20, అక్టోబర్ 2013, ఆదివారం

సమస్యాపూరణం - 1210 (కలిమి గలుఁగు గృహిణి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.....
కలిమి గలుఁగు గృహిణి కంటఁ గన్నీ రొలుకన్.

39 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించ నున్నవి !

    మాయలఫకీరు మరణించిన పిదప బాలనాగమ్మ :

    01)
    ____________________________________

    కలతలు దీరిన వేళను
    కలిసిన తనయుని , ప్రియమగు - కాంతుని గనగా
    గలిగిన నానందముతో
    కలిమి గలుఁగు గృహిణి కంటఁ - గన్నీ రొలుకన్ !
    ____________________________________

    రిప్లయితొలగించండి
  2. రావణ వధానంతరం విభీషణుడు తోడ్కొని వచ్చిన సీత :

    02)
    ____________________________________

    అలనాడు రాము జూచిన
    అలివేణి సీత యనంగ - మానందముతో
    జలజల జలజల రాల్చిన;
    కలిమి గలుఁగు గృహిణి కంటఁ - గన్నీ రొలుకన్ !
    ____________________________________
    అనంగము = హృదయము

    రిప్లయితొలగించండి
  3. దుశ్శాసనుని మరణానంతరం ద్రౌపది :

    03)
    ____________________________________

    తులువగు దేవరు రక్తం
    బలదిన తన కుంతలముల - పావని గనుచున్
    మిలమిల నవ్వుల జిందుచు
    కలిమి గలుఁగు గృహిణి కంటఁ - గన్నీ రొలుకన్ !
    ____________________________________
    దేవరుడు = మరది

    రిప్లయితొలగించండి
  4. శ్రీకృష్ణుడు మానసంరక్షణ జేసిన పిదప ద్రౌపది :

    04)
    ____________________________________

    తులువలు వలువల నూడ్చిన
    విలువల గాపాడి నట్టి - వెన్నుని గనుచున్
    వలవల వలవల నేడ్చుచు
    కలిమి గలుఁగు గృహిణి కంటఁ - గన్నీ రొలుకన్ !
    ____________________________________

    రిప్లయితొలగించండి
  5. తన కుమారునికి బదులు భీముణ్ణి పంపిన కుంతిని జూచి ఆ యిల్లాలు :

    05)
    ____________________________________

    బలుడు, బకాసురు చెంతకు
    బలినిడ భీముని పనిచిన - పాండవ మాతన్
    గలుగును కుశలం బనుచున్
    కలిమి గలుఁగు గృహిణి కంటఁ - గన్నీ రొలుకన్ !
    ____________________________________

    రిప్లయితొలగించండి


  6. తొలకరి చినుకుల విచ్చెడి
    వలపుల పతి సతులు మునుగ, వారక ముదముల్,
    గలగల నవ్వులు, దరగని
    కలిమి గలుఁగు ! గృహిణి కంటఁ గన్నీ రొలుకన్.

    రిప్లయితొలగించండి
  7. సుఖప్రసవమైన పిదప నే యిల్లాలైనా :

    06)
    ____________________________________

    అలసట బాధయు భయమును
    గలిగిన తనలోన నదిమి - కాన్పున దనయున్
    గలిగిన ; ముసిముసి నవ్వుల
    కలిమి గలుఁగు గృహిణి కంటఁ - గన్నీ రొలుకన్ !
    ____________________________________

    రిప్లయితొలగించండి
  8. పట్టుదలతో ప్రయత్నించి చెడ్డ భర్తను మంచిగా మార్చుకున్న వనిత :

    07)
    ____________________________________

    నిలుకడు జూపిన నిత్యము
    నిలకడ లేనట్టి పతిని - నిక్కపు మార్పుల్
    గలిగిన; సంతోషముతో
    కలిమి గలుఁగు గృహిణి కంటఁ - గన్నీ రొలుకన్ !
    ____________________________________
    నిలుకడు = పట్టుదల

    రిప్లయితొలగించండి

  9. పెండ్లాము కంట కన్నీరు పెట్టిన మగవారు
    ఐసై పోదురు ; బంగరు ధర తగ్గే భామలారా
    లీటరు కన్నీరు ఒలికించుడు బలిమి బంగరు
    కలిమి గలుఁగు గృహిణి కంటఁ గన్నీ రొలుకన్!!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. జిలేబీ గారి బంగారు తలపుతో ;

    అలవోక నాలి యేడ్చిన
    విలవిల దా మంచు గాడె ప్రియనాథుండున్ ?
    తులము ధర తగ్గె , పుత్తడి
    కలిమి గలుఁగు ! గృహిణి కంటఁ గన్నీ రొలుకన్!!

    రిప్లయితొలగించండి
  11. ఈరోజు కిశోర్ గారూ మూర్తి గారూ రకరకాలుగా " కలిమి గలుగునట్లు గృహిణికంట కన్నీరొలికిస్తున్నారు" మేమేం చేయాలి..

    రిప్లయితొలగించండి
  12. పిలిచడుగకమ్మపెట్టదు
    అలుకను మరి చూపకుండ నడుగకయున్నన్
    పలునగలు పతియె దెచ్చున
    కలిమి గలుఁగు గృహిణి కంటఁ గన్నీ రొలుకన్.

    రిప్లయితొలగించండి

  13. గుండు మధుసూదన్ గారి పూరణ.....

    ఇల గృహిణి సంతసించిన
    కలిమి గలుఁగు; గృహిణి కంటఁ గన్నీ రొలుకన్
    కలిమి తొలఁగు, కాన నెపుడు
    మెలఁగుఁడు సతి సంతసించి మేలు దలిర్పన్.

    రిప్లయితొలగించండి
  14. పలు నగలను పొరుగున గల
    కలికి గలిగె ననుట వినుడు, గనజాలక మి
    క్కిలి మచ్చరమున నలుగును
    కలిమి గలుగు గృహిణి కంట గన్నీరొలుకన్

    రిప్లయితొలగించండి
  15. చలికాలపుసాయంత్రము
    తలపడె చేయగ పకోడి తరగగ యుల్లిన్
    జలజల రాలెను! హతవిధి!
    కలిమి గలుగు గృహిణి కంట-కన్నీ రొలుకన్!

    రిప్లయితొలగించండి
  16. అలిగిన వేళల సత్యను
    అలరించగమాధవుండుఅక్కున జేర్చన్
    గలగల నవ్వెను భామయె
    కలిమి గలుగు గృహిణి కంట-గన్నీ రొలుకన్!

    రిప్లయితొలగించండి
  17. హనుమచ్చాస్త్రి గారు,

    మీరు చెప్పినట్టు, శ్రీ వసంత్ కిశోర్ గారు కురిపించే పద్యాల ఝల్లులలో తడవని అంశమే లేదే. మీరు కూడా గెంటిచేశారు. ఇక మాబోంట్లకు అవకాశమెక్కడిది? అయినా ఒక చిన్న సాహసం........

    ఫలితమునెంచకనీర్ష్యా
    ఫలభారముతోడనుండి పరులకు కలిగే
    కలిమికినోర్వగ లేకన్
    కలిమిఁ గలుఁగు గృహిణి కంటఁ గన్నీ రొలుకన్.

    రిప్లయితొలగించండి
  18. ఇలఁ జదువన్ శ్రీసూక్తము
    కలిమిగలుఁగు , గృహిణికంటఁ గన్నీరొలుకం
    గలిగించెడు సంతోషము ,
    తొలగెడు పేదరికమెంత దుర్భరమైనన్ II

    తొలగెడు పేదరికంబున్
    కలిమిగలుఁగు , గృహిణికంటఁ గన్నీరొలుకన్
    లలనామణి శ్రీ సూక్తము
    వలనన్ హోమంబు జేయ వచ్చెడు పొగతో II

    రిప్లయితొలగించండి
  19. పండితనేమాని గారికి పూజ్యగురుదేవులు శంకరయ్యగారికి వందనములు

    చెలిమియు వలపును పరువపు
    కలిమి గలుగు గృహిణి కంట కన్నీరొలుకన్
    తలమే దైవము కైనను
    అలుకను కలతను దీర్చక నక్రియుడవగన్

    రిప్లయితొలగించండి
  20. 'గెలిచితి నమ్మా! పరీక్ష
    సులువుగ నీ పూజ వలన' సుతుడన కన్నీ-
    రొలికించు తల్లి ముదమున!
    కలిమి గలుఁగు గృహిణి కంటఁ గన్నీ రొలుకన్.

    'కొలువు లభించిన దమ్మా!
    సులువుగ నీ పూజ వలన' సుతుడన కన్నీ-
    రొలికించు తల్లి ముదమున!
    కలిమి గలుఁగు గృహిణి కంటఁ గన్నీ రొలుకన్.

    రిప్లయితొలగించండి
  21. కవిమిత్రులకు నమస్కృతులు.
    ఈనాటి సమస్యను కొందరు మిత్రులు సరిగా అర్థము చేసికొననట్టుంది. ‘గృహిణి కంట కన్నీరొలికినచో కలిమి గలుగు(తుంది)’ అనీ, ‘కలిమి గలుగు (గలిగిన) గృహిణి కంట కన్నీరొలుకన్..ఏమి చేసింది? లేదా ఏమి జరిగింది?’ అనీ అర్థాలు వస్తాయి (అని నేను అర్థం చేసుకొన్నది).
    కొందరు సమస్యను విరిచి సమర్థంగా పూరణలు చేసారు.
    ‘కలిమి గలుగు గృహిణికి + అంట, కన్నీరొలుకన్’ అని ‘కన్నీరొలుకుచుండగా గృహిణికి కలిమి కల్గునంట’ అనే అర్థాన్ని తీసుకొన్నారేమో కొందరు. అప్పుడు వారి పూరణలు సమర్థనీయమే అవుతాయి.
    ఈనాటి సమస్య మిమ్మల్నేమో కాని నన్ను గందరగోళంలో పడవేసింది.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ ఏడు పూరణలూ సప్తవర్ణాల ఇంద్రధనుస్సు అయింది. బాగున్నవి. అభినందనలు.
    ‘నవ్వుల కలిమి’ అన్న పూరణ చాలా బాగుంది.
    రెండవ పూరణ రెండవ పాదంలో ‘ణివేణి’ గణదోషం.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    బాగా నవ్వినా కన్నీరొస్తుంది. అంతగా నవ్వించాడా పతి తన గృహిణిని? బాగుంది మీ పూరణ. అభినందనలు.
    జిలేబీ గారి భావాన్ని ఛందోబద్ధం చేసినందుకు ధన్యవాదాలు.
    *
    జిలేబీ గారూ,
    ‘ఆడది ఏడ్చి సాధిస్తుంది’ అన్నారు కదా! మంచి భావాన్ని అందించారు. దానికి గన్నవరపు వారు చక్కని పద్యరూపాన్నిచ్చారు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘పిలిచి యడుగక యమ్మ’ అనవలసి ఉంది. ‘పిలువక యమ్మయు బెట్టదు’ అందామా?
    *
    గుండు మధుసూదన్ గారూ,
    విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణలో ‘తరగగ నుల్లిన్’ అనండి.
    రెండవ పూరణలో ‘సత్యను + అలరించగ’, ‘మాధవుండు + అక్కున’ అన్నప్పుడు సంధి నిత్యం. మొదటి రెండు పాదాలకు నా సవరణ....
    అలిగిన సత్యను మాధవుఁ
    డలరించగ ప్రేమమీఱ నక్కున జేర్చెన్’
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
    బహుకాల దర్శనం. సంతోషం.
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘ఐనను + అలుకను’ అన్నప్పుడు సంధి జరుగుతుంది. ‘తలమే దైవమునకు నా/యలుకను...’ అందామా?
    *
    మిస్సన్న గారూ,
    పరీక్ష గెల్చి, కొలువు సాధించిన కుమారుని వాక్యాలుగా మీ రెండు పూరణలు (రెండనవచ్చునా?) బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణ మొదటి పాదంలో గణదోషం. ‘గెలిచితి పరీక్ష నమ్మా’ అంటే సరి.

    రిప్లయితొలగించండి
  22. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..
    ఈరోజు శ్రీ వసంత కిశోర్ గారు మంచి పద్యములతో మొదలు పెట్టినారు.
    అందరికీ వందనములు !
    ఊటీ మరియు సొంత ఊరు వెళ్ళి వచ్చితిని, నెట్ సమస్యలవల్ల వారం రోజులు బ్లాగునకు దూరమైతిని.
    శ్రీ మిస్సన్న గారి క్రొత్త చిత్రము బాగుగానున్నది.
    =========*=========
    కలియుగ రావణులు బలుక
    కలిమి గలుఁగు గృహిణి కంటఁ గన్నీ రొలుకన్,
    తులువలు జలజల విలువల
    వలువలు విడచుచు నడచిరి పావనమనుచున్!

    మరియొక ప్రయత్నము గృహిణి కంట కన్నీరొలుక తొలకరి చినుకు వలె సంపదలు మాయమౌనని.
    ========*========
    కలియుగ ఖలులకు బలముగ
    కలిమి గలుఁగు, గృహిణి కంటఁ గన్నీ రొలుకన్.
    కలుషపు గడలిని గలువక
    దొలగును కలిమి చినుకు వలె, దురితము మిగులున్!

    రిప్లయితొలగించండి
  23. గురువుగారికి ధన్యవాదాలు.

    వరప్రసాదు గారి సునిశిత పరిశీలనకు జొహార్లు.
    వారి విహార యాత్ర ఉల్లాసంగా గదిచిందని తలుస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  24. కలగన్న కొలువున సుతుఁడు
    కులమంతయు పొగడు రీతి కోడలు దొరకన్
    పులకింతల తులతూగెడు
    కలిమి గలుఁగు, గృహిణి కంటఁ గన్నీరొలుకన్!

    రిప్లయితొలగించండి
  25. వరప్రసాద్ గారూ,
    మీ ప్రయాణం ఆనందాన్నిచ్చిందని భావిస్తున్నాను.
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  26. కలహంస కలికి సతియని
    చెలువమ్ముగ నుండ నట్టి చెలి కాడున్నన్
    చులకన జేసిన నీసుగ
    కలిమి గలుగు గృహిణి కంట కన్నీ రొలుకన్

    రిప్లయితొలగించండి



  27. కలకంఠి మోదమొందిన
    కలిమికలుగు;గృహిణి కంట కన్నీరొలుకన్
    కలిమి నశించును.పతియున్
    కలికిని సంతృప్తి బరుప గార్యంబౌగా.


    రిప్లయితొలగించండి
  28. గురువుగారికి ధన్యవాదాలు.
    శ్రీ మిస్సన్న గారికి ధన్యవాదాలు.

    ఊటీ చాలా చల్లగా నున్నది గురువుగారు, నిజంగా ఆ చలిలో పద్యములు (కవితలు ) వ్రాయుట మరచితిని. అక్కడ వ్రాయుట బహు కష్టముగానున్నది. ఊటీ చాలా చాలా అందమైన నగరము. అక్కడ నిత్యమూ చిరు జల్లులు పడుచున్నవి. యాత్రలో వీరప్పన్ సంచరించు బండిపుర అడవి బహు సుందరమైనది.

    రిప్లయితొలగించండి
  29. శ్రీగురుభ్యోనమ:

    మలుపులు ద్రిప్పుచు కథలను
    కలకాలము సాగదీసి కష్టము లెన్నో
    కలిగించెడి నిర్మాతకు
    కలిమి గలుఁగు, గృహిణి కంటఁ గన్నీ రొలుకన్.

    రిప్లయితొలగించండి
  30. మాస్టరు గారూ ! ధన్యవాదములు.
    మీరు చూపిన సవరణతో..

    పిలువక నమ్మయె బెట్టదు
    అలుకను మరి చూపకుండ నడుగకయున్నన్
    పలునగలు పతియు దెచ్చున
    కలిమి గలుఁగు గృహిణి కంటఁ గన్నీ రొలుకన్.

    రిప్లయితొలగించండి
  31. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    కమనీయం గారూ,
    చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  32. మిత్రులు
    గోలి హనుమచ్చాస్త్రి గారికీ
    సంపత్‌కుమార్ శాస్త్రి గారికీ
    వరప్రసాద్‌ గారికీ
    ధన్యవాదములు !

    శంకరార్యా ! ధన్యవాదములు !

    మిత్రులందరి పూరణలూ మురిపించు చున్నవి !

    రావణ వధానంతరం విభీషణుడు తోడ్కొని వచ్చిన సీత :

    02అ)
    ____________________________________

    అలనాడు రాము జూచిన
    అలివేణి యమల యనంగ - మానందముతో
    జలజల జలజల రాల్చిన;
    కలిమి గలుఁగు గృహిణి కంటఁ - గన్నీ రొలుకన్ !
    ____________________________________
    అమల = సీత
    అనంగము = హృదయము

    రిప్లయితొలగించండి
  33. అల శంకరార్యులనుఁ గని
    విలపించెను తరుణిదాను వేదనతోడన్
    కలదే భాగ్యమటంచున్.
    కలిమి గలుఁగు గృహిణి కంటఁ గన్నీ రొలుకన్.

    రిప్లయితొలగించండి
  34. కలవారిది కోడ లొకటి
    కలికియె కామాక్షి పేరు కాళ్ళకు నీళ్ళన్
    నిలబడి తానిచ్చెనుగా!
    కలిమి గలుఁగు గృహిణి కంటఁ గన్నీ రొలుకన్

    రిప్లయితొలగించండి


  35. చెలిమిని గాంచిన నుల్లము
    కలిమి గలుఁగు గృహిణి! కంటఁ గన్నీ రొలుకన్
    విలువలు తగ్గును నీకు
    న్నలుకల మానుము కనకననవ్వులు తప్పున్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి

  36. నాటి జిలేబీయానికి నేటి జిలేబీయం

    చెలియా! బంగారు ధరలు
    పలురెట్లుపెరి గెనుగాద ! పదపడి బాష్ప
    మ్మొలికింప మగడు కొనగన్
    కలిమి గలుఁగు గృహిణి! కంటఁ గన్నీ రొలుకన్

    జిలేబి

    రిప్లయితొలగించండి
  37. విలపించగ నొడ్యాణము
    కలలో కనిపించినదని కమ్మల సతి భల్
    బలుపుగ కంసాలయ్యకు
    కలిమి గలుఁగు గృహిణి కంటఁ గన్నీ రొలుకన్

    రిప్లయితొలగించండి