30, అక్టోబర్ 2013, బుధవారం

సమస్యాపూరణం - 1220 (అత్రి మునికి నహల్యయే)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.....
అత్రి మునికి నహల్యయే పుత్రిక యగు.
ఈ సమస్యను పంపిన నాగరాజు రవీందర్ గారికి ధన్యవాదాలు.

14 కామెంట్‌లు:

 1. సృష్టి చిత్రము జేసెడి స్రష్ట యనగ
  యుగము లందున కైవల్య యోగ మనుచు
  ఒకరి కొకరిని పుట్టించు మైక మందు
  అత్రి మునికి నహల్యయే పుత్రిక యగు

  రిప్లయితొలగించండి
 2. అత్రి ముని కనసూయయే యగును భార్య
  కాదహల్య పుత్రిక యేని కనుక చెపుమ
  ఏ విధమ్మున నంటివో యేమి కతమొ?
  అత్రి మునికి నహల్య యే పుత్రిక యగు?

  రిప్లయితొలగించండి
 3. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..

  శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...

  మాయాబజార్ సినిమాలో యస్ వి ఆర్ , రమణారెడ్డిల మద్య జరుగు "వీర కంకణము " సన్నివేశము. ప్రశ్నలకు సమాదానము జెప్పగా యస్ వి ఆర్ వారికి వీర కంకణము వేయుమనును.
  ========*==========
  అత్రి మునికి నహల్యయే పుత్రిక యగు
  నన్న చిన్న వానిని సరి యైన బదులు
  బల్కితి వనుచు,సేవక బళిర బళిర
  వీర కంకణమును దెచ్చి వేయు డనెను!

  రిప్లయితొలగించండి
 4. అత్రి మునికి నహల్యయే పుత్రిక యగు
  ననుచు రూడి గ బలుకుట యక్రమమ్ము
  బ్రహ్మ చేతను చేతను సృ జియింప బడిన సా ధ్వి
  గౌ తమ మహర్షి భార్య యే , సేతు నతులు

  రిప్లయితొలగించండి
 5. ఏ మునికి ననసూయ పెండ్లా మగునయ?
  ఱాయి నాతిగ మాఱిన రమణి యెవతె?
  భూమిజయె జనకునకును నేమగునయ?
  యత్రిమునికి, నహల్యయే, పుత్రికయగు!

  రిప్లయితొలగించండి
 6. పుత్రు డొక్కడే దుర్వాసు డత్రి మునికి
  పుత్రుకలు పూర్వ జన్మలో పుట్టిరేమొ!
  వింత గొలుపీ సమస్యను వినగ, నెట్లు
  అత్రి మునికి నహల్య యే పుత్రిక యగు?

  రిప్లయితొలగించండి
 7. ముద్ద లుని కొమరిత ముద్దు గుమ్మ
  గౌత ముని సతి యటంచు గార వమ్ము
  సృష్టి వై చిత్ర మేరీతి స్రష్ట పలుకు
  అత్రి మునికి నహల్యయే పుత్రిక యగు

  రిప్లయితొలగించండి
 8. పండిత నేమానిగారికి పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు
  త్రిగుణ ములకును లొంగని ధీరుడత్రి
  ఈసు జెందని అనసూయ ఏక మగుచు
  అంద చందము లొప్ప నహల్య యనగ
  అత్రి ముని కహల్యయే పుత్రికయగు

  రిప్లయితొలగించండి
 9. గౌతమ ముని యహల్యను కరము బట్టె
  బ్రహ్మ సృజియించ నందాల పడతి గాను
  దత్త రూపాన బ్రహ్మయె తనయు డవగ
  అత్రి మునికి, నహల్యయే పుత్రిక యగు!

  రిప్లయితొలగించండి
 10. మరియొక ప్రయత్నము:

  చదువు లేదయ్యు గర్వమ్ము చాల గలుగు
  నొక్క కథకుని కోరగా నొక్క కథను
  చెప్పుమని యాత డీరీతి జెప్పె నహహ
  అత్రి మునికి యహల్యయే పుత్రిక యగు

  రిప్లయితొలగించండి
 11. పండిత నేమానిగారికి పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు

  ధాత శివుడునువిష్ణువు దత్తులైరి
  అత్రిముని కహల్యయేపుత్రికయగు
  బొమ్మదేవునికందాల బొమ్మయగుచు
  పంచకన్యలప్రణుతింప ప్రథమురాలు

  రిప్లయితొలగించండి
 12. దూరదర్శిని లో " డబ్బు దోచుకోండి "
  అనుచు బెట్టిన " ప్రోగాము ' అందులోన
  నొక్క ప్రశ్నకు జెప్పెను నొక్కి యొకడు
  అత్రి మునికి యహల్యయే పుత్రిక యగు.

  రిప్లయితొలగించండి
 13. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  నవబ్రహ్మలలో నొకడైన అత్రికి అహల్య కూతురే గదా !

  01)
  _______________________________

  అంద చందాల నతి మేటి - యతివ యనగ
  నాపె సృజియింప బడె గాదె - యజుని చేత !
  అత్రి నవబ్రహ్మలందున - నమరె గాన
  అత్రి మునికి నహల్యయే - పుత్రిక యగు !
  _______________________________
  అజుడు = బ్రహ్మ

  నవ-బ్రహ్మలు : సంకేతపదకోశము (రవ్వా శ్రీహరి)
  (అ.)
  1. భృగువు
  2. పులస్త్యుడు
  3. పులహుడు
  4. క్రతువు
  5. అంగిరసుడు
  6. దక్షుడు
  7. అత్రి
  8. మరీచి
  9. వసిష్ఠుడు
  (ఆ.)
  1. బాలబ్రహ్మ
  2. కుమారబ్రహ్మ
  3. అర్కబ్రహ్మ
  4. వీరబ్రహ్మ
  5. విశ్వబ్రహ్మ
  6. తారకబ్రహ్మ
  7. గరుడబ్రహ్మ
  8. స్వర్గబ్రహ్మ
  9. పద్మబ్రహ్మ

  రిప్లయితొలగించండి