7, అక్టోబర్ 2013, సోమవారం

పద్య రచన – 487 (ప్రణయ కలహము)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
“ప్రణయ కలహము”

13 కామెంట్‌లు:

 1. కలహపు ప్రణయము నందున
  చిలిపిగ వల పన్ని గెలిచె చెన్నుని ప్రేమన్
  వలపుల తలపులు నింపుచు
  కలహంస సొగసు ప్రణయిని కలహాం తరితౌ

  రిప్లయితొలగించండి

 2. కలహము పుట్టిన జనులకు
  కలలోనే శాంతి, ప్రణయ కలహము తీరన్
  కలభాషిణి దరి జేరుచు
  కలలను పండించి శాంతి గలిగించు గదా !

  రిప్లయితొలగించండి
 3. శృంగార భావమే చెలగు నెదను గాని
  ....కనులలో చిరునవ్వు కాన రాదు
  చక్కని సుమమాల జడను దాల్చును గాని
  ....వికసింప దానన బిసరుహంబు
  కమ్మని పలుకుల గుమ్మరించెడు నోరు
  ....మూగ వోయిన రీతి ముడుచు కొనును
  తాపమో కోపమో పాపమా తరుణిలో
  ....కల ప్రేమరాశిని గప్పి వేయు
  పంచబాణుని నేనియు మించునట్టి
  యందముల వాడు ప్రియుడంత యలుక దీర్చి
  ముచ్చటల గూర్చి జేర్చుచు బూల పాన్పు
  బళి సుఖాంతమొనర్చును ప్రణయ లీల

  రిప్లయితొలగించండి
 4. ప్రణయకలహములనునవిపడతులందు
  విరివిగాకాని పించును తరచి చూడ
  ప్రేమతోడన దరిజేరి ప్రియము పలుక
  తొలగిపోవును గోపము తోయజాక్షి!

  రిప్లయితొలగించండి
 5. సుందరాంగివి నాదుకన్నులఁ జూడ చక్కని బొమ్మవై
  యందలంబునఁ గొల్వుతీర్తునటంచు మోసము జేతువా?
  కుందనంపు యడంద నిల్పితి కొమ్మ! నమ్మవె భామినీ!
  చిందులాపవె నా మనమ్మున సేదతీరగ వేడుదున్.

  రిప్లయితొలగించండి
 6. సంభాషణ

  సుందరాంగివి నాదుకన్నులఁ జూడ చక్కని బొమ్మవై
  యందలంబునఁ గొల్వుతీర్తునటంచు మోసము జేతువా?
  కుందనంపు యడంద నిన్నిక కొమ్మ! నిల్పితి నమ్మవా?
  చిందులాపవె నా మనమ్మున సేదతీరగ వేడుదున్.

  రిప్లయితొలగించండి
 7. శ్రుతి మించగ సతి కోపము
  బ్రతి మాలెడు పతి శిరంబుఁ బాదము సోకన్!
  సుతి మెత్తని కాల్నొక్కగ
  గతిఁదప్పుఁగరము 'ప్రణయకలహము' మీరన్!

  రిప్లయితొలగించండి
 8. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  ప్రణయ కలహపు తీరుతెన్నులను చక్కని సీసంలో మనోహరంగా అభివర్ణించారు. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *

  శైలజ గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  మొదటి పూరణలో ‘పూనాలో నొక’ అనండి.
  రెండవ పూరణలో మూడవ పాదంలో గణదోషం. ‘గనగ’ను ‘గన’ అంటే సరి.
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  తిమ్మనగారి సత్యభామను గుర్తుకు తెచ్చారు. బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. కలహ మాడెడు యింటిన కలిమి సున్న
  ఫ్రణయ కలహమందున ప్రబలు ప్రేమ
  ప్రణయధారలు పలుకున పంచుకొనగ
  మధుర మైనది పరిణయ బంధనమ్ము

  రిప్లయితొలగించండి
 10. పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

  కోపమ దేలనే చెలియ! కోరిన వన్నియు దీర్చి నాన నన్
  యే పర భామతో గడపి యీసమయ మ్మిట వచ్చినావు నీ
  కై పరితాప మందుచును వ్యగ్రత వేచిన సత్యభామ నే
  జ్ఞాపక ముంచినావ ?నెడి గార పు వాక్కలహమున్ స్తుతి౦చెదెన్

  రిప్లయితొలగించండి
 11. శైలజ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ ఉత్పలమాల చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. శైలజ గారి పద్యం బాగుంది.చివరి పాదంలో యతి మైత్రి?

  రిప్లయితొలగించండి
 13. సహదేవుడు గారూ,
  ధన్యవాదాలు. నేను గమనించలేదు.
  ‘స్వాదువైనది పరిణయ బంధనమ్ము’ అంటే సరి!

  రిప్లయితొలగించండి