ:

  వెర్రిబాగులవాడు వెలుగులకోసమై
  విద్యుత్తునే నమ్మి విసిగిపోయె
  మడిపంట పండంగ తడియైన పారదే
  విద్యుత్తు లేకున్న వెతలు మిగులు
  నీరైన నివ్వక నిలచె గొట్టపు బావి
  వ్విద్యుద్విపత్తుతో వీధిలోన
  బ్లాగును వీక్షించి పద్యంబు పంపగా
  శక్యంబు కాదులే "శక్తి" లేక

  నేడు విద్యుత్తు మూలమై నిలచి ప్రజకు
  ప్రగతి పథమున నిలిపెను జగతినంత
  దేవి గాయత్రిమాతయే దివ్యశక్తి
  ప్రణతు లర్పింతు మాతకు భక్తి తోన(డ)

  శక్తి = పవర్ {వీక్షింపగా బ్లాగు వీలు కాకున్నది, పద్యంబు పంపగా పవరు లేదు} అందామనుకున్నా, కానీ "పవర్" అనే ఆంగ్ల పదము బదులు శక్తి అన్నాను. బ్లాగు అన్నదానికి సమానార్థము తెకియదు.

  రిప్లయితొలగించండి
 3. విద్యుల్లత యలిగిన తరి
  సద్యత్ గర్భమున కొలువు చాతుర్యము నన్
  అధ్యయ నము జేయకనే
  విద్యుత్ విపత్తు ముదమిడు విధ్యార్దులకున్

  రిప్లయితొలగించండి
 4. విద్యుల్లత యలిగిన తరి
  సద్య ద్గర్భమున కొలువు చాతుర్యము నన్
  అధ్యయ నము జేయకనే
  విద్యు ద్విపత్తు ముదమిడు విధ్యార్దులకున్

  రిప్లయితొలగించండి
 5. కూడు గూడు గుడ్డల కంటె విద్యుత్తు ముఖ్యమైనదని నాభావం...

  గూడు చిన్నబోవు గ్రుడ్డి వారైపోవు
  గుడ్డలన్ని చింపు కొనగ బోవు
  కూడు దినగ మనసు కొంచెమైనా రాదు
  ఈకరెంటులేక శోకమేలె.

  రిప్లయితొలగించండి
 6. విద్యుద్విపత్తు అనేది సామాన్యప్రజానీకానికే కానీ మంత్రులకు కాదు కదా. అదే విషయాన్ని మంత్రివర్యులతో చెపుతున్నట్లుగా.........

  త్రాగనునీరులేదు, విషదగ్ధములాయెమనంబులంతటన్
  సాగవుపాడిపంటలిక, సాధ్యముకాదు ప్రశాంతజీవనం
  బేగతి వైద్యసేవజరిపింతురు, పిల్లలకెద్దివిద్య మీ
  భోగముమీదెకాని జనమున్ గని యీ స్థితి చక్కదిద్దుమీ.

  రిప్లయితొలగించండి


 7. విద్యుత్తు లేక గడవదు
  విద్యలకున్ సకల శాస్త్రవిజ్ఞానముకున్
  పద్యమువ్రాసిన పంపగ
  విద్యుత్తే యవసరమ్ము వేల్పులకైనన్
  విద్యున్మూలము సృష్టియు
  విద్యుత్ప్రాధాన్యముగను విశ్వము దిరుగున్
  విద్యుద్విపత్తు వచ్చిన
  సద్యోగము కలుగదింక సద్గతి నొందన్
  ఆద్యంతము లేనిమాత
  విడ్యున్మాతయెగద అణువే విశ్వముగా
  విద్యుత్తు నిమిడి యుండును
  సద్యోజాతమ్ము శక్తి శాంకరి దుర్గీ

  రిప్లయితొలగించండి


 8. ఆంధ్రరాష్ట్రమందంతయునంధకార
  మగుట,విద్యుద్విపత్తులేయగునుమఱిని
  కారణంబులుసిబ్బందిగైరు హాజ
  రగుట , వెలుగులు సూతుమయార్య!మనము?

  రిప్లయితొలగించండి
 9. విద్యుద్విపత్తు వచ్చెను
  విద్యుత్ బృందము వరుసగ విధులకు రాకన్
  పద్యము పంపగ బ్లాగున
  విద్యుత్ లేదాయె చివరకు వీధులనైనన్

  రిప్లయితొలగించండి
 10. ముందు చూపు లేక నంధులై నడువంగ
  భావి తరము లన్ని బాధ పడును
  విజ్ఞతఁ దెలుపంగ విద్యుద్వి పత్తిది
  వనరుల సరి పెంచ వలయు సుమ్మి!

  రిప్లయితొలగించండి
 11. ఫ్యాక్టరీలు విద్యుత్తుతో పరుగు లెత్తు
  రాత్రి వేళలో విద్యుత్తు ప్రభలనిచ్చు
  మానవాళికి విద్యుత్తు మనుగడిచ్చు
  పనులు గాలేవు విద్యుద్విపత్తు వలన

  రిప్లయితొలగించండి
 12. విద్యుద్యోజనలెన్ని వచ్చినను సంప్రీతిన్ మనుష్యుండిలన్
  సద్యోజాతయశాంతిఁ బొంది శుభమౌ సౌహార్దతన్ వీడుచున్
  విద్యుల్లేఖలలోనె పంచునిక విద్వేషంబులన్ పృథ్వి నచ్
  చ్ఛేద్యంబౌ నసహిష్ణుతన్ ప్రభుతపై చింతన్ సదా మున్గుచున్.

  రిప్లయితొలగించండి
 13. జనులు జాగరూకత లేక సంభవించు
  కొన్ని విద్యుద్విపత్తుల కొంత నష్ట
  మగుచు నున్నది; నేర్పున మనగ వలెను
  వాడుకను తెలిసికొనగ భద్రముండు.

  రిప్లయితొలగించండి
 14. అమ్మా లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. చిన్న సూచన: "సద్యోజాత యశాంతి" అను సంధి కార్యము బాగు లేదు. సవరించండి. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 15. అయ్యా,
  అది సందేహం గా అడిగినాను. కట్ చేసి పోస్ట్ చేయలేదనుకుంటా.ధన్యవాదములు. సవరిస్తాను.

  రిప్లయితొలగించండి
 16. శ్రీ బొడ్డు శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. మనుగడిచ్చు అనుటకు బదులుగా మనుగడనిడు అందాము. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 17. శ్రీ పండిత నేమాని గురువర్యులకు నమస్కారములు, సవరణతో.........

  ఫ్యాక్టరీలు విద్యుత్తుతో పరుగు లెత్తు
  రాత్రి వేళలో విద్యుత్తు ప్రభలనిచ్చు
  మానవాళికి విద్యుత్తు మనుగడనిడు
  పనులు గాలేవు విద్యుద్విపత్తు వలన

  రిప్లయితొలగించండి
 18. నేఁడు విద్యుత్తు లేకున్న నిత్య కృత్య
  ములకు నాటంక మొదవు సంపూర్ణముగను!
  నిట్టి విద్యుద్విపత్తిఁ బోనెంచి కృషిని
  జేయవలెఁ బ్రభుత్వము కడు శీఘ్రగతిని!!

  రిప్లయితొలగించండి
 19. విద్యుద్యోజనలెన్నొ వచ్చునెడనాపేక్షల్ మరింతింతలై
  విద్యావేత్తలశాంతిఁ బొంది మదినావేశమ్మునున్ పొందుచున్
  విద్యుల్లేఖలలోనె పంచుదురు విద్వేషంబులన్ పృథ్విన
  చ్ఛేద్యంబౌ నసహిష్ణుతన్ ప్రభుతపై చింతన్ సదా మున్గుచున్.

  అయ్యా,
  మీకు మరీ మరీ ధన్యవాదములు.


  రిప్లయితొలగించండి
 20. గురువర్యులకు వందనములు, ఆలస్యంగా పంపుచున్నందులకు మన్నించ మనవి!

  హాయిగ జనులు బ్రతుకునా హ్లాదముగను
  గడుపుచుండెను విద్యుత్తు గతియు వలన
  పరుగు లిడుచుండె పనులిన్ని ప్రభల తోడ
  ప్రగతి స్తంబించు విద్యుద్విపత్తు వలన

  రిప్లయితొలగించండి