15, అక్టోబర్ 2013, మంగళవారం

సమస్యాపూరణం - 1205 (శూర్పణఖ రామచంద్రుని)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.....
శూర్పణఖ రామచంద్రుని సోదరి యఁట 

18 కామెంట్‌లు:

 1. తనను చేపట్టి రమియించు మనియె నపుడు
  శూర్పణఖ రామచంద్రుని, సోదరియట
  ఖ్యాతి వహియించి త్రైలోక్యజేత యైన
  అసురపతి పంక్తికంఠున కామె నిజము.

  రిప్లయితొలగించండి
 2. చుప్పనాతియనుచు బిల్వ నొప్పునెవరి
  నదియ కామించె నెవ్వరి నడవిలోన
  వరస కేమగు రావణాసురున కామె
  శూర్పణఖ- రామచంద్రుని- సోదరి యఁట

  రిప్లయితొలగించండి

 3. పూజ్యగురుదేవులు శంకరయ్య గారికి వందనములు


  జానకీరామచంద్రుల జంట జూచి

  కామశదగ్ధ పీడిత కలియ గోరె

  శూర్పణఖ రామచంద్రుని సోదరి యట

  యామె లంకేశు రావణాసురునకు

  రిప్లయితొలగించండి
 4. పగటి వేష గాళ్లు వచ్చి పోయిన తర్వాత వారి రక్తసంబంధము గురించి అమ్మలక్కలు మాట్లాడుకుంటూ...
  పగటి వేషమందు మిగుల వగల మారి
  రామ చంద్రుని వద్దకు ప్రేమ యనుచు
  వచ్చి లక్ష్మణు చేతన భంగ పడిన
  శూర్ఫనఖ రామచంద్రుని సోదరియట!

  రిప్లయితొలగించండి
 5. ఏకపత్నీవ్రతుండుగ నిలను పేరు
  బొంది నట్టి రాముడు ధర్మ మూర్తి,భర్త
  సీతకు, నితర స్త్రీలకు భ్రాత గాన
  శూర్పణఖ రామచంద్రుని సోదరియట

  రిప్లయితొలగించండి

 6. ఎవరీ కోణంగి నన్ను కోరే లక్ష్మణా
  అని రాముడు ప్రశ్నించ తమ్ముడు
  చమత్కరించే ముసి ముసి నవ్వున
  శూర్పణఖ, రామ! చంద్రుని సోదరి యఁట !!

  జిలేబి
  (శూర్పణఖ కి చంద్రనఖ అన్న పేరు ఉన్నదట ! సోదరియా చంద్రనఖ ?)

  రిప్లయితొలగించండి
 7. పెండ్లియాడుమ యనికోరె బ్రియము గలిగి
  శూర్పణఖ రామచంద్రుని, సోదరియట
  చుప్పనాతి రావణునకు చోద్యమాయె
  రావణారిని గోరుట రామ మఱిని

  రిప్లయితొలగించండి
 8. వర గుణాఢ్యుడు రూపలావణ్యమూర్తి
  యనుచు మోహించెనాభీల వనమునందు
  శూర్ఫణఖ రామచంద్రుని, సోదరియట
  నామె దశకంఠునికి రావణాగ్రజునికి

  రిప్లయితొలగించండి
 9. వినగ చోద్యము గాదెనీ దనుజ కాంత
  నేక పత్నీ వ్రతుడైన నేలి కనక
  వింత కోరిక లందున సంత సించ
  శూర్ఫ ణఖ రామ చంద్రుని , సోదరి యట
  రాక్షస రావణు నకు లంక యందు

  రిప్లయితొలగించండి
 10. రామాయణ మంతా విన్నాక ' రాముడికి సీత ఏమౌ తుంద 'ని అడిగాడట వెనకటి కెవడో - అలాంటి వాడే వీడు కూడ :

  రామకథను విని యొకండు గ్రామ మందు
  " సీత రాముని కేమౌను చెపుము ? మరియు
  శూర్పణఖ రామచంద్రుని సోదరి యట
  గద ? యనుచు ప్రశ్నలను వేసె నదను జూచి

  రిప్లయితొలగించండి
 11. రాముని సమీపించి కోరికఁ దీర్చుమని యడుగు శూర్పణఖను గనిన సీత లక్ష్మణుని యడిగిన ప్రశ్న, యతని సమాధానము...

  "చేరె, లక్ష్మణా! యెద్దియో చెప్పు మనియు
  శూర్పణఖ రామచంద్రుని?","సోదరియఁట
  రావణునకును! కోరి, తా రాముని యిట
  వాంఛఁ దీర్చ నంగీకార వచన మడిగె!"

  రిప్లయితొలగించండి
 12. ఏక పత్నీ వ్రతుండని యెరిగి కోరె
  శూర్పణఖ రామచంద్రుని, " సోదరి! యట
  లంకలో నంద చందముల దితి సుతులు
  నీకు దగిన వారున్నారు నేను తగను
  పొమ్మ" నుచు పల్కె రాముండు పొలతి తోడ.

  రిప్లయితొలగించండి
 13. మిత్రులారా! శుభాశీస్సులు.
  ఈనాటి సమస్యకు వచ్చిన పూరణలను పరిశీలించుదాము. అందరికీ అభినందనలు.

  శ్రీ వి.ఎస్.ఎం.హరి గారు: మీ పూరణ ప్రశస్తముగా నున్నది.

  శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు: క్రమాలంకారములో మీ పూరణ ఉత్తమముగా నున్నది.

  శ్రీ తిమ్మాజీ రావు గారు: మీ పద్యము చాల బాగుగ నున్నది. కొన్ని సవరణలు:
  -- 2వ పాదమును ఇలా మార్చుదాము: కామ శర మహాపీడిత కలియ గోరె
  -- 4వ పాదమును ఇలా మార్చుదాము: లంక కధినాయకుండైన రావణునకు

  శ్రీ సుబ్బా రావు గారు: మీ పద్యము చాల బాగుగ నున్నది. 4వ పాదమును ఇలాగ మార్చుదాము: రావణారిని గోరుటా రామ యహహ!

  శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారు: మీ పద్యము మనోహరముగా నున్నది. 4వ పాదమును ఇలాగ మార్చుదాము:
  ఆమె దశకంధరాఖ్య మహాసురునకు

  శ్రీ సహదేవుడు గారు: మీ పూరణ పగటి వేష గాళ్ళ నాశ్రయించి మనోజ్ఞముగా నున్నది.

  శ్రీ బొడ్డు శంకరయ్య గారు: మీ పద్యము ప్రశస్తముగా నున్నది - భ్రాతృ భావమును చూపించేరు.

  శ్రీమతి రాజేశ్వరి గారు: మీ పద్యమును ఇలాగ సవరించుదాము:
  వినగ చోద్యము గాదె యీ దనుజ కాంత
  యేకపత్నీవ్రతుండని యెద దలచక
  వింత కోరిక కోరెను సంతసమున
  శూర్పణఖ రామచంద్రుని, సోదరి యట
  రాక్షసాధీశ్వరుండైన రావణునకు

  శ్రీ నాగరజు రవీందర్ గారు: మీ పూరణ ప్రశస్తముగా నున్నది. 4వ పాదమును ఇలాగ మార్చుదాము:
  యనుచు వేసెను ప్రశ్నల నదను జూచి.

  శ్రీ గుండు మధుసూదన్ గారు: మీ పద్యము చాలా బాగుగ నున్నది. అన్వయ సౌలభ్యము ఇంకా మెరుగుగా ఉంటే బాగుండును. 3వ పాదములో రాముని నిట అని నుగాగమము చెయ్యాలి కదా.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 14. దేమిటండీ ఎవరూ పాపం శకారుని స్మరించి పూర్తిచేయరేం ఈ‌సమస్యని? సరేనండీ నాకే వదిలేశారనుకుంటాను

  అరసి సర్వపురాణేతిహాసరాశి
  ఆ శకారుడు పలుకాడు నద్భుతముగ
  రావణుని తండ్రి యట పాండు రాజు మరియు
  శూర్పణఖ రామచంద్రుని సోదరి యఁట

  రిప్లయితొలగించండి
 15. శ్రీ కంది శంకరయ్య గురువర్యులకు వందనములు,
  అర్థ గణదోషములున్న సవరించ ప్రార్థన !

  రమ్య రూప శీలుండు శ్రీరాము జూసి
  తమక మొందుచు గోరెను తాను గలియ
  శూర్పణఖ రామచంద్రుని, సోదరియట
  లంక నేలెడు రాజగు రావణునికి

  రిప్లయితొలగించండి