8, అక్టోబర్ 2013, మంగళవారం

పద్య రచన – 488 (వేఁప పుల్ల)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
“వేఁప పుల్ల”

25 కామెంట్‌లు:

  1. బ్రష్షది తాతకు నోరే
    ప్రెష్షుగ నుండేను కడుగ బేక్టీర్యానే
    హుష్షని మాయంబగునా
    యుష్షే బెరుగునని తాత యూరిలొ చెప్పెన్.

    రిప్లయితొలగించండి
  2. ఒక్కటియై వచ్చు, నూగును ముప్పది
    ....యిద్దరితో నేగు నిద్దరివలె
    ఒక కొంత చేదు వేరొక కొంత తీయన
    ....కలుగు రసమ్ముల వెలువరించు
    ఔషధ సారమ్ములలరు పుష్కలముగ
    ....క్రిముల నెల్లను సంహరించు చుండు
    కాల కృత్యములలో చాల ముఖ్యంబగు
    ....దంత ధావనమున దనరుచుండు
    వేపపుల్ల చాల విలువ గల్గిన దను
    ఘన యశమ్ము ధరణి గాంచె గాదె?
    కాల మహిమ చేత మూల జేరెను నేడు
    కుంచె లెక్కువయి ప్రపంచమందు

    రిప్లయితొలగించండి
  3. వీధి లోన యుండు వేపచె ట్టుపుల్ల
    టీతు తోము నాటి టూతు బ్రష్షు
    పట్టణాల యందు వాడుట మరచినా
    పల్లె సీమ జూడ ప్రబలు చుండె

    రిప్లయితొలగించండి
  4. కాన్వెంట్ విద్యార్థి తన స్నేహితునితో ... వేపపుల్ల గురించి..

    బ్రష్షది వేప్ స్టిక్, మౌతే
    ఫ్రెష్షగు వాష్ చేయ బ్యాడ్ బేక్టీర్యాయే
    హుష్షగు యూస్ చేయగ నా
    యుష్సింక్రీసనుచు గ్రాండ్ ప యూరిలొ చెప్పెన్.

    రిప్లయితొలగించండి
  5. నోరు శుభ్రపడును తీరుగా నమలిన
    చేదు చంపు క్రిముల చేర నీదు
    వేపపుల్ల తోడ వీలుగా చేసెడు
    దంత ధావనమె ముదమ్ము గూర్చు.

    రిప్లయితొలగించండి
  6. వేఁప పుల్ల బెట్టి పేరును తోమగా
    పలువరుస మెరయుచు పలుకరించు
    శోభ నిచ్చి నీకు లాభ మొసగు పుల్ల
    పిచ్చి గాని నీకు పేస్టులేల!

    రిప్లయితొలగించండి
  7. పళ్ళు తోముటకయి పవమాన సుతునకు
    నయ్యశోక వనము నందు కాను
    పించదగుట నొక్క వేపపుల్లయు నంత
    కోపమున వనమును గూల్చె నతడు

    రిప్లయితొలగించండి
  8. పూజ్యులు నేమాని వారి పద్యము చమత్కార జనకముగ నున్నది. అభినందనలు!

    నోట నిడక మున్ జేదాయెనో యటండ్రు;
    నమలఁగాఁ దీపి, యమృత మంచండ్రు జనులు!
    లోకమం దిదె మందయ్య, శోకమేల?
    పేస్టు వేస్టయ్య; మేలిడు వేఁప పుల్ల!!
    యెండుచోఁ బొయ్యి నంటించ నిదె సమిధయ;
    బ్రష్షుకన్నను పదిరెట్లు భద్ర మిదియ;
    (కుంచె కన్నను మేలిడు నంచితముగ)
    రెండుగాఁ జీల్ప నిదె టంగుక్లీన రయ్య;
    (రెండుగాఁ జీల్ప "రసనమాలిన్యదూర"!)
    కాన,నే నెల్ల వేళల ఖర్చుఁ బెంచు
    వేని నొల్లను; కావలె వేఁప పుల్ల!!

    రిప్లయితొలగించండి
  9. శైలజగారూ,
    మొదటి పాదంలో గణదోషం సవరించవలసి యున్నది..

    రిప్లయితొలగించండి
  10. వేప పుల్ల లోని విలువైన గుణములు
    మానవాళికెల్ల మంచి జేయు
    దంతధావనమ్ము దానితో జేయగా
    పాచినెల్ల దీసి కాచు నోరు

    రిప్లయితొలగించండి
  11. మంచియలవాట్ల నెల్లరు మఱచినారు
    నేడు మరల విచారించ నేర్చినారు
    విడచి పుచ్చిన వాటిని ప్రీతితోడ
    తలచుచుంద్రు; వేపను వాడ తరలి రారు.

    రిప్లయితొలగించండి
  12. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..

    వివిధ రకముల పేస్ట్ ల ప్రకటనల పై
    ========*============
    వేప పుల్ల కున్న విలువ యొక్కటి లేదు
    దంతములను గాచ దండిగాను
    తీపి లవణ మనుచు దెలుపు చుందురు నేడు
    పరువు లేని వారు బలము గాను !

    రిప్లయితొలగించండి
  13. వేపపుల్ల నమల వెగటుగా నుండును
    పండ్లుతోమ తెల్లబడును మిగుల
    పిప్పి పన్నులుండవెప్పటికినిమఱి
    వేపపుల్ల మేలు వేనవేలు

    రిప్లయితొలగించండి
  14. నోటి శుభ్రతఁ గాచేటి మేటి కుంచె!
    సాయి సైతము వాడెను సత్య మనుచు
    యరగ దీయగ గంధమ్ము నణచు పుండ్ల!
    వేప పుల్లతో లాభాలు వేన వేలు!



    రిప్లయితొలగించండి
  15. లక్ష్మీదేవిగారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ..సవరణ...

    వేప పుల్ల మేలు వేనవేలుగలవు
    టీతు తోము నాటి టూతు బ్రష్షు
    పట్టణాల యందు వాడుట మరచినా
    పల్లె సీమ జూడ ప్రబలు చుండె

    రిప్లయితొలగించండి
  16. పూజ్యులు శంకరయ్యగారికి వందనములు

    వేపపుల్ల బ్రష్షు వేపపుల్లయెపేస్టు
    పండ్లు తోమ క్రిములు పారిపోవు
    నడుమ చీల్చ పుల్ల నాలుక బద్దగా
    కడగి నోరు శుభ్ర పడును నిజము
    రోజుకొక్క బ్రష్షు రోజుకొక్క పేస్టు
    రోజు నాల్కకున్న బూజుదీయ
    కాణి ఖర్చు లేక కలుగు శుభ్రత నోటి
    కంపు తొలగి పోవు నింపొసంగు

    రిప్లయితొలగించండి
  17. పెరడున వేపను బెంచగ
    విరివిగ నౌషధ ములిచ్చు వేప పుల్లేయైనన్
    సురటిగ రంజిల గాలులు
    సరిజేయును మనుజు లందు సాత్విక గుణముల్

    రిప్లయితొలగించండి
  18. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    అన్యదేశ్యాలను ఉపయోగించారు కనుక ‘ఉండేను, ఊరిలొ’ అన్నపదాల వాడడం దోషంగా పరిగణించడం లేదు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    సీసం మొదటి పాదం చివర ‘ఇద్దరి వలె’ అన్నదాన్ని ‘ఇద్ద రగుచు’ అంటే బాగుంటుందేమో!
    మీ రెండవ పద్యంలోని చమత్కారం అలరించింది.
    *
    శైలజ గారూ,
    సవరించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    చాలా రోజుల తర్వాత.... మంచి పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    అన్యదేశ్యాలను వాడిన పాదాలకు పాఠాంతరాలనిచ్చారు. బాగుంది. సంతోషం.
    *
    కుసుమ సుదర్శన్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మంచి పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘కాచేటి’ని ‘కాచెడి’ అనండి. అలాగే ‘సత్యమనుచు/ నరగదీయగ...’ అనండి.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    రెండవ పాదంలో గణదోషం. ‘వేప పుడకయే’ అందామా?

    రిప్లయితొలగించండి
  19. దంతమలినజాల మంతయు పోగొట్టి
    హర్ష మందజేసి యనుదినంబు
    జనుల గాచుచుండు ఘనరుగ్మతలనుండి
    విజ్ఞులార! నిజము వేపపుల్ల.

    చేదు నెంచ వలదు సేమంబు తాఁగూర్చు,
    క్రిముల జేరనీదు, విమలముగను
    దంతపంక్తి నుంచు దారుఢ్యతను బెంచు
    విజ్ఞులార! నిజము వేపపుల్ల.

    పళ్ళు తోము కొరకు బహువిధ చూర్ణాలు
    మరియు లేహ్యతతుల మాటయేల?
    తనివిదీర్చగలదు తానొక్కటున్నచో
    విజ్ఞులార! నిజము వేపపుల్ల.

    ధనము కోరబోదు, మనమున కెంతయో
    హాయి నొసగుచుండు, హానికరము
    కాదు కొంచెమైన, వాదు లింకేలనో
    విజ్ఞులార! నిజము వేపపుల్ల.

    పిన్నవారికైన, పెద్దవారలకైన
    కోరి పూనువారి కేరికైన
    అతుల చేతనత్వ మారోగ్య మందించు
    విజ్ఞులార! నిజము వేపపుల్ల.

    రిప్లయితొలగించండి
  20. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    ‘అతుల చేతనత్వ మారోగ్య మందించు వేపపుల్ల’ను గురించిన మీ ఖండిక చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. దంత ధావనము సలుప చింత వీడి
    చెంత నున్నట్టి యొక వేప చెట్టు కొమ్మ
    కొంత విరుచుచు వాడిన దంతములను
    వింత కాదయ్య రక్షించు వేప పుల్ల

    రిప్లయితొలగించండి
  22. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. గురువుగారికి ధన్యవాదములు. తమరి సూచిత సవరణ:
    నోటి శుభ్రతఁ గాచెడు మేటి కుంచె!
    సాయి సైతము వాడెను సత్య మనుచు
    నరగ దీయగ
    గంధమ్ము నణచు పుండ్ల!
    వేప పుల్లతో లాభాలు వేన వేలు!

    రిప్లయితొలగించండి
  24. గురువుగారూ,
    ధన్యవాదాలు. పైన శంకరాభరణము పేరూ, వాగ్దేవి కొలువైన తీరూ బాగున్నవి.

    రిప్లయితొలగించండి