28, అక్టోబర్ 2013, సోమవారం

సమస్యాపూరణం - 1218 (కాలితోఁ దన్నుటే)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.....
కాలితోఁ దన్నుటే మేటి కనికరమ్ము.
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

34 కామెంట్‌లు:

  1. కవిమిత్రులకు నమస్కృతులు.
    నిన్న రాత్రి మా అబ్బాయికి రెండు సర్జరీలు జరిగాయి. ప్రస్తుతం బాగానే ఉన్నాడు. స్నానాదులు చేయడానికి ఇంటికి వచ్చాను. మళ్ళీ వెళ్ళాలి.
    నిన్నటి సమస్యకు చక్కని పూరణలు చెప్పిన మిత్రులందరికీ అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. కాలు డుగ్రుడై పట్ట మృకండుసుతుని
    రుద్రు డాభక్తునకు గూర్చి భద్రములను
    శమనుపై కోపమూనియు శాంతు డగుచు
    కాలితో దన్నుటే మేటి కనికరమ్ము

    రిప్లయితొలగించండి
  3. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..

    శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...

    గురువు గారూ! మీ పుత్రుడు త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ,భగవంతుని ప్రార్థిస్తూ...

    నేటి రాజకీయ నాయకులపై
    =========*=========
    రక్త పింజరి వలె నేడు రాక్షస తతి
    ద్రాగు చుండ సామాన్యుల రక్త మాంస
    ములను,రాముని వలె భద్రములను గూర్చ
    కాలితో దన్నుటే మేటి కనికరమ్ము!

    రిప్లయితొలగించండి
  4. పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    అలుక జెందిన భార్యతో భర్త


    కోరచూపులు మాకు నీ యోరచూపు
    మూతి విరుపులు నలుకలు ముచ్చటగును
    చేతి విసురులునిందలు చిత్త హరము
    కాలితో తన్నుటే మేటి కనికరమ్ము

    రిప్లయితొలగించండి
  5. నేటి రాజకీయ నాయకులపై
    =========*=========
    2. చెత్త దినుచు,ఘనుల మని జెలుగు చున్న
    రాజకీయ నాయకులను గాజు పురుగు
    లను నవని పైన జనులెల్ల ననవరతము,
    కాలితో దన్నుటే మేటి కనికరమ్ము!

    రిప్లయితొలగించండి
  6. కాలితో దన్నుటే మేటి కనికరమ్ము
    అటుల జరిగెనునలనాడ యామృకండు
    తనయు పట్లన కాలుని దరికి పోవు
    తఱి ని గాపాడె శం భుడు తనర భక్తి

    రిప్లయితొలగించండి
  7. గురువులు ,శం కరయ్యగారికి నమస్కారములు
    ఆ పార్వతీ పరమేశ్వరులు మీ అబ్బాయి గారిని
    చల్లగా చూతురు గాక !

    రిప్లయితొలగించండి
  8. కాలితో తన్నిన సత్యాదేవిని సంబోధిస్తూ శ్రీకృష్ణుడు అన్నట్లుగా.......

    అలక పానుపు నెక్కిన యతివ సలుపు
    ముద్దు మాటలు, మురిపెంపు మూతివిరుపు
    లమిత హాని గూర్చు సత్యా! వచింతు
    కాలుతోఁ దన్నుటే మేటి కనికరమ్ము

    రిప్లయితొలగించండి
  9. మరియొక ప్రయత్నము:

    సంహరింపగ నేతెంచు శకట రూప
    రాక్షసుని గాలితో దన్ని మోక్షమిచ్చె
    బాలకృష్ణుండు కరుణాలవాలుడు కద
    కాలితో దన్నుటే మేటి కనికరమ్ము

    రిప్లయితొలగించండి
  10. శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. 3వ పాదములో టైపు పొరపాటు కావచ్చును - గణభంగమును సరిచేయండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. అబల నొక్కతిగాఁ జూచి నాబ గాను
    రెచ్చి యవమాన పఱచెడు లేకి వారి
    చీల్చి చెండాడి పేడిగా చేయ కుండ
    కాలితో దన్నుటే మేటి కనికరమ్ము!

    రిప్లయితొలగించండి
  12. ఆ కాలు త్రిలోక పూజ్యము, బుధులకు శిరొధార్యము
    ఆ కాలినంటి నడిచిన పాదుక ఏలెను భక్తి రాజ్యము
    ఆ కాలి స్పర్శ తగిల వదులు జన్మజన్మల జాడ్యము
    అట్టి నా స్వామి కాలితో తన్నుటే మేటి కరికరమ్ము

    రిప్లయితొలగించండి
  13. అతి తపోశక్తి సంపన్న యతి భ్రుగుండు
    తన్నె శ్రీహరిని లక్ష్మితో నున్న వేళ
    మౌని పాద నేత్రముహరి మశి యెనర్చ
    కాలితో తన్నుటే మేటి కనికరమ్ము.

    రిప్లయితొలగించండి
  14. పండిత నేమాని గారికి పూజ్యులు శంకరయ్య
    గురుదేవులు గారికి వందనములు

    కాలు సోకినంతనె శిల కాంతయవగ
    కాలు మర్దింప కాళీయు గర్వమణగ
    కాలి తన్నుతో నసుర సద్గతిని పొంద
    కాలితో తన్నుటే మేటి కనికరమ్ము

    రిప్లయితొలగించండి
  15. ఆదిత్య మద్దూరి గారు గొప్పగ జెప్పిన గద్యానికి అభినందనలు తెలియ జేస్తూ పద్య రూపం:
    పరము త్రైలోక్య పూజిత పాదమేదొ!
    తాకి పాదుక రాజ్యంబు తానె యేలె!
    సోక శిలదాల్చె సుందర సోయగమ్ము!
    నడచి ననుజేరి యా స్వామి నాదు తలను
    కాలితోఁ దన్నుటే మేటి కనికరమ్ము!

    రిప్లయితొలగించండి
  16. శ్రీనేమాని పండిత గురువర్యులకు,

    నమస్కారములు. టైపాటు ను చూపినందులకు ధన్యవాదములు.

    అది.... "హాయిని" అని ఉండాలి. "హాని" గా మారింది.

    "అమిత హాయిని గూర్చు సత్యా! వచింతు" అని ఉండాలి.

    రిప్లయితొలగించండి
  17. భక్తి మీరిన తిన్నడు యుక్తి లేక
    కాలి నదిమెను శివునికి కన్ను లమర
    ముక్తి నిచ్చెను దైవము మోద మంది
    కాలితో దన్నుటే మేటి కనిక రమ్ము

    రిప్లయితొలగించండి
  18. రుద్ర భూమిని రౌద్రమై భద్ర కాళి
    శివుని ద్రొక్కగ స్పర్స చే చింత నొంది
    భీక రాకృతి చాలించి ప్రీతి నొందె
    కాలి తోఁ దన్నుటే మేటి కనిక రమ్ము

    రిప్లయితొలగించండి
  19. కొందరి సుతులు వేయు కుప్పి గంతులు జూడ
    ==========*===========
    3. నీతి పాఠము జెప్పెడి నేత లెల్ల
    రడ్డ దారులు వెదకగ బిడ్డ లకును,
    కుప్పి గంతులు వేయగ గొప్పగాను
    కాలితో దన్నుటే మేటి కనికరమ్ము !

    రిప్లయితొలగించండి
  20. 4. పేదవాని బలుకు లెల్ల వేద మనుచు
    రోజు కొక్క రీతి బలుకు రాజుగారు
    గాలి లోన దీపము నుంచి వాలి ననగ,
    కాలితో దన్నుటే మేటి కనికరమ్ము !

    ( పేద= రాహుల్ , రాజుగారు= ప్రదాన మంత్రి, దీపము= ప్రజల బ్రతుకు)

    రిప్లయితొలగించండి
  21. శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారూ! శుభాశీస్సులు.
    మీ సవరణ కొక చిన్న సవరణ:

    అమిత హాయిని అని సమాసము చేయరాదు. దానికి బదులుగ అతుల సౌఖ్యము అందాము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  22. 5.అడ్డ దారులందు దిరుగు దొడ్డ వారి
    బంధు వర్గమును బిలచి ముందుగాను
    సుతులు, హితులని జూడక సొగసుగాను
    కాలితో దన్నుటే మేటి కనికరమ్ము !

    6. కౌరవులకు తమ్ములు నాడు వారి పైన
    ధూమ శకటము వలె పొగ దుమ్ము వదల
    సుతులు, హితులని జూడక సొగసుగాను
    కాలితో దన్నుటే మేటి కనికరమ్ము !

    రిప్లయితొలగించండి
  23. మిత్రులారా! శుభాశీస్సులు.
    ఈనాటి పూరణలు భావ వైవిధ్యముతో పఠితృజన హృదయ రంజకముగా నలరారు చున్నవి. అందరికి అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  24. భూరి కిల్బిష నాశని పుట్టినిల్లు
    స్పర్శయే చాలు సంసార బంధ ముడుప
    పాపి నని శ్రీహరీ! నన్ను కోపమూని
    కాలితోఁ దన్నుటే మేటి కనికరమ్ము.

    రిప్లయితొలగించండి
  25. 7. దస్త రమ్ము మాయ మనెడి దంతి తతిని
    పంది వలెను దినెడి దుష్ట పాలకులను
    నక్క వలె నేటి జిత్తుల నాయకులను
    కాలితో దన్నుటే మేటి కనికరమ్ము !
    (దంతి తతిని= అధికారులు )

    రిప్లయితొలగించండి
  26. పైన పళ్ళేమొ వచ్చెను పాపకిపుడు
    శాంతి జేయగ నెంచగా చక్కగాను
    మేనమామేమొ కుదరదు మెచ్చననక
    కాలితోఁ దన్నుటే మేటి కనికరమ్ము.

    రిప్లయితొలగించండి
  27. నిన్నటి సమస్యకు నా పూరణలు...

    మాయ అనే మేనకోడల్ని పెండ్లాడెదనని చెప్పుచున్న బావమరిది గూర్చి బావ...

    మా మాయ జూచి, బావా !
    నా మాటల వినుము నేను నచ్చితి దానిన్
    ప్రేమగ పెండ్లాడుదునని
    మా మాయని, బావమఱఁది మాటలు గలిపెన్!

    మరొక పూరణ...

    ఏమాటకు ముందైనను
    ' మామామా ' యనుచు నత్తి మాటలు వచ్చున్
    మోమాటము బడుతూనే
    ' మామా ' యని బావ మఱఁ ది మాటలు గలిపెన్

    రిప్లయితొలగించండి

  28. కాలితోఁ దన్నుటే మేటి కనికరమ్ము
    పురిటి నొప్పులు తెలియ జేయన్
    కాలితోఁ దన్నుటే మేటి కనికరమ్ము
    మనవడు జూపించు చిలిపి చేష్టలున్ !!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  29. సహదేవుడు గారికి నమస్కారం,

    తనికెళ్ళ భరణి గారు ఇలా చమత్కరించారు
    "నాకా రావయ ఓనమాలు బిల్‌కుల్ రాదు ఛందస్సు నువ్వే యతివి... గణాలు సుట్టుముట్టూ శబ్బాష్‌రా శంకరా"
    కాని ఇది నా విషయం లో నిజం :-)
    నాకు ఛందస్సు అస్సలు తెలియదు
    కాని సమస్యా పూరణ అంటే చాల మక్కువ
    అందుకే మీ మధ్య చేరాను
    నా రచనకు పద్యానువాదం చేసినందుకు ధన్యవాదములు
    ఆదిత్య మద్దూరి

    రిప్లయితొలగించండి
  30. శ్రీమతి జిలేబి గారి భావానికి నా పద్య రూపము.

    తల్లి కడుపున బైటకే తరలు నపుడు
    నాన్న తాతల యెదపైననాడునపుడు
    చిట్టి పాపడు నవ్వుతూ చిందు తోడ
    కాలితోఁ దన్నుటే మేటి కనికరమ్ము

    రిప్లయితొలగించండి
  31. యమునినైన నింకెవ్వరినైన భక్త
    జనుల బాధవెట్టెడు వారి క్షణములోనె
    నాశమొనరింప గలవాడు నైన శివుడు
    కాలితోఁ దన్నుటే మేటి కనికరమ్ము.

    రిప్లయితొలగించండి