శ్రీదేవీస్తుతి
వందే శ్రీలలితా దేవీం
వందే ప్రణవ రూపిణీమ్ |
వందే సర్వ జగన్నేత్రీం
వందేஉహం సర్వమంగళామ్ ||
వందే దేవ సమారాధ్యాం
వందే కామేశ వల్లభామ్ |
వందే శ్రీచక్ర రాజస్థాం
వందేஉహం సర్వమంగళామ్ ||
వందే పద్మాటవీ సంస్థాం
వందే త్రిపుర సుందరీమ్ |
వందే విశ్వమయీం దేవీం
వందేஉహం సర్వమంగళామ్ ||
వందే పూర్ణేందు బింబాస్యాం
వందే కారుణ్య వర్షిణీమ్ |
వందే నానా విభూషాఢ్యాం
వందేஉహం సర్వమంగళామ్ ||
వందే విద్యాం చిదానందాం
వందే దారిద్ర్య నాశినీమ్ |
వందే దివ్యాయుధోపేతాం
వందేஉహం సర్వమంగళామ్ ||
వందే సింహాసనారూఢాం
వందే పంచాస్య వాహనామ్ |
వందే దుర్గాం మహాకాళీం
వందేஉహం సర్వమంగళామ్ ||
వందే వాగ్దేవాతారాధ్యాం
వందే మంత్ర స్వరూపిణీమ్ |
వందే శాంతాం గుణాతీతాం
వందేஉహం సర్వమంగళామ్ ||
వందే శక్తిమయీం రౌద్రాం
వందే మహిష మర్ధినీమ్ |
వందే ముక్తిప్రదాం నిత్యాం
వందేஉహం సర్వమంగళామ్ ||
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు
వందేஉహం సర్వమంగళామ్
ప్రత్యుత్తరంతొలగించుప్రభాత వేళ మాచే సర్వమంగళ స్తోత్రమును పఠింపింపజేచిన
గురువర్యులు శ్రీ పండిత నేమాని వారి చరణారవిందముల సాష్టాంగ నమస్కారములు.
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
ప్రత్యుత్తరంతొలగించుప్రణామములు
ప్రత్యుత్తరంతొలగించుఉదయాన్నే దేవీ స్తుతిని పఠింప జేసిన పూజ్య గురువులకు కృతజ్ఞతా పూర్వక శిరసాభి వందనములు
అన్నయ్యగారికి నమస్సులు ! శ్రీ దేవి స్తుతి చాలా బాగుంది. ఈ నవరాత్రులు ప్రతి దినము చదువుకోడానికి అనువుగా నుంది.
ప్రత్యుత్తరంతొలగించుమా రచన గని హితులు సమాదరమున
ప్రత్యుత్తరంతొలగించుస్పందన మొనర్చి రింపుగా స్వాంతమలర
వారలకు నెల్ల శ్రీదేవి వరద యగుచు
శాంతి సౌఖ్యాధియోగమొసంగు గాక