8, అక్టోబర్ 2013, మంగళవారం

సమస్యాపూరణం – 1198 (అరిసెల వేఁచఁగావలయు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
అరిసెల వేఁచఁగావలయు నాముదమందునఁ బెండ్లివిందుకై.

34 కామెంట్‌లు:

  1. విరివిగ భక్ష్త్య భోజ్యములు వేడుక మీరగ పిండి వంటలున్
    వరునకు ప్రీతి పాత్రమగు పాయస మందున నుప్పు కారముల్
    మురుకులు వండినారట యమోఘపు గుండ్రటి బండి చక్రముల్
    అరిసెలు వేచగా వలయు నాముద మందున బెండ్లి విందుకై

    రిప్లయితొలగించండి
  2. వంట వారు పెండ్లి వారిని వంటలు యేమిచేయాలో అడుగు సందర్భం...

    మరి వినరండి వంటకము లవ్విట నేమియు జేయగా వలెన్
    కరకర లాడె డప్పడము కాకర వేపుడు కజ్జెకాయలున్
    సరిసరి సేమ్య పాయసము శర్కర తోడను నేతి తోడనా
    యరిసెల వేఁచఁగావలయు నా ? ముదమందునఁ బెండ్లివిందుకై.

    రిప్లయితొలగించండి
  3. శ్రీ హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము చాల బాగుగ నున్నది. అభినందనలు. 1వ పాదములో యతిని విస్మరించేరు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  4. వంటవారు వారు చేసిన వంటలు చెప్పు సందర్బము..

    సరిసరి యన్ని వంటలును చక్కగ అయ్యెనువాటినన్నిటిన్
    వరుసగ లడ్డు జాంగిరిలు బాగుగ వేగిన బజ్జి బాదుషా
    విరివిగ గారి బూరెలయె, వేడిగ నేతిని గాచి బాగుగా
    అరిసెలు వేచగావలయునా ముదమందున బెండ్లి విందుకై

    రిప్లయితొలగించండి
  5. ఆర్యా ! ధన్యవాదములు.
    సవరణ చేసిన నాపూరణ ...

    మరి వినరండి వంటకము మమ్ముల మెచ్చగ జేయగా వలెన్
    కరకర లాడె డప్పడము కాకర వేపుడు కజ్జెకాయలున్
    సరిసరి సేమ్య పాయసము శర్కర గల్పుచు నేతి తోడనా
    యరిసెల వేఁచఁగావలయు నా ? ముదమందునఁ బెండ్లివిందుకై.

    రిప్లయితొలగించండి
  6. వియ్యాలవారి పెండ్లి విందుకై పాకశాలలో చమత్కారముగ మాటలాడుకొను సందర్భము...

    విరసత వీడి సేయవలె వియ్యపువారలు విందుభోజనాల్!
    సరసుల వంటకమ్ము లివి! "చాలవు, తెమ్మిఁకఁ గొన్ని" యంచుఁ బల్
    వరుసలు కట్టి, కోరఁగనుఁ జక్కని బూరెలు, చిల్లి గారె లీ
    యరిసెల వేఁచఁగా వలయు నాముదమందునఁ బెండ్లి విందుకై!

    (ఆముదమందున=ఆముదములో, ఆ వియ్యాలవారు వచ్చినప్పటి సంబరములో)

    రిప్లయితొలగించండి
  7. సరియన రావు రావతిరసమ్ములతో సమమైన భక్ష్యముల్
    హరియు, హరుండు, బ్రహ్మయు, సురాధిప ముఖ్యులు చాల మెచ్చు కొం
    దురుగద యేల సంశయము? తొందరగా బొనరింతు, నెర్రగా
    నరిసెలు వేచగా వలయునా? ముదమందున పెండ్లి విందుకై
    (అతిరసములు = అరిసెలు).

    రిప్లయితొలగించండి
  8. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..

    శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...
    మన వియ్యంకులు సరసులు వారికి వడ్డించు వారు మంచి సరసులైన మంచిది కావున వారికి యా పనులు అప్ప జెప్పుమనుచు భార్యకు దెలిపుచున్న భర్త !

    బిరుదులు బొందియున్న మన వియ్యపు వారలు పెక్కు రీతులన్
    సరసము లాడు హంస తతి,సాగర వాసుల మెప్పు బొందగన్
    యరిసెల వేఁచఁగా వలయు నాముదమందునఁ బెండ్లి విందుకై!
    సరసము లాడువారు బహు జక్కగ వేడుక జేయు విందునన్!

    (సాగర = నాగార్జున సాగర్ )

    రిప్లయితొలగించండి
  9. మరిమరి వేఁడి కోరితిని మాకునభీష్టములైన వంటలన్
    విరివిగఁ జేసియుంచితిరి ప్రేమగ మీరలు పిండివంటకా
    లరిసెల, వేఁచఁగా వలయునా? ముదమందునఁ బెండ్లివిందుకై
    స్థిరతర చిత్తుఁడై నిలచి తీపిపదార్థములారగించెదన్.

    వేచుట = కాచుకొనుట,

    రిప్లయితొలగించండి
  10. కందములో
    ======*======
    మన వియ్యంకుల కెల్ల! ల
    లన!యరిసెల వేఁచఁగా వలయు నాముదమం
    దునఁ బెండ్లి విందుకై!కని
    విని యెరుగని రీతులందు వేడుక జేయన్ !
    =======*======
    అనుచరుల కెల్ల దెలుపు! ల
    లన!యరిసెల వేఁచఁగా వలయు నాముదమం
    దునఁ బెండ్లి విందుకై!కని
    విని యెరుగని సరసులు మన వియ్యంకు లిలన్!

    రిప్లయితొలగించండి
  11. కరకరలాడు జంతికలు కారపు కూరలు, వేడియన్నమున్,
    మురిపెముతోడ వండితిని పూర్ణపు భక్ష్యములన్; సరి!! యిందు పై
    నరిసెల వేఁచఁగావలయునా ? ముదమందునఁ బెండ్లివిందుకై
    సరసపు మాటలందు తిన చాలును వండిన వన్ని గాంచుమా!

    రిప్లయితొలగించండి
  12. పూజ్యు లు శంకరయ్యగారికి వందనములు


    కరకర లాడు జంతికలు కమ్మనిబూరెలు ఆవడల్ వడల్
    సరగున చప్పరించగను చల్లని మీగడ లేహ్యముల్ గనన్
    మురిసి భుజింప పాయస మపూపము లడ్లుయు నావు నేతితో
    అరిసెల వేచగా వలయునా ముదమందున బెండ్లి విందుకై

    రిప్లయితొలగించండి
  13. ఓ పెండ్లి పెద్ద వంట వారితో...

    విరివిగ బంధు వర్గమది వేడుకఁ జూడగ నేగుదెంతురున్,
    మరచితిఁ జెప్పుట 'ముఖ్యమంత్రి'యును మాట నొసంగెను వత్తునంచు నా
    దొరలకు నిష్టమౌ వడలఁ దోరగ, తీయటి లడ్డు జాంగిరుల్
    నరిసెల వేఁచగా వలయు నా ముదమందున బెండ్లి విందుకై!

    రిప్లయితొలగించండి
  14. లక్ష్మీదేవి గారూ మీ పూరణ బాగుంది.
    కరకరలాడు జంతికలు కారపు కూరలు, వేడియన్నమున్,
    మురిపెముతోడ వండితిని పూర్ణపు భక్ష్యములన్; సరి!! యిందు పై

    రిప్లయితొలగించండి
  15. ధన్యవాదాలండీ,
    సంతోషముతో కూడిన కబుర్లవేళ వండినవి చాలవా, ఇంకానా అని....

    రిప్లయితొలగించండి
  16. అమ్మా! లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. 2వ పాదములో చివరలో సరి యిందుపై అనే చోట గణ భంగమును దిద్ద వలసి యున్నది. చూడండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  17. శ్రీ సహదేవుడు గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. 2వ పాదములో మరచితి చెప్పుట ముఖ్యమంత్రి అన్నారు కదా. గణభంగము కనుపట్టుచున్నది. చూడండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  18. విరివిగ జేసి యుంటిమి కవేపుడు కూరలు పిండి వంటలున్
    పెరుగులు పాలు మీగడలు ప్రీతిగ విందును స్వీ కరించగా
    కరకర లాడు జంతికలు కారపు పూసయు బూంది లడ్డులున్
    అరిసెలు వేచగా వలయు నా? ముదమందున బెండ్లి విందుకై

    రిప్లయితొలగించండి
  19. అరుదగు పిండి వంటలును అద్భుతమౌ రసరమ్య పాకముల్
    సురుచిర పాయ సాన్నములు జూడగనే మదిలోని కోరిక
    ల్లరమర లేకనుప్పతిలు నందరకున్ దిన నింక నేతి యీ
    అరిసెల వేచగా వలయునా! ముదమందున పెండ్లి విందుకై

    రిప్లయితొలగించండి
  20. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘వలయునా’ తరువాత ప్రశ్నార్థకాన్ని ఉంచితే బాగుండేదనుకుంటాను.
    తాజాగా వ్రాసినది మొదటిదానికి సవరణా? లేక ప్రత్యేకమా? ఏమైనా చాలా బాగుంది.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    సవరణ చేసిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘ఆడడి + అప్పడము’ అన్నప్పుడు సంధి లేదు. ‘ఆడు నప్పుడము’ అనండి.
    *
    శైలజ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘వలయునా’ తరువాత ? పెడితే బాగుండేది.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    ‘ఆముద మందున’ అన్నచోట శ్లేషతో చక్కని పూరణ చేశారు. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ముఖ్యంగా చంపకమాల పాదాన్ని కందంలో ఇమిడ్చి చేసిన పూరణలు ప్రశంసనీయాలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    సమస్యలో ఉన్న పదం ‘వేఁచు’. మీరు ఎదురుచూచు అనే అర్థంలో ప్రయోగించిన ‘వేచు’లో అర్థానుస్వాసం ఉండదు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    రెండవ పాదంలో గణదోషం. ‘భక్ష్యము లిప్పు డిందుపై’ అందామా?
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘లడ్లుయు’ అన్నదాన్ని ‘లడ్లును’ అందాం.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    రెండవ పాదంలో ‘మరువకు 'ముఖ్యమంత్రి'యును మాట నొసంగెను....’ అంటే గణదోషం తొలగిపోతుంది.
    ‘ఏగుదెంతురున్’ అన్నదాన్ని ‘ఏగుదెంతురే’ అంటే బాగుంటుందేమో!
    *
    లక్కరాజు వారూ,
    ధన్యవాదాలు.
    *
    పండిత నేమాని వారూ,
    మిత్రుల పూరణలను పరిశీలించి తగిన సూచనల నిచ్చినందుకు కృతజ్ఞతాంజలి.

    రిప్లయితొలగించండి
  21. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘కోర్కె లే/ యరమర...’ అనండి.

    రిప్లయితొలగించండి
  22. రాజేశ్వరి నేదునూరి గారూ వావ్!
    ఇన్ని చేశా నయ్యా ఇంకా అరిసెలు చెయ్యాలా?
    పూరణ బాగుంది.
    విరివిగ జేసి యుంటిమి కవేపుడు కూరలు పిండి వంటలున్
    పెరుగులు పాలు మీగడలు ప్రీతిగ విందును స్వీ కరించగా

    రిప్లయితొలగించండి
  23. వరునకు నచ్చునట్లుగ వివాహము నందున వంటకమ్ములన్
    సరగున జేసిపెట్టి రట స్వాగత మందిన వార లెల్లరున్
    సరసము లైన శాకములు, చక్కని వంటల నారగింపగా
    అరిసెల వేఁచఁగా వలయునా? ముదమందునఁ బెండ్లివిందుకై.

    రిప్లయితొలగించండి
  24. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. నంస్కారములు
    నేను నాణానికి ఒకవైపే రాసాను కదా ! అందుకని మరోవైపు రాయాలని
    ఇంతకీ అందరూ ముదమున వేయించారే గానీ .....ఆముదంలో ఎవరు వేయించ్లేదు .అదేమరి ?
    గురువులకు శ్రీ లక్కరాజు గారికి ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  26. శ్రీగురుభ్యోనమ:

    నిరసనలెన్ని వచ్చినను నేతల తీరది మారకున్నదే !
    మొరటుగనేలుచుండిరిట మోసము జేయుచు భారతావనిన్
    కఱకుగ "వోటు వేయవలె కాదని" వారల బెండ్లిజేయుచున్
    నరిసెల వేఁచఁగావలయు నాముదమందునఁ బెండ్లివిందుకై

    వోటు వేయవలె కాదని = Reject Vote

    రిప్లయితొలగించండి
  27. గురువర్యులిరువురకు ధన్యవాదములు. తమరి సూచనల ప్రకారం సవరణ:
    విరివిగ బంధు వర్గమది వేడుకఁ జూడగ
    నేగుదెంతురే,
    మరువకు
    'ముఖ్యమంత్రి'యును మాట
    నొసంగెను వత్తునంచు నా
    దొరలకు నిష్టమౌ వడలఁ దోరగ, తీయటి లడ్డు జాంగిరుల్
    నరిసెలు వేఁచగా వలయు నా ముదమందునఁ బెండ్లి విందుకై!

    రిప్లయితొలగించండి
  28. రాజేశ్వరి గారూ వచ్చేసింది శ్రీపతిశాస్త్రి గారి నుండి, నేతలకి పెండ్లి విందులో ఆముదముతో అరిసెలు వేయించి పెట్టాలంటున్నారు. శాస్త్రి గారూ పూరణ బాగుంది.

    నిరసనలెన్ని వచ్చినను నేతల తీరది మారకున్నదే !
    మొరటుగనేలుచుండిరిట మోసము జేయుచు భారతావనిన్
    కఱకుగ "వోటు వేయవలె కాదని" వారల బెండ్లిజేయుచున్
    నరిసెల వేఁచఁగావలయు నాముదమందునఁ బెండ్లివిందుకై

    రిప్లయితొలగించండి


  29. ర-ఱ లకు ప్రాస వైరమని చదివిన గుర్తు. పెద్దలు వివరించగలరు.

    రిప్లయితొలగించండి
  30. ఆర్యా ! ధన్యవాదములు.
    సవరణ చేసిన నాపూరణ ...

    మరి వినరండి వంటకము మమ్ముల మెచ్చగ జేయగా వలెన్
    కరకర లాడునప్పడము కాకర వేపుడు కజ్జెకాయలున్
    సరిసరి సేమ్య పాయసము శర్కర గల్పుచు నేతి తోడనా
    యరిసెల వేఁచఁగావలయు నా ? ముదమందునఁ బెండ్లివిందుకై.

    రిప్లయితొలగించండి
  31. కరిగిన నేతినందునను కమ్మగ నన్నము నావకయతో
    మురుకులు కజ్జి కాయలును ముచ్చట మీరగ పంచ భక్ష్యముల్
    విరివిగ లడ్లు మెక్కుటను వేకువ జామున కుక్షి భద్రమై
    అరిసెల వేఁచఁగావలయు నాముదమందునఁ బెండ్లివిందుకై
    😊

    రిప్లయితొలగించండి