కంచి గరుడ సేవ : కష్టమైనా ఉపయోగం లేకపోయినా తప్పనిసరై చేసే పని. కంచిలో గరుడ విగ్రహము చాలా పెద్దది, ఒక రథము అంత ఉంటుంది దానిని సేవకు తరలించుట కొద్దిగ కష్టం. గరుడుడు విష్ణువుకు వాహనం. ముందుగా గరుడునికి దండం పెట్టాకే విష్ణువు దగ్గరకెళ్ళాలి. అతనికి నమస్కారం చెయ్యకుండా యజమాని దగ్గరకు నేరుగా వెళితే ఏమి కోపం పెట్టుకుంటాడో. ఒకవేళ నమస్కరించినా పెద్దగా ఒరిగేదీ లేదు. ఒక నమస్కారం పెడితే పోలా, ఎందుకొచ్చిన బాధలెమ్మని చేసే సేవ.
కవిమిత్రులకు నమస్కృతులు. ‘కంచి గరుడసేవ’... చిన్నతనంనుండి వింటున్న (అప్పుడప్పుడు స్వయంగా సంభాషణలలో ప్రయోగిస్తున్న) ప్రయోగిస్తున్న జాతీయం. కానీ దాని అంతరార్థం సరిగా తెలియదు. ఫలితంలేని (గురింపబడని) శ్రమకు ఈ జాతీయాన్ని వాడుతున్నాం. ఇలాగైనా దాని వివరాలు తెలుస్తాయని ఈరోజు పద్యరచనకు శీర్షికగా ఇచ్చాను. నేనూహించినట్లే మిత్రుల స్పందన సంతోషాన్ని కలిగించింది. నాగరాజు రవీందర్ గారు ఇచ్చిన వివరాలకు ధన్యవాదాలు. చక్కని పద్యాలను రచించిన మిత్రులు.... కెంబాయి తిమ్మాజీ రావు గారికి, నాగరాజు రవీందర్ గారికి, సుబ్బారావు గారికి, లక్ష్మీదేవి గారికి, గుండు మధుసూదన్ గారికి, బొడ్డు శంకరయ్య గారికి, అభినందనలు, ధన్యవాదాలు. * నాగరాజు రవీందర్ గారూ, ‘బస్సు + ఏది’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘మంచిదేది బస్సు’ అందామా? రెండవ పద్యంలో ‘గరుడునకును’ అంటే సరి! * లక్ష్మీదేవి గారూ, ‘దండగ’ లేదు... ‘దండుగ’ ఉంది.
వరప్రసాద్ గారూ, మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు. ‘గరుని’...? * సహదేవుడు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, కంచి గరుడసేవ విఖ్యాతిని చక్కగా వర్ణించారు. అభినందనలు. * శైలజ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
పూజ్యులు శంకరయ్యగారికి వందనములు
రిప్లయితొలగించండిసిరివరదరాజు కాంచీ
పురవీధులగరుడ రథమ్మున నూరేగన్
స్వరపరచి త్యాగరాజులు
తరించె భవజలధి పొందె ధన్యత ముక్తిన్
కంచి గరుడ సేవ :
రిప్లయితొలగించండికష్టమైనా ఉపయోగం లేకపోయినా తప్పనిసరై చేసే పని. కంచిలో గరుడ విగ్రహము చాలా పెద్దది, ఒక రథము అంత ఉంటుంది దానిని సేవకు తరలించుట కొద్దిగ కష్టం. గరుడుడు విష్ణువుకు వాహనం. ముందుగా గరుడునికి దండం పెట్టాకే విష్ణువు దగ్గరకెళ్ళాలి. అతనికి నమస్కారం చెయ్యకుండా యజమాని దగ్గరకు నేరుగా వెళితే ఏమి కోపం పెట్టుకుంటాడో. ఒకవేళ నమస్కరించినా పెద్దగా ఒరిగేదీ లేదు. ఒక నమస్కారం పెడితే పోలా, ఎందుకొచ్చిన బాధలెమ్మని చేసే సేవ.
తెలుగు జాతీయములు - వికిపీడియా నుండి
కథలు ముగియ తుదకు కలియు ప్రాంతము పేరు ?
రిప్లయితొలగించండిమంచి బస్సు యేది కంచి వెడల ?
మానవులకు సేవ మహిలోన నేమగు ?
కంచి ; గరుడ ; సేవ మంచి దగును.
సమస్యా పూరణం -365
కంచి గరుడ సేవ మంచి దగును
పూజసేయ కుండ పోయిన గుడిలోకి
రిప్లయితొలగించండికలుగు నేమొ కినుక గరుడుడు నకు ?
వరము లీయ డేమొ ? వరదుడు గావున
కంచి గరుడ సేవ మంచి దేమొ ?
కంచికేగిన ప్రతియొక్కడంచితముగ
రిప్లయితొలగించండిగరుడసేవనుగావించికాంచు విష్ణు
నదియయిచ్చునుఫలితము నార్య! నిజము
వరల కామాక్షి మాతకు వందనములు
తిమ్మాజీరావు గారూ,
రిప్లయితొలగించండిరెండవపాదములో గణభంగమైనట్టుంది.
నాగరాజు గారూ,
గరుడుడు నకు అనవచ్చునా ? గరుడుకయిన/కైన అని మార్చవచ్చేమో......!
స్వామిసేవలోన సతతము తానుండు
రిప్లయితొలగించండిస్వామి కొలువ దండగేమి ? నరుల
స్వామి భక్తి మించు కామ రహిత భక్తి
కేమి సాటి విశ్వమెల్ల యెడల?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిలక్ష్మిదేవిగారికి నమస్సులు గణ భంగముసవరించిన
రిప్లయితొలగించండిపద్యము ప్రస్తుతించుచున్నాను
సిరివరడరాజు కాంచీ
పురవీధుల గరుడుని రథముననూరేగన్
స్వరపరిచి త్యాగరాజులు
తరించె భవజలధి పొందె ధన్యత ముక్తిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచదువు రాని వాని సంచిత గ్రంథాస్థ;
రిప్లయితొలగించండిదసలు పంచెఁ గోరు ముసలి భ్రాంతి;
ముక్కర నటఁ గోరు ముక్కిడి యందమ్ముఁ,
గంచి గరుడ సేవ ఘనత లేల? (1)
అంధుఁ జేత నున్న యద్దమ్ము పగిదిని;
మూక చేతనున్న మైకు వలెను;
చెవిటి వాని చెవిని స్పీకరున్నట్టులు,
కంచి గరుడ సేవ ఘనత లేల? (2)
(అన్యదేశ్యాలు హాస్యమునకు గ్రహింపఁబడినవిగా నెఱుంగునది)
బోడిగుండు వాని పొంత దువ్వెన వలె;
నేతి బీర లోని నేయి రీతిఁ;
గామితమ్ము లిడని క్ష్మాభృత్తు కైవడిఁ,
గంచి గరుడ సేవ ఘనత లేల? (3)
సార మింత లేని సంసారము వలె; నా
మోద మింత లేని మోదుగు వలె;
సలిల మింత లేని సరసి పోలికఁ జూడఁ
గంచి గరుడ సేవ ఘనత లేల? (4)
అంచిత సేవలు జేసిన
రిప్లయితొలగించండికంచిన గల గరుడు డేమి కాదనకున్నన్
సంచయ మగు కష్టమ్ములు
కంచి గరుడ సేవ వలన కడతేరవుగా!
నిజమే లక్ష్మీదేవి గారూ ! ' గరుడు నకును ' అంటే సరిపోతుందేమో !
రిప్లయితొలగించండికవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండి‘కంచి గరుడసేవ’... చిన్నతనంనుండి వింటున్న (అప్పుడప్పుడు స్వయంగా సంభాషణలలో ప్రయోగిస్తున్న) ప్రయోగిస్తున్న జాతీయం. కానీ దాని అంతరార్థం సరిగా తెలియదు. ఫలితంలేని (గురింపబడని) శ్రమకు ఈ జాతీయాన్ని వాడుతున్నాం. ఇలాగైనా దాని వివరాలు తెలుస్తాయని ఈరోజు పద్యరచనకు శీర్షికగా ఇచ్చాను. నేనూహించినట్లే మిత్రుల స్పందన సంతోషాన్ని కలిగించింది.
నాగరాజు రవీందర్ గారు ఇచ్చిన వివరాలకు ధన్యవాదాలు.
చక్కని పద్యాలను రచించిన మిత్రులు....
కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
నాగరాజు రవీందర్ గారికి,
సుబ్బారావు గారికి,
లక్ష్మీదేవి గారికి,
గుండు మధుసూదన్ గారికి,
బొడ్డు శంకరయ్య గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.
*
నాగరాజు రవీందర్ గారూ,
‘బస్సు + ఏది’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘మంచిదేది బస్సు’ అందామా?
రెండవ పద్యంలో ‘గరుడునకును’ అంటే సరి!
*
లక్ష్మీదేవి గారూ,
‘దండగ’ లేదు... ‘దండుగ’ ఉంది.
శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...
సరదాగా, ఆట వెలది/సీసములలో
=======*===========
అంత్యకాల మనుచు నాధి పత్యమునకై
---కణము పణము బట్టి కంజ నేత్ర!
కంచి గరుడ సేవ మంచి దనుచు నేడు
---ఖలులు బలులు జేరె కంజ నేత్ర!
మెప్పు బొంద గరుని పప్పుల యెర వేసి
--- కలిమి బలిమి పొందె కంజ నేత్ర!
భక్త తతుల నెల్ల భాదించు చుండిరి
--- గదను వదలి రమ్ము కంజ నేత్ర!
లంచ మనెడి వారి రట్టు దీసి మిగుల
---కరి వరద! మురారి ! కంజ నేత్ర!
పంజరమున నున్న భక్త వరుల కెల్ల
---కలిమి బలిమి నిమ్ము కంజ నేత్ర!
(కణము పణము= అన్ని విధముల ధనము, బలులు= బలవంతులు )
కొడుకు కూతురనుచు కూడేసి చదివించి
రిప్లయితొలగించండిమంచి స్థితికి దెచ్చి మనువు జేయ
విడువఁ దల్లి దండ్రిఁ వృద్ధాప్య గృహమందు
కంచి గరుడ సేవ కాదె నిదియు?
పూజ్యగురుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండిఘడియ కొకమారు సేవలు గరుడగమన!
వరదరాజుగ గొనెదవు భక్తులిడగ?
ఏటికొకమారు నీవు యూరేగుటకును
వాహనమ్మగు నాకు సేవలుయొనర్ప
న్యాయమని దోచెనా నీకు యనుచు పల్కు
వైనతేయుని జూచి తానానతిచ్చె
కలి యుగంబున ఇకపైన కంచిలోన
జరుగు నీసేవ నీపేర బరగు నితము
"కంచి గరుడ సేవంచు విఖ్యాతిజెంది"
తల్లి నివిడి పించు తనయుడు గరుడుడు
రిప్లయితొలగించండిఅందు కాయె నతడు హరికి తేరు
మంచి వారి సేవ మాధవుండేచేసె
కంచి గరుడ సేవ ఘనత గాదె
గురువుగారూ,
రిప్లయితొలగించండినిజమే....నండి. మన్నించగలరు.
వరప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
‘గరుని’...?
*
సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
కంచి గరుడసేవ విఖ్యాతిని చక్కగా వర్ణించారు. అభినందనలు.
*
శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
రాజ కీయ మందు రాబందు లకు సాటి
రిప్లయితొలగించండిదేశ సేవ జేసి దీప్తి నొంద
తిన్న వాని కెంత తీరదు తనివెంత
కంచి గరుడ సేవ నెంచు కొనగ