రాజేశ్వరి అక్కయ్యా, బాగుంది మీ పద్యం. అభినందనలు. ‘ద - ధ’లకు ప్రాసమైత్రి లేదు . ‘థ-ధ’ ప్రాస ఉంది. * వసంత కిశోర్ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘పందెపుటాట’ టుగామమ సంధి సరియైనదే. * పండిత నేమాని వారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో .. ======*========= వాడ వాడలందున మంచి వేడు కయిన కోడి పందె ములకు,నేడు క్రొత్త మెరుగు లద్ది ముదము నొందుచునుండె బుద్ది లేని జనులు పండుగ లందున ఘనము గాను !
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ, మీ పద్యాలు అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు. * గుండు మధుసూదన్ గారూ, పల్నాటి భారతాన్ని ప్రస్తావించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
పందెము వేసిరి మనకిటు
రిప్లయితొలగించండిబంధము లనుత్రెంచి మనము పగగొని పోరన్
విందులు జేసుకు వారలు
బంధువు లందరిని కలసి పంక్తులు దీరన్
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
నిషేధించబడిన కోడి పందేలాడుట నేరమూ - అత్యంత ఘోరమూ :
01)
_______________________________________
కోడిపందెము లాడు చుందురు - కూడి జూదరు లందరూ !
కోడికాళ్ళకు వాడికత్తులు - గూడ గట్టెద రొక్కచో !
కోడిపుంజదె దెబ్బలాడక - గూలిపోయిన నోడునే !
కోడి యోడిన దాని మాంసము - గూర జేసుకు తిందురే !
కూడదే యిది ఘోరమే మరి - కోడిపందెపు టాటలే !
_______________________________________
శంకరార్యా !
రిప్లయితొలగించండిపందెము+ఆట = పందెపుటాట
సరియేనా ? అయితే ఏ సంధి
పుంప్వాదేశమా లేక టుగాగమమా ?
కోడి పందెములను గొర్రె పందెములను
రిప్లయితొలగించండిదాటి జనుచు నేటి మేటి రాజ
కీయ నాయకాళి గెలుపు లోటములకై
సలుపు పోరు తీరు దలప గలమె?
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిబాగుంది మీ పద్యం. అభినందనలు.
‘ద - ధ’లకు ప్రాసమైత్రి లేదు . ‘థ-ధ’ ప్రాస ఉంది.
*
వసంత కిశోర్ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘పందెపుటాట’ టుగామమ సంధి సరియైనదే.
*
పండిత నేమాని వారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
బాదాము వెట్టి పెంచును
రిప్లయితొలగించండిపాదాలకు కత్తిగట్టి పందెము వెట్టున్
జూదాల నాడి మనుజులు
మాదేహము గాల్చి తింద్రు మాగతి గనరే !
పల్లెటూరున సంక్రాంతి పండుగలకు
రిప్లయితొలగించండికోడి పందెముల్ జరిపింత్రు వేడుకనుచు
పదును గత్తుల తోడన బలము జూప
వెఱ్ఱి కేకలు వేతురు వెఱ్ఱి జనము
పౌరుషమ్ము గలిగి పోరున నిల్చియు
రిప్లయితొలగించండిచావుకైన వెఱవ లేవు కోళ్ళు
"వెన్ను జూప రాదు మిన్ను గూలిన గాని"
కోడి పందెమందు గొప్ప యిదియె
హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
కోడి పందెము లందరు కోరి యాడు
రిప్లయితొలగించండిపౌరు షమ్మున యాటయె పంత మగును
విందు కాదది కనులకు వింత భాద
జూద మేదైన జూదమే జూతు వేల
శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో ..
రిప్లయితొలగించండి======*=========
వాడ వాడలందున మంచి వేడు కయిన
కోడి పందె ములకు,నేడు క్రొత్త మెరుగు
లద్ది ముదము నొందుచునుండె బుద్ది లేని
జనులు పండుగ లందున ఘనము గాను !
( క్రొత్త మెరుగు= కాళ్ళకు కత్తిని గట్టి )
శైలజ గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పద్యం. అభినందనలు.
‘పౌరుషమ్మున నాటయె..’ అనండి.
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమన్నించండి....
‘పందెము + ఆట = పందెపు టాట’ పుంప్వాదేశ, టుగాగమ సంధులు రెండు ఉన్నాయి.
వరప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
తెలుగునేలపైన వెలుగొందుచున్నట్టి
రిప్లయితొలగించండిసాంఘికంబులైన సంస్కృతులకు
నుదహరించదగిన దదియేమిటని యన్న
కోడిపందె మందురు రేడ జనిన.
మకరసంక్రాంతి పర్వాన సకలజగతి
కాత్మవిక్రమవైభవ మద్భుతముగ
చాటి చెప్పంగ బూనుచు మేటివైన
కుక్కుటంబుల నాటకై కూర్చుచుంద్రు.
కాళ్ళసందున పదునైన కత్తి గట్టి
పోరు సల్పంగ నుసిగొల్పి, చేరదీసి
ధనము, ప్రాణంబు, మానంబు లనుపమముగ
పణము గావింతు రెల్లెడ బహుళగతుల.
కుక్కుటముల స్పర్థల నిల
మక్కువతో జరుపుచుండి మాన్యదములుగా
లెక్కించుచుందు రెల్లరు
నక్కట! దయయించుకైన నగుపించదహో!
నోరులేనిజీవు లేరీతినైనను
పలుకలే వటన్న తలపుగాక
కువలయంబులోన కోళ్ళపందెముజూడ
సముచితంబు కాదు సన్మతులకు.
గుండు మధుసూదన్ గారి పద్యము.....
రిప్లయితొలగించండిబ్రహ్మనాయుండు నాగమ్మ పన్నిదమునఁ
గుక్కుటమ్ముల నుసిగొల్పఁ గోళ్ళుఁ బోరె!
నాఁటి పందెమ్ములే సాఁగె నేఁటి వఱకు
వలద టన్ననుఁ జట్టముల్ బలిమి సీమ!!
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలు అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు.
*
గుండు మధుసూదన్ గారూ,
పల్నాటి భారతాన్ని ప్రస్తావించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
పూజ్యగురుదేవులు శంకరయ్యగారికి కవులందరికీ నమస్కారములు
రిప్లయితొలగించండికోడి పందెములవివేడిగా వాడిగా
జరుగుచుండు భీమవరమునందు
కోస్తయాన్ద్ర యందు కాస్త రాయలసీమ
పేరు గాంచె నాటి కారె పూడి
కోడిప౦దెపుటాటలో నోడిపోయి
నాటి పలనాటి సీమయే నాశ మాయె
అన్నదమ్ములు రణమున హతులవంగ
పొత్తు కుదరక పోవంగ పోరుసలుప
నేరమాయెనుకోడిపందెములు నేడు
క్రూరహింసాత్మకమ్ములౌ గొర్రె లెడ్ల
బండిపందెమ్ములెల్లను పాపమనుచు
జంతుహింసల చట్టశాసనము వలన
నేటి జగమున కోడిపందెములనంగ
రెండురాజ్యముల్ పోరాడు మెండుగాను
అగ్రరాజ్యముల్ వీక్షించు రాబగాను
గట్టుపైనుండి క్రీడను గుట్టుసెడక
సవరణలకు శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు
రిప్లయితొలగించండికెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిసవిరంగా వ్రాసిన మీ పద్యాలు చాలా బాగున్నవి. అభినందనలు.
కోడి పందెములంచును కొందరకట
రిప్లయితొలగించండియుద్ధములఁ జేసిరని వింటి యుర్వియందు,
నాటపాటల జరిగిన నదియు సరియె,
తప్పు పందెము గాచుట- తగదు తగదు.
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిమంచి పద్యాన్ని వ్రాసారు. అభినందనలు.
‘వింటి నుర్వియందు’ అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిబొడ్డు శంకరయ్య గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
‘ధరణి యందు’ అనండి. చివరి పాదంలో ‘గనుచు’ టైపాటు వల్ల ‘గునుచు’ అయింది.
గురువుగారికి వందనములు, తప్పిదము జరిగినది సవరణతో.......
రిప్లయితొలగించండికోడి పందెము లందున నోడి పోయి
ధనము కోల్పోయి బీదగ ధరణి యందు
కష్టము లనుభ వించిన నష్ట జాత
కులను గనుచు పందెముల వదలిన మేలు
శంకరయ్య గారూ,
రిప్లయితొలగించండిసంతోషం. ధన్యవాదాలు.